Telangana Movement & State Formation Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.
Telangana Movement & State Formation , 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు.
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
Telangana Movement & State Formation , 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు.
1. ప్రాంతీయ మండలి విషయంలో ఉల్లంఘనలు:
- పార్లమెంట్ లో ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్’ను ప్రవేశపెట్టే సమయానికి తెలంగాణ ప్రాంతీయ మండలికి బదులు తెలంగాణ ప్రాంతీయ కమిటీని ప్రతిపాదించారు.
- ఈ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు. అది కూడా ఆర్థిక భారం లేని సూచనలు మాత్రమే చేయాలని కమిటీ అధికారాలను పరిమితం చేశారు.
- కమిటీకి ముల్కీ నిబంధనల అమలు, పర్యవేక్షణాధికారాన్ని కాని, ఉన్నత విద్యా వ్యవస్థను పర్యవేక్షించే అధికారం కాని లేవు.
- ఆ విధంగా పెద్దమనుషుల ఒప్పందంలో ప్రతిపాదించిన ప్రాంతీయ మండలిని బలహీనపరిచి, ప్రాంతీయ కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారు.
2. రాజకీయ రంగంలో ఉల్లంఘనలు
తెలంగాణకు ముఖ్యమంత్రి (లేదా) ఉపముఖ్యమంత్రి పదవి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.
- నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉపముఖ్యమంత్రి పదవి “చేతికి ఆరో వేలు వంటిదని” పేర్కొని ఆ పదవిని ఎవరికీ ఇవ్వలేదు.
- దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణ నాయకుడైన కె.వి. రంగారెడ్డికి ఇచ్చాడు.
హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
- తెలంగాణకు కల్పించిన రక్షణల ప్రకారం “హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ”ని కొనసాగించాలి.
- తెలంగాణలో రాజకీయ నాయకత్వం ఎదగకుండా చేయడం కోసం ఆంధ్ర నాయకులు దీనిని రద్దు చేశారు.
- ఆంధ్ర నాయకులు ఉల్లంఘించిన తెలంగాణ రక్షణలలో అతి ముఖ్యమైన రక్షణ ఇది.
కొత్త రాష్ట్రం పేరు ఆంధ్ర-తెలంగాణగా పెట్టడం
- కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ అని పేరు పెట్టుటకు అందరూ అంగీకరించారు.
- కానీ “ రాష్ట్రాల పునర్విభజనల బిల్లు-1956”లో ఈ పేరు చూపలేదు.
- పార్లమెంటులో రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదించినపుడు ఈ పేరును ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది.
3. వసాయ రంగంలో ఉల్లంఘనలు:
- హైదరాబాద్ కౌలుదారీ మరియు వ్యవసాయ భూముల చట్టం – 1950 ప్రకారం స్థానికేతరులు తెలంగాణ వ్యవసాయ భూములను కొనడం చట్టవిరుద్ధం.
- కానీ 1968 వ సం||లో హైదరాబాద్ కౌలుదారీ మరియు వ్యవసాయ భూముల చట్టంను సవరించి దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని పెద్దమొత్తంలో మాగాణి భూమిని తక్కువ ధరకే ఆంధ్రులు కొనుగోలు చేయడం జరిగింది.
4. ఉద్యోగ రంగంలో ఉల్లంఘనలు:
1957 ప్రభుత్వ ఉద్యోగాల నివాస అర్హత చట్టం సెక్షన్-3
- పార్లమెంట్ 1957లో ప్రభుత్వ ఉద్యోగాల (నివాస అర్హత) చట్టాన్ని ఆమోదించింది.
- ఈ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల (నివాస అర్హత) నిబంధనలను 1959లో జారీ చేసింది.
- ఈ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి, తెలంగాణ ప్రాంతంలోని స్థానిక సంస్థల్లో ఉద్యోగానికై 12సం||రాల స్థిర నివాసాన్ని ఒక అర్హతగా గుర్తించాయి.
- అదేవిధంగా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోను ప్రతి మూడు ఉద్యోగాలలో రెండవ ఉద్యోగానికి విధిగా నివాస అర్హతను పాటించాలి.
- అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నివాస అర్హతకు మినహాయింపు ఇవ్వవచ్చు.
తెలంగాణా DCCB అపెక్స్ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల
మినహాయింపు పేరుతో ఉల్లంఘనలు:
- మే 1968 నాటికి 1,730 సందర్భాలలో మినహాయింపును ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెపుతున్నాయి.
- స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లేరన్న నెపంతో చాలామందిని స్థానికేతరులను నియమించారు.
- భార్యభర్తలను ఇద్దరిని ఒకేదగ్గర పోస్టింగ్ చేయాలనే కారణంతో అనేక మంది స్థానికేతరులను నియమించారు.
- ఆంధ్రలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారనీ ముల్కీ నియమానికి విరుద్ధంగా వారిని తెలంగాణకు కేటాయించారు.
కొత్తగూడెం థర్మల్ స్టేషన్లో అన్యాయాలు:
- 1961లో పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించబడింది.
- పాల్వంచలోని పవర్ స్టేషన్ తెలంగాణ మిగులు నిధులతో నిర్మించబడినది కనుక దీనిలోని ఉద్యోగాలలో మిగతా ప్రాంతాల వారికి అవకాశం లేదు. కానీ పెద్ద సంఖ్యలో స్థానికేతరులను నియమించారు.
- 1968 జూలై 30న పాల్వంచ ఎన్జీవోల సమావేశం కేటీపీఎస్ క్లబ్ లో రామసుధాకర రాజు అధ్యక్షతన జరిగింది.
- 1968లో తెలంగాణ హక్కుల రక్షణ ఉద్యమం ప్రారంభమై 1968 జూలై 10న తెలంగాణ రక్షణల దినంను పాటించడం జరిగింది.
- 1968లో కొలిశెట్టి రామదాసు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశాడు.
- అర్హులైన తెలంగాణ స్థానికులు లభించని యెడల ఆ ఖాళీలను అలాగే ఉంచాలని 1968 ఏప్రిల్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
- ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతీయులని నియమించవలసి ఉన్న ప్రభుత్వం మరియు బోర్డు ఉత్తర్వులను ఖాతరు చేయక 1969 మే 1న కె.సుబ్బారావు (పశ్చిమగోదావరి), ఆజం అలీ (కృష్ణా), ఎ. పెరుమాళ్ (మద్రాస్) వారిని పవర్ స్టేషన్లో నిర్మించడం జరిగింది.
- దీంతో తెలంగాణ నాయకులలో ప్రముఖుడైన న్యాయవేత్త గులాం పంజాతన్ “పరిస్థితి చేయిదాటక ముందే మేల్కొనండి” అనే శీర్షికతో 1959 డిశంబర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపన పత్రం ఇచ్చాడు.
శాసనసభలో ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ప్రకటన:
- తెలంగాణకు జరుగుతున్న నష్టాలపై కె. అచ్చుతరెడ్డి గారు దామోదరం సంజీవయ్యను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశాడు.
అచ్యుతరెడ్డి ఆరోపణలకు స్పందించి శాసనసభలో సంజీవయ్య ఇచ్చిన హామీలు :
- తెలంగాణ మిగులు నిధులతో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం
- కొత్తగూడెంలో ఎరువుల కర్మాగార నిర్మాణం.
- ఆంధ్రప్రాంతానికి ఖర్చు చేసిన తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకు ఖర్చు పెడతామని పేర్కొన్నాడు
- ముఖ్యమంత్రి ప్రకటన పర్యవసనంగా ప్రభుత్వం 1961లో శ్వేతపత్రం విడుదల చేసింది.
శ్వేతపత్రం లోని ముఖ్యాంశాలు:
- నిజాం సెక్యూరిటీలకు సంబంధించిన రూ.13 కోట్లు తెలంగాణకు ఖర్చు పెట్టడం జరుగుతుంది
- ఆంధ్రప్రాంతంలో ఖర్చు పెట్టిన తెలంగాణ మిగులు నిధులను తృతీయ ప్రణాళికలో తెలంగాణలో ఖర్చు పెడతారు.
- దీనికి అదనంగా తెలంగాణలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం రూ. 12 కోట్లు ఖర్చు పెట్టగలదు.
తెలంగాణ అన్యాయాలపై లోకసభ, రాజ్యసభలలో చర్చ :
- 1961లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు హరిశ్చంద్ర హేడా లోక్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందంలోని మౌలిక విషయాలను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు.
- రాజ్యసభ సమావేశాలలో వి.కె.ధగే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టకపోతే తెలంగాణలో మహోపద్రవాన్ని ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నాడు.
Download: 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
మునుపటి అంశాలు :
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
More Important Links on TSPSC :
Telangana State GK |
Polity Study Material in Telugu |
Economics Study Material in Telugu |