Table of Contents
Telangana Movement and State Formation మలిదశ ఉద్యమం
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Movement and State Formation మలిదశ ఉద్యమం
- కాకినాడ తీర్మానం (Kakinada Resolution) అమలు చేయకపోయేసరికి ఆలె నరేంద్ర బీజేపీ నుంచి బయటికి వచ్చి ‘తెలంగాణ సాధన సమితి’ అనే పార్టీని స్థాపించారు.
- కేసీఆర్ తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించి 2002 ఆగస్టు 11న టీఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది.
2004 ఎన్నికల పొత్తులు (2004 Election Alliances)
- టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించింది.
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి 42 స్థానాలు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది.
- 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 26 శాసనసభ సీట్లను, 5 లోక్ సభ సీట్లను గెలిచింది.
- కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలోకి రావటంతో టీఆర్ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరింది.
- దీనిలో కె.చంద్రశేఖర్ రావుకు ఓడరేవుల మంత్రిత్వశాఖ , ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది.
- 2004 జూన్ 7న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంలో ‘అవసరమైన సంప్రదింపుల ద్వారా సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేపడుతుందని” పేర్కొన్నారు.
జె.ఎమ్.గిర్‌గ్లాని కమిటీ (J.M. Giriglani Committee)
- జూన్ 25, 2001న 610 జి.ఓ. అమలును పరిశీలించడానికి గిర్‌గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది – నారా చంద్రబాబునాయుడు
- ఇది ఏకసభ్య విచారణ కమిటీ.
- ఈ కమిటీ 90 రోజులలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది.
- ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది
- మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారుచేయబడింది.
సూచనలు (Recommendations)
ఈ కమీషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జి.వో అమలు కోసం తాత్కాలికమైన, శాశ్వతమైన చర్యలను సూచించింది.
- సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి.
- ఉల్లంఘనలు సరిచేసిన తర్వాతే కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని చేయాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి.
- రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి.
- సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగంను బలోపేతం చేయాలి.
- జి.వో.610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమీటీని నియమించింది.
జి.వో 610పై హౌస్ కమిటీ:
- జూన్ 15, 2001న 6 సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెం. 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది.
- తెలంగాణ శాసన సభ్యులు. డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు
- దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
- ఈ కమిటీ చైర్మన్ – రేవూరి ప్రకాశ్ (టీడీపీ ఎమ్మెల్యే)
610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ:
- 2006 డిసెంబర్ 6న 610 జీవో అమలుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ కమిటీ సభ్యులలో వున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 జీవో అమలు కాలేదు.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ
- కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2005లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
- ఈ కమిటీ యొక్క గడువు 8 వారాలు
- ఈ కమిటీ యొక్క విధి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం.
- ఈ కమిటీకి 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు.
- 2008 అక్టోబర్ లో టిడిపి తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇచ్చింది.
టి.ఆర్.ఎస్. చీలికకు వై.ఎస్.ఆర్, కుట్ర:
- ఇటువంటి సమయంలో వై.ఎస్.ఆర్ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్.ను చీల్చడానికి ప్రయత్నించాడు.
- దీనిని పసిగట్టిన కె.సి.ఆర్. రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకోమని టి.ఆర్.ఎస్. మంత్రులకు సూచించాడు
- రాష్ట్ర మంత్రివర్గంలోని టి.ఆర్.ఎస్ మంత్రులు రాజీనామా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న కె.సి.ఆర్, ఆలె నరేంద్రలు తమ పదవులకు రాజీనామా చేయలేదు.
- 2005 డిసెంబర్ లో శాసనమండలి ఎన్నికలలో “కాసాని జ్ఞానేశ్వర్” స్వతంత్ర్య అభ్యర్థిగా కాంగ్రెస్అం డతో పోటీ చేశాడు.
- జ్ఞానేశ్వర్‌కు పార్టీ ఆదేశాలను ధిక్కరించి 9 మంది టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు మద్దతివ్వడానికి పరోక్షంగా వై.ఎస్.ఆర్. కారణమయ్యాడు
- తెలంగాణ భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ జాగరణ సేన అను పేరుతో లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
- పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో 2006 ఫిబ్రవరి 12న భద్రాచలంలో బహిరంగ సభను నిర్వహించింది.
- ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు.
*****************************************************************
మునుపటి అంశాలు :
తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు
తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర
జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు
1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
