Telugu govt jobs   »   State GK   »   1969 Movement-Role of Different Communities

Telangana Movement and State Formation, 1969 Movement-Role of Different Communities | 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం మరియు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య మరియు ప్రభుత్వ ఖర్చులలో తెలంగాణ ప్రాంతానికి వివక్ష కొనసాగింపు ఫలితంగా 1969 రాష్ట్ర ఆవిర్భావ ఆందోళన జరిగింది. 1969 జనవరిలో విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసనలను తీవ్రతరం చేశారు. ఈ కధనంలో 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర గురించి చర్చించాము.

(ఎ) 1969 ఉద్యమం-ఉద్యో గుల పాత్ర

విద్యుత్ ఉద్యోగులు

  •  కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని నాన్ ముల్కీ ఉద్యోగులను జనవరి 10 లోగా తొలగించాలని ఉద్యమించారు.
  • ఉద్యమం ఉదృతరూపం దాల్చడంతో 1969 జనవరి 18, 19 రోజులలో కాసు బ్రహ్మానందరెడి ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

అఖిలపక్ష ఒప్పందం

ఈ ఒప్పందం ప్రకారం తీసుకోవలసిన చర్యలు

  • ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాలలో స్థానికులను నియమించాలి. ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్రప్రాంతం వారికి వారి ప్రాంతంలో ఉద్యోగవకాశాలు కల్పించాలి.
  • ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఉపయోగించాలి.
  • రాజధానియైన హైదరాబాదు నగరంలో విద్యావసతులను విస్తరింపజేయాలి.

జి.వో.36 

  • ఈ అఖిలపక్ష నిర్ణయాన్ని అమలుపరచుటకు, రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరి 21 రోజున 36 నంబరు గల ఒక జీ.వో.ను జారీ చేసింది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యాచరణ సమితి

  •  1969 మార్చి 11న TNGO ల నాయకుడు కె.ఆర్. అమోస్ ఉపాధ్యాయుల నాయకుడు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో – ‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి’ ఏర్పడింది.

కె.ఆర్.ఆమోస్ డిస్మిస్ అంశం

  • 1969 మేలో ప్రత్యేక తెలంగాణ జూన్ 1 లోగా ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగసంఘం నాయకుడు – కె.ఆర్. ఆమోస్.
  • దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది.
  • అంతే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడనే కారణంతో గవర్నర్ ‘అమోస్’ను ఉద్యోగం నుండి 1969 మే 25న డిస్మిస్ చేశారు.

నిరవధిక సమ్మె

  • 1969 జూన్ 10 నుండి ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించి, 1969 జూలై 16 (37 రోజులు)న విరమించారు.
  • తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నసి ఉల్లాబేగ్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

బి) 1969 ఉద్యమం – మేధావుల పాత్ర

తెలంగాణ పరిరక్షణల కమిటి

  • హైదరాబాద్ నగరంలోని మేధావులు 1969 జనవరి 13 న తెలంగాణ పరిరక్షణల కమిటీని స్థాపించారు. 
  • తెలంగాణ పరిరక్షణల కమిటీ ఛైర్మన్ – కాటం లక్ష్మీనారాయణ. 

తెలంగాణ విమోచనోద్యమ సమితి

  • 1969 జనవరి 28న వరంగల్ లో ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ సదస్సు కాళోజీ అధ్యక్షతన జరిగింది.
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – ‘కాళోజీ నారాయణరావు’
  • 1969 జూన్లో హైదరాబాద్ లో కాళోజి నారాయణరావు అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది.

తెలంగాణా ప్రజాసమితి

  • 1969 మార్చి 25న హైద్రాబాద్ లో యువకులు, మేధావులు విద్యార్థులు కొనసాగిస్తున్న తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా ‘తెలంగాణ ప్రజాసమితి’ ని స్థాపించారు (ఫిబ్రవరిలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా కన్వెన్షన్ 1969 మార్చి 25న తెలంగాణ ప్రజా సమితిగా మార్పు చెందింది).
  • దీని అధ్యక్షుడు – మదన్ మోహన్ (సిద్దిపేట లాయర్)
  • మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షుడు అయిన తర్వాతి కాలంలో తెలంగాణ ప్రజాసమితి నుండి మదన్ మోహన్ సిద్దిపేట ఉపఎన్నికలలో పాల్గొని విజయం సాధించాడు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సు: (1969 మే 20) 

  • 1969 మే 20 న ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, లెక్చరర్ల తెలంగాణా సదస్సు వై.యం.సి.ఎ. హాల్ లో ప్రొ॥ముంజుఠాలం అధ్యక్షతన జరిగింది. “
  • ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసింది – రావాడ సత్యనారాయణ (ఉస్మానియా వైస్ ఛాన్సలర్)
  • ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్న రావాడ సత్యనారాయణను 1969 ఏప్రిల్ 25న డి.ఎస్.రెడ్డి స్థానంలో ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గా నియమించారు.

ఈ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించిన ప్రొఫెసర్లు :

  • ప్రొ॥ జయశంకర్ సారు
  • బషీరొద్దిన్
  • పెన్నా లక్ష్మీకాంతారావు
  • శ్రీధరస్వామి
  • తోట ఆనందరావు
  • ఈ సదస్సులో సమర్పించిన పత్రాలన్నింటిని కలపి ‘Telangana Movement and Investigative Focus’ అనే పుస్తకంను ప్రచురించారు.
  • ఈ సదస్సులో ప్రొ॥ జయశంకర్ సారు సమర్పించిన పత్రం పేరు- “డా॥ కె.ఎల్.రావు-నాగార్జునసాగర్”
  • ఈ సదస్సు ముగింపు ఉత్సవంలో మర్రిచెన్నారెడ్డి ప్రసంగించారు.

 

(సి) 1969 ఉద్యమం-విద్యార్థుల పాత్ర

ఉద్యమంలోకి ఉస్మానియా విద్యార్థులు 

  • 1969 జనవరి 12న యూనివర్సిటిలోని అన్ని కాలేజీలు విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశం వెంకట్రామారెడ్డి అధ్యక్షతన జరిగింది. 

సెఫ్ గార్డ్స్ విద్యార్ధులు: (ప్రత్యేక రక్షణల అమలుకోసం మాత్రమే)

  • వెంకట్రామిరెడ్డి నాయకత్వంలోని గ్రూపు కేవలం తెలంగాణ రక్షణల అమలుకు మాత్రమే పరిమితం. 
  • ఈ విద్యార్థుల లక్ష్యం – రాష్ట్రంను సమైక్యంగా ఉంచుతూ తెలంగాణ రక్షణలను అమలు పరచాలి.
  • అందుకే రక్షణల కోసం మాత్రమే పోరాడుతున్న విద్యార్థులను సేఫ్ గార్డ్స్ విద్యార్థులు అన్నారు.

తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి

  • ఈ కార్యాచరణ సమితి యొక్క ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్ ఎన్నికయ్యాడు.
  • ‘ప్రత్యేక తెలంగాణ సాధించడం మా లక్ష్యం’ అని విద్యార్థులు మొదటిసారి ఈ సమితి ద్వారా ప్రకటించారు. *
  • దీంతో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో రెండు విద్యార్థి సంఘాల గ్రూపులు సేఫ్ గార్డ్స్ మరియు సెపరేటిస్టులుగా విడిపోయారు.

సెపరేటిస్టు విద్యార్థులు

  •  వీరు ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ గా ఏర్పడ్డారు.
  • దీనికి ప్రధాన కార్యదర్శి – మల్లికార్జున్
  • వీరు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించారు.
  • 1969 జనవరి 18 సెపరేటి స్టువర్గం విద్యార్థులు మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో నిజాం కాలేజి నుండి కోఠికి ఊరేగింపు నిర్వహించారు.
  • తెలంగాణ రక్షణలు కోరుతున్న విద్యార్థులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కోఠి నుండి అబిడ్డకు ఊరేగింపు నిర్వహించారు.
  • ఈ రెండు ఊరేగింపులు అబిడ్స్ చౌరస్తాలో ఎదురుపడ్డారు.
  • అప్పుడు 1969 ఉద్యమ సమయంలో మొదటిసారి హైద్రాబాద్ నగరంలో 1969 జనవరి 18న లాఠీచార్జి జరిగింది.
  • 1969 జనవరి 20న శంషాబాదు రైల్వేస్టేషన్ (ఉమదానగర్)పై విద్యార్థులు దాడి చేసిన సందర్భంలో నగరంలో తొలిసారి పోలీసులు కాల్పులు జరిపారు.
  • 1969 జనవరి 24న సదాశివపేటలో విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు.
  • ఈ ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరపగా ‘శంకర్’, ‘కృష్ణ’ అనే యువకులకు బుల్లెట్లు తగిలి గాంధీ హాస్పిటల్ లో చేరగా శంకర్ జనవరి 25న, కృష్ణ ఫిబ్రవరి 10న మరణించారు.

నోట్: 1969వ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. 

విద్యార్థి నాయకుల జిల్లా పర్యటనలు

  • 1969 మార్చి మొదటి వారంలో హైద్రాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో తెలంగాణ సదస్సు ఏర్పాటు చేయాలని 1969 జనవరి 27న మల్లికార్జున్ నేతృత్వంలో ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ నిర్ణయించింది.
  • ఈ సదస్సు విజయవంతం చేయుటకొరకు 35 మంది విద్యార్థి నాయకులు తెలంగాణ జిల్లాలలో పర్యటించడానికి వెళ్ళారు.
  • అటువంటి సమయంలో 1969 జనవరి 28న నల్లగొండ పట్టణంలో ఉపసర్వేయర్ గా పనిచేస్తున్న ‘రంగాచార్యులు’ అనే  ఆంధ్ర ఉద్యోగిని గుర్తు తెలియనివారు పెట్రోల్ పోసి తగులబెట్టారు.
  • దాంతో ఆంధ్రప్రాంతంలో జి.వో-36 కు వ్యతిరేకంగా కౌంటర్ ఉద్యమం ప్రారంభం అయ్యింది.

Telangana History PDF In Telugu | తెలంగాణ చరిత్ర స్టడీ మెటీరియల్ PDF

రెడ్డి హాస్టల్ సదస్సు (1969 మార్చి 8,9 లలో)

  • 35 మంది విద్యార్థి నాయకులు జిల్లా పర్యటనలు పూర్తి చేసుకొని హైద్రాబాద్ లో 1969 మార్చి _8,9వ న రెండు రోజులు రెడ్డి హాస్టల్ లో ‘తెలంగాణ సదస్సు’ నిర్వహించారు.
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – శ్రీమతి సదాలక్ష్మి.
  • ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ప్రొ॥ రావాడ సత్యనారాయణ చేశాడు.
  • ఈ సదస్సులో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి క్విట్ తెలంగాణ అనే నూతన నినాదాన్ని లేవదిశారు.
  • తెలంగాణ మ్యాప్ ను ఇ.వి. పద్మనాభం, ఆదిరాజు వెంకటేశ్వరరావు, మునిజమాలు 1969 మార్చి 7న లీడర్ పత్రికా కార్యాలయంలో రూపొందించారు.
  • తెలంగాణ మ్యాపు రెడ్డి హాస్టల్ సదస్సులోనే శాసనసభ్యుడు అయిన టి.పురుషోత్తమరావు ఆవిష్కరించారు.
  • ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘తపాలబిళ్ల’ ఆవిష్కరణ కోసం రాష్ట్ర గవర్నర్ ఖండుభాయిదేశాయి రావడంతో విద్యార్థులు గవర్నర్ ను ఘెరావ్ చేశారు.
  • 1969 మార్చి 17న విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ‘ప్రజాస్వామ్య రక్షణ దినాన్ని’ జరుపుకొన్నాయి.
  • 1969 మార్చి 28 న ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రింకోర్టు తీర్పు చెప్పింది
  • సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమించి జామై ఉస్మానియా రైలు స్టేషన్‌కు నిప్పంటించారు.

రైల్వే స్టేషన్ మంటలలో పొరపాటున చిక్కుకొని మరణించిన ఇంజనీరింగ్ విద్యార్థులు

  1. ప్రకాశ్ కుమార్ జైన్
  2. పి.సర్వా రెడ్డి

( డి) ఉద్యమం- తెలంగాణ ప్రజా సమితి పాత్ర

  • 1969 ఏప్రిల్ 11 న ప్రధానమంత్రి ఇందిరాగాంధి, లోక్ సభలో అష్ఠసూత్ర పథకంను ప్రకటించింది.
  • ఇటువంటి సమయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంఘాల నియోజకవర్గానికి శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
  • ఈ ఎన్నికలలో మేడ్చల్ పంచాయితీ సమితి అధ్యక్షుడు గా ఉన్న వెంకటరామిరెడ్డి తెలంగాణ ప్రజాసమితి తరపున నిలబడి విజయం సాధించాడు.

మెడే ఊరేగింపు – 1969 మే 01

  • తెలంగాణ ప్రజాసమితి మే డే (మే,01) నాడు ‘డిమాండ్స్ డే’ (కోరికల దినం) పాటించాలని పిలుపునిచ్చింది.
  • మే 01 న రెండు ఊరేగింపులు నిర్వహించి గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది.
  1. చార్ మినార్ నుండి రాజ్ భవనకు
  2. 2. సికింద్రాబాద్ నుండి రాజ్ భవను
  • కాని పోలీస్ కమీషనర్  ఊరేగింపుకు అనుమతి చార్ మినార్ నుండి కాకుండా పబ్లిక్ గార్డెన్స్ నుండి ఇచ్చాడు.
  • కాని నాయకులు చార్ మినార్ నుండి ఊరేగింపు చేయాలని నిర్ణయించారు.

చార్మినార్ నుంచి ఊరేగింపు 

చార్మినార్ నుండి ఊరేగింపుకు మొదట సారధ్యం వహించిన వారు-

  1. మల్లిఖార్జున్
  2.  మదన్ మోహన్
  3. కేశవరావ్ జాదవ్
  •  తరువాత కాలంలో కె.వి.రంగారెడ్డి నాయకత్వంలో ఊరేగింపు బయలుదేరింది.
  • ఆ ఊరేగింపు సికింద్రాబాద్ నుండి బయలుదేరిన ఊరేగింపుతో పబ్లిక్ గార్డెన్ వద్ద కలుసుకొంది.

సికింద్రాబాద్ నుంచి ఊరేగింపు

  • ఈ ఊరేగింపునకు నాయకత్వం వహించినది.
  • ఎస్.బి. గిరి
  • నాగం కృష్ణ
  • గౌతు లచ్చన్న
  • రాజ్ భవన్ దగ్గర కూడా ఉద్యమకారులపై కాల్పులు జరగడం వలన సికింద్రాబాద్ ‘సాయం కళాశాల’ విద్యార్థి నాయకుడు అయిన ‘ఉపేందరావు’ మరణించాడు.

పోలీస్ వ్యాన్‌పై బాంబుదాడి

  • మే 01 వ తేదీన జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా మే 2 వ తేదీనాడు నగరంలో బంద్ నిర్వహించారు.
  • దీనికి నిరసనగా హింసకు హింసతోనే సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో సికింద్రాబాద్ లో పోలీస్ వ్యాన్ పై బాంబు విసిరిన ఉద్యమకారులు : * నరేందర్ • కుమార్
  • ఈ బాంబు దాడిలో మరణిచిన కానిస్టేబుల్ – ‘ఫారుఖ్ అలీ’.

చెన్నారెడ్డి – తెలంగాణ ప్రజాసమితి

  • 1969 ఏప్రిల్ లో చెన్నారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ప్రకటనను ప్రకటిస్తూ ప్రత్యక్ష ఉద్యమంలోకి ప్రవేశించాడు.
  • చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం రెండోదశలోకి ప్రవేశించింది.
  • ప్రత్యేక తెలంగాణ విషయంపై 15 రోజులలో ప్రజాభిప్రాయం సేకరిస్తే అందులో ఓడిపోతే ఉద్యమం విరమిస్తానని చెన్నారెడ్డి 1969 మే 18న ఇందిరాగాంధికి సవాల్ విసిరారు.
  • తెలంగాణ ప్రజాసమితి జూన్ 2వ తేదీన బంద్ కు పిలుపునిచ్చింది.
  • హైద్రాబాద్ నగరం మొత్తం బంద్ పాటించినా ‘దుర్గావిలాస్’ అనే ఆంధ్రహోటల్ మాత్రం తెరచి ఉంచారు.
  • దాంతో ఆగ్రహించిన విద్యార్థి నాయకుడు ‘ప్రేమ్ కిషోర్’ హోటల్ లోనికి వెళ్ళగా అప్పటికే అక్కడికి వచ్చిన ఆంధ్రరౌడీలు కత్తులతో పొడిచి చంపారు.
  • 1969 జూన్ 4 వ తేదీన హైద్రాబాద్ నగరంలో ప్రధాని ఇంధిరాగాంధి పర్యటించి తెలంగాణ ప్రజాసమితి నాయకులతో ఇతర ఉద్యమకారులతో చర్చించింది.

అబిడ్స్ చౌరస్తా – సత్యాగ్రహం

  • 1969 జూన్ 25 న అబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అనుమతించలేదు.
  • అయినప్పటికీ అబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహం చేశారు.
  • దాంతో ప్రభుత్వం 16 మంది అగ్రనాయకులను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది
  • ఈ అగ్రనాయకుల అరెస్టుకు నిరసనగా లోకసభకు రాజీనామా చేస్తామని పేర్కొన్న పార్లమెంటరీయన్లు
  •  డాక్టర్. మెల్కోటే
  • సంగం లక్ష్మీబాయమ్మ.
  • దేశంలోనే పి.డి. చట్టం కింద అరెస్టు కాబడిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ – ‘డాక్టర్ గోపాల్ కిషన్’.

తెలంగాణ ఫ్లాగ్ డే – 1969 జూలై 12

  • ‘1969 జూలై 12’ న తెలంగాణాలో ఫ్లాగ్ డే ను నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఇసామియా బజార్ లో ప్రత్యేక తెలంగాణ పతకాన్ని ఆవిష్కరిస్తూ అరెస్ట్ కాబడిన పార్లమెంట్ సభ్యుడు – డాక్టర్ మేల్కాటే.
  • అటువంటి సమయంలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి బలపరచిన లక్ష్మీనారాయణ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం కూడా తెలంగాణవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది.

కొత్తగూడెం కాల్పులు – 1969 ఆగస్టు 6

  • కొత్తగా హోం మినిస్టర్ పదవి చేపట్టిన జలగం వెంగళ్ రావు సభలో నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై “ఆగస్టు 6′ న కొత్తగూడెంలో పోలీసులు కాల్పులు జరిపారు.
  • ఈ కాల్పులలో మరణించిన విద్యార్థులు : * రాంచందర్ * దస్తగీర్.

ఉద్యమ విరమణ ప్రకటన

  • హైదరాబాద్ నగరానికి విడిదికి వచ్చిన రాష్ట్రపతి వి.వి.గిరి తో మర్రిచెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలు తెలంగాణ ఉద్యమంపై చర్చించారు.
  • ఈ చర్చ అనంతరం 1969 సెప్టెంబర్ 23న విద్యార్థులు తరగతులకు హజరుకావాలని ‘తెలంగాణ ప్రజాసమితి’ మరియు ‘విద్యార్థుల కార్యచరణ సమితి’ ప్రకటించింది
  • ఈ ప్రకటనపై సంతకం చేసిన నాయకులు : మర్రి చెన్నారెడ్డి, మల్లిఖార్జున్

తెలంగాణ ప్రజాసమితి ప్రథమ రాష్ట్రస్థాయి సభలు

  • ఈ సభలు మర్రి చెన్నారెడ్డి అధ్యక్షతన 1970 జనవరి 10న సికింద్రాబాద్ లోని బాయ్స్ స్కాట్ కేంద్ర కార్యాలయం వద్ద ప్రారంభించబడ్డాయి
  • ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు – నగరి కృష్ణ,
  • ఈ మహాసభలకు ప్రత్యేక ఆహ్వానితుడుగా బ్రిటన్ కి చెందిన లేబర్ పార్టీ ఎం.పి. గ్రే హాజరయ్యారు.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిపై రిఫరెండం జరగాలని ఈ సమావేశాల్లోనే మర్రి చెన్నారెడ్డిగారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇ) పోటీ తెలంగాణ ప్రజాసమితి పాత్ర

  • 1969 మేలో చెన్నారెడ్డి ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడయ్యాడు.
  • మర్రిచెన్నారెడ్డి అధ్యక్షతను వ్యతిరేకిస్తూ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ‘పోటీ తెలంగాణ ప్రజాసమితి’ ఏర్పరిచారు.
  • ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయినందుకు పోటీ తెలంగాణ ప్రజాసమితి వారు 1970 జనవరి 15న కేశవ మెమోరియల్ గ్రౌండ్లో బహిరంగ సభను నిర్వహించారు.
  • ఈ సభకు పోటీ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు ఎం.శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

Download: 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

తెలంగాణ ఉద్యమం ఆర్టికల్స్ 
తెలంగాణ గుర్తింపుకై ఆరాటం  జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956 తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్య సంఘటనలు
 1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
నక్సలైట్ ఉద్యమం 1969 ఉద్యమానికి కారణాలు


pdpCourseImg

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

What was the Telangana 1969 Movement?

The Telangana 1969 Movement refers to a mass agitation that took place in the region of Telangana, India, in 1969. The movement aimed to address the grievances of the people of Telangana and secure separate statehood for the region.

How did government employees contribute to the Telangana 1969 Movement?

Government employees, including teachers and staff, supported the Telangana 1969 Movement by participating in strikes and demonstrations. Their involvement added to the intensity of the movement and put pressure on the government to address the demands.

How did students contribute to the Telangana 1969 Movement?

Students actively participated in the Telangana 1969 Movement by organizing protests, demonstrations, and rallies. Their energetic involvement lent significant support and helped amplify the voice of the movement.