Telugu govt jobs   »   Study Material   »   Telangana Movement and State Formation

Telangana Movement and State Formation, Download PDF | తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు

Telangana Movement and State Formation | తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు

మిలియన్ మార్చ్ (2011 మార్చి 10)

  • కె. సి.ఆర్. గారు 2011 మార్చి 10న హైద్రాబాద్ నగర నలుమూలల నుండి ట్యాంక్ బండ్ పైకి మిలియన్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
  • ఈ మిలియన్ మార్చ్ అనేది ఈజిప్ట్ (కైరోలోని) తెహ్రీక్ చౌక్ దిగ్బంధనమును ఆదర్శంగా తీసుకొని నిర్వహించారు.
  • ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ఉద్యమకారులకు అక్కడ ఉన్న విగ్రహాలలో ఎక్కువగా ఆంధ్రుల విగ్రహాలు ఉండటంతో తెలంగాణ చరిత్రను, గొప్ప వ్యక్తులను మరుగున పడవేస్తున్నారని భావించి విగ్రహ ధ్వంసానికి పూనుకున్నారు.

 కలెక్టరేట్ల ముట్టడి (2011 జనవరి 10,11)

  • శ్రీకృష్ణ కమిటీ సమైఖ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన టి.జె.ఎ.సి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
  • ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా 2011 జనవరి 10, 11 తేదీలలో అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించింది.

Telangana Movement - Various protest programs, download PDF_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

సహాయ నిరాకరణోద్యమం (2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు)

  • బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది.
  • ఈ సహాయనిరాకరణ కార్యక్రమం 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు మొత్తం 16 రోజుల పాటు జరిగింది.

సకల జనుల సమ్మె (2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు)

  • సకలజనుల సమ్మెను కూడా మూడు ప్రధాన లక్ష్యాలతో కొనసాగించారు.
  1. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమ నాయకత్వంగా మార్చుకోవడం
  2. సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యం నుండి, భావజాలం నుండి విముక్తి చేసి వారిని ప్రజా ఉద్యమంలోకి, నాయకత్వంలోకి తీసుకొనిరావడం. 
  3. తెలంగాణపై ఆధిపత్యం చేస్తున్న సీమాంధ్ర సంపన్న వర్గాలు, పెట్టుబడిదారుల పై పోరాటం చేయడం.
  • 2011 సెప్టెంబర్ 12న “జనగర్జన సభ” కరీంనగర్ లో జరిగింది. ఈ సభలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస “సకలజనుల సమ్మె”కు పిలుపునిచ్చింది.
  • 2011 సెప్టెంబర్ 13 నుండి సకలజనుల సమ్మె మొదలయింది.
  • 2011 సెప్టెంబర్ 30న కాంగ్రెస్ కోర్ కమిటీ పిలుపుతో కె.సి.ఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, ఈటెల రాజేందర్ వంటి టి.ఆర్.ఎస్ నాయకులు, టి.జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నాయకులు అయిన స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ వంటి 40 మంది నాయకులు తెలంగాణపై సంప్రదింపుల కోసం ఢిల్లీకి వెళ్లారు.
  • 2011 అక్టోబర్ 1న ఢిల్లీలో నివసించే తెలంగాణవాదులు కోదండరాం, స్వామి గౌడ్ ల నాయకత్వంలో ఆంధ్రభవన్ నుండి ఇండియాగేట్ దాకా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
  • 2011 అక్టోబర్ 2న కె.సి.ఆర్, కోదండరాం, స్వామిగౌడ్ బృందము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి దగ్గర మౌనదీక్ష చేశారు.
  • సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగి అక్టోబర్ 24న ముగిసింది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష (2011 నవంబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు)

  • నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2011 నవంబర్ 1 నుండి నవంబర్ 9 వరకు నల్గొండ క్లాక్ టవర్ వద్ద నిరాహార దీక్షను చేశాడు.
  • ఇదే సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12 మంది స్వాతంత్ర్య సమర యోధులతో కలిసి నవంబర్ 1 నుండి 7 వరకు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు.
  • 2011లో ప్రారంభమైన దీక్షలు సిద్దిపేట, అదిలాబాద్, బోధన్ లలో తెలంగాణ వచ్చేదాకా కొనసాగాయి.

మానవహారం (2010 ఫిబ్రవరి 4 మరియు 5)

  • తెలంగాణ జె.ఎ.సి పిలుపు మేరకు 2010 ఫిబ్రవరి 4న అదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్‌లోని ఆలంపూర్ వరకు నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మీదుగా మానవహారం కొనసాగింది.
  • 2010 ఫిబ్రవరి 5న 9వ జాతీయ రహదారిపై హైదరాబాద్ మరియు కోదాడల మధ్య మరో మానవహారం కార్యక్రమం విజయవంతమైంది.

తెలంగాణ మార్చ్ (2012 సెప్టెంబర్ 30)

  • ప్రత్యేక తెలంగాణ ఇవ్వటానికి 2012 సెప్టెంబర్ 30 ని కేంద్రానికి గడువు తేదీగా TJACనిర్ణయించింది. 
  • ఈ గడువులో తెలంగాణ ప్రకటన రాకపోవటంతో TJAC 2012 సెప్టెంబర్ 30న నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మార్చ్ ను నిర్వహించింది.

సడక్ బంద్ (2013 మార్చి 21)

  • 2013 మార్చి 21న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఐకాస సడక్ బంద్ కు పిలుపునిచ్చింది.
  • శంషాబాద్ నుండి అలంపూర్ వరకు సడక్బంద్ విజయవంతమైంది.

సంసద్ యాత్ర (2013 ఏప్రిల్ 29,30)

  • 2013 ఏప్రిల్ 29, 30 రెండు రోజులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర తెలంగాణ రాజకీయ జె.ఎ.సి సంసద్ యాత్రను నిర్వహించింది.
  • ఈ యాత్రకు ఢిల్లీకి ఉద్యమకారులను తరలించడానికి తెలంగాణ ఎక్స్ ప్రెస్ అనే పేరుతో ప్రత్యేక రైలును దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

సత్యాగ్రహ దీక్ష (2013 ఏప్రిల్ 29)

  • ఏప్రిల్ 29, 2013న తెలంగాణ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమయింది.
  • ఈ సత్యాగ్రహ దీక్షను మెయిన్ స్ట్రీమ్ సంపాదకులు సుమీత్ చక్రవర్తి’ ప్రారంభించారు.
  •  ఈ కార్యక్రమానికి సి.పి.ఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, భారతీయ జనాతాపార్టీ నాయకులు ప్రకాశ్ జవదేకర్ తో పాటు  సుష్మస్వరాజ్, ఉమాభారతి, స్మృతి ఇరానీలు సంఘీభావం ప్రకటించారు.

Telangana Movement and State Formation, Download PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష
తెలంగాణ ఉద్యమం- తెలంగాణ భావజాల వ్యాప్తి.

Telangana Movement - Various protest programs, download PDF_50.1

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

When did the Million March take place?

K.C.R. On March 10, 2011, called for a million march from all over the city of Hyderabad to Tank Bund.

When was the general strike?

It was held from September 13 to October 24, 2011

Download your free content now!

Congratulations!

Telangana Movement - Various protest programs, download PDF_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Movement - Various protest programs, download PDF_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.