Telugu govt jobs   »   Green Revolution in India

Economy Study Material – Green Revolution in India, Download PDF, APPSC, TSPSC Groups | భారతదేశంలో హరిత విప్లవం

Green Revolution in India | భారతదేశంలో హరిత విప్లవం

భారతదేశంలో, హరిత విప్లవం కారకుడు ప్రధానంగా M.S. స్వామినాథన్. హరిత విప్లవం ఫలితంగా 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన కొత్త, అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రవేశపెట్టడం వలన ఆహార ధాన్యాల (ముఖ్యంగా గోధుమ మరియు బియ్యం) ఉత్పత్తిలో గొప్ప పెరుగుదల ఏర్పడింది. హరిత విప్లవం వరి దిగుబడిలో వేగవంతమైన పెరుగుదలకు ఉపయోగించే ఎరువులు మరియు ఇతర రసాయనిక ఇన్‌పుట్‌ల విస్తృత వినియోగంతో కలిపి మెరుగైన రకాలు అందించబడింది మరియు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయాలు మరియు ఆహార సరఫరాలపై ప్రభావాన్ని చూపింది. ఈ కధనంలో భారతదేశంలో హరిత విప్లవం పూర్తి వివరాలను అందిస్తున్నాము. భారతదేశంలో హరిత విప్లవం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కధనాన్ని చదవండి.

Green Revolution Introduction | హరిత విప్లవం పరిచయం

వ్యవసాయంలో మేలైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, సాగునీరు, ధరలు, పరపతి లాంటి అంశాల ద్వారా ముఖ్యంగా అధిక ఉత్పత్తిని సాధించడాన్నే హరితవిప్లవం అంటారు.

హరిత విప్లవం అనేది 1960 లలో నార్మన్ బోర్లాగ్ ప్రారంభించిన ప్రయత్నం. అతను ప్రపంచంలో ‘హరిత విప్లవ పితామహుడు’ గా పిలువబడ్డాడు. ఇది గోధుమలను అధిక దిగుబడినిచ్చే (HYVs) అభివృద్ధిలో చేసిన కృషికి 1970 లో నోబెల్ శాంతి బహుమతిని తెచ్చి పెట్టింది.

  • భారతదేశంలో, హరిత విప్లవం కోసం ప్రధానంగా M.S. స్వామినాథన్ కృషి చేశారు.
  • హరిత విప్లవం ఫలితంగా 20 వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన కొత్త, అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రవేశపెట్టడం వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి (ముఖ్యంగా గోధుమ మరియు బియ్యం) బాగా పెరిగింది.
  • దీని ప్రారంభ నాటకీయ విజయాలు మెక్సికో మరియు భారత ఉపఖండంలో ఉన్నాయి.
  • 1967-68 నుండి 1977-78 వరకు విస్తరించిన హరిత విప్లవం, భారతదేశం యొక్క స్థితిని ఆహార లోపం ఉన్న దేశం నుండి ప్రపంచంలోని ప్రముఖ వ్యవసాయ దేశాలలో ఒకటిగా మార్చింది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

Green Revolution History | చారిత్రక నేపథ్యం

భారత్లో మూడో పంచవర్ష ప్రణాళికా కాలం (1961 -66)లో వ్యవసాయ రంగంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి మూలంగా ఆహార కొరత ఏర్పడింది. పబ్లిక్ లా – 480 కింద అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నాం.

  • వ్యవసాయ ఉత్పత్తి పెంపునకు పౌర్డ్ ఫౌండేషన్ చేసిన సిఫార్సుల మేరకు 1960లో దేశంలోని 7 జిల్లాల్లో సాంద్రం వ్యవసాయ జిల్లాల పథకం (Intensive Agricultural District Programme – |ADP)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
  • IADP కింద ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేశారు.
  • IADP లోని లోపాలను సవరించి 1965లో ‘సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం’ (Intensive Agricultural Area Programme – IAAP) గా మార్పు చేసి 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.

Green Revolution New Agriculture Strategy | నూతన వ్యవసాయక వ్యూహం

హరిత విప్లవం అనే పదాన్ని 1968లో మొదటిసారి విలియం ఎస్. గాండ్ ఉపయోగించాడు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో మెక్సికన్ గోధుమ రకాన్ని అభివృద్ధి చేసిన నార్మన్ బోర్లాగ్ (అమెరికా)ను హరిత విప్లవ పితామహుడు అంటారు.

  • భారత్లో హరిత విప్లవ పితామహుడు – ఎం.ఎస్. స్వామినాథన్.
  • హరిత విప్లవం లేదా నూతన వ్యవసాయక వ్యూహం అనేది ఒక ప్యాకేజీ కార్యక్రమం. 1966 ఖరీఫ్ కాలంలో ఉత్పత్తి పెంపునకు అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం (High Yielding Varieties Programme – HYVP)ను ప్రవేశపెట్టారు. ఈ నూతన వ్యవసాయ వ్యూహంలో కింది అంశాలు ఇమిడి ఉన్నాయి.

1. HYVP అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం (High Yielding Varieties Programme)

  • 1965లో సోనారా – 64,  లెర్మరోజా – 64 లాంటి గోధుమ వంగడాలను భారత్ దిగుమతి చేసుకుంది. వరి పంట విషయంలో IR – 8 అధిక ఫలితాలను ఇచ్చింది.

2. అల్ప ఫలదీకరణ కాలం గల పంటలను ప్రవేశపెట్టడం

  • ప్రధానంగా IR – 3, జయ, పద్మ లాంటి వరి రకాలు 4 నెలల్లో కోతకు రావడం సాధ్యమైంది.

3. ఆధునిక సాంకేతిక పద్ధతులు

నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను కింది అంశాల్లో ప్రవేశపెట్టారు.

  •  పంటల మార్పిడి విధానం, బహుళ పంటల విధానం
  • నీటి పారుదల వసతుల కల్పన
  • యాంత్రికీకరణ
  • పరపతి సదుపాయాల కల్పన
  • పంటల రక్షిత విధానం (విత్తనశుద్ధి, క్రిమిసంహారకాలు, రసాయనాలు)
  • మద్దతు ధర

1964 నుంచి మద్దతు ధరల విధానం ప్రారంభం అయింది. 1965 లో ఆహారధాన్యాల ధరలపై సలహాకు వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసారు. 1965లో ఆహారధాన్య కొనుగోలుకు భారత ఆహార సంస్థ (ఎపీసీఐ)ని  ఏర్పాటు చేసారు.

4. ప్రభుత్వ సంస్థలు ఉత్పాదకాల ప్యాకేజీ

  •  1963లో జాతీయ విత్తన సంస్థ ఏర్పాటు చేసారు
  • 1963లో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC – 1963) ఏర్పాటు చేసారు.
  • 1965లో రాష్ట్రాల్లో వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేసారు.
  • 1963లో వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. 1982లో ఇది నాబార్డుగా మారింది.

పై అంశాల కలయిక ద్వారా వ్యవసాయరంగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఫలితాన్నే హరిత విప్లవం అంటారు.

Green Revolution Benefits | హరిత విప్లవం వల్ల లాభాలు

ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది. హరిత విప్లవం వరి, గోధుమల ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపింది. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుధాన్యాల ఉత్పత్తి క్రమంగా తగ్గింది.

వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. నూతన వ్యవసాయక వ్యూహ ప్రధాన లక్ష్యల వల్ల ఆహారధాన్యాలు పెరిగాయి. 1960 – 61 నుంచి 1973 – 74 వరకు వాణిజ్య పంటలపై హరిత విప్లవం ప్రభావం లేదు. దీన్ని డాక్టర్ ధరమ్ నారాయణ్ వాణిజ్య పంటల పక్షపాతంగా వర్ణించాడు. 1973 – 74 తర్వాత వాణిజ్య పంటల్లో పెరుగుదల కనిపించింది.

1960లో వరి ఉత్పాదకత 10 క్వింటాళ్లు. అది 2011 -12 నాటికి 23 క్వింటాళ్లకుపెరిగింది. ఇదే కాలానికి గోధుమ 8 క్వింటాళ్ల నుంచి 31 క్వింటాళ్లకు పెరిగింది.

  • కాయధాన్యాల నిష్పత్తి పెరిగి, పప్పుధాన్యాల నిష్పత్తి తగ్గింది.
  • వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
  • ఉపాధి పెరిగింది ,పేదరికం తగ్గింది. ఆదాయం పెరిగింది.

Green Revolution disadvantages | హరిత విప్లవం వల్ల నష్టాలు

  • వ్యవసాయం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిపోయింది
  • ధనిక – పేద రైతుల మధ్య ఆదాయ వ్యత్యాసాల పెరిగాయి
  • దేశంలో ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగి అసమానతలకు దారి తీసింది.
  • హరిత విప్లవం వల్ల కలిగిన లాభాలు కొన్ని పంటలకే పరిమితం (గోధుమ, ఆలుగడ్డ, మాత్రమే) అయ్యాయి
  • వ్యవసాయ యంత్రాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల శ్రామికుల తొలగింపు
  • రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల గ్రామీణ పర్యావరణ సమస్యలు పెరిగాయి
  • వ్యవసాయ యంత్రాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల శ్రామికుల తొలగింపు
  • రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల గ్రామీణ పర్యావరణ సమస్యలు పెరిగాయి

Agriculture in India after Economic Reforms | దేశంలో ‘ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యవసాయ రంగం

నూతన వ్యవసాయక వ్యూహం/హరిత విప్లవం ద్వారా సాధించిన భారత వ్యవసాయ వృద్ధి, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత తగ్గింది.

ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు: నీటిపారుదల సౌకర్యాల కొరత, ఆధునిక సాంకేతిక విజ్ఞానం అల్ప వినియోగం, ఉత్పాదకాల వాడకంలో అల్ప వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం, పరపతి సౌకర్యాల కొరత మొదలైన కారణాల వల్ల వృద్ధి తగ్గింది.

Steps Taken For the Development of Agriculture | దేశంలో వ్యవసాయ అభివృద్ధికి తీసుకున్న చర్యలు

8వ ప్రణాళిక కాలంలో వ్యవసాయంతోపాటు, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. భారత్లో మొదటి వ్యవసాయ విధానం ప్రకటన – 1993 లో చేసారు. నూతన వ్యవసాయ విధానం 2000లో ప్రకటించారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీన్ని 2000, జులై 28న ప్రకటించారు. ఇది 4% వ్యవసాయ వృద్ధి లక్ష్యంగా ఉంది.

శ్వేత విప్లవం (పాల ఉత్పత్తి/ Operation Flood) – 1970 లో ప్రారంభించారు

వర్గీస్ కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసేదేశం భారత్. భారత్లో తలసరి పాల లభ్యత – 290 గ్రా. (2011 – 12)

రెయిన్బో విప్లవం: దీనిలో వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధికి చర్యలు చేపట్టారు

ప్రధానంగా చేపలు (Blue), మాంసం (Red), ఎరువులు (Grey), గుడ్లు (Silver), పండ్లు/ఆపిల్ (Golden). రొయ్యలు (shrimp), క్రూడ్ఆయిల్ (Black), ఆలుగడ్డలు (Round), సుగంధ ద్రవ్యాలు (Brown) మొదలైన వాటిని విప్లవాత్మకంగా ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు.

  • ఇంటెన్సివ్ కాటిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ – 1964 – 65 లో ప్రారంభమైంది.
  • నేషనల్ ఆయిల్సేడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు 1985 86
  • ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన 2004లో జాతీయ రైతు కమిషన్ ను  నియమించింది.
  • 2006 జూన్ 3న అప్పటి ప్రధాని మన్మోహన్ రెండో హరిత విప్లవానికి పిలుపు నిచ్చారు.

Green Revolution Conclusion

మొత్తంగా, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి హరిత విప్లవం ఒక పెద్ద విజయం మరియు వారికి అపూర్వమైన జాతీయ ఆహార భద్రతను అందించింది. ఇది వ్యవసాయంలో పారిశ్రామిక దేశాలు ఇప్పటికే తమ కోసం స్వాధీనం చేసుకున్న శాస్త్రీయ విప్లవం యొక్క విజయవంతమైన అనుసరణ మరియు బదిలీ చేయటానికి సహాయ పడింది. ముందుకు సాగే మార్గంగా, విధాన కర్తలు కొత్త టెక్నాలజీల నుండి ఎక్కువ ప్రత్యక్ష ప్రయోజనాలను పొందేలా చూడటానికి పేదవారిని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవాలి మరియు ఆ సాంకేతికతలు కూడా పర్యావరణ హితంగా ఉండాలి. అలాగే, గతం నుండి పాఠాలు నేర్చుకుంటూ, అటువంటి కార్యక్రమాలలో పరిమిత క్షేత్రానికి కట్టుబడి కాకుండా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ లబ్ధిదారులందరూ ఉండేలా చూసుకోవాలి.

Green Revolution in India, Download PDF

 

Economy Articles 
ఎకానమీ స్టడీ మెటీరియల్ : భారతదేశంలో పేదరికం ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ PDF
భారతదేశంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ నియంత్రణ భారతదేశంలో పేదరికం కొలత
భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్ధిక వ్యవస్థ
ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు పేదరికం రకాలు 
పంచ వర్ష ప్రణాళికలు ప్రణాళిక సంఘం
మధ్య యుగ భారత ఆర్ధిక వ్యవస్థ పారిశ్రామిక రంగం,విధానాలు

RRB NTPC (CBT 1 & 2) 2024 Complete Live Batch | Online Live Classes by Adda 247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

For which Green Revolution is most successful in India?

Wheat and Rice were the two most successful crops of the Green Revolution

Who brought green revolution in India?

Dr. MS Swaminathan is the father of the Indian Green Revolution.

Which crops improves by green revolution in India?

The Green Revolution resulted in a significant increase in production of food grains (especially wheat and rice)