Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-11

 

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-11_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

ఆంధ్రప్రదేశ్-నైసర్గిక స్వరూపం-2

ప్రశ్నలు 

Q1. తీర మైదానాలు బంగాళాకతంలో తీరరేఖ, తూర్పు కనుముల మధ్య ఎక్కడ నుంచి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయి?

A.ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాల్లోని  వంశధార నది నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాల్లోని పెన్నా నది

B.దక్షిణాన శ్రీకాకుళం జిల్లాల్లోని  వంశధార నది నుంచి ఉత్తరాన నెల్లూరు జిల్లాల్లోని పెన్నా నది

C.ఉత్తరాన నెల్లూరు జిల్లాల్లోని పెన్నా నది నుంచి దక్షిణాన శ్రీకాకుళం జిల్లాల్లోని  వంశధార నది

D.పైవేవి కాదు

 

Q2. తీర మైదానం కృష్ణ, గోదావరి నదుల మధ్య కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వెడల్పుతో ఎన్ని కిలో మీటర్ లకు  పైగా విస్తరించి ఉంది?

A.150

B.160

C.170

D.180

 

Q3. తీర రేఖ మాదిరి తీర మైదానం కూడా  ………………కిలో మీటర్లు విస్తరించి ఉంది?

A.792

B.692

C.872

D.972

 

Q4. కృష్ణ గోదావరిలా మద్య ఉన్న పల్లపు ప్రాంతాన్ని ఈ సరస్సు అని పిలుస్తారు?

A.పులికాట్

B.కొల్లేరు

C.పైవి రెండూ

D.ఏదికాదు

 

Q5. ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?

A.పులికాట్ 

B.శ్రీశైలం 

C.కొల్లేరు 

D.పైవన్నీ

 

Q6. కొల్లేరు సరస్సులో కలిసే నదుల పేర్లను కనుగొనండి?

A.రామిలేరు

B.బుడమేరు

C.తమ్మిలేరు

D.పైవన్నీ

 

Q7. కొల్లేరు సరస్సుని, బంగాళాకాతం ని కేలిపే నది పేరు కనుగొనండి?

A.బుడమేరు

B.ఉప్పుటేరు

C.తమ్మిలేరు

D.రామిలేరు

 

Q8.  ఈ క్రింది వాటిలో దేనిని ఆంధ్ర దుఃఖదాయిని అని పిలుస్తారు?

A.బుడమేరు

B.ఉప్పుటేరు

C.తమ్మిలేరు

D.రామిలేరు

 

Q9. పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది ఎంత వైశాల్యం కలిగి ఉంది చదరపు కిలోమీటర్ లలో ?

A.ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో,520

B.ఆంధ్రప్రదేశ్ తెలంగాణా  మధ్యలో,460

C.ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మధ్యలో,520

D.ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో,460

 

Q10. ఈ క్రింది వాటిలో ఏది ఒక లాగున్ సరస్సు?

A.పులికాట్

B.కొల్లేరు 

C.పైవి రెండూ

D.పైవేవి కాదు 

 

Q11.ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద సరస్సు ఏది ?

A.లాగున్ 

B.కొల్లేరు

C.రెండూ

D.ఏదికాదు

 

Q12.రామ్ సార్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?

A.1981

B.1971

C.1961

D.1951

 

Q13.రామ్ సార్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన ఏకైక చిత్తడి ప్రదేశం ఏది?

A.కొల్లేరు సరస్సు.

B.పులికాట్ సరస్సు

C.పైవి రెండూ

D.పైవేవి కాదు 

 

Q14. విశాఖ జిల్లాలోని తూర్పు కనుముల్లో ఎత్తైన శిఖరం ఆర్మికొండ (ఆరోమా) ఏ పీఠభూమిలో ఉంది?

A.రాజమండ్రి శిలలు

B.కడప శిలలు

C.మాచ్ ఖండ్

D.ధార్వార్ శిలలు 

 

Q15.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది?

A.శేషాచల

B.ఇంద్రకీలాద్రి

C.సింహాచల

D.రత్నగిరి

 

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-11_3.1                    AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-11_4.1

 

జవాబులు

Q1.ANS.(a).

తీర మైదానాలు బంగాళాకతంలో తీరరేఖ, తూర్పు కనుముల మధ్య ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాల్లోని  వంశధార నది నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాల్లోని పెన్నా నది వరకు విస్తరించి ఉన్నాయి.

Q2.ANS.(b).

తీర మైదానం కృష్ణ, గోదావరి నదుల మధ్య కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వెడల్పుతో ఎన్ని 160 కిలో మీటర్ లకు  పైగా విస్తరించి ఉంది.

Q3.ANS.(d).

తీర రేఖ మాదిరి తీర మైదానం కూడా 972 కిలో మీటర్లు విస్తరించి ఉంది.

Q4.ANS.(b).

కృష్ణ గోదావరిలా మద్య ఉన్న పల్లపు ప్రాంతాన్నికొల్లేరు సరస్సు అని పిలుస్తారు. దిని వైశాల్యం 250 చ.కి.మీ.లు ఇది కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల  సరిహద్దుల్లో ఉంది.

Q5.ANS.(c).

 ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు సైబీరియ ప్రాంతం నుంచి వలస వచ్చే పక్షుల (పెలికాన్స్-గూడ బాతుల)కు ప్రసిద్ది. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలను కొల్లేరు అభయారణ్యంగ, కొల్లేరు క్పక్షి సంరక్షణ కేంద్రంగా  పిలుస్తారు. 

Q6.ANS.(d).

కొల్లేరు సరస్సులో కలిసే నదుల పేర్లు రామిలేరు,బుడమేరు, తమ్మిలేరు.

Q7.ANS.(b).

కొల్లేరు సరస్సుని, బంగాళాకాతం ని కేలిపే నది పేరు ఉప్పుటేరు

Q8.ANS.(a).

బుడమేరు ను ఆంధ్ర దుఃఖదాయిని అని పిలుస్తారు. కొల్లేరు సరస్సు పై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ అజీజ్ కమిటీ

Q9.ANS.(d).

పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో ఉంది వైశాల్యం 460 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది.

Q10.ANS.(a).

సముద్ర జలాల భూభాగంలోకి చొచ్చుకు వచ్చి సరస్సుగా ఏర్పడటాన్ని లాగున్ అంటారు.

Q11.ANS.(a).

ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద సరస్సు పులికాట్ సరస్సు దీనినే లాగున్ అని కూడా అంటారు. ఈ సరస్సు సమీపంలోనే శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం (రాకెట్ లాంచింగ్ స్టేషన్) ఉంది.

Q12.ANS.(b).

రామ్ సార్ ఒప్పందం 1971 సంవత్సరంలో ఇరాన్ లోని రామ్ సార్ అనే ప్రాంతం లో చిత్తడి ప్రదేశాల సంరక్షణకు సంబందించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దీన్నే రామ్ సార్ ఒప్పందం అంటారు.

Q13.ANS.(a).

రామ్ సార్  ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన ఏకైక చిత్తడి ప్రదేశం కొల్లేరు సరస్సు.

Q14.ANS.(c).

విశాఖ జిల్లాలోని తూర్పు కనుముల్లో ఎత్తైన శిఖరం ఆర్మికొండ (ఆరోమా) మాచ్ ఖండ్ పీఠభూమిలో ఉంది

Q15.ANS.(d).

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం రత్నగిరి కొండల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

అంశము ముఖ్యమైన ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ ఉనికి- క్షేత్రీయ అమరిక Download State GK part-1
2. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం    పార్ట్-1     పార్ట్-2    పార్ట్-3 పార్ట్-4
3. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి పార్ట్-1  పార్ట్-2             పార్ట్-3       పార్ట్-4     పార్ట్-5
4. ఆంధ్రప్రదేశ్ నేలలు(మృతికలు) త్వరలో
5. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ త్వరలో
6. ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల విధానాలు త్వరలో
7. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగం త్వరలో
8. ఆంధ్రప్రదేశ్ లో అడవులు పార్ట్-1

 

పార్ట్-2 పార్ట్-3

 

పార్ట్-4
9. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం  

త్వరలో

10. ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ సంపద త్వరలో
11. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం త్వరలో
12. ఆంధ్రప్రదేశ్ లో రవాణా త్వరలో
13. ఆంధ్రప్రదేశ్లో దర్శనీయ ప్రదేశాలు త్వరలో
14. ఆంధ్రప్రదేశ్లో జనాభా త్వరలో
15. ఆంధ్రపదేశ్లో -జిల్లాల సమాచారాలు త్వరలో

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

21 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!