Telugu govt jobs   »   Telangana Movement and State Formation   »   Telangana Movement and State Formation

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం

Telangana Movement & State Formation : Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.

Telangana Movement & State Formation 

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం,  భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_40.1APPSC/TSPSC Sure shot Selection Group

ధూంధాం 

  •  మలిదశ ఉద్యమంలో తెలంగాణ అన్యాయాలను ప్రజలకు తెలియజెప్పడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూంధాం
  • దీనియొక్క తొలి ప్రదర్శన సెప్టెంబర్ 30, 2002 కామారెడ్డిలో జరిగింది
  • రసమయి బాలకిషన్, అందెశ్రీ, వరంగల్ శంకర్, గోరటి వెంకన్న, విమలక్క గూడ అంజయ్య తమ ఆటపాటలతో అలరించారు.
  • ధూంధాం దశాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 22, 2012న హైదరాబాద్ లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగాయి.

Read More: TS TET Notification 2022 PDF Telangana

 

Telangana Martyr Statue తెలంగాణ అమరవీరుల స్థూపం 

  • 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు.
  • ఈ స్థూపాన్ని చెక్కిన శిల్పి  – ఎక్క యాదగిరి.
  • ఈ అమరవీరుల స్థూపం అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు.
  • నాలుగు వైపుల తొమ్మిది చొప్పున చిన్న రంధ్రాలు వున్నాయి. ఇవి అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్
  • స్థూపాన్ని ఎరుపురాయితో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం.
  • స్థూపం మధ్యభాగంలో ఒక స్థంబం వుంటుంది. ఏ వైపు చూసినా దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. ఇవి తొమ్మిది జిల్లాలకు నిదర్శనం
  • పై భాగంలో అశోకుని ధర్మచక్రం వుంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_50.1

తెలంగాణ తల్లి విగ్రహం

  • తెలంగాణ తల్లి విగ్రహం రూపొదించడంలో ముఖ్య పాత్ర పోషించినవారు బి.ఎస్.రాములు, బి.వి.ఆర్. చారి, ప్రొ.గంగాధర్.
  • పసునూరి దయాకర్ తయారు చేసిన తెలంగాణ తల్లి తొలివిగ్రహాన్ని తెలంగాణ భవన్ లో 2007 నవంబర్ 15న కేసీఆర్ ఆవిష్కరించారు.

ఈ విగ్రహం ప్రత్యేకతలు : 

  1. కిరీటంలో, వడ్డాణంలో ప్రసిద్ధి చెందిన కోహినూరు, జాకబ్ వజ్రాలుంటాయి.
  2. పట్టుచీర – పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా. 
  3. కాలి మెట్టెలు – ముత్తైదువకు చిహ్నంగా.
  4. వెండి మట్టలు – కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా. 
  5. చేతిలోని మొక్కజొన్న – తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా
  6. ఇంకో చేతిలో బతుకమ్మ – తెలంగాణ పండుగకు గుర్తుగా

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_60.1

తెలంగాణ జాగృతి 

  • తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా  2008 జూన్ లో ఏర్పడింది.
  • దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
  • పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
  • తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ఠ ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిగి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తుంది

Also read: TSPSC Group 4 Recruitment 2022 Apply for 9168 Posts, Notification

 

Telangana Political Joint Action Committee-TJAC తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ  

  • తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) 2009 డిసెంబర్ 24న ఏర్పడింది.
  • దీనికి కన్వీనర్ – ప్రొ. కోదండరామ్, కో-కన్వీనర్ -మల్లేపల్లి లక్ష్మయ్య.
  • ఈ జేఏసీలో చేరిన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, సీపీఐ, న్యూడెమొక్రసీ.
  • 2010 ఫిబ్రవరి 19న జేఏసీ నుండి కాంగ్రెస్ తప్పుకున్నట్లు ప్రకటించింది. తరువాత కాలంలో తెలంగాణ టీడీపీ ఫోరం కూడా జేఏసీ నుండి తప్పుకుంది.

తెలంగాణ జేఏసీ నిరసన కార్యక్రమాలు 

2010 లో మానవహారం
  • ఆదిలాబాద్ నుండి ఆలంపురం వరకు
  • హైదరాబాద్ నుంచి కోదాడ వరకు
2011, జనవరి 10-11 కలెక్టరేట్ల ముట్టడి
2011 జనవరి 19 వంటా వార్పూ
2011 ఫిబ్రవరి 17 – మార్చి 4 సహాయనిరాకరణ
2011 మార్చి 1 పల్లె పల్లె పట్టాలపైకి
2011 మార్చి 10 మిలియన్ మార్చ్
2011 సెప్టెంబర్ 16 – అక్టోబర్ 24 సకలజనుల సమ్మె
2012 సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ / సాగరహారం
2013 మార్చి 21 సడక్ బంద్
2013 ఏప్రిల్ 29-30 సంసద్ యాత్ర

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_70.1

తెలంగాణ కోసం ఆత్మహత్యలు

  •  2009 నవంబర్ 29న కేసీఆర్ అరెస్టుతో మనస్తాపానికి గురైన శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మబలిదానానికి సిద్ధమయ్యారు.
  • ఇతను డిసెంబర్ 3వ తేదీన అంతిమ శ్వాస విడిచాడు.
  • 2010 జనవరి 19న ఓయూ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నాడు
  • తెలంగాణ ఉద్యమ తీవ్రత గురించి ఢిల్లీకి తెలియజేయాలని ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి
  • అసెంబ్లీ ముట్టడి సమయంలో యాదయ్య అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్శిటీ ఎన్.సి.సి. గేటు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.
  • 2010లో అడ్వకేట్ దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • 2010 జూలైలో ఉపఎన్నికల ఫలితాల్లో డీఎస్ ఓడిపోవడంతో తన కోరిక నెరవేరిందని ఇషాంత్ రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నాడు.
  • 2012 మార్చిలో సిరిపురం’ శ్రీకాంత్ అనే విద్యార్థి హైదరాబాద్ లో మరణించాడు.

Also Read: CGBSE 10th, 12th Results 2022

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_80.1

*****************************************************************

మునుపటి అంశాలు :

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర

మలిదశ ఉద్యమం

రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు

తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు

 తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర

తెలంగాణ భావజాల వ్యాప్తి

 తెలంగాణ గుర్తింపుకై ఆరాటం 

నక్సలైట్ ఉద్యమం

జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 

 1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర

1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

 1969 ఉద్యమానికి కారణాలు

1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,

తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956

తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952

 

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_90.1
Download Adda247 app

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_110.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Movement and State Formation | Revivalision of Telangana Culture_120.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.