సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫారసు
కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ప్రైవేటీకరణలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లో ప్రభుత్వ వాటాను తొలగించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో, 2021-22లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్ బిలు) మరియు ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం కొత్త పిఎస్ఇ (పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్) విధానం ప్రకారం, వ్యూహాత్మక రంగాలలో పిఎస్యులను విలీనం చేయడం, ప్రైవేటీకరించడం లేదా ఇతర పిఎస్యుల అనుబంధ సంస్థలుగా తయారు చేయాలని సూచించే పనిని నీతి ఆయోగ్ కు అప్పగించారు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ (డిఐపిఎఎమ్) మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ ఎస్) ఈ ప్రతిపాదనను పరిశీలించి బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన చట్టపరమైన మార్పులపై చర్చిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ చేయడం వివిధ దశల ప్రక్రియ. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలు సూచించిన పేర్లను ఆమోదం చేసిన తరువాత, ఈ ప్రతిపాదన ఆమోదం కోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (Alternative Mechanism)కు వెళుతుంది మరియు చివరికి తుది ఆమోదం కోసం ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గానికి వెళుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- నీతి ఆయోగ్ ఏర్పడింది: 1 జనవరి 2015.
- నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.
- నీతి ఆయోగ్ చైర్ పర్సన్: నరేంద్ర మోడీ.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 5 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి