Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-8

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-8_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ అడవులు – జంతువులు-3

Q1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఏ కలపని “కింగ్ ఆఫ్ ఫారెస్ట్” అంటారు?

A.ఎర్ర చందనం

B.టేకు

C.మంచిగంధం

D.పైవేవి కాదు

Q2. ఆంధ్రప్రదేశ్ లో వెదురు అధికంగా లభించే జిల్లా ఏది?

A.కర్నూలు

B.కృష్ణా

C.పశ్చిమ గోదావరి

D.తూర్పు గోదావరి

Q3. ఇప్ప పువ్వు అధికంగా ఏ జిల్లాలలో లభిస్తుంది?

A.కర్నూలు

B.కడప

C.పశ్చిమ గోదావరి

D.తూర్పు గోదావరి

Q4. పేదవాడి కలప అని దేనిని పిలుస్తారు?

A.వెదురు

B.ఎర్ర చందనం

C.ఇప్ప పువ్వు చెట్టు

D.మంచి గంధం

Q5.అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో జాతీయ అటవీ తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?

A.1954

B.1953

C.1952

D.1951

Q6. అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం ఏమిటి?

A.దేశ విస్తీర్ణం లో అడవులకు ఈ చట్టానికి సంబందం లేదు

B.దేశ విస్తీర్ణం లో అడవులను తగ్గించడం

C.దేశ విస్తీర్ణం లో అడవులను పెంచడం

D.పైవేవి కాదు

Q7. జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో అడవులను ఎంత శాతం పెంచాలి అనుకున్నది?

A.35%

B.34%

C.36%

D.33%

Q8. భారత ప్రభుత్వం అడవుల రక్షణా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?

A.1952

B.1980

C.1962

D.1970

Q9. 1980 లో  ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం అడవుల రక్షణ చట్టం వల్ల కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు వేటికి కేటాయించే  అధికారం లేదు?

A.వాల్ల సొంత అవసరాలకు 

B.ఇతర అవసరాలకు 

C.పైవి రెండూ

D.పైవేవి కాదు

Q10. అడవులను పునరుద్దించడానికి సామజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది?

A.5వ

B.6వ

C.7వ

D.8వ

Q11.ఆంధ్రప్రదేశ్ అడవులలో అనేక రకాల జంతువులు అన్ని జిల్లాలలో ఉన్నాయి, అయితే వాటిలో ఏ జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి?

  1. దుప్పి, కొండగొర్రె, అడవిపంది, రకరకాల కోతులు.
  2. సివంగి, చారల సివంగి,కణతి.
  3. ముళ్ళ పంది, ఎలుగుబంటులు, జింకలు.

A.1 మరియు 2

B.2 మరియు 3

C.1 మరియు 3

D.పైవన్నీ

Q12. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో తెల్ల దున్నపోతులు ఎక్కువగా ఉత్తర సర్కారు జిల్లాలలో కనిపిస్తాయి అవి ఏ జిల్లాలో ఈ క్రింది సమాధానాలలో గుర్తించండి?

A.కర్నూలు, కడప 

B.కడప, అనంతపురం

C.విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం

D.పైవన్నీ

Q13.ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కొమ్ముల కొండ గొర్రెలు ఎక్కువగా ఈ అడవుల్లోనే ఉంటాయి ?

A.విజయనగరం

B.రాయలసీమ

C.కర్నూలు

D.పైవన్నీ

Q14.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొసళ్ళు ఎక్కువగా ఏ నదిలో కనిపిస్తాయి?

A.రాజమండ్రి వద్ద గోదావరి నదిలో

B.శ్రీశైలం, నాగార్జున సాగర్ల వద్ద కృష్ణా నదిలో 

C.పైవి రెండూ

D.పైవేవి కాదు

Q15.భారతదేశం లో ఎప్పుడో అంతరించి పోయింది అనుకున్న పక్షి ఏది?

A.బట్ట మేకపక్షి 

B.పాలపిట్ట

C.పెలికాన్ కొంగలు

D.పైవన్నీ

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-8_3.1

జవాబులు

Q1.ANS.(B)

ఆంధ్రప్రదేశ్ లో టేకు అధికంగా లభించే జిల్లా తూర్పుగోదావరి. టేకు ని “కింగ్ అఫ్ ఫారెస్ట్”  అంటారు.

Q2.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లో అధికంగా వెదురు కలప లభించేది తూర్పు గోదావరి జిల్లా. వెదురును “పేదవాడి కలప” అని పిలుస్తారు.

Q3.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ లో ఇప్ప పువ్వు అధికంగా కర్నూలు జిల్లాలో లభిస్తుంది.

Q4.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ లో అధికంగా వెదురు కలప లభించేది తూర్పు గోదావరి జిల్లా. వెదురును “పేదవాడి కలప” అని పిలుస్తారు.

Q5.ANS.(C)

అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో జాతీయ అటవీ తీర్మానాన్ని 1952 సంవత్సరంలో ప్రవేశ పెట్టారు. జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో 33% అడవులను పెంచడం.

Q6.ANS(C)

అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో జాతీయ అటవీ తీర్మానాన్ని 1952 సంవత్సరంలో ప్రవేశ పెట్టారు. జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో 33% అడవులను పెంచడం.

Q7. ANS.(D)

అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో జాతీయ అటవీ తీర్మానాన్ని 1952 సంవత్సరంలో ప్రవేశ పెట్టారు. జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో 33% అడవులను పెంచడం.

Q8. ANS.(B)

1980 లో భారత ప్రభుత్వం అడవుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం వల్ల కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు కేటాయించే అధికారం లేదు. పోడు వ్యవసాయ పద్దతులపై కూడా నిబందనలు విదించారు.

Q9. ANS.(C)

1980 లో భారత ప్రభుత్వం అడవుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం వల్ల కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు కేటాయించే అధికారం లేదు. పోడు వ్యవసాయ పద్దతులపై కూడా నిబందనలు విదించారు.

Q10. ANS.(A)

అడవులను పునరుద్దించడానికి సామజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. 6వ పంచవర్ష ప్రణాళికలో అధికంగా అమలైంది.

Q11. ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల జంతువులూ ఉన్నాయి అన్ని జిల్లాలలో ఉన్నాయి అయితే వాటిలో దుప్పి, కొండగొర్రె, అడవిపంది, రకరకాల కోతులు, సివంగి, చారల సివంగి,కణతి, ముళ్ళ పంది, ఎలుగుబంటులు, జింకలు ఎక్కువగా కనిపిస్తాయి.

Q12. ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల జంతువులూ ఉన్నాయి అన్ని జిల్లాలలో ఉన్నాయి అయితే వాటిలో దుప్పి, కొండగొర్రె, అడవిపంది, రకరకాల కోతులు, సివంగి, చారల సివంగి,కణతి, ముళ్ళ పంది, ఎలుగుబంటులు, జింకలు ఎక్కువగా కనిపిస్తాయి.వాటితోపాటు తెల్ల దున్నపోతులు ఎక్కువగా ఉత్తర సర్కారు విజయనగరం,శ్రీకాకుళం ,విశాఖపట్నం జిల్లాలలో కనిపిస్తాయి.

Q13. ANS.(B)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెల్ల దున్నపోతులు ఎక్కువగా ఉత్తర సర్కారు విజయనగరం ,శ్రీకాకుళం ,విశాఖపట్నం జిల్లాలలో కనిపిస్తాయి మరియు నాలుగు కొమ్ముల కొండగొర్రెలు ఎక్కువగా రాయలసీమలో ఉంటాయి.

Q14. ANS.(B)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొసళ్ళు ఎక్కువగా శ్రీశైలం, నాగార్జున సాగర్ల వద్ద కృష్ణా నదిలో కనిపిస్తాయి.

Q15.ANS.(A)

భారతదేశం లో ఎప్పుడో అంతరించి పోయింది అనుకున్న పక్షి బట్ట మేకపక్షి ఇది కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడులో కనిపించింది.

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-8_4.1

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 1    :      A.P Geography Important Questions Part-1

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 2    :      A.P Geography Important Questions Part-2

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 3    :      A.P Geography Important Questions Part-3

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 4   :       A.P Geography Important Questions Part-4

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 5   :        A.P Geography Important Questions Part-5

ఆంధ్రప్రదేశ్ అడవులు-జంతుజాలం-1 :  A.P Geography Important Questions Part-6

ఆంధ్రప్రదేశ్ అడవులు-జంతుజాలం-2 :  A.P Geography Important Questions Part-7

For Weekly current affairs in telugu PDF please click here

Sharing is caring!