Telugu govt jobs   »   Telangana Movement and State Formation   »   Telangana Movement and State Formation

Telangana Movement and State Formation – Mulki Movement, Download PDF | తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఏర్పాటు – ముల్కీ ఉద్యమం 1952

Telangana Movement

Telangana Movement & State Formation Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.

Telangana Movement & State Formation , తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , Mulki Movement ముల్కీ ఉద్యమం 1952 : తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం,  భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

  1. Mulki Movement 1952 | ముల్కీ ఉద్యమం 1952
  2. Gentlemen Agreement 1956 | పెద్ద మనుషుల ఒప్పందం 1956
  3. Violation of protection of Telangana between 1956-69 | 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు
  4. Causes of 1969 Movement | 1969 ఉద్యమానికి కారణాలు
  5. 1969 Movement- The role of Various Communities | 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
  6. 1969 Movement – Role of Various Political Parties | 1969 ఉద్యమం – వివిధ రాజకీయ పార్టీల పాత్ర
  7. Jai Andhra Movement | జై ఆంధ్ర ఉద్యమం
  8. Telangana recognition | తెలంగాణ గుర్తింపుకై ఆరాటం 
  9. Spread of Telangana Ideology | తెలంగాణ భావజాల వ్యాప్తి
  10. Role of Civil Societies and Vedika in Spreading Telangana Ideology | తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర
  11. Various assemblies in the spread of Telangana ideologies | తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు
  12. Political and ideological efforts | రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు
  13. Malidasha movement | మలిదశ ఉద్యమం
  14. The Role of Various Parties in the Formation of Telangana State | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర
  15. Revivalision of Telangana Culture | తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
  16. KCR hunger strike | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష
  17. తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు
  18. Naxalite movement | నక్సలైట్ ఉద్యమం 

TSPSC General Studies and General Ability Test Series in Telugu and English For TSPSC GROUP-2, GROUP-3, AMVI, AEE, FSO, Extension Officer, Women and Child Development Officer(CDPO) By Adda247

Mulki Movement, ముల్కీ ఉద్యమం 1952

  • అరాచకమైన నిజాం యొక్క పాలన నుండి విముక్తి లభిస్తుందని హైదరాబాద్ రాష్ర్ట ప్రజలు పోలీస్ చర్యను స్వాగతించారు.
  • కానీ పోలీస్ చర్య తరువాత ఏర్పడిన మిలిటరీ పాలన (జనరల్ జె.ఎన్. చౌదరి పాలన), పౌర ప్రభుత్వ పాలన (ఎమ్.కె.వెల్లో డిపాలన) కాలంలో స్థానికేతరులను(నాన్‌ముల్కీ) వివిధ ప్రభుత్వఉద్యోగాలలోనియమించబడడం జరిగింది.  దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
  • 1952 మార్చిలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని అనుకున్నారు.
  • కానీ వాస్తవంలో నాన్ ముల్కీలు నకిలీ ధృవ పత్రాలను సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాలలో చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టకపోవడంతో స్థానికులలో అభద్రతా భావం పెరిగింది.

వరంగల్ లో ముల్కీ ఉద్యమం:

  • వరంగల్ జిల్లాలోని డివిజనల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేస్తున్న పార్థసారథి అనే అధికారి 1952లో దాదాపు 180 మంది టీచర్లను బదిలీ చేసి వారి స్థానంలో నాన్‌ముల్కీలను నియమించినట్లు వార్తలు ప్రచారంలో వచ్చాయి.
  • స్థానికంగా ఉన్న విద్యార్థులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి నిర్ణయించారు.
  • దీంతో పార్థసారథి యొక్క అక్రమాలపై సెంట్రల్ మిడిల్ స్కూలకు చెందిన 9 మంది ఉపాధ్యాయులు, హయగ్రీవాచారి అనే రాజకీయనాయకుడు పార్థసారధిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
  • పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులతో కలిసి 1952 జూలై 26న వరంగల్ లో ఒక కార్యాచంలో కమిటి ఏర్పాటయింది.
  • 1952 ఆగస్టు నెలలో విద్యార్థులు శాంతియుతమైన ర్యాలీని నిర్వహించారు.
  • 1952 ఆగస్టు 30న విద్యార్థులు తరగతులకు వెళ్ళకుండా ఉద్యమించటంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

హైదరాబాద్ లో ఉద్యమం:

  • ఆగసు 30న హన్మకొండ హైస్కూలు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కు వ్యతిరేకంగా ఆగస్టు 31న హైదరాబాద్ లో సమ్మెను నిర్వహించారు.
  • ఆగస్టు 31 1952న సైఫాబాద్ కాలేజీ నుండి ఆబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
  • సెప్టెంబర్ 1, 1952న బక్రీద్ పండుగ కావటంతో ఎటువంటి ర్యాలీలు నిర్వహించలేదు.

సీటి కాలేజి సంఘటన:

  • సెప్టెంబర్ 2, 1952న ‘నాన్ ముల్కీ గోబ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ ఘర్ కో జాప్’, ‘స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్’ వంటి నినాదాలతో విద్యార్థులు భారీస్థాయిలో ర్యాలీలు నిర్వహించారు.
  • 3 సెప్టెంబర్ 1952న పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఒకప్రకటన ద్వారా నిషేధిత ఆజ్ఞలను జారీచేయడంజరిగింది.
  • ” అయినప్పటికి సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.
  • సిటీ కాలేజ్ విద్యార్థుల ఆందోళనను శాంతింపజేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రయత్నం చేసి విఫలమయ్యా రు.
  • సెప్టెంబర్ 3 1952న సిటీ కాలేజ్ మరియు పత్తర్ ఘట్ ప్రాంతాలలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
  • మొదటిసారి కాల్పుల్లో మహమ్మద్ ఖాసీం అనే 22 యేండ్ల యువకుడు మరణించగా, రెండవసారి కాల్పులలో షేక్ మహబూబ్ అనే వ్యక్తి మరణించాడు
  • 1952 సెప్టెంబర్ 3న జరిగిన కాల్పులలో గాయపడి చికిత్స పొందుతున్న జమాలూద్దీన్ (40 సం||లు), రాములు (18 సం||లు) 1952, సెప్టెంబర్ 29న మరణించారు
  • ప్రభుత్వ మరియు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి రిపోర్టు ప్రకారం ఇద్దరు చనిపోయారు, కానీ అనధికార లెక్కల ప్రకారం ఇద్దరు అక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు.
  • సెప్టెంబర్ 4న చనిపోయిన విద్యార్థుల (సెప్టెంబర్ 3న) శవాలు అప్పగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
  • దాంతో శాంతిభద్రతలను సాకుగా చూపిస్తూ సెప్టెంబర్ 4, 1952న అఫ్టల్ గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
  •  1952 సెప్టెంబర్ 4 న జరిపిన కాల్పులలో నలుగురు మరణించారు.
  • ప్రభుత్వ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 3, 4న జరిగిన కాల్పులలో 6 మంది మరణించారు. అనధికార లెక్కల ప్రకారం 8 మంది మరణించారు .
  1. మహ్మద్ ఖాసీం – వయస్సు 22 సంవత్సరాలు – ఫాక్టరీ వర్కర్
  2. షేక్ మహబూబ్ – వయస్సు 30 సంవత్సరాలు – రిక్షా కార్మికుడు
  3. జమాలుద్దీన్ – వయస్సు 40 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
  4. మహ్మద్ ఖాన్ – వయస్సు 35 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
  5. రాములు – వయస్సు 18 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి
  6. షేక్ ముక్తార్ – వయస్సు 40 సంవత్సరాలు – ప్రైవేటు ఉద్యోగి

1952 సెప్టెంబర్ లో ఫతేమైదా లో బహిరంగ సభ

  • ఉద్యోగాలలో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్ పాండే (P.D.F) ముల్కీ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
  • సోషలిస్టు పార్టీ నాయకుడు ‘మహదేవ్ సింగ్’ పోలీసుల కాల్పులను ఖండించి ముల్కి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపాడు.
  • కృష్ణదేవరాయల భాషా నిలయం స్వర్ణోత్సవములు 1952 సెప్టెంబర్ లో సుల్తాన్ బజార్ లో జరిగినాయి.
  • ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ‘బూర్గుల రామకృష్ణారావు’ హాజరయ్యారు.
  • ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులకు నిరసనగా బూర్గుల యొక్క కారును సెప్టెంబర్ 5న ఆందోళనకారులు తగులబెట్టారు.
  • ఈ సంఘటన జరగడంతో స్వామి రామానంద తీర్థ విద్యార్థుల వెనకాల సంఘ విద్రోహశక్తులున్నాయని పేర్కొన్నాడు.
  • ఆ తర్వాత కాలంలో ఉపఎన్నికల ప్రచారానికి వరంగల్ వెళ్ళిన రామనందతీర్థ కారుకు కూడా విద్యార్థులు నిప్పంటించారు.
  • జయశంకర్ సార్ ఈ ముల్కి ఉద్యమంలో పాల్గొనడానికి హన్మకొండ నుండి హైదరాబాద్ కి వస్తున్నబస్ ను భువనగిరిలో ఆపివేశారు.

adda247

ప్రభుత్వచర్యలు:

  • ముల్కీ ఉద్యమం యొక్క ఉధృతిని గమనించిన ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘంను నియమించింది.

ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు :

  • కొండా వెంకటరంగారెడ్డి (ఎక్సైజ్ శాఖామంత్రి)
  • డా|| మెల్కోటే (ఆర్థికమంత్రి)
  • పూల్ చంద్ గాంధీ (విద్యాశాఖ మంత్రి)
  • నవాజ్ జంగ్ (పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి)
  • పోలీసుల కాల్పులపై విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి ‘పింగళి జగన్మోహనరెడ్డి’ ఆధ్వర్యంలోన్యాయ విచారణ సంఘాన్ని నియమించింది.
  • జస్టిస్ పింగళి జగన్మోహనరెడ్డి యొక్క ఆత్మకథ –ది జుడిషియరీ ఐ సర్వ్ డ్‘. 
  • ‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్’ అనే తన ఆత్మకథలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని పేర్కొన్నాడు.

జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటి:

  • సెప్టెంబర్ 3మరియు 4 తేదీలలో జరిగిన కాల్పులపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగిందని పత్రికా ప్రకటన వెలువడింది.
  • కమిటీ చేపట్టాల్సిన విచారణను గురించి విధి విధానాలు సవివరంగా తెలుపుతూ సెప్టెంబర్ 10 1952న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

కమిటీ రిపోర్టు:

  • మొదటిసారి అఫ్టల్ గంజ్ లో కాల్పులు జరిగినపుడు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, పోలీసు అధికారులు, పోలీసు బలగాల మధ్య సమన్వయ లోపం కొరవడింది.
  • పోలీసులు సరిగా స్పందించకపోవడం మరియు ప్రజానాయకులు సరిగా కల్పించుకోకపోవడం వెరసి ఆందోళనకారులు, విద్యార్థులు చెలరేగిపోయారు.
  • ఆందోళనకారులు ఎలాగైన ర్యాలీ తీయాలనే సంకల్పంతో ఉండటం, పోలీసులపై రాళ్లు రువ్వడం వలన పోలీసులు కాల్పులు జరిపారు.

ముల్కి ఉద్యమ అనంతరం 

  • నాన్ ముల్కీలందరిని వెనక్కుపంపి ఆ స్థానాలలో స్థానికులను నియమించాలని విశాలాంధ్ర దినపత్రికలో పేర్కొన్న PDF నాయకులు :  వి.డి.దేశ్ పాండ్ , రాజ్ బహద్దూర్ గౌడ్ ,వి.కె.ధాగే
  • సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడ్డ శాసన సభ్యుడు -సయ్యద్ అక్తర్ హుస్సేన్.
  • ‘సయ్యద్ అక్తర్ హుస్సేన్’ ఆవాద్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు.
  • ఇతనితో పాటు అరెస్టు కాబడ్డ మరో పాత్రికేయురాలు – బేగం సాదిక్ జహన్.

  Download: Telangana Movement & State Formation , mulki movemnt

adda247

 

More Important Links on TSPSC :
Telangana State GK 
Polity Study Material in Telugu

Sharing is caring!

FAQs

Who started Telangana movement?

Sri M. Chenna Reddy, founded the Telangana Praja Samithi (TPS) political party in 1969 to spearhead the statehood movement.