Telugu govt jobs   »   State GK   »   Role of Various parties in formation...

TS Movement – Role of Various parties in formation of Telangana state | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర, డౌన్లోడ్ PDF

తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర

భారతదేశంలో తెలంగాణ ఏర్పడటం అనేది కీలక రాజకీయ పార్టీలు పోషించిన క్లిష్టమైన పాత్రల ద్వారా రూపొందించబడిన నీటి ఘట్టం. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మరియు దాని ప్రజాకర్షక నాయకుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో, భారీ ప్రజా మద్దతుతో ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్, ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి అంతర్గత అసమ్మతిని నావిగేట్ చేసింది, అయితే భారతీయ జనతా పార్టీ (BJP) ప్రాంతీయ ఆకాంక్షలకు దాని నిబద్ధతతో కలిసి మద్దతునిచ్చింది. ఈ కధనంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర గురించి చర్చించాము.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర

జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయని పేర్కొన్నారు.

  1. భావ వ్యా ప్తి 
  2. ఉద్యమ దశ 
  3. రాజకీయ ప్రక్రియ

(1) భావవ్యా ప్తి:

  • 1990 లలో మొదలై 1996 తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, అన్నివర్గాల వారు ఈ భావవ్యాప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.
  • తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందనే విషయాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుదాకా అన్నివర్గాల వారు ప్రతిభావంతంగా, ప్రభావంతంగా భావవ్యాప్తిని చేయగలిగారు.

(2) ఉద్యమదశ:

  • భావవ్యాప్తి ద్వారా వచ్చిన చైతన్యం ఉద్యమంగా మారింది. 2000లలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ రూపాలు ఏర్పడ్డాయి.
  • 1990లలో ఒక ఆకాంక్షగా మొదలైన తెలంగాణ ఉద్యమం 2001లో టి.ఆర్.ఎస్ ఆవిర్భావం తరువాత రాజకీయ వ్యక్తీకరణ జరిగింది. ఆ తరువాత డిమాండ్ గా మారింది.

(3) రాజకీయ ప్రక్రియ :

  • 2001 టి.ఆర్.ఎస్ ఆవిర్భావం తరువాత టి.ఆర్.ఎస్ పార్టీ ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకున్నది.

టీఆర్ఎస్ పార్టీ పాత్ర మరియు రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల పొత్తులు

  • తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వయుగంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి ఆ తరువాత కాలంలో, అంటే 1983లో ఎన్.టి.ఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు (1985, 1989, 1993) సార్లు ఎన్నికవుతూ వచ్చారు.
  •  1999 ఎన్నికల అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.
  • విజన్-2020 పత్రాన్ని మెకెన్సీ వారిచేత బాబు తయారుచేయించారు.
  • విజన్-2020 డాక్యుమెంట్ లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడంతో ఈ పత్రాన్ని కె.సి.ఆర్ బహిరంగంగా విమర్శించారు.
  • చంద్రబాబు కరెంట్ చార్జీలను పెంచినపుడు “అసలే కరువుతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు ఇది మరింత భారమై వారి నడ్డి విరిచేస్తుంది” అని కె.సి.ఆర్ బహిరంగంగానే విమర్శించారు.
  • 2000 సం||లో ఎన్.డి.ఎ ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను ఏర్పరుస్తూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించగా చంద్రబాబు అడ్డుపడ్డాడు. దాంతో కె.సి.ఆర్. టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు.
  • రాజీనామా అనంతరం 2001 ఏప్రిల్ 27న కె.సి.ఆర్’ హైదరాబాద్ లోని జలదృశ్యంలో “తెలంగాణ రాష్ట్ర సమితి“ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
  • 2001 మే 17న కరీంనగర్ లో “సింహగర్జన” పేరుతో సభ పెట్టారు.
  • ఈ సింహగర్జన సభకు “జార్ఖండ్ ముక్తి మోర్చా” నాయకుడు “శిబూ సోరెన్” వచ్చి తెలంగాణకు మద్దతు తెలిపాడు.
  • 2001లో స్థానిక సంస్థల ఎన్నికలలో టి.ఆర్.ఎస్. పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకుంది.
  • నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా-సంతోష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా – కె.వి.రాజేశ్వర్‌రావు ఎన్నికయ్యారు.
  • 2001 సెప్టెంబర్ లో కె.సి.ఆర్. రాజీనామా చేసిన సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
  • ఈ ఉప ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గము నుండి తన ప్రత్యర్థి అయిన కె.శ్రీనివాసరెడ్డి పై (టి.డి.పి) 58,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
  • 2001 నవంబర్ 17న ఖమ్మంలో ప్రజాగర్జన సభను నిర్వహించారు.
  • 2002 మార్చి 27న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో శంఖారావ సభ పేరుతో బహిరంగ సభను టీఆర్ఎస్ నిర్వహించింది.
  • 2002 జనవరి 22న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి.
  • ఈ ఎన్నికలలో టి.ఆర్.ఎస్. పార్టీ కేవలం రెండు కార్పొరేట్ స్థానాలలో (మాణికేశ్వర్ నగర్ లో యాదయ్య, మోండా మార్కెట్ నుండి పద్మారావు) మాత్రమే గెలిచారు.
  • ఈ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ స్థానానికి పోటీ చేసిన టి.ఆర్.ఎస్. పార్టీ ప్రధాన కార్యదర్శి – నాయిని నర్సింహారెడ్డి కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయాడు.

ప్రథమ వార్షికోత్సవ సభ

  • 2002 ఏప్రిల్ 27న టి.ఆర్.ఎస్. ప్రథమ వార్షికోత్సవ సభ నల్గొండలో జరిగింది.
  • ఈ వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు: శిబూసోరెన్, అజిత్ సింగ్, భీంసింగ్
  • టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్ల చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి కె.సి.ఆర్ తో సహా పార్టీ కార్యకర్తలు భిక్షాటన చేసి మరీ ఆర్థిక సహాయం అందించారు.

ద్వితీయ వార్షికోత్సవ సభ

  • 2003 ఏప్రిల్ 27 వ తేదీన వరంగల్ (హన్మకొండ) పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయవార్షికోత్సవ సభలు జరిగాయి.
  • ఈ సభకు టి.ఆర్.ఎస్. పార్టీ ‘వరంగల్ జైత్రయాత్ర’ అని నామకరణం చేసింది.
  • ఈ సభకు కె.సి.ఆర్ సిద్ధిపేట నుండి సైకిల్ యాత్రతో, అన్ని జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు సైకిళ్ళపై వచ్చారు. ఈ
  • ఈ వార్షికోత్సవ సభలో పాల్గొన్న ముఖ్య నాయకులు –
  • అజిత్ సింగ్ (మాజీ కేంద్రమంత్రి)
  • దేవేగౌడ (మాజీ ప్రధానమంత్రి)
  • బన్వర్‌లాల్ పురోహిత్ (విదర్భ ఉద్యమనాయకుడు)
  • బాబూలాల్ తివారి (బుందేల్ఖాండ్ ఉద్యమనాయకుడు)
  • ఈ సభలోనే దేవేగౌడ, అజిత్ సింగ్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తమ పార్టీల మద్దతు లభించగలదని హామీ ఇచ్చారు.

తెలంగాణ భావన ప్రజలలోకి తీసుకువెళ్లడానికి టీఆర్ఎస్ కార్యక్రమాలు

పల్లెబాట: టి. ఆర్. ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది.

జలసాధన ఉద్యమం

  • తెలంగాణ రాష్ట్రసమితి 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 వరకు జలసాధన ఉద్యమాన్ని నిర్వహించింది.
  • జలసాధన కార్యక్రమం అనంతరం 2003 జనవరి 6న ‘తెలంగాణ గర్జన’ ఫేరుతో హైద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్స్ లో ఒక మహాసభను నిర్వహించింది.

కె.సి.ఆర్ పాదయాత్రలు

  • రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యపై నిరహార దీక్ష చేసిన నాయకుడు – రవీంద్రనాథ్ రెడ్డి
  • అటువంటి సమయంలో ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కె.సి.ఆర్. 2003 మే 20నుండి మే 25వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశారు.
  • ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుదారులు నిరసన వ్యక్తం చేశారు.
  • దాంతో బాధిత రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కె.సి.ఆర్. 2003 ఆగస్టు 25 నుండి ఆగస్టు 30 తేదీల మధ్య కోదాడ నుండి హాలియా వరకు 120 కి.మీ పాదయాత్ర చేశారు.

జాతీయస్థాయిలో తెలంగాణ ఆకాంక్ష తెలియజేయడం

  • టి.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ వాదమును ఢిల్లీకి తెలయజేయడానికి 2003 మార్చి 27న హైద్రాబాద్ లోని ఫలక్ నుమా పాలెస్ నుండి 1000కార్లతో ఢిల్లీకి కారు ర్యాలీ తీశారు. ఢిల్లీలో రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికాడు.
  • “2003 సెప్టెంబర్ 9న మౌలాంకర్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలోనే “ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కె.సి.ఆర్.” ను ఎన్నుకున్నారు.
  • ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యనాయకులు
  • అజిత్ సింగ్ (హరిత ప్రదేశ్ ఉద్యమకారుడు)
  • శిబూసోరెన్ (జార్ఖండ్ రాష్ట్రం)
  • బన్వర్ లాల్ (విదర్భ ఉద్యమకారుడు)
  • బాబూలాల్ తివారి (బుందేల్ ఖండ్ ఉద్యమకారుడు)
  • రాజా బుందేలా (బుందేల్ఖాండ్ ఉద్యమకారుడు)

Role of Various parties in formation of Telangana state PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష
తెలంగాణ ఉద్యమం- తెలంగాణ భావజాల వ్యాప్తి.
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు | తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం
తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు.
మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

Which political party played a leading role in the formation of Telangana?

The Telangana Rashtra Samithi (TRS), led by K. Chandrashekar Rao (KCR), played a pivotal role in spearheading the movement for the formation of Telangana. The party actively advocated for the socio-economic development of the region and mobilized significant public support.

What was the Telangana Movement?

The Telangana Movement was a socio-political movement in India advocating for the creation of a separate state, Telangana, from Andhra Pradesh.