Telugu govt jobs   »   Economy   »   ద్రవ్య వ్యవస్థ

ఎకానమీ స్టడీ మెటీరియల్ – ద్రవ్య వ్యవస్థ, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

ద్రవ్య వ్యవస్థ

ద్రవ్య వ్యవస్థ ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహం ప్రాధాన్యాన్ని మానవ శరీరంలో రక్త ప్రవాహంతో పోల్చవచ్చు. దేశ ఆర్థిక విధానాలను లోతుగా చేసుకోవడంలో ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రధానపాత్ర పోషిస్తాయి

ద్రవ్యం – నిర్వచనం ద్రవ్యాన్ని నిపుణులు ప్రజల భావాలకు అనుగుణంగా వివిధ కోణాల్లో నిర్వచించారు.

 • ‘ప్రజలంతా దేన్ని ‘ద్రవ్యం’ అని సార్వత్రికంగా అంగీకరిస్తే అదే ద్రవ్యం – సెలిగ్ మన్
 • వినిమయ సాధనంగా ప్రజలంతా భావించేదే ద్రవ్యం – క్రౌధర్
 • ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభ్యమయ్యే మొత్తమే ద్రవ్యం – రాడ్క్లిఫ్ కమిటీ

ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువుని బట్టి రెండు రకాలు. అవి

1. లోహపు ద్రవ్యం

2. కాగితపు ద్రవ్యం

చట్టబద్ధమైన ఆమోదం కోణంలో రెండు రకాలు.

1. అపరిమిత

2. పరిమిత

ప్రజల ద్రవ్యత్వాభిరుచి(లిక్విడిటీ ప్రిఫరెన్స్)కి అనుగుణంగా చూస్తే

1. సామాన్య ద్రవ్యం,

2. సమీప అని రెండు రకాలు.

విశదీకరణ లోహపు ద్రవ్యం: ద్రవ్యం తయారీలో లోహాలు (బంగారం, వెండి, నికెల్) దాన్ని లోహపు ద్రవ్యం అంటారు. ఇందులో 3 అంశాలుంటాయి.

i) ప్రమాణ ద్రవ్యం: ఒక నాణెం తయారీకి ఉపయోగించే లోహం విలువ దాని ముఖవిలువకు సమానంగా ఉంటే దాన్ని ప్రమాణ ద్రవ్యం అంటారు. ఉదా: 5 రూపాయల నాణెం తయారీకి 5 రూపాయల విలువ ఉన్న వెండి వాడటం.

ii) చిహ్న ద్రవ్యం: నాణెం తయారీకి ఉపయోగించే విలువ కంటే దాని చెలామణి విలువ ఎక్కువ ఉండటం.

iii) ప్రతినిధి ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా ద్రవ్యంగా ముద్రించి వాడటం. ఈ విధానంలో ద్రవ్యం జారీ చేసే అధికారుల దగ్గర ద్రవ్యానికి సమానమైన బంగారం, వెండి నిల్వలుంటాయి.

ఎకానమీ స్టడీ మెటీరియల్ - ద్రవ్య వ్యవస్థ, డౌన్‌లోడ్ PDF_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

ద్రవ్య భావనలు

M1, M2. M 3 ,M 4 అనే నాలుగు రకాల ద్రవ్య భావనలను భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 1977 లో ప్రవేశపెట్టింది

 1. M1నీ సంకుచిత ద్రవ్యం, M3 ని విశాల ద్రవ్యం అంటారు.
 2. M 1 ,M 3 పరిమాణాలను రిజర్వు ద్రవ్యం లేదా హైపర్ ద్రవ్యం నిర్ణయిస్తుంది.
 3. M1 నుంచి M4 కు ద్రవ్యత్వం తగ్గుతూ వస్తుంది.

ప్రస్తుత ద్రవ్య వ్యవస్థను పరివర్తనలేని కాగితపు ప్రమాణంగా వర్ణించవచ్చు. భారత ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్ రూపాయి. రూపాయితోపాటు రూ.10, 20, 50, 100, 500, విలువ ఉన్న కాగితపు ద్రవ్య యూనిట్లు ఉంటాయి.

ఈ ద్రవ్య వ్యవస్థ 1957 ” జనవరి నుంచి వాడుకలో ఉంది. భారతదేశ కాయినేజ్ (సవరణ) చట్టం – 1955 ద్వారా నూతన దశాంశ(డెసీమల్) వ్యవస్థను ప్రవేశపెట్టారు.

నాణేలు, ఆర్బీఐ నోట్లు

భారతదేశ కేంద్ర ప్రభుత్వ విత్త మంత్రిత్వ శాఖ ఒక రూపాయి నోట్లను; ఒక రూపాయి, 50పైసల నాణేలతో సహా అన్ని నాణేలను ముద్రిస్తుంది.2011 జూన్ నుంచి 25 పైసలు అంతకంటే తక్కువ విలువ ఉన్న నాణేలను తొలగించారు.భారతదేశంలో కరెన్సీను ముద్రించే గుత్తాధిపత్య హక్కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఉంది.

ఆర్థిక సర్వే మరియు బడ్జెట్‌ను ఎలా చదవాలి?

భారత్లో ద్రవ్య సరఫరా

ఒక దేశంలో ప్రజల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ఉండే ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ లావాదేవీలు జరపడానికి, రుణాలను చెల్లించడానికి వినియోగించే మొత్తం మాత్రమే ‘ద్రవ్య సరఫరా’ పరిధిలోకి వస్తుంది. ద్రవ్య సమష్టిలు (మానిటరీ అగ్రిగేట్స్) / ద్రవ్య కొలమానాలు కింది విధంగా ఉన్నాయి.

i) మొదటి రకం ద్రవ్యం లేదా సంకుచితమైన ద్రవ్యం (M1)

 • ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు (C).
 • బ్యాంకుల డిమాండ్ డిపాజిట్లు (DD)
 • కేంద్ర బ్యాంకు ఇతర డిపాజిట్లు (OD)
 • M1= C + DD + OD.

ii) రెండోరకం ద్రవ్యం (M2) M1సహా తపాలా కార్యాలయాల వద్ద ఉండే పొదుపు డిపాజిట్లు.

iii) మూడోరకం ద్రవ్యం (M3) లేదా విశాల ద్రవ్యం

 • M1 సహా బ్యాంకుల వద్ద ఉన్న కాలపరిమితి డిపాజిట్లు (TD)
 • M3 = M1 +TD

iv) నాలుగోరకం ద్రవ్యం (M4)

M1 సహా అన్ని రకాల తపాలా కార్యాలయాల డిపాజిట్లు , తపాలా కార్యాలయాలకు చెందిన గణాంకాలను రిజర్వు బ్యాంకు తాజాగా సంకలనం చేయడం లేదు కాబట్టి M2,M4 భావనలు అర్థరహితంగా మారాయి.

వై.వి.రెడ్డి (1998) మూడో వర్కింగ్ గ్రూపు నూతన ద్రవ్య, ద్రవ్యత్వ కొలమానాలు ఈ వర్కింగ్ గ్రూపు నాలుగు ద్రవ్య సమస్టీలను పునర్ నిర్వచించింది. సవరించిన ద్రవ్య సప్లయి నిర్వచనం ప్రకారం M0 (రిజర్వ్ ద్రవ్యం), M1 (సంకుచిత ద్రవ్యం), M2, M3, (విశాల ద్రవ్యం)లను మాత్రమే లెక్కిస్తారు. రిజర్వు లేదా హైపవర్ ద్రవ్యం (M): ద్రవ్య సప్లయిని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైంది. దీన్ని ప్రభుత్వ ద్రవ్యంగా భావించవచ్చు. దీన్ని మూలాధార ద్రవ్యం లేదా హైపవర్ ద్రవ్యం అంటారు.

 • M₂ =C +OD + CR
 • C = ప్రజల దగ్గర చెలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ
 • OD = ప్రజలు రిజర్వు బ్యాంకులో పెట్టుకున్న ఇతర డిపాజిట్లు
 • CR = వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు
 • M0 కు M1 కు సంబంధం ఉంది.
 • M1 = C+ OD + DD
 • బ్యాంకింగ్ వ్యవస్థ సృష్టించే మొత్తం డిపాజిట్ నిర్మాణానికి నగదు నిల్వలు (CR) మూలాధారంగా ఉంటాయి.

TSPSC మరియు APPSC పరీక్షల కోసం ఎకానమీని ఎలా చదవాలి?

ద్రవ్య గుణకం

ఒక ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైంది రిజర్వు ద్రవ్యం, ద్రవ్య సప్లయి రిజర్వు ద్రవ్యానికి మధ్య ఉండే నిష్పత్తిని ద్రవ్య గుణకం తెలియజేస్తుంది.

 • సంకుచిత ద్రవ్య గుణకం m1= M1/Mo
 • విశాల ద్రవ్య గుణకం m3= M3/Mo

RBI కరెన్సీ నిర్వహణ వ్యవస్థ అంటే ఏమిటి?

 • RBI, కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరిపి, ఒక సంవత్సరంలో డినామినేషన్ వారీగా అవసరమయ్యే బ్యాంకు నోట్ల పరిమాణాన్ని అంచనా వేస్తుంది మరియు వాటి సరఫరా కోసం వివిధ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లతో ఇండెంట్లను ఉంచుతుంది.
 • భారతదేశానికి చెందిన రెండు కరెన్సీ నోట్ ప్రింటింగ్ ప్రెస్‌లు (నాసిక్ మరియు దేవాస్) భారత ప్రభుత్వానికి చెందినవి; మరో రెండు (మైసూర్ మరియు సల్బోని) RBI తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్ (BRBNML) ద్వారా స్వంతం చేసుకున్నాయి.
 • చెలామణి నుండి తిరిగి స్వీకరించబడిన నోట్లు పరిశీలించబడతాయి, ఆ తర్వాత చెలామణికి సరిపోయేవి మళ్లీ విడుదల చేయబడతాయి, అయితే మురికి మరియు చిరిగిపోయిన నోట్లు నాశనం చేయబడతాయి.

Economy Study Material – Monetary System, Download PDF

ఎకానమీ స్టడీ మెటీరియల్ - ద్రవ్య వ్యవస్థ, డౌన్‌లోడ్ PDF_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ద్రవ్యం యొక్క 3 ప్రధాన విధులు ఏమిటి?

ద్రవ్యం యొక్క 3 ప్రధాన విధులు మార్పిడి మాధ్యమం, ఖాతా యూనిట్ మరియు విలువ నిల్వ.

ద్రవ్య వ్యవస్థ అంటే ఏమిటి?

ద్రవ్య వ్యవస్థ అనేది దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం మరియు ఫైనాన్స్‌ను నియంత్రించే నియమాలు, సంస్థలు మరియు విధానాల ఫ్రేమ్‌వర్క్‌ను సూచిస్తుంది. దేశ ఆర్థిక విధానాలను మరింత లోతుగా చేయడంలో ద్రవ్య వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది

Download your free content now!

Congratulations!

ఎకానమీ స్టడీ మెటీరియల్ - ద్రవ్య వ్యవస్థ, డౌన్‌లోడ్ PDF_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

ఎకానమీ స్టడీ మెటీరియల్ - ద్రవ్య వ్యవస్థ, డౌన్‌లోడ్ PDF_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.