Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-4

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-4_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

 

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి

Q1. ఆంధ్రప్రదేశ్ లో సంవహన వర్షపాత సమయంలో అత్యదిక సగటు ఉష్ట్నోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది?

A. 5

B. 32

C. 5

D. 31

Q2. ఆంధ్రప్రదేశ్ లో సంవహన వర్షపాత సమయంలో అత్యల్ప సగటు ఉష్ట్నోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది?

A.18.5

B.18

C.17.5

D.17

Q3. వేసవిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రుతుపవనాలు రాకముందు పడే జల్లులను ఏమంటారు?

A.మామిడి జల్లులు

B.మ్యాంగోషవర్స్

C.ఏరువాక జల్లులు

D.పైవన్నీ

Q4. ఆంధ్రప్రదేశ్ లో సముద్ర ప్రభావం వల్ల  ఈ క్రింది వాటిలో  ఏ ఏ ప్రాంతాలలో తక్కువ ఉష్ట్నోగ్రతలు నమోదవుతాయి?

A.విశాఖపట్నం

B.మచిలీపట్నం

C.కాకినాడ

D.పైవన్నీ

Q5. ఆంధ్రప్రదేశ్ లోని సగటు వర్షపాతం ఎన్ని మిల్లీ మీటర్లు?

A.950

B.955

C.960

D.965

Q6. నైరుతి రుతుపవనకాలం/ వర్షపాతం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర , దక్షిణ ప్రాంతంలో ఎన్ని సెంటీ మీటర్ల వర్షపాతం ఉంటుంది?

A.80,40

B.65,45

C.85,45

D.60, 40

Q7. నైరుతి రుతుపవనాల వల్ల కోస్తా రాయలసీమ ప్రాంతాలకంటే ఏ రాష్ట్రము లో ఎక్కువ  వర్షపాతం ఏర్పడుతుంది?

A.తెలంగాణ

B.తమిళనాడు

C.కర్ణాటక

D.పైవన్నీ

Q8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా తీరం సగటు, రాయలసీమలలో సగటు వర్షపాతం ఎంత?

A.1 సెం.మీ., 46.3 సెం.మీ.

B.3 సెం.మీ , 65.1 సెం.మీ.

C.65 సెం.మీ., 46 సెం.మీ.

D.46 సెం.మీ., 65 సెం.మీ.

Q9. ఈ క్రింది వాటిలో ఏ మాసం వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య వారధిలా ఉండి సందిమాసంలా ఉంటుంది అని చెప్పవచ్చు?

A.సెప్టెంబర్

B.అక్టోబర్

C.నవంబర్

D.డిసెంబర్

Q10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల సాదారణ వర్షపాతం ఎన్ని మిల్లీ మీటర్లుగా ఉంటుంది?

A.224

B.223

C.221

D.225

ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Q1.ANS.(C)

వేసవికాలంలో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు , మెరుపులు, వడగళ్ళతో కూడిన సంవహన వర్షపు జల్లులు పడతాయి.వేసవిలో అత్యదిక సగటు ఉష్ట్నోగ్రత 31.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది.

Q2.ANS.(B)

వేసవికాలంలో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు , మెరుపులు ,వడగళ్ళతో కూడిన సంవహన వర్షపు జల్లులు పడతాయి.వేసవిలో అత్యల్ప సగటు ఉష్ట్నోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది.

Q3.ANS.(D)

వేసవిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రుతుపవనాలు రాకముందు పడే జల్లులను మామిడి జల్లులు, మ్యాంగోషవర్స్, ఏరువాక జల్లులు, తొలకరి జల్లులు అని పిలుస్తారు.

Q4.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లో సముద్ర ప్రభావం వాళ్ళ విశాఖపట్నం, మచిలీపట్నం,కాకినాడ ప్రాంతాలలో తక్కువ ఉష్ట్నోగ్రతలు నమోదవుతాయి.

Q5.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని సగటు వర్షపాతం 960 మిల్లీ మీటర్లు.

Q6.ANS.(A)

నైరుతి రుతుపవనకాలం/ వర్షపాతం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతంలో 80 సెంటీ మీటర్లు , దక్షిణ ప్రాంతంలో 40 సెంటీ మీటర్లు వర్షపాతం ఉంటుంది.

Q7.ANS.(A)

నైరుతి రుతుపవనాల వల్ల కోస్తా రాయలసీమ ప్రాంతాలకంటే తెలంగాణ రాష్ట్రము లో ఎక్కువ  వర్షపాతం ఉంటుంది.

Q8.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ప్రాంతాల వారిగా చూస్తే కోస్తా తీరం సగటు 65.1 సెం.మీ., రాయలసీమలలో సగటు 46.3 సెం.మీ. వర్షపాతం.

Q9.ANS.(B)

ఈశాన్య ఋతుపవన కాలం లో అక్టోబర్ మాసం వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య వారధిలా ఉండి సందిమాసంలా ఉంటుంది అని చెప్పవచ్చు. అధిక ఉష్ట్నోగ్రత, అధిక తేమ కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాదారణంగా అక్టోబర్ వేడిమి అని అంటారు.

Q10.ANS.(A)

ఆంధ్ర ప్రదేశ్ లో ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా కొద్దిపాటి వర్షం పడుతుంది. ఉత్తర ప్రాంతాల కంటే దక్షిణ  ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల సాదారణ వర్షపాతం 224 మిల్లీ మీటర్లుగా నమోదు అవుతుంది.

 

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-4_3.1

Sharing is caring!