Telugu govt jobs   »   AP Govt Jobs

AP Govt Jobs

AP Government Jobs(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు): AndhraPradesh Government has regularly releasing notification for Various positions through Andhra Pradesh Public Service Commission(APPSC) like GROUP-1, GROUP-2, GROUP-3, GROUP-4 , Assistant Engineer(AE), Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of AndhraPradesh regularly. Apart from this the Government will conduct open recruitment for Teachers in government schools under D.SC. Also it recruits Sub-Inspector and Constable for various departments in Andhrapradesh state.  

AP Govt Jobs_30.1APPSC/TSPSC Sure shot Selection Group

AP Government Jobs(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా GROUP-1, GROUP-2, GROUP-3, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు వివిధ ఉద్యోగాల కోసం క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల క్రింద నాన్-ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యుటివ్ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేస్తుంది. ఇది కాకుండా ప్రభుత్వం D.SC కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం ఓపెన్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్‌లను నియమిస్తుంది.

 

APPSC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్) 

APPSC ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను సమయానుగుణంగా భర్తీ చేస్తూ ఉంటుంది. దీనిలో వివిధ స్థాయిలలోని ఉద్యోగాలను గ్రూపుల మాదిరిగా విభజించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

APPSC నిర్వహించే వివిధ పరీక్షల వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది 

పోస్టు పేరు పోస్టు స్థాయి నోటిఫికేషన్
APPSC Group-1  డిప్యూటి కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, DSP, జైలర్ మొదలగు పోస్టులు. త్వరలో ప్రకటించబడుతుంది
APPSC Group-2  డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఆడిటర్, మునిసిపల్ కమీషనర్ గ్రేడ్-3 మొదలగునవి మార్చి/ఏప్రిల్ 2022
APPSC Group-3 పంచాయతి కార్యదర్శి గ్రేడ్-4
APPSC Group-4  జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ 2022 Notification 
AP Endowment officer దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఎగ్జిక్యుటివ్ 2022 Notification
Junior Lecturers ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు త్వరలో విడుదల కానున్నది
Degree Lecturer  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు త్వరలో విడుదల కానున్నది
Assistant Engineer  ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులు 2022 Notification
గమనిక: ఇవేకాకుండా APPSC మరిన్ని పోస్టులను భర్తీ చేస్తుంది

 

APPSC Group-1 Notification (ఎపిపిఎస్సి గ్రూప్-1 నోటిఫికేషన్)

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమీషనర్, డిప్యూటి కలెక్టర్, DSP, డిప్యూటి సూపరింటెండెంట్జైలర్ వంటి ఎగ్జిక్యుటివ్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తుంది.

 

APPSC Group-2 Notification (ఎపిపిఎస్సి గ్రూప్-2 నోటిఫికేషన్)

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఆడిటర్, మునిసిపల్ కమీషనర్ గ్రేడ్-3 మొదలగు పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

 

APPSC Group-3 Notification (ఎపిపిఎస్సి గ్రూప్-3 నోటిఫికేషన్)

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నవివిధ గ్రామ పంచాయతీలలోని పంచాయతి సెక్రటరీ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇప్పటి వరకు 2018 మరియు 2019 సంవత్సరాలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయడం జరిగింది.

 

APPSC Group-4 Notification (ఎపిపిఎస్సి గ్రూప్-4 నోటిఫికేషన్)

ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ముఖ్యంగా రెవిన్యూ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం సుమారు 670 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

AP Government Jobs FAQ’s:

Q1. AP Government Jobs క్రిందకు ఏ పోస్టులు వస్తాయి?

జవాబు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న  GROUP-1, GROUP-2, GROUP-3, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగాలతో పాటు మరిన్ని నాన్-టీచింగ్ మరియు నాన్-ఎగ్జిక్యుటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది.

Q2. AP Government Jobs Notification లను ఎప్పుడు విడుదల చేస్తుంది?

జవాబు. APPSC job calendar లో పేర్కొన్న విధంగా ఖాళీల సంఖ్యను బట్టి సమయానుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

Q3. AP Government Jobs సమాచారం ఎలా తెలుసుకోవాలి?

జవాబు. APPSC మరియు పోలీస్ రిక్రూట్మెంట్ లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి Adda247 telugu వెబ్ సైట్ ను నిరంతరం వీక్షించండి. ఇక్కడ మీకు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.

Q4. AP Government Jobs కి ఎలా సిద్దం కావాలి?

జవాబు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా అన్ని పోస్టులకు సుమారు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కావున అభ్యర్ధులు జనరల్ స్టడీస్ కు సంబంధించిన అన్ని అంశాలను చదవాల్సి ఉంటుంది. దీనికి గాను Adda247 telugu అందించే ఉచిత స్టడీ మెటీరియల్ మీకు ఎంతో సహకరిస్తుంది.

Q5. AP Government Jobs కి సిద్ధం కావడానికి ఉత్తమైన మెటీరియల్ ఏమిటి?

జవాబు. జనరల్ స్టడీస్ చదవడానికి 6- 12 తరగతులకు సంబంధించిన SCERT చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం అంశాలు చదివితే సరిపోతుంది. దీనికి తోడు ప్రాక్టిస్ కోసం Adda247 అందించే మాక్ టెస్టులను సాధన చెయ్యాల్సి ఉంటుంది.