Telangana Formation Day: 02 June | తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం: 02 జూన్

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది. కోవిడ్ రెండవ తాకిడి కారణంగా భద్రతా కారణాల రీత్యా ఈ 8 వ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా జరపలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలోని ప్రతినిధులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జెండాను ఎగురవేయడం ద్వారా తెలంగాణా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకోవడం జరిగింది.

చరిత్ర:

దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా,2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.  2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

sudarshanbabu

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

9 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

9 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago