Categories: ArticleLatest Post

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-10

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

ఆంధ్రప్రదేశ్-నైసర్గిక స్వరూపం-

Q1.ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా ఎన్ని భాగాలుగా విభజించారు?

A.1

B.2

C.3

D.4

 

Q2. సగటున పశ్చిమ పీఠభూమి ఎత్తు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఈ క్రింది వాటిలో కనుగొనండి?

A.150 మీటర్ల నుంచి 550 మీటర్ల వరకు ఉంటుంది

B.150 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉంటుంది

C.150 మీటర్ల నుంచి 450 మీటర్ల వరకు ఉంటుంది

D.450 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉంటుంది

 

Q3. పశ్చిమ/పడమటి పీఠభూమి తెలంగాణా లోని ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది?

A.తొమ్మిది 

B.పదకొండు 

C.ఎనిమిది 

D.పది

 

Q4. పశ్చిమ/పడమటి పీఠభూమి ఎన్ని రకాల శిలలతో ఏర్పడింది?

A.1

B.2

C.3

D.4

 

Q5. ఈ క్రింది వాటిలో ఏవి అత్యంత ప్రాచీనమైన శిలలు కనుగొనండి?

A.కడప శిలలు

B.ధార్వార్ శిలలు

C.కర్నూలు శిలలు

D.రాజమండ్రి శిలలు

 

Q6. ధార్వార్ శిలల అవశేషాలను ఈ క్రింది వాటిలో ఏ శిలలు అంటారో గుర్తించండి ?

A.కడప శిలలు

B.కర్నూల్ శిలలు

C.రాజమండ్రి శిలలు

D.పైవేవి కాదు

 

Q7. సముద్రం ఉప్పొంగి ఈ క్రింది వాటిలో ఏ శిలలు ఏర్పడ్డాయో కనుగొనండి?

A.కడప శిలలు

B.కర్నూల్ శిలలు

C.రాజమండ్రి శిలలు

D.పైవేవి కాదు

 

Q8. రాజమండ్రి శిలలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనదో కనుగొనండి?

A.ఇది వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపునకు వాలి ఉంది.

B.ఈ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఎర్రనేలలు ఆక్రమించాయి 

C.పైవి రెండు సరైనవే

D.పైవేవి కాదు 

 

Q9. రాజమండ్రి శిలా పీఠభూమిలో లభించే ఖనిజాలను గుర్తించండి?

A.బొగ్గు

B.మంగనిసు

C.అబ్రకం

D.పైవన్నీ 

 

Q10. రాజమండ్రి శిలల్లో ఇనుము ముఖ్యంగా ఏ జిల్లాలలో లభిస్తున్నాయి?

A.కడప 

B.కర్నూలు

C.కృష్ణ 

D.పైవన్నీ 

జవాబులు 

Q1.ANS: (c)

ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా 3 భాగాలుగా విభజించారు. 1. పడమటి పీఠభూమి,2. తూర్పు కనుమలు,3. తీరమైదానాలు.

Q2.ANS: (b)

పశ్చిమ/పడమటి పీఠభూమి తూర్పు కనుమలకు పశ్చిమంగా సువిశాలమైన పశ్చిమ పీఠభూమి ఉంది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఇంచుమించు ఈ పీఠభూమిలోనే ఉన్నాయి. సగటున ఈ పీఠభూమి ఎత్తు సముద్ర మట్టానికి 150 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉంటుంది.

Q3.ANS: (d)

ఈ పీరభూమి ఆదిలాబాద్లోని నిర్మల్ గుట్టల నుంచి దక్షిణాన అనంతపురంలోని మడకశిర గుట్టల వరకు వ్యాపించి ఉంది. ఈ పీఠభూమిలో తెలంగాణలోని పది జిల్లాలు విస్తరించి ఉండటం వల్ల దీనిని తెలంగాణ పీఠభూమి అని కూడా పిలుస్తారు.

Q4.ANS: (d)

ఈ పీఠభూమి పడమర అగ్ని పర్వత సంబందమైన ప్రాచీన కఠినశిలలతో నిర్మితమైనది. కోస్తా జిల్లాల పడమటి కొంతమేర తెలంగాణా / పడమటి పీఠభూమిలో అంతరాబగాలుగా ఉన్నాయి.  ఈ పీఠభూమి 4 శిలలతో ఏర్పడింది అవి ధార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు , రాజమండ్రి శిలలు.

Q5.ANS: (b)

ధార్వార్ శిలలు అత్యంత ప్రాచినమైన శిలలు. విలువైన ఖనిజలకు ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా బంగారం (చిత్తూరు), అభ్రకం (నెల్లూరు) లభిస్తాయి. కర్ణాటక లోని ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు ఈ శిలలు విస్తరించి ఉన్నాయి.

Q6.ANS: (a)

క్రమక్షయ కారకాల వాళ్ళ 50 కోట్ల సంవత్సరాల క్రిందటి మిగిలిపోయిన ధార్వార్ శిలల అవశేషాలను “కడప శిలలు”అంటారు. ఈ ప్రాంతం (ఈ శిలల్లో) ఆస్బెస్టాస్ (రాతినార),మైకా, సున్నపురాయికి ప్రసిద్ది.

Q7.ANS: (c)

రాజమండ్రి శిలలు సముద్రం ఉప్పొంగి ఏర్పడిన శిలలు. పెట్రోలియం , సహజ వాయువు, ఖనిజలకి ప్రసిద్ది.

ఈ పీఠభూమి ఉపరితలంగా కాకుండా ఎగుడు దిగుడు స్తలక్రుతులను కలిగి అనేక లోయలు, గుట్టలు లాంటి నిర్మాణాలలో ఉంటుంది.

Q8.ANS: (c)

రాజమండ్రి శిలలు సముద్రం ఉప్పొంగి ఏర్పడిన శిలలు. ఈ పీఠభూమి ఉపరితలంగా కాకుండా ఎగుడు దిగుడు స్తలక్రుతులను కలిగి అనేక లోయలు, గుట్టలు లాంటి నిర్మాణాలలో ఉంటుంది. ఇది వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపునకు వాలి ఉంది. ఈ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఎర్రనేలలు ఆక్రమించాయి.

Q9.ANS: (d)

లావా శిలలు నుంఛి నల్లరేగడి భూములు ఆవిర్భవించాయి ఈ పితభుమిలో అనేక ఖనిజాలు లభిస్తున్నాయి అవి బొగ్గు, ఇనుము ,మంగనేసు, అభ్రకం, రాగి, ఆస్ బెస్టాస్, వజ్రాలు ముఖ్యంగా లభించే ఖనిజాలు  

Q10.ANS(d)

ఇనుము: కడప, కర్నూలు, కృష్ణ.

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

అంశము ముఖ్యమైన ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ ఉనికి- క్షేత్రీయ అమరిక త్వరలో
2. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం    పార్ట్-1     పార్ట్-2    పార్ట్-3 పార్ట్-4
3. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి పార్ట్-1  పార్ట్-2             పార్ట్-3       పార్ట్-4     పార్ట్-5
4. ఆంధ్రప్రదేశ్ నేలలు(మృతికలు) త్వరలో
5. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ త్వరలో
6. ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల విధానాలు త్వరలో
7. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగం త్వరలో
8. ఆంధ్రప్రదేశ్ లో అడవులు పార్ట్-1

 

పార్ట్-2 పార్ట్-3

 

పార్ట్-4
9. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం  

త్వరలో

10. ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ సంపద త్వరలో
11. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం త్వరలో
12. ఆంధ్రప్రదేశ్ లో రవాణా త్వరలో
13. ఆంధ్రప్రదేశ్లో దర్శనీయ ప్రదేశాలు త్వరలో
14. ఆంధ్రప్రదేశ్లో జనాభా త్వరలో
15. ఆంధ్రపదేశ్లో -జిల్లాల సమాచారాలు త్వరలో

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 02 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

13 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

15 hours ago

AP SET 2024 ప్రాధమిక కీ విడుదల అభ్యంతరాల లింకు తనిఖీ చేయండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…

15 hours ago

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu | RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF SI ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

17 hours ago