Telugu govt jobs   »   Article   »   ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్

Indian Economy Study Material – Types of Inflation and Causes , Download PDF | భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, APPSC, TSPSC గ్రూప్స్ పరీక్షల కోసం

ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ ద్రవ్యోల్బణం 

ద్రవ్యోల్బణం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రభావితం చేస్తుంది. ఆ దేశ అభివృద్ధి దశ, స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణ ప్రభావాలను, వాటి కారణాలను అర్థం చేసుకుని తగిన చర్యలు చేపడుతుంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరతలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ఒక స్థూలమైన జాతీయ సమస్య అని చెప్పవచ్చు.

ద్రవ్యోల్బణం అంటే ఏమిటి?

ద్రవ్యోల్బణం అనేది డబ్బు విలువ తగ్గింపు పెరగడం లేదా తగ్గడం వలన ప్రజలు కొనుగోలు చేసే వస్తువులు మరియు సేవల ధరలలో కనిపించే మార్పుని ద్రవ్యోల్బణం అంటారు. ఇది వివిధ కారణాల పై ఆధారపడి ఉంటుంది. తరచూ ఒక దేశ ఆర్ధిక వ్యవస్థని ద్రవ్యోల్బణంలో కొలిచి ఎంతమేర ప్రజల జీవనం మెరుగుపడిందో తెలుసుకుంటారు.

Holi Biggest Sale With 2x Validity Check Now

ద్రవ్యోల్బణం రకాలు

పెరుగుదల పరిధి మరియు దాని తీవ్రతను బట్టి, ద్రవ్యోల్బణాన్ని మూడు విస్తృత వర్గాలుగా వర్గీకరించవచ్చు.

తక్కువ ద్రవ్యోల్బణం (Low Inflation )

దీనిని పాకే ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ఇటువంటి ద్రవ్యోల్బణం నెమ్మదిగా ఉంటుంది మరియు ఊహించదగిన రేఖలలో చిన్నది లేదా క్రమంగా  ఉంటుంది.

  •  ఈ ద్రవ్యోల్బణం సుదీర్ఘ కాలంలో జరుగుతుంది మరియు పెరుగుదల పరిధి సాధారణంగా ఒకే అంకెలో ఉంటుంది.
  • అటువంటి ద్రవ్యోల్బణాన్ని క్రీపింగ్ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం : (Galloping Inflation)

దీనిని దూకే ద్రవ్యోల్బణం అని కూడా అంటారు ఇది చాలా అధిక ద్రవ్యోల్బణం, రెండంకెల లేదా మూడింతల పరిధిలో నడుస్తోంది.

ఈ ద్రవ్యోల్బణానికి మరికొన్ని పేర్లు

  • ఆశించిన ద్రవ్యోల్బణం
  • పెరుగుతున్న ద్రవ్యోల్బణం
  • రన్నింగ్ లేదా రన్అవే ద్రవ్యోల్బణం.

అధిక ద్రవ్యోల్బణం ( High Inflation )

  • ఈ ద్రవ్యోల్బణం పెద్దది మరియు వేగవంతమైనది, ఇది వార్షిక రేట్లను మిలియన్ లేదా ట్రిలియన్లలో కలిగి ఉండవచ్చు
  • అటువంటి ద్రవ్యోల్బణంలో పెరుగుదల పరిధి చాలా పెద్దది మాత్రమే కాదు, పెరుగుదల చాలా తక్కువ వ్యవధిలో జరుగుతుంది, ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి.
  • ఆర్థికవేత్తలు ఉదహరించిన హైపర్ ద్రవ్యోల్బణానికి ఉత్తమ ఉదాహరణ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1920లో జర్మనీ లో సంభవించింది అటువంటి ద్రవ్యోల్బణం త్వరగా దేశీయ కరెన్సీపై పూర్తి విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.

పునరుల్బణం (Reflation )

పునరుల్బణం అనేది నిరుద్యోగాన్ని తగ్గించడానికి మరియు అధిక స్థాయి ఆర్థిక వృద్ధికి వెళ్లడం ద్వారా డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వం తరచుగా ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చే పరిస్థితి. ప్రభుత్వాలు అధిక ప్రజా వ్యయం, పన్ను కోతలు, వడ్డీ రేట్ల కోతలు మొదలైన చర్యలు తెసుకుంటాయి.

స్తబ్దత ( Stagflation)

ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం రెండూ సాంప్రదాయక విరుద్ధంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పరిస్థితి.

  • స్టాగ్‌ఫ్లేషన్ ప్రాథమికంగా అధిక ద్రవ్యోల్బణం మరియు తక్కువ వృద్ధి కలయిక అని సంబోదిస్తారు

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

 

Inflation Theories | ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు

1. పరిమాణాత్మక ద్రవ్యోల్బణం (Quantity Theory of Inflation): ద్రవ్య సప్లయి, చెలామణి, ద్రవ్యమారకాల సమీకరణాలపై ఆధారపడిన ధరల పెరుగుదల.

2. గుణాత్మక ద్రవ్యోల్బణం (Quality Theory of Inflation): వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని అమ్మకందారులు భవిష్యత్తులో మార్పు చేసుకోవాలనే అంచనాలపై ఆధారపడిన ధరల పెరుగుదల

3. రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం (Sectoral Inflation): ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరల పెరుగుదల.

4. ధర శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (Pricing Power Inflation): పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం.

5. కోశ సంబంధ ద్రవ్యోల్బణం (Fiscal Inflation): ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం.

Inflation measures | అంచానా వేసే పద్ధతులు

  • వినియోగదారుల ధరల సూచిక (Consumer Price Index CPI)
    • వినియోగదారుల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు సీపీఐని గణిస్తారు. సీపీఐ వినియోగ వస్తువుల ధరల సూచిక. మనదేశంలో 4 రకాల సీపీఐలను గణిస్తారు.
  •  సీపీఐ-ఐడబ్ల్యూ: వినియోగదారుల ధరల సూచిక – ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ ఐడబ్ల్యూ)లో 260 అంశాలు, సేవలు ఉన్నాయి. దీని ఆధార సంవత్సరం 2001 (మొదటి ఆధార సంవత్సరం 1958-59)
  • సీపీఐ-యూఎస్ఎమ్ఎస్ఈ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ – అర్బస్ నాస్-మాన్యువల్  ఎంప్లాయీస్): దీని ఆధార సంవత్సరం 1984-85. దీన్ని నెలవారీగా గణిస్తారు. భారతదేశంలోని విదేశీ కంపెనీల ఉద్యోగుల కరవు భత్యాన్ని దీని ఆధారంగా గణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలో ‘క్యాపిటల్ గెయిన్స్’ విలువను నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్వో) గణిస్తుంది.
  • సీపీఐ-ఏఎల్ (సీపీఐ ఫర్ అగ్రికల్చరల్ లేబరెర్స్):  దీని ఆధార సంవత్సరం 1986-87.నెలవారీ ప్రతిపాదికగా 600 గ్రామాల నుంచి గణిస్తారు. 260 వస్తువుల సమూహంతో దీన్ని గణిస్తారు.  NSSO దాని 61 వ NSSO సమావేశం (2004 – 05) సమయంలో సేకరించిన వినియోగదారుల ఖర్చు డేటాను ఉపయోగించాలని ప్రతిపాదించబడింది.
  • సీపీఐ-ఆర్ఎల్ (సీపీఐ ఫర్ రూరల్ లేబరర్స్): దీని ఆధార సంవత్సరం 1986-87. దీన్నికూడా నెలవారీగా లెక్కిస్తారు.

Inflation CPI New method | సీపీఐ నవీకరణ

2011లో ప్రభుత్వం నూతన సీపీఐ(సీపీఐ రూరల్, సీపీఐ అర్బన్ కి సంబంధించి ఈ రెండింటినీ కలిపి సీపీఐ కంబైన్డ్) గా గణిస్తున్నారు. మొత్తం గా 1181 గ్రామాలను ఎంపిక చేశారు. దీని ఆధార సంవత్సరం 2010 =100. 2015 ఫిబ్రవరిలో సీపీఐని తిరిగి నవీకరించారు. ఆధార సంవత్సరం 2012= 100. సీపీఐని లెక్కించే పద్ధతిలో గణనీయమైన మార్పులు చేశారు.

టోకు ధరల సూచిక (Wholesale Price Index WPI)

భారతదేశంలో మొదటి టోకు ధరల సూచికను 1942, జనవరి 10న గణించారు. ప్రస్తుతం దీన్ని 676 వస్తువుల సమూహంగా, ఆధార సంవత్సరం 2011-12గా గణిస్తున్నారు (2015 జనవరి నవీకరణ ప్రకారం). టోకు ధరల సూచిక ఆధార సంవత్సరాన్ని అయిదు సార్లు మార్చారు. డబ్ల్యూపీఐని భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు (పరిశ్రమల మంత్రిత్వ శాఖ) కార్యాలయం ప్రకటిస్తుంది.

టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ప్రధాన లోపం విద్య, ఆరోగ్యం, రవాణా లాంటి సేవలను పరిగణించకపోవడం.

పశ్చిమ దేశాలు డబ్ల్యూపీఐకి బదులు పీపీఐ (ఉత్పత్తిదారుల ధరల సూచిక)ని వినియోగిస్తున్నాయి. ఉత్పత్తిదారుల ధరల సూచిక (పీపీఐ) మార్కెట్లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను పీపీఐ గణిస్తుంది. వస్తువులతోపాటు సేవలను కూడా ఇది లెక్కిస్తుంది. డబ్ల్యూపీఐ లెక్కించదు.

  •  ప్రభుత్వం పన్నులు వేయక ముందు ధరలను లెక్కించేది పీపీఐ. పన్నులు విధించిన తర్వాత లెక్కించేది స్థూల దేశీయోత్పత్తి ప్రత్యోల్బణ సూచిక (జీడీపీ డిఫ్లేటర్)
  • దేశీయ ఆదాయంలోని ధరలను తటస్థం చేయడాన్ని ప్రత్యోల్బణ సూచిక అంటారు.
  • ద్రవ్యోల్బణాన్ని జీడీపీ డిప్లేటర్ సహాయంతో కూడా లెక్కించవచ్చు. ప్రస్తుత ధరల్లో జీడీపీ = స్థిర ధరల్లో జీడీపీ. అయితే అక్కడ జీడీపీ డిఫ్లేటర్ విలువ ఒకటి వస్తే ధరల స్థాయిలో మార్పు లేదు. జీడీపీ డిప్లేటర్ విలువ రెండు అయితే అక్కడ ధరలస్థాయి రెట్టింపు అని అర్ధం.
  • డబ్ల్యూపీఐ, సీపీఐ కంటే డిప్లేటర్ మెరుగైన సూచిక.. ఎందుకంటే ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తుసేవలను పరిగణనలోకి తీసుకుంటుంది.

ప్రధాన ద్రవ్యోల్బణం (కోర్ ఇస్టేషన్)

తాత్కాలిక, ఎక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే ఆహారం, శక్తి లాంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తు ధరల్లో మార్పులను లెక్కిస్తే ప్రధాన ద్రవ్యోల్బణం వస్తుంది. తాత్కాలిక ఒడిదుడుకుల కంటే శాశ్వత ఒడిదుడుకుల్లోని మార్పులను తెలుసుకుని, దానికి అనుగుణంగా దీర్ఘకాలిక విధానాలను రూపొందించడానికి ఉపయోగపడేది ప్రధాన ద్రవ్యోల్బణం.

జీవనప్రమాణ వ్యయ సూచీ (కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్)

  •  వినియోగదారుల సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ.
  • దీనిలో స్థిర ఆదాయాలను, కాంట్రాక్టు ఆదాయాలను, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేయవచ్చు

వినియోగదారుడి వ్యయ అవ్యక్త ప్రవ్యోల్బణ సూచిక (Consumer Expenditure Implicit Price Deflator)

వినియోగదారుడి ధరల సూచికకు ప్రత్యామ్నాయం ఇది. వినియోగదారుడు వ్యయం చేసే వస్తువుల ధరల్లోని మార్పును ఈ సూచిక తెలియజేస్తుంది.

మూలధన వస్తువుల ధరల సూచిక (Capital Goods Price Index)

ద్రవ్య సప్లయి పెరుగుదల వినియోగ వస్తువుల ద్రవ్యోల్బణాన్నే కాకుండా మూలధన వస్తువుల ద్రవ్యోల్బణానికి కూడా కారణమవుతుంది. ఇటీవల కాలంలో పేర్లు, డిబెంచర్లు, రియల్ఎస్టేట్, ఇతర ఆస్తుల మూలధన వస్తువుల ధరల పెరుగుదలకు సంబంధించి ద్రవ్యోల్బణాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని ప్రతిపాదించారు. దీన్ని మూలధన వస్తువుల ద్రవ్యోల్బణం అని చెప్పవచ్చు.

ప్రతి దవ్యోల్బణ సూచిక (Price Deflator)

ధరల్లోని మార్పుల వల్ల ద్రవ్య విలువలో కలిగే మార్పులను కొలిచే విలువే ప్రతి ద్రవ్యోల్బణ సూచీ. ఇది ధరల ప్రభావాలను హరించి ధరల సూచీని ప్రతిబింబించడానికి ఉపయోగపడే సూచీ. ఇది ధరల ప్రభావాలను హరించి ధరల సూచీని ప్రతిబింబించడానికి ఉపయోగపడే కొలత. ఇది వాస్తవిక, నామమాత్రపు ధరల మధ్య ఉండే వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ఈ సూచీ ప్రస్తుత కరెన్సీని ద్రవ్యోల్బణంతో సవరించిన కరెన్సీగా మార్చడానికి ఉపయోగపడుతుంది. దీనిద్వారా కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరల్లో తెలియజేయగలం.

Inflation causes | ద్రవ్యోల్బణానికి కారణాలు

 డిమాండ్ పెరుగుదలను ప్రేరేపించే

  •  జనాభా పెరుగుదల
  • ప్రభుత్వ లోటు బడ్జెట్ .
  • ప్రజల వినియోగం పెరుగుదల
  • సులభ ద్రవ్య విధానం
  • ఎగుమతుల్లో పెరుగుదల
  • ప్రభుత్వం పూర్వం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం
  • ద్రవ్య సప్లయి పెరుగుదల

 సప్లయిలో తగ్గుదలను కలిగించే అంశాలు

  • ప్రకృతి వైపరీత్యాలు
  • ఉత్పత్తి కారకాల సప్లయి కొరత
  • వ్యాపారులు వస్తువులను దాచివేయడం
  • వినియోగదారులు వస్తువులను ముందుగానే కొని నిల్వ చేసుకోవడం
  • అధిక వేతన రేట్లు
  • అధిక పన్ను రేట్లు
  • ఉత్పత్తిదారులు అధిక లాభాలు నిర్ణయించుకోవడం

భారతదేశంలో ద్రవ్యోల్బణం పోకడలు

ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా చాలాకాలం నుంచి నెలకొన్న ఆర్థిక సమస్య ద్రవ్యోల్బణం. ఈ సమస్య తీవ్రత వివిధ సంవత్సరాల్లో పలు రకాలుగా ఉంది.

ఆర్థిక సంస్కరణలకు పూర్వం ద్రవ్యోల్బణం

  • ఆర్థిక సంస్కరణలకు పూర్వం.. 1960లలో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. దీనికి కొంతవరకు 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధాలు, 1965-66లోని పంటల వైఫల్యం కారణంగా చెప్పవచ్చు.
  • 1970లలో ద్రవ్యోల్బణం 20 శాతం కంటే పెరిగి ఆందోళన కలిగించింది. దీనికి వ్యవసాయ ఉత్పత్తుల వైఫల్యం, అంతర్జాతీయ ముడి చమురు ధరల విపరీత పెరుగుదల కారణంగా చెప్పవచ్చు.
  • 1957-58, 1960-61 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 3 నుంచి 7 శాతం వరకు నమోదైంది.
  •  1970వ దశకం ద్రవ్యోల్బణం చరిత్రలో ఎంతో అనిశ్చితిని ప్రదర్శించిందని చెప్పవచ్చు.
  •  స్వతంత్ర భారతదేశంలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం 1974 సెప్టెంబరులో 33.3%గా * నమోదైంది.
  • 1980వ దశకంలో ద్రవ్యోల్బణ సగటు 7.2 శాతంగా నమోదైంది.
  • 1985-86లో 4.4 శాతం నుంచి 1990-91లో 10.1 శాతం వరకు నమోదైంది.

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) మీద ఆధారపడిన ద్రవ్యోల్బణం 1950, 1960 దశకాల్లో 7 శాతం కంటే తక్కువగా ఉన్నా, 1970వ దశకం మొదటి భాగంలో త్వరితంగా పెరిగి రెండు అంకెల స్థాయిని చేరింది. కానీ 1970వ దశకం రెండో భాగంలో తగ్గుతూ 1980వ దశకంలో సగటు 7.2 శాతానికి చేరింది.

ఆర్థిక సంస్కరణల తర్వాత.. (1992-93 నుంచి)

  • 1991 మార్చి చివరి నుంచి 1992 మార్చి చివరి వరకు రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 37 శాతం క్షీణించింది. ఇది తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీసింది.
  • 1990 మొదటి దశకంలో చమురు ధరల నిరంతర పెరుగుదల, నిత్యావసర వస్తువుల – డిమాండ్ వ్యత్యాసం ద్రవ్యోల్బణం రెండు అంకెల స్థాయిని నమోదు చేయడానికి కారణమయ్యాయి.
  • 1995-96 నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 1996-97 నుంచి 2000-01 మధ్యకాలంలో గణనీయంగా తగ్గింది.
  • వినియోగదారుడి ధరల సూచీ విధానపు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05కు మార్చారు.
  • 2011లో ఉన్న ద్రవ్యోల్బణ రేటు 9.35 శాతం నుంచి 2012లో 7.55 శాతానికి తగ్గింది.
  • 2010-13 మధ్య కాలంలో ద్రవ్యోల్బణ రేటు 7.18 శాతంగా ఉంది.

Types of Inflation and Causes , Download PDF

Read More:
ప్రణాళిక సంఘం మధ్య యుగ భారత ఆర్ధిక వ్యవస్థ
పంచ వర్ష ప్రణాళికలు పారిశ్రామిక రంగం,విధానాలు
స్వాతంత్రానికి ముందు భారత ఆర్ధిక వ్యవస్థ నీతి ఆయోగ్
ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు పేదరికం రకాలు 
ద్రవ్య వ్యవస్థ భారతదేశంలో పేదరికం
భారతదేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు భారతదేశంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ నియంత్రణ

Indian Economy Study Material - Types of Inflation and Causes , Download PDF_4.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ద్రవ్యోల్బణం అనగానేమి

What are the Types of Inflation?

There are 4 Types of Inflation