Telugu govt jobs   »   Economy   »   పంచవర్ష ప్రణాళికలు

Economics Study Material Five Year Plans APPSC, TSPSC Groups | పంచవర్ష ప్రణాళికలు

ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే ప్రక్రియగా ప్రణాళిక ఆలోచన 1940-50లలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1944లో వివిధ పారిశ్రామికవేత్తలు కలిసి భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉమ్మడి ప్రతిపాదనను రూపొందించారు. ఇది బాంబే ప్లాన్‌గా ప్రసిద్ధి చెందింది. భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి మరియు అభివృద్ధిని సాధించడానికి స్వాతంత్ర్యం తర్వాత పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించింది. ఇక్కడ మేము పంచవర్ష ప్రణాళికలు వివరాలు చర్చించాము.

ప్రణాళికా సంఘం 

1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు.

క్ర.సం. ప్రణాళిక వ్యవధి
1 మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-1956
2 రెండో పంచవర్ష ప్రణాళిక 1956-1961
3 మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-1966
4 నాల్గవ పంచవర్ష ప్రణాళిక 1969-1974
5 ఐదవ పంచవర్ష ప్రణాళిక 1974-1979
6 ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980-1985
7 ఏడవ పంచవర్ష ప్రణాళిక 1985-1989
8 ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక 1992-1997
9 తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక 1997-2002
10 పదవ పంచవర్ష ప్రణాళిక 2002-2007
11 పదకొండవ పంచవర్ష ప్రణాళిక 2007-2012
12 పన్నెండవ పంచవర్ష ప్రణాళిక 2012-2017

పంచవర్ష ప్రణాళికలు

భారత ప్రభుత్వం 1950 మార్చిలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. (ఇటీవల దీని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది.) ప్రణాళిక సంఘం ద్వారా ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా 2014 లో పంచవర్ష ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ ను ప్రవేశ పెట్టారు. ఇక్కడ  పంచవర్ష ప్రణాళికల పూర్తి వివరాలు అందించాము.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

మొదటి ప్రణాళిక: (1951-56)

దీనిని హర్రోడ్-దమోర్ మోడల్ ఆధారంగా తయారు చేసారు. వ్యవసాయం, ధరల నియంత్రణ, రవాణా రంగాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ధరల నియంత్రణ లో వ్యవసాయ అభివృద్ధిలో ఇది విజయవంతమైంది. కమ్యునిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈ ప్రణాళికలోనే 1952 లో ప్రారంభించారు.

  • వృద్ధి రేటు లక్ష్యం 4.5% సాధించింది – 4.3%

రెండవ ప్రణాళిక: (1956 – 61)

దీనిని మహలనోబిస్ మోడల్ ఆధారంగా తయారు చేసారు. భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపనకు ఇందులో అధిక క్యాన్ని ఇచ్చారు. వ్యవసాయ రంగ ప్రాధాన్యం ఈ ప్రణాళిక లో తగ్గిపోయింది.రెండవ పంచవర్ష ప్రణాళిక వేగవంతమైన పారిశ్రామికీకరణ మరియు ప్రభుత్వ రంగాన్ని నొక్కి చెప్పింది.
ఇది త్వరిత నిర్మాణ రూపాంతరాన్ని నొక్కి చెప్పింది.

మూడవ ప్రణాళిక: (1961 – 66)

వ్యవసాయం, గోధుమల ఉత్పత్తి మెరుగుదలపై దృష్టి సారించారు. రాష్ట్రాలకు అదనపు అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. మాధ్యమిక మరియు ఉన్నత విద్యకు మాజీ రాష్ట్రాలు బాధ్యత వహించాయి.

(1962), పాకిస్తాన్ యుద్ధం (1965) వల్ల ఈ ప్రణాళిక విఫలం అయింది.

  • వృద్ధి రేటు లక్ష్యం 5.6% సాధించింది – 2.4%
  • ఈ ప్రణాళిక విఫలం అవడం వల్ల, మూడు వార్షిక ప్రణాళికలను తీసుకువచ్చారు. అవి: మూడు వార్షిక ప్రణాళికలు (1966 – 67, 1967 – 68 & 1968 – 69)

నాలుగవ ప్రణాళిక: (1969 – 74)

ఈ ప్రణాళిక 1969-70 నుంచి 1973-74 వరకు కొనసాగింది. సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో రైతులకు తగినంత రుణాలను అందించడానికి దేశంలోని ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది. మునుపటి వైఫల్యాలను సరిదిద్దడానికి ప్రయత్నించింది. గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా, స్థిరత్వంతో వృద్ధి మరియు స్వావలంబన దిశగా పురోగమించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.

  • వృద్ధి రేటు లక్ష్యం 5.7% సాధించింది – 3.3%

ఐదవ ప్రణాళిక: (1974 – 78)

గరీబీ హటావో నినాదంతో, పేదరిక నిర్మూలనకు ఈ ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయంలో స్వావలంబనకు, ఆహారోత్పత్తుల దిగుమతులను తగ్గించడానికి ప్రాముఖ్యతనిచ్చారు

  • వృద్ధి రేటు లక్ష్యం – 4.4% సాధించింది – 4.8%
  • ఈ ప్రణాళిక కాలంలోనే దేశ రాజకీయాలలో విపరీత పరిణామాలు సంభవించాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడం ఈ కాలంలోనే జరిగింది.
  • ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన మురార్జీ ప్రభుత్వం ఈ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను (Rolling Plans) ప్రారంభించింది.

Read more : ఆర్ధిక సంస్కరణలు

రోలింగ్ ప్లాన్స్
కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఇందిర ప్రభుత్వం ప్రారంభించిన ప్రణాళికను అర్థాంతరంగా ముగించి జనతా పార్టీ లక్ష్యాలతో మురార్జీ ప్రభుత్వం నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రముఖ ఆర్థిక వేత్త డి.టి.లక్డావాలాను ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా నియమించారు. ఈ ప్రణాళికనే ఆరవ ప్రణాళికగా భావించారు. కాని కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దీన్ని కూడా రద్దుచేసి 1980 నుంచి ఆరవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు.

ఆరొవ  ప్రణాళిక (1980-1985)

6వ ప్రణాళిక కాలంలో తలసరి 5.2 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 5.7 శాతం వృద్ధిరేటును సాధించడం జరిగింది. ప్రొఫెసర్ రాజకృష్ణ పేర్కొన్న ‘హిందూ వృద్ధిరేటు’ (5 శాతం)ను అధిగమించి తొలిసారిగా వృద్ధి నమోదైంది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలో 3.2 శాతం వృద్ధిరేటు, వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి.ధరల నియంత్రణలను తొలగించడం ద్వారా ఆర్థిక విముక్తికి నాంది పలికింది. అధిక జనాభాను నివారించడానికి, కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టారు.

  • గ్రామీణ, భూమిలేని వారికి ఉపాధి భద్రతా పథకం (RLEGP – 1983), జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP – 1980),
  • గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, శిశువుల అభివృద్ధి పథకం (DWACRA) మొదలైన కార్యక్రమాలు చేపట్టారు.

ఏడో పంచవర్ష ప్రణాళిక (1992-1997)

(1985 ఏప్రిల్ 1 – 1990 మార్చి 31) ఆరో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థ అనుకున్న విధంగా వృద్ధిని సాధించడంతో ఏడో పంచవర్ష ప్రణాళిక ఆశాజనకమైన ఆర్థిక వాతావరణంలో ప్రారంభమైంది. ఈ పంచవర్ష ప్రణాళికను 1985 నుంచి 2000 సంవత్సరం వరకు, అంటే 15 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దీర్ఘదృష్టితో తయారు చేయడం జరిగింది.

  • ఆర్ధిక వృద్ధి, ఆధునికీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం లాంటి ముఖ్య ఉద్దేశాల నేపథ్యంలో ఏడో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల కల్పన, ఉత్పాదకతను పెంచడం, తదితర లక్ష్యాలకు ఈ ప్రణాళిక అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
  • ఏడో ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో చేయదల్చుకున్న వ్యయం రూ.2,18,730 కోట్లు. మొత్తం ప్రణాళిక వ్యయంలో అత్యధికంగా ఇంధన (శక్తి) రంగానికి 28 శాతం నిధులు కేటాయించారు. అందుకే దీన్ని ‘శక్తి ప్రణాళిక’గా పిలుస్తారు.

వార్షిక ప్రణాళికలు (1990-92): ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, విదేశీ మారక నిల్వల కొరత, ధరల పెరుగుదల, తదితర సమస్యల వల్ల 1990-92 మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలంలో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

ఎనిమిదో ప్రణాళిక (1992-1997)

ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక 1990 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రారంభం కాలేదు. 1992 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ‘మానవ వనరుల అభివృద్ధి’లో భాగంగా శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, సార్వత్రిక ప్రాథమిక విద్య, తాగునీరు, అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాలతో ఎనిమిదో ప్రణాళిక ప్రారంభమైంది.

  •  ఈ ప్రణాళికను పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ నమూనా (ఎల్పీజీ) ఆధారంగా రూపొందించారు.
  • నూతన ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రారంభించిన మొదటి ప్రణాళిక ఇది.
  • ఈ ప్రణాళిక నుంచి భారత్ సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని అమలు పరిచింది. దీనిలో ప్రభుత్వరంగ ప్రాధాన్యం తగ్గి ప్రైవేటు రంగానికి ప్రాముఖ్యం పెరిగింది.
  • ఈ ప్రణాళిక కాలంలో బడ్జెట్ లోటును, విదేశీ రుణాన్ని సవరించే లక్ష్యంతో భారత ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నం జరిగింది.
  • ఈ ప్రణాళికలో మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగానికి రూ.4,85,460 కోట్లు

తొమ్మిదో ప్రణాళిక (1997-2002)

(1997 ఏప్రిల్ 1 – 2002 మార్చి 31)  సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి, గ్రామీణాభివృద్ధిపై తొమ్మిదో ప్రణాళిక ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని సాధించడానికి నాలుగు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. అవి:

1. జీవన నాణ్యత

2. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం

3 ప్రాంతీయ అసమానతలు తగ్గించడం

4. స్వయం ఆధారితం.

పైన పేర్కొన్న లక్ష్యాల సాధనకోసం ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.8,59,200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా రవాణా, సమాచార రంగానికి 25 శాతం నిధులు కేటాయించారు.

ప్రణాళిక ఫలితాలు:

  • ఈ ప్రణాళికలో నిర్దేశిత వృద్ధి రేటు లక్ష్యం 6.5 శాతం అయితే 5.4 శాతం వృద్ధిని మాత్రమే సాధించడం జరిగింది. ఈ కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.4
  • స్వర్ణ జయంతీ షహరీ రోజ్ గార్ యోజన (SJSRY – 1997), జవహర్ గ్రామ సమృద్ధి యోజన (JGSY – 1999), స్వర్ణజయంతీ గ్రామ్ స్వరోచ్గార్ యోజన (SGSY – 1999), ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY – 2000) లాంటి పథకాలు ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభమయ్యాయి.

పదో పంచవర్ష ప్రణాళిక (2002-2007)

(2002 ఏప్రిల్ 1 – 2007 మార్చి 31) జాతీయ అభివృద్ధి మండలి ఈ ప్రణాళికను డిసెంబర్ 2002లో ఆమోదించింది. 8 శాతం వార్షిక వృద్ధిరేటును సాధించాలని నిర్ణయించింది. ‘సమానత్వం, సాంఘిక న్యాయం, నాణ్యమైన మానవ వనరులను పెంపొందించడం’ ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

  •  అయిదేళ్లలో 50 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడం.
  • పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5 శాతం పాయింట్లు, 2012 నాటికి 15 శాతం పాయింట్లు తగ్గించడం
  • 2007 నాటికి అక్షరాస్యతను 75 శాతానికి పెంచాలి.
  • రాబోయే పదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు చేయాలి
  • పదకొండో పంచవర్ష ప్రణాళిక 2007 డిసెంబరులో జాతీయ అభి వృద్ధి మండలి ఆమోదం పొందింది.
  • వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, అవస్థాపన సౌకర్యాలు లాంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఈ ప్రణాళికలో భావించారు.
  • ‘సత్వర, సమ్మిళిత వృద్ధికి’ (Faster and Inclusive Growth) ఈ ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు.

పదకొండో ప్రణాళిక (2007-2012)

పదకొండో ప్రణాళికలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 9 శాతం. ప్రణాళిక చివరి సంవత్సరం నాటికి 10 శాతం వృద్ధిరేటు సాధించాలి. అయితే 2008-09, 2009-10 లో అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక తిరోగమన పరిస్థితుల వల్ల వృద్ధిరేటును 8.1 శాతానికి సవరించారు. వ్యవసాయరంగంలో 4 శాతం, పారిశ్రామికరంగంలో 10 నుంచి 11 శాతం, సేవారంగంలో 9 నుంచి 11 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు పదకొండో ప్రణాళికలో 6 రంగాలకు సంబంధించిన 27 నిర్దేశిత ప్రమాణాలను(Monitorable targets) లక్ష్యంగా పేర్కొన్నారు.

Read more : భారత ఆర్ధిక వ్యవస్థ : హరిత విప్లవం

పన్నెండో ప్రణాళిక (2012-17)

పన్నెండో ప్రణాళిక తుది ముసాయిదాను డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని జాతీయ అభివృద్ధి మండలి 2012 డిసెంబరులో ఆమోదించింది. 2012 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చె 31 కాలానికి ఈ ప్రణాళికను రూపొందించారు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభానికి ముందు 2008-09 లో ప్రపంచవ్యాప్త సంక్షోభం కారణంగా స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా ఉంది. అయితే, అధికంగా ఉన్న పెట్టుబడి రేటు, ప్రయివేట్ రంగ పొదుపు లాంటివి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో అధిక వృద్ధి రేటును సాధించడానికి అనుకూల అంశాలుగా చెప్పొచ్చు.

  • (Faster, sustainable and more inclusive growth). వృద్ధిని సమ్మిళితం చేయడంలో కింద పేర్కొన్న అంశాలు ముఖ్య సాధనాలుగా చెప్పొచ్చు
  • పారిశ్రామికరంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనను వేగవంతం చేయడం.
  • విస్తృతంగా విస్తరించేలా సరైన వ్యవస్థాపన సౌకర్యాల కల్పన.
  • ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల అభివృద్ధికి ఎక్కువ ప్రయత్నం చేయడం.
  • పేదవారి కోసం ఉద్దేశించిన పథకాల ప్రభావాన్ని మెరుగుపరచడం.
  • సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాల రూపకల్పన.
  • వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం.

స్వాతంత్ర్యానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ

పంచ వర్ష ప్రణాళికల విజయాలు

1947 లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన మనదేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళిక బద్దంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైననూ అభివృద్ధిపథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషిచేశాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తి సాధించగల్గాము. రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మంచి ఊతం లభించింది. మూడో ప్రణాళిక విఫలమవడానికి చైనా యుద్ధం (1962), నెహ్రూ మరణం (1964), పాకిస్తాన్తో యుద్ధం (1965) కారణాలు. ఆ తర్వాత కూడా రుతుపవనాలు, దేశ రాజకీయ కారణాలు మొదలగునవి ప్రణాళికల అభివృద్ధిని తాత్కాలికంగా ఆపినా దేశ అభివృద్ధిని మాత్రం అడ్డగించలేవు. ఈనాడు దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నదానికి, సమాచార, శాస్త్ర, సంకేతిక, అంతరిక్ష రంగాలలో అంతెత్తున ఎగిరినదానికి ప్రణాళికబద్ద లక్ష్యాలే కారణం. పారిశ్రామికంగా కూడా బాగా అభివృద్ధి సాధించాం. ఒకప్పుడు ఆహారధాన్యాలకై ఇతరదేశాలపై ఆధారపడిన భారతదేశం ఈనాడు ఎగుమతి దశకు చేరడానికి, పారిశ్రామిక, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రణాళికలు దోహదం చేశాయి.

పంచ వర్ష ప్రణాళికల వైఫల్యాలు

పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించిననూ అవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. 6 దశాబ్దాల ప్రణాళికా భారతి ఏమి సాధించిందో గ్రామీణ రంగాన్ని ఒక్కసారి చూస్తే అర్థమౌతుంది. గత 60 సంవత్సరాలుగా కోట్ల రూపాయలు దారిద్యం, నిరుద్యోగం, జనాభా నిర్మూలన, ఉ ద్యోగ అవకాశాలపై ఖర్చు చేస్తున్ననూ అవి మరింతగా పెరగడం ఆశ్చర్యం కల్గుతుంది. అంకెల్లో ప్రగతి బాగున్ననూ వాటి ఫలాలు మాత్రం కొందరే అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ప్రణాళికలకు ఒక స్థిరమైన గమ్యంలేదని, రాజకీయ పార్టీలు తమ వాగ్దానాల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం ప్రణాళిక లక్ష్యాలను మార్చివేస్తున్నారనే అపవాదు ఉంది. మొదటి, రెండో ప్రణాళికలో పొమ్దుపర్చిన లక్ష్యాలనే 11 వ ప్రణాళికలో కూడా ఉండటం కచ్చితంగా ప్రణాళికా వైఫల్యమేనని చెప్పవచ్చు. నాల్గవ ప్రణాళిక అనంతరం చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగలేదు. వ్యవసాయరంగంలో తాత్కాలిక ఫలితాల సాధనకే ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో అధిక ప్రాంతాలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడవల్సిన పరిస్థితి పోలేదు. దేశంలో సమతూలక అభివృద్ధి ఏర్పడలేదు

పంచ వర్ష ప్రణాళికలు PDF

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Sharing is caring!

FAQs

భారతదేశం యొక్క చివరి పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత?

భారత ప్రభుత్వం యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక (2012–17) భారతదేశం యొక్క చివరి పంచవర్ష ప్రణాళిక.

మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి?

వ్యవసాయ వృద్ధి మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం

గాంధీయన్ మోడల్ అని ఏ పంచవర్ష ప్రణాళికను పిలుస్తారు?

మూడవ పంచవర్ష ప్రణాళికను గాంధీయన్ మోడల్ అని పేర్కొనవచ్చు.