Telugu govt jobs   »   Telangana Movement & State Formation,   »   Telangana Movement & State Formation,

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం – వివిధ రాజకీయ పార్టీల పాత్ర

Telangana Movement & State Formation Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం – వివిధ రాజకీయ పార్టీల పాత్ర

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం,  భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

1969 ఉద్యమం – వివిధ రాజకీయ పార్టీల పాత్ర

  • 1969 జనవరిలో తెలంగాణ రక్షణల అమలుకోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోతే తాము కూడా విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్న ప్రతిపక్ష పార్టీలు: 1) జనసంఘ్ 2) సి.పి.ఐ 3) సి.పి.ఎం 4) సంయుక్త సోషలిస్టు పార్టీ 5) మజ్లిస్
  • ఈ ప్రకటనకు స్పందించిన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1969 జనవరి 18, 19న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

జనసంఘ్ పార్టీ పాత్ర :

  • జనసంఘ్ పార్టీ హైద్రాబాద్ నగర కార్యదర్శి అయిన ఎమ్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించాడు.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించినందుకు జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించారు.

సి.పి.ఐ పార్టీ పాత్ర: 

  • 1969 ఏప్రిల్ లో సికింద్రాబాదులోని ‘బురుగు మహదేవ్ హాలు’లో సమైక్యాంధ్రులు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన కమ్యునిస్టుల ముసుగులో సభను నిర్వహించారు.
  • ఈ సభకు అధ్యక్షత వహించిన నగర కార్మిక నాయకుడు – సత్యనారాయణరెడి.
  • సభ బయట అప్పటికే ఉన్న తెలంగాణవాదులతో వీరు కలిసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభం అయింది .
  • ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణవాదులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

 CPM పార్టి పాత్ర:

  • CPM పార్టి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ‘ నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దూరంగా ఉన్నది. నర్రా రాఘవరెడ్డి అధ్యక్షతన నకిరెకల్ లో మే 4న విశాలాంధ్ర సమైక్యతాసభ జరిగింది.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలు: స్వతంత్ర పార్టీ ,సంయుక్త సోషలిస్టు పార్టీ
  • భారతీయ క్రాంతిదళ్ పార్టీ అధ్యక్షుడు చౌదరిచరణ్ సింగ్ ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నాడు.

 

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_50.1

కాంగ్రెస్ పార్టీ పాత్ర

కొండా లక్ష్మణ్ బాపూజీ

  • తెలంగాణలో ఆంధ్రప్రాంతం వారిపై దాడులు జరుగుతున్నాయనే అపోహలను ఆంధ్ర మీడియా సృష్టించింది.
  • దీంతో ఆంధ్రావారు ఈగల పెంటలోని తెలంగాణ ఉద్యోగులు, వర్కర్లు నివాసముండే కాలనీపై దాడి చేశారు.
  • ఈగలపెంట ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మరియు బాధితులకు ఎలాంటి సహాయం చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.
  • 1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని, జి.వో.36 ను కొట్టివేసింది.
  • దాంతో కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. దీంతో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోయాడు.
  • 1969 ఏప్రిల్ లో సికింద్రాబాద్ కాల్పులకు నిరసనగా ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 8 వరకు కొండాలక్ష్మణ్ బాపూజీ నిరాహార దీక్ష చేపట్టాడు.
  • మొదట్లో తెలంగాణ ప్రాంతానికి అస్సాం రాష్ట్రంలో విధంగా ప్రాంతీయ ప్రతిపత్తిని కోరుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 మే 14న మొదటిసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు.

తెలంగాణ పి.సి.సి ఏర్పాటు:

  • 1969 జూన్ 1 న కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన గాంధీభవన్లోని ప్రకాశం హాలులో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు నిర్వహించబడింది.
  • ఈ సదస్సులోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీని ఎన్నుకున్నారు.

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్

  • రాష్ట్ర మంత్రి వర్గం నుండి రాజీనామా చేసిన వి.బి.రాజు అధ్యక్షతన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని 1970 ఫిబ్రవరి 26 న ఏర్పాటు చేయడం జరిగింది.

Telangana Govt Job News, తెలంగాణ లో 91,142 పోస్టులకి సిఎం కెసిఆర్ అనుమతి

ప్రభుత్వ చర్యలు

(ఎ) అఖిలపక్ష ఒప్పందం:

ఈ ఒప్పందం ప్రకారం తీసుకోవలసిన చర్యలు:

  1. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాలలో స్థానికులను నియమించాలి. ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్రప్రాంతం వారికి వారి ప్రాంతంలో ఉద్యోగవకాశాలు కల్పించాలి.
  2. ప్రభుత్వ విభాగాలకే కాక స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు కూడ ముల్కీ నిబంధనలను వర్తింపజేయాలి.
  3. ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ఆ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఉపయోగించాలి.
  4. రాజధానియైన హైదరాబాదు నగరంలో విద్యావసతులను విస్తరింపజేయాలి.

జి.వో.36:

  • 1969 అఖిలపక్ష నిర్ణయాన్ని అమలుపరచుటకు, రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరి 21 రోజు 36 నంబరు గల ఒక జీ.వో ను జారీ చేసింది
  • జి.వో.36 జారీ అయిన మరుక్షణమే, ఆనాటి అగ్రనాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించినాడు.

ఉద్యోగుల సమస్యల పరిశీలనకు ఉన్నతాధికార సంఘం – 1970:

  • తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నసి ఉల్లా బేగ్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.
  • ఈ సంఘంలో సభ్యులు :
  • 1) ఎల్ చంద్ (రెవెన్యూ బోర్డు సభ్యుడు)
  • 2) సి.ఆర్. కృష్ణస్వామి (రెవెన్యూ బోర్డు ప్రత్యేక కార్యదర్శి)
  • 3) రావు సాహెబ్ మండలం

TSPSC Group 1 Notification 2022 , TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

(బి) అష్ట సూత్ర పథకం :

  • అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 11న పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక పథకాన్ని ప్రతిపాదించింది. దానిని అష్టసూత్ర పథకమని అంటారు.

అష్టసూత్ర పథకంలోని అంశాలు:

  1. ఆంధ్రప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
  2. మిగులు నిధుల తరలింపువలన తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించుటకు కావలసిన నిధులను సమకూర్చుతారు.
  3. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను తయారుచేయడానికి ముఖ్యమంత్రి అద్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయుట. ఈ సంఘంలో ప్రణాళిక సంఘం ప్రతినిధి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు.
  4. నిర్ణయించిన ప్రణాళికలను అమలుపరచడానికి ప్రణాళికా సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయుట.
  5. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి, తరువాత ఆ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన యంత్రాంగానికి, ఇంకా ఎక్కువ అధికారాలనిచ్చుట.
  6. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి కావలసిన రాజ్యాంగపరమైన సవరణ చేయడం.
  7. తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను పరిశీలించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తాం.
  8. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిని సారించడానికి ఆరు నెలలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి సమక్షంలో జరుపుతారు.

(సి) తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృత అధికారాలు:

  • తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృత అధికారాలను కల్పిస్తూ 1970 మార్చి 7న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘం ఉత్తర్వు – 1958ను సవరిస్తూ ఉత్తర్వును జారీ చేశాడు.
  • ప్రాంతీయ సంఘానికి పెంచిన అధికారాలు:
  • తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను వేరువేరుగా చూపడం.
  • యూనివర్సిటీ విద్య, భారీ మధ్యతరగతి పరిశ్రమలు కూడా తెలంగాణ ప్రాంతీయసంఘ పరిధిలోకి వస్తాయి.
  • తెలంగాణ ప్రాంతీయులను ప్రభుత్వ సర్వీసులలో నియమించడానికి అనుసరించవలసిన నియమ నిబంధనలను కూడా ప్రాంతీయ సంఘం కిందకు తేవాలని ఈ ఉత్తర్వు తెలుపుతుంది.
  • సర్వీసుల విలీనంపై కేంద్రప్రభుత్వ నిర్ణయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ సంఘానికి నివేదిక అందించాలి.
  • ప్రాంతీయ సంఘం చేసిన సిఫార్సులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ఆరు నెలలకొకసారి ప్రాంతీయ సంఘానికి నివేదిక అందించాలి.

TSPSC Group 2 Notification 2022 , TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

డి) వివిధ కమిటీలు

1) కుమార్ లలిత్ కమిటీ

  • తెలంగాణ మిగులు నిధులపై కాగ్ అధికారి కుమార్ లలిత్ నేతృత్వంలో మిగులు నిధుల కమిటీ ఏర్పడింది.
  • 1969 జనవరి 19 న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా 1969 జనవరిలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటి నవంబర్ 1, 1956 నుండి మార్చి 31, 1968 వరకు జరిగిన కేటాయింపులన్నింటిని పరిశీలించి నివేదికను సమర్పించింది.
  • తెలంగాణ మీద ఖర్చు పెట్టవలసి ఉండి పెట్టకుండా మిగిలిపోయిన మిగులు నిధులు 34.10 కోట్లని పేర్కొంది.

2) జస్టిస్ భార్గవ కమిటీ :

  • సమగ్ర తెలంగాణ చరిత్ర అష్టసూత్ర పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధి ప్రకటించినట్లుగా 1969 ఏప్రిల్ 22న జస్టిస్ వశిష్టభార్గవ నాయకత్వాన కమిటీని నియమించారు.
  • తెలంగాణలోని మిగులు నిధులపై ఈ కమిటీని నియమించారు. 
  • ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం అధికారికంగా బహిరంగపరచలేదు.

3) వాంఛూ కమిటీ: 

  • ఈ కమిటీ అధ్యక్షుడు : కె.ఎన్.వాంఛూ. 
  • సభ్యులు : నిరె డే, ఎం.పి. సెతల్వాడ్ 
  • ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని కేంద్రం 1969 ఏప్రిల్ లో నియమించింది.

సూచనలు:

  • రాష్ట్ర ఉద్యోగాలలో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది.
  • కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యత లభించేటట్లు చట్టంచేసే అధికారం పార్లమెంట్ కు లేదు.
  • తన నివేదికలో ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి వీలు లేదని మరియు రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదు అని పేర్కొంది.

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_60.1

Telangana Martyrs Memorial తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం

  • 1969 ఉద్యమంలో అమరులైన వారికి అమరవీరుల స్మారక స్థూపాన్ని నెలకొల్పాలని విద్యార్థి సభ నిర్ణయించింది.
  • 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో ఈ స్మారక స్థూపాన్ని శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.
  • కాని ఈ శంకుస్థాపన కార్యక్రమంకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
  • పోలీసుల అనుమతి లేనప్పటికి అనేక నిషేదాజ్ఞలను ఉల్లంఘించి గన్ పార్క్ లో శంకుస్థాపన చేసినది లక్ష్మీనారాయణ (నగర్ మేయర్).

నిషేదాజ్ఞలను ఉల్లంఘించినందుకు పోలీసులు అరెస్టు చేసిన నాయకులు-

  • మర్రి చెన్నారెడ్డి
  • మేయర్ లక్ష్మినారాయణ
  • టి.గోవింద్ సింగ్
  • మల్లిఖార్జున్.
  • సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ ప్రాంతంలో ‘1970 ఫిబ్రవరి 25న నగర్ డిప్యూటి మేయర్ శ్రీమతి మ్యాడం రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు.
  • 1970 ఫిబ్రవరి 28న గన్‌పార్కులో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించినారు.
  • ఆ తరువాతి కాలంలో హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లోని మునిసిపల్ కార్పోరేటర్ల కృషి వలన ఈ స్థూపం స్థాపించబడింది.
  • ఈ స్థూపం నిర్మాణం ‘1975’ లో పూర్తి అయింది.
  • ఈ స్థూపాన్ని నిర్మించిన కళాకారుడు, శిల్పి – ఎక్కా యాదగిరిరావు (జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్)
  • కాని మరో విశాధకరమైన విషయం ఏమిటంటే ఈ స్థూపం ఇప్పటివరకు ఆవిష్కరించబడలేదు.
  • అయినప్పటికి నవంబర్ 1 న (విద్రోహ దినం) రోజున ప్రజలు ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ స్థూపం ప్రత్యేకతలు:

  • ఈ స్థూపం యొక్క అడుగుభాగం నల్లరాయితో తయారు చేయబడింది. ఈ స్థూపానికి నాలుగువైపుల ఉన్న శిలాఫలకాలపై ప్రతివైపు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. అప్పటి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం ఈ తొమ్మిది రంధ్రాలు.
  • అడుగుభాగం పైన నిర్మించబడిన స్థూపం ఎర్రరంగు రాయితో నిర్మించబడింది. ఎరుపురంగు త్యాగానికి గుర్తుగా ఎరుపురాయిని ఎంచుకొన్నారు
  • ఈ స్థూపం దగ్గర ఉన్న మరొక తోరణం ను ‘సాంచిస్థూపం’ నుండి స్వీకరించారు.
  • శిలాఫలకానికి నాలుగువైపులా చెక్కిన పుష్పాలు అమరవీరులకు అర్పించే నివాళులకు సంకేతం.
  • స్థూపం మధ్యభాగంలో ఉన్న స్తంభంపై ఏవైపు నుండి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనబడుతాయి. ఈ తొమ్మిది గీతలు కూడా తొమ్మిది జిల్లాలకు సంకేతం.
  • స్థూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రంను నిర్మించారు.
  • 1969 ఉద్యమంలో చనిపోయిన అమరవీరులు ధర్మసంస్థాపన కొరకు తమ ప్రాణాలు బలి పెట్టారని తెలియజేయడానికి స్థూపం పైభాగంలో ఈ అశోకుని ధర్మచక్రంను నిర్మించారు.
  • స్థూప శీర్షభాగంలో ‘తొమ్మిది రేకులు’ కలిగిన మల్లెపువ్వును నిర్మించారు.ఈ మల్లేపువ్వు స్వచ్చతకు సంకేతం.
  • అమరవీరుల త్యాగానికి సాహసానికి సంకేతంగా మల్లేపువ్వును స్థూపశీర్షభాగంలో ఏర్పాటు చేశారు.

Telangana History PDF In Telugu | తెలంగాణ చరిత్ర స్టడీ మెటీరియల్ PDF

 

1969 ఉద్యమం – ముఖ్య సంస్థలు:

1. తెలంగాణ విద్యార్థులు కార్యాచరణ సమితి – 1969 జనవరి 13 కార్యదర్శి మల్లికార్జున్

2. తెలంగాణ విద్యార్థుల పరిరక్షణ సమితి – 1969 జనవరి 13, అధ్యక్షుడు-వెంకటరామరెడ్డి

3. తెలంగాణ విమోచనోద్యమ సమితి – 1969 జనవరి 28, అధ్యక్షుడు-కాళోజి

4. తెలంగాణ ప్రజాసమితి – 1969 మార్చి 25, అధ్యక్షుడు-మదన్ మోహన్

5. పోటీ తెలంగాణ ప్రజాసమితి – 1969 ఏప్రిల్, అధ్యక్షుడు-శ్రీధర్ రెడ్డి

6. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి – డాక్టర్. కె.ఆర్.ఆమోస్

1969 ఉద్యమం – ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు:

  1. ఓ.యు. కళాశాలల విద్యార్థి సంఘాల సమావేశం – 1969 జనవరి 12, అధ్యక్షుడు-వెంకటరామిరెడ్డి 
  2. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు – 1969 జనవరి 28, అధ్యక్షుడు – కాళోజి నారాయణరావు
  3. రెడ్డి హాస్టల్ సదస్సు – 1969 మార్చి 8, 9 : అధ్యక్షురాలు – టి.ఎన్.సదాలక్ష్మి 
  4. ఉస్మానియా ప్రొఫెసర్ల తెలంగాణ సదస్సు – 1969 మే 20, అధ్యక్షుడు – మంజూర్ ఆలమ్ 
  5. తెలంగాణ రచయితల సదస్సు – 1969 జూన్ 6, అధ్యక్షుడు – కాళోజి నారాయణరావు

1969 ఉద్యమం – ప్రధాన ఘట్టాలు

  1. తొలి పోలీసు కాల్పులు : 1969 జనవరి 20న శంషాబాద్ లో జరిగాయి. 
  2. తొలి అమరుడు : జనవరి 24న సదాశివపేటలో కాల్పుల్లో మరణించిన తొలి అమరుడు శంకర్.
  3. మే డే | తెలంగాణ కోరికల దినం: తెలంగాణ ప్రజాసమితి పిలుపు మేరకు 1969 మే 1న జరిగింది.
  4. జూన్ – 2 పోలీసు కాల్పులు: జూన్ 2-5 మధ్య నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోలీసు కాల్పుల్లో 30 మంది మరణించారు.
  5. జూన్ 20-25 సత్యాగ్రహం : అబిడ్స్ లో ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
  6. జూన్ 25 ముషీరాబాద్ జైలు సంఘటన : ముషీరాబాద్ జైలులోపల సత్యాగ్రహీలపై ఖైదీలు దాడి చేశారు.ఈ దాడిలో సుమారు 70 మంది సత్యాగ్రహీలు గాయపడ్డారు

ముఖ్యమైన దినములు: 

  • మార్చి 17 : పోరాటం దినం (ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రకటించారు.)
  • ఏప్రిల్ 15 : తెలంగాణ పోరాట దినం 
  • మే 1: తెలంగాణ డిమాండ్స్ డే / కోరికల దినం
  • మే 17: తెలంగాణ మృతవీరుల దినం
  • జులై 10: తెలంగాణ పరిరక్షణ దినం
  • జులై 12 : తెలంగాణ ఫ్లాగ్ డే
  • జులై 12 : తెలంగాణ లిబరేషన్ డే

Download: 1969 ఉద్యమం – వివిధ రాజకీయ పార్టీల పాత్ర 

మునుపటి అంశాలు :

1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

 1969 ఉద్యమానికి కారణాలు

1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,

తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956

తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952

 

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_70.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Movement & State Formation, 1969 Movement - Role of various political parties_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.