Table of Contents
Telangana Movement & State Formation : Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.
Telangana Movement & State Formation రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Movement & State Formation రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు
తెలంగాణా పార్టీ:
- 1984 సంవత్సరంలో దేవానంద స్వామి అనే ప్రత్యేక తెలంగాణా వాది వరంగల్ లో తెలంగాణ పార్టీని స్థాపించాడు.
- 1984 నుండి కొంతకాలం వరకు ప్రత్యేక తెలంగాణవాదంను ప్రచారంలో ఉంచగలిగాడు.
తెలంగాణ పోరాట (సంఘర్పణ) సమితి:
- ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు 1989లో తెలంగాణ పోరాట సమితిని ఏర్పరచినవారు- మేచినేని కిషన్‌రావ్, కోహెడ ప్రభాకర రెడ్డి, కె.ఆర్. ఆమోస్
- తెలంగాణ పోరాట సమితి ద్వారా కొంతకాలం పాటు ప్రత్యేక తెలంగాణ కోసం వీరు కార్యక్రమాలను నిర్వహించారు.
తెలంగాణ ఫోరం
- 1991-92లలో వెలిచాల జగపతిరావు వెల్లడించిన నివేదిక వలన తెలంగాణవాదులలో కొంత స్పందన వచ్చింది.
- దాంతో అప్పుడప్పుడే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన జానారెడ్డి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
- దీంతో తెలంగాణలోని వివిధ పార్టీల శాసనసభ్యులు కలిసి తెలంగాణ ఫోరం ఏర్పరచుకొని దానికి కన్వీనర్‌గా జానారెడ్డిని ఎన్నుకున్నారు.
- ఈ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి వర్గం తెలంగాణకు జరిగిన అన్యాయాలపై 1992 సెప్టెంబర్ లో ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధనరెడ్డికు వినతి పత్రాలు సమర్పించారు.
- కానీ ఇంతలో నేదురమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా తప్పించి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం నియమించింది.
- ఈ కొత్త ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిపదవి లభించడంతో జానారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకున్నాడు.
Read More: TS TET Notification 2022 PDF Telangana
జై తెలంగాణ పార్టీ
- 1996 వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి తరువాతి కాలంలో ఎన్.టి.ఆర్ తెలుగుదేశం (లక్ష్మీపార్వతి పార్టీ) పార్టీ లో చేరిన నాయకుడు – పటోళ్ళ ఇంద్రారెడ్డి
- ఇతను 1997లో జై తెలంగాణా పార్టీని ఏర్పాటు చేశారు.
- ఈ పార్టీ తరపున తెలంగాణలో విజయయాత్రలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తేవడంలో ఇతనికి సహకరించిన మేధావి వర్గం కొండా మాధవరెడ్డి (రిటైర్డ్ న్యాయమూర్తి), జయశంకర్ సారు
- ఇతను ఎవరిమాటలు వినకుండా తన అనుచరులనే అన్ని పదవులలో నియమించడం వల్ల ఇతనికి, సహకరించిన వారందరూ దూరమయ్యారు.
- దాంతో అప్పటి పి.సి.సి అధ్యక్షుడు డాక్టర్ వై. యస్.ఆర్ ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.
రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై సుదీర్ఘ చర్చ:
- 1997 ఫిబ్రవరిలో తెలంగాణ అంశంపై శాసనసభ సుదీర్ఘ చర్చ చేసింది.
- ఈ చర్చలో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను శాసనసభ్యులు జీవన్‌రెడ్డి గణాంకాలతో సహా వివరించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.
- ఇతనితో పాటు ఇతర ప్రతిపక్షాల శాసనసభ్యులు తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
- వీరందరి ప్రసంగం అనంతరం వీరడిగిన ప్రశ్నలకు చంద్రబాబునాయుడు పొంతన కుదరని సమాధానాలిచ్చి తన ప్రసంగం చివరిలో జై తెలుగుదేశం, జై హింద్ అంటూ ముగించాడు.
ప్రధాని దేవేగౌడ ప్రకటన:
- సంకీర్ణ రాజకీయాల యుగం కాలంలో 1996 లోకసభ ఎన్నికల అనంతరం అనేక సంకీర్ణ పార్టీలతో కలిసి కేంద్రంలో దేవేగౌడ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
- ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి దేవేగౌడ ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి కేంద్రప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని చిన్న రాష్ట్రాల ఏర్పాటు పట్ల తన సానుకూల ధోరణిని ప్రకటించాడు.
ప్రణయ్ భాస్కర్ రాజీనామా
- 1996-97 నుండి ప్రత్యేక తెలంగాణ నినాదం విస్తృతం కావడంలో తెలంగాణ యువకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు అనడంలో ఎవరికీ అనుమానం లేదు.
- ఇటువంటి సమయంలో శాసనసభలో తెలుగుదేశ శాసనసభ్యుడు అయిన ప్రణయభాస్కర్ (వరంగల్) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రస్తావించాడు.
- ఈ శాసనసభలో స్పీకర్‌గా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు తెలంగాణ అనే పదం వాడకూడదు దాని స్థానంలో వెనుకబడిన ప్రాంతం అని పేర్కొనాలని రూలింగ్ ఇచ్చాడు.
- దీంతో మనస్తాపానికి గురైన ప్రణయ్ భాస్కర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపసంహరించుకున్నారు.
- దాంతో తమకు జరిగిన నష్టం గురించి తోటివారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో పరిశోధన చేసి అన్యాయాలను వెలికితీసి వాటిని ముద్రించడం జరిగింది.
- ఆవిధంగా ముద్రించబడిన వాటిలో గాదె ఇన్నయ్య నాయకత్వంలో ముద్రించబడిన దగాపడ్డ తెలంగాణ సంక్షిప్త వివరాలు అనే గ్రంథం ఎంతో ముఖ్యమైనది.
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం – చిన్నారెడ్డి
- చిన్నారెడ్డి తెలంగాణ పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తెచ్చాడు.
- చిన్నారెడ్డి కన్వీనర్‌గా “తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం” ఏర్పాటు అయ్యింది.
- 2000 ఆగస్టు 11న సోనియాగాంధీ హైదరాబాదు వచ్చారు. చిన్నారెడ్డి నాయకత్వంలో 41 మంది ఎమ్మెల్యేలు (38 మంది ఎమ్.ఎల్.ఏల సంతకాలతో) తెలంగాణకు అనుకూలంగా సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు.
- 2004 ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుండి ఎన్నికలలో గెలిచిన చిన్నారెడ్డి వై.ఎస్.ఆర్. మంత్రివర్గంలో చేరాడు. దాంతో తెలంగాణ ఉద్యమానికి దూరమయ్యాడు.
TSPSC Group 4 Recruitment 2022 Apply for 9168 Posts, Notification
మునుపటి అంశాలు :
తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు
తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర
జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు
1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952