NITI Aayog recommends privatisation of Central Bank, Indian Overseas Bank | సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫారసు

సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫారసు

కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ప్రైవేటీకరణలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లో ప్రభుత్వ వాటాను తొలగించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో, 2021-22లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్ బిలు) మరియు ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం కొత్త పిఎస్ఇ (పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్) విధానం ప్రకారం, వ్యూహాత్మక రంగాలలో పిఎస్యులను  విలీనం చేయడం, ప్రైవేటీకరించడం లేదా ఇతర పిఎస్యుల అనుబంధ సంస్థలుగా తయారు చేయాలని సూచించే పనిని నీతి ఆయోగ్ కు అప్పగించారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ (డిఐపిఎఎమ్) మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ ఎస్) ఈ ప్రతిపాదనను పరిశీలించి బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన చట్టపరమైన మార్పులపై చర్చిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ చేయడం వివిధ దశల ప్రక్రియ. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలు సూచించిన పేర్లను ఆమోదం చేసిన తరువాత, ఈ ప్రతిపాదన ఆమోదం కోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (Alternative Mechanism)కు వెళుతుంది మరియు చివరికి తుది ఆమోదం కోసం ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గానికి వెళుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నీతి ఆయోగ్ ఏర్పడింది: 1 జనవరి 2015.
  • నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.
  • నీతి ఆయోగ్ చైర్ పర్సన్: నరేంద్ర మోడీ.

కొన్ని ముఖ్యమైన లింకులు 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

13 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

15 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

15 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

16 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

19 hours ago