Telugu govt jobs   »   Current Affairs   »   largest floating solar pv project in...

India’s largest Floating Solar PV Project commissioned in Andhra Pradesh | భారతదేశంలోనే మొట్టమొదటి తేలియాడే సోలార్ PV ప్రాజెక్ట్ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం అయింది.

NTPC భారతదేశంలోని విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ స్టేషన్ రిజర్వాయర్‌పై భారతదేశంలోనే 25MW పవర్ కలిగిన అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ PV ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఫ్లెక్సిబిలైజేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన మొదటి సోలార్ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2018 లో నోటిఫై చేసింది. NTPC కూడా సింహాద్రిలో పైలట్ ప్రాతిపదికన హైడ్రోజన్ ఆధారిత మైక్రో గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్ట్ గురించి:

NTPC యొక్క ఫ్లోటింగ్ సోలార్ ఇన్‌స్టాలేషన్,  సింహాద్రి రిజర్వాయర్ ఉపరితలం మీద  75 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది 7,000 గృహాలను వెలుతురునివ్వడానికి లక్షకు పైగా సోలార్ PV మాడ్యూల్స్ నుండి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏటా 46,000 టన్నుల CO2 ఉద్గారాలను మరియు 1,364 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తుంది, ఇది ఒక సంవత్సరంలో 6,700 గృహాల విద్యుత్  అవసరాలను తీర్చడానికి సరిపోతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • NTPC ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్: శ్రీ గురుదీప్ సింగ్.
  • NTPC స్థాపించబడింది: 1975.
  • NTPC ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ, భారతదేశం.
Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

 

శతాబ్ది Live Batch-For Details Click Here

Sharing is caring!