Telugu govt jobs   »   Study Material   »   Indian Economy in Medieval period

మధ్య యుగ భారత ఆర్థిక వ్యవస్థ, డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్ స్టడీ నోట్స్

మధ్య యుగ భారత ఆర్థిక వ్యవస్థ

మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ: మధ్యయుగ కాలంలో, ప్రజల జీవనోపాధి వివిధ వృత్తిపరమైన కళలు, వ్యవసాయం, వాణిజ్యం మరియు వాణిజ్యం, చేతివృత్తుల చేతివృత్తులు మరియు మొదలైనవి సుస్థిర జీవన విధానాలు. ఈ కార్యకలాపాలు కాలక్రమేణా మారాయి. రాష్ట్రం తమ పాలనను నిలబెట్టుకోవడానికి వారి ఉత్పత్తి మరియు వనరుల ఆధారంగా ప్రజలపై పన్నులు విధించింది. మధ్యయుగ భారతదేశంలో, జనాభాలో అత్యధికులు రైతులు. మధ్యయుగ భారతదేశ ఆర్థిక చరిత్రలో అవి అత్యంత ముఖ్యమైన భాగం. మెజారిటీ రైతుల సాధారణ పేరు రాయత్. ఈ వ్యాసంలో మేము మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి వివరాలను అందిస్తున్నాము. మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి మరింత తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.

మధ్య యుగ భారత ఆర్థిక వ్యవస్థ  పరిచయం

చారిత్రక సంఘటనల క్రమం ఆధారంగా చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి

1) ప్రాచీన యుగం (క్రీ.శ. 8వ శతాబ్దం పూర్వం )
2) మధ్య యుగం
3) ఆధునిక యుగం ( క్రీ.శ. 18వ శతాబ్దం తర్వాత నుంచి ఇప్పటి వరకు )

భారతదేశ చరిత్రలో క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. ఈ కాలంలో వివిధ రాజులు పరిపాలించారు ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు, ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తులు పరిపాలించగా, దక్షిణ భారతదేశాన్ని చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు పరిపాలించారు. మొగల్ చక్రవర్తులకు సమకాలీనంగా దక్షిణ భారతదేశంలో శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించాడు.

మధ్యయుగ ప్రధాన లక్షణం భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజం. భారతదేశంలో ఆర్.ఎస్. శర్మ అనే చరిత్రకారుడు తొలిసారిగా ఫ్యూడలిజం లేదా భూస్వామ్య వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించాడు. హర్బన్స్ ముఖియా దాన్ని స్వేచ్ఛా రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటే, ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రకారుడు ‘మధ్యయుగ ఆర్థికవ్యవస్థ’ అనే పద ప్రయోగమే ఉత్తమం అని పేర్కొన్నాడు. రాజులు తమ ఉద్యోగులకు జీతాలను నగదు రూపంలో కాకుండా భూమి, జాగీర్ల రూపంలో ఇవ్వడం వల్లే క్రీ.శ. 7వ శతాబ్దంలో భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. వాస్తవానికి భూస్వామ్య వ్యవస్థకు పునాది గుప్త యుగంలోనే పడింది. భూమిని పొందిన వ్యక్తులు ఆ భూములను కౌలుకు ఇవ్వడం ద్వారా కౌలు రైతులు, బానిసలు, అర్ధబానిసలు పుట్టుకొచ్చారు.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

రాజపుత్ర యుగం

రాజపుత్ర యుగంనాటి ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవడానికి ఆల్బెరూని రచించిన కితాబ్-ఉల్-హింద్ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యుగంలోనే భూస్వామ్య ప్రభువులు వచ్చారు. వారిని సామంతులని, రాణాలని పిలిచేవారు. రాజు తన ఉద్యోగులకు ఇచ్చే భూమిని భోగ లేదా జమీ అనేవారు. వ్యవసాయం ద్వారా వచ్చే మిగులును ప్రత్యక్ష పాత్రలేని వ్యక్తులు హరించే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది.

భూస్వామ్య ప్రభువుల విధానాల కారణంగా ‘కనీసపు పంటలు’ మేలని రైతులు భావించారు. అదనపు పంటలు లేకపోవడం, అంతర్గత అస్థిరత రాజ్యాల మధ్య నిరంతర పోరాటాల వల్ల వాణిజ్యం తగ్గి, నాణేల చెలామణి కూడా తగ్గిపోయింది. అరబ్ యాత్రికుల రచనల ప్రకారం రాజపుత్ర యుగంలో చైనా కంటే భారతదేశంలో పట్టణాల సంఖ్య తక్కువగా ఉంది. పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలతో వ్యాపారం చేసేవారు. పర్షియన్ గల్ఫ్ లోని సిరాజ్ రేవు పట్టణం వ్యాపారానికి ఆయువుపట్టుగా ఉండేది.

వాణిజ్యం 

భారతదేశానికి కర్పూరం, దంతం, కాగితం, వజ్రాలు, గంధపు చెక్క లాంటివి దిగుమతి అయ్యేవి. ఇక్కడి నుంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మందులు, ఆభరణాలు ఎగుమతి అయ్యేవి. పశ్చిమ దేశాలకు సుగంధ ద్రవ్యాలు, ఆగ్నేయాసియాకు మందులు, చైనాకు ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేవారు. తూర్పు కోస్తాలో లభించే బుఖారిమ్స్ అనే వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేదని మార్కోపోలో రాశాడు. మధ్యయుగంలో అరబ్బులు నౌకా వాణిజ్యంలో ముందంజ వేశారు. అరబ్బులతో వ్యాపారం వల్ల రాష్ట్రకూట రాజ్యం ఐశ్వర్యవంతమైంది. రాష్ట్రకూటుల కాలంలో వంశపారంపర్య అధికారులను నాల్గవుండులు లేదా దేశాగ్రముక్తాలు అనేవారు. వీరి నుంచే దేశముఖు, దేశ్పాండేలు ఆవిర్భవించారు.

మహ్మదీయ దండయాత్రల వల్ల ముఖ్యంగా గజనీ మహమ్మద్ దండయాత్రతో భారత ఆర్థిక వ్యవస్థలో క్షీణ లక్షణాలు ప్రారంభమయ్యాయి. గజనీ తన దాడుల ద్వారా దేశసంపదను నాశనం చేశాడని అతడితో వచ్చిన అల్బెరూని పేర్కొన్నాడు. అల్బెరూని తన కితాబ్-ఉల్- హింద్ గ్రంథంలో నాటి ఆర్థిక అంశాలను ప్రస్తావించాడు. భూమిశిస్తు పంటలో 1/6వ వంతుగా ఉండేదని, బ్రాహ్మణులకు తప్ప మరెవ్వరికీ పన్ను మినహాయింపు లేదని రాశాడు. కానీ భూస్వామ్య ప్రభువులు రైతులను పీడించే విధానాల గురించి తన రచనల్లో ప్రస్తావించలేదు.

ఢిల్లీ సుల్తానుల యుగం

క్రీ.శ. 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని  అయిదు రాజ్యవంశాలు పరిపాలించాయి. ఈ కాలంలో భూమిశిస్తు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రైతులను దోపిడీ చేసి, అపారమైన నిధులను సమీకరించడం ఢిల్లీ సుల్తానుల ఆర్థిక పాలనలో ముఖ్య లక్షణం. సుల్తానుల కాలంలో భూములను మూడు ప్రధానమైన రకాలుగా వర్గీకరించారు. అవి:

  • ఇక్తా భూములు.
  • ఖలీసా భూములు
  • మదద్-ఇ-మాష్ లేదా సమూర్ఫర్ భూములు

ఇక్తా భూమిపై వచ్చే ఆదాయాన్ని కులీన వర్గాలకు, అధికారులకు కేటాయించేవారు. సుల్తాన్ సొంత భూమిని ఖలీసా భూమి అనేవారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కవులు, పండితులు, కళాకారులు, మత సంబంధ వ్యక్తులకు ఇచ్చే భూములను మదద్-ఇ-మాష్ భూములు అనేవారు. జమ అంటే ప్రతి ప్రాంతం చెల్లించే భూమి శిస్తు అంచనా. ఈ జమను సుల్తానులే తయారు చేయించేవారు.

పన్నులు

  • అల్లావుద్దీన్ ఖిల్జీ నగదు రూపంలో జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టి, తరువాత ఆ పద్ధతిని రద్దు చేశాడు. భూదానాలను రద్దు చేసి వాటిని ఖలీసా భూములుగా మార్చాడు. శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించే ఏర్పాట్లు చేశాడు. కానీ అతడి కాలంలోనే భూమి శిస్తు 1/3వ వంతు నుంచి 1/2వ వంతుకు పెరిగింది.
  • ప్రాచీన కాలంలో 1/6వ వంతు భూమిశిస్తు ఉండేది. ఇది మధ్య యుగంలో 1/3వ వంతుకు చేరింది. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బీన్ తుగ్లక్ లాంటివారు దాన్ని 1/2వ వంతుకు పెంచేశారు. హిందువులపై అత్యధిక పన్నులు విధించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ.
  • ఢిల్లీ సుల్తానులు కత్, జిజియా, ఖరాజ్, థామ్స్ అనే నాలుగు ప్రధాన పన్నులనే వసూలను చేసేవారు. ముస్లిం ఆస్తులు, భూములపై విధించే పన్ను జకత్. ముస్లిమేతరుల నుంచి వసూలు చేసే పన్ను జిజియా.
  • అన్ని వర్గాల వారి నుంచి వసూలు చేసే భూమి పన్ను భారజ్/ ఖరాజ్. యుద్ధ సమయంలో కొల్లగొట్టిన ధనంలో వాటాను భామ్స్ అనేవారు. ఇది సైనికులకు 1/5వ వంతు, రాజ్యానికి 4/5వ వంతు లభించేది. ప్రభుత్వానికి అధిక ఆదాయం ఖరాజ్ నుంచి వచ్చేది. తర్వాత కాలంలో ఉషర్, ష్రబ్ అనే నీటి పన్నులను కూడా వసూలు చేశారు. గనుల మీద, గుప్త సంపదల మీద 1/5వ వంతు పన్ను విధించేవారు.

పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు

సమకాలీన చరిత్రకారులైన ఇబన్ బటూటా, ఇసామీ, బరానీ లాంటివారు అప్పటి ఆర్థిక వ్యవస్థను గురించి వివరించారు. మహ్మబ్బీన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా భారత్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, రహదారులు, ప్రజల జీవన పరిస్థితుల గురించి వివరించారు

  • తూర్పు ఇస్లాం రాజ్యాల్లో ఢిల్లీని మించిన పట్టణం లేదని పేర్కొన్నాడు. కందెన, విల్లు, రాట్నం లాంటి నేతకార్మికుల పరికరాలను తురుష్కులు భారతదేశంలో ప్రవేశ పెట్టారు. గుజరాత్, బెంగాల్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. తురుష్కులు భారత్లో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేశారు.
  • బెంగాల్ లో ముడిపట్టును ఉత్పత్తి చేసినప్పటికీ ఇరాక్, అఫ్గనిస్థాన్ నుంచి ముడిపట్టు దిగుమతి చేసుకునేవారు. భవన నిర్మాణ కార్యక్రమంలో సున్నాన్ని సిమెంట్ వాడటం, వాల్టెడ్ రూఫింగ్ లాంటి పద్ధతులను ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని భవన నిర్మాణ మేస్త్రీలు, రాళ్లు కొట్టేవారు (శిల్పులు) ఎంతో నైపుణ్యం ఉన్నవారని అమీర్ ఖుస్రూ పేర్కొన్నారు
  • తీర ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మార్వాడీలు వ్యాపార ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ముస్లిం మతంలోని బోహ్రాశాఖ వ్యాపారంలో అధికంగా పాల్గొనేది. పశ్చిమాసియా, మధ్యాసియా దేశాలకు జరిగే వ్యాపారం హిందూ వర్గమైన ముల్తానీల అధీనంలో ఉండేది. ముల్తానీలు చాలా ధనవంతులని బరానీ పేర్కొన్నాడు. నాటి బానిస వ్యవస్థ గురించి, వారి వలసల గురించి ఇసామీ వివరించారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధార వృత్తులు అభివృద్ధి చెందాయి. ఆహార, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. గ్రామ పెద్ద ముఖద్దమ్, చిన్న చిన్న భూస్వాముల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండేవి. నీరు అధికంగా లభించే ప్రాంతాల్లో మూడు పంటలను కూడా పండించేవారని ఇబన్ బటూటా పేర్కొన్నారు
  • అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు అమలు చేశాడు. దివాన్-ఇ-రియాసత్ అనే మార్కెట్ శాఖను, షహనా-ఇ-మండి అనే ఉన్నతాధికారిని నియమించాడు. ఇతడి మార్కెట్ సంస్కరణలు దేశమంతా ఉన్నాయని జియా ఉద్దీన్ బరాని పేర్కొన్నాడు. కానీ సైనిక పటాలాలున్న ప్రాంతాల్లోనే అమలయ్యాయని అనేకమంది చరిత్రకారులు పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందిలో
  • అవినీతిని నిర్మూలించడానికి దివాన్-ఇ-మస్తక్ రాజ్ అనే శాఖను అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేశాడు.
  • బెంగాల్ నుంచి మేలురకం బియ్యాన్ని మలబార్, గుజరాత్ లకు సరఫరా చేసేవారు. అవధ్, కారా, అలహాబాద్ ప్రాంతాల్లో గోధుమలు అధికంగా పండేవి. అడవులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్.
  • వ్యవసాయాభివృద్ధికి అనేక నీటి పారుదల కాలువల్ని తవ్వించిన ఫిరోజా తుగ్లక్ రైతు బాంధవుడిగా పేరుపొందాడు. దివాన్-ఇ-ఖైరత్ అనే సంక్షేమ శాఖను, దివాన్-ఇ-బందగాని అనే బానిస శాఖను ఫిరోజే తుగ్లక్ ఏర్పాటు చేశాడు.
  • దివాన్-ఇ-కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను మహ్మబ్బిన్ తుగ్లక్ ప్రారంభించాడు. ఢిల్లీ సుల్తానులు అనేక రకాల నాణేలను చలామణిలోకి తెచ్చారు. టంకా అనే వెండి నాణెం, జటాల్ అనే రాగినాణేలను ఇల్ టుట్ మిష్/ ఇల్తమష్ ప్రవేశపెట్టాడు. ప్రిన్స్ ఆఫ్ మనీయర్ (కరెన్సీ యువరాజు) గా పేరొందిన మహ్మబ్బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని, బిరంజ్ అనే నాణేలను ముద్రించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ అదా, బిఖ్ అనే నాణేలను ప్రవేశపెట్టాడు. సుల్తాన్ కిరీటంలోని ప్రతి ముత్యం పేద రైతులు కన్నీటి నుంచి ఘనీభవించిందే’ అని అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు.

Indian Economy Complete study material in Telugu

న్యాయపాలన

  • కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల్లో అప్పటి న్యాయపాలన గురించిన అంశాలు ఉన్నాయి. రాజే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. న్యాయపాలనలో మహామాత్రులు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు.
  • జిల్లా స్థాయిలో న్యాయపాలన కోసం ‘రజ్ఞుకలను నియమించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పెద్దలు తీర్పులు ఇచ్చేవారు. మౌర్యులకాలంలో సివిల్, క్రిమినల్ వివాదాలను పరిష్కరించేందుకు వేర్వేరు న్యాయస్థానాలు ఉండేవి. సివిల్ న్యాయస్థానాలను ‘ధర్మశీయ’, క్రిమినల్ న్యాయ స్థానాలను ‘కంఠక శోధన’ అని పిలిచేవారు. సివిల్ న్యాయమూర్తులను వ్యవహారిక క్రిమినల్ న్యాయమూర్తులను ‘ప్రదేష్ట’ అనేవారు. మౌర్యుల కాలంలో శిక్షాస్మృతి కఠినంగా ఉండేదని వి.ఎ.స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.

వాణిజ్యం

  • గుజరాత్లోని కాంబే నూలు వస్త్రాలు, నాణ్యత, చౌక ధరలకు ప్రసిద్ధి చెందింది. మలబార్ ప్రాంతం కూడా నూలు వస్త్రాలకు ప్రఖ్యాతిగాంచింది. బంజారా తెగవారు సరకులను వివిధ ప్రాంతాలకు రవాణా చేసేవారు.
  • వస్త్రాలు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, ధాన్యం, చక్కెర ప్రధాన ఎగుమతులు, గుర్రాలు, ఎండు పండ్లు, ఉప్పు, రాగి లాంటివి నాటి భారత ప్రధాన దిగుమతులు. కుతుబుద్దీన్ ఐబక్ 1/10వ వంతు శిస్తు వసూలు చేసేవాడు. మహ్మద్ బిన్ తుగ్లక్, ఘరి అనే ఇంటి పన్నును, చరి/చరాయి అనే (పచ్చిక బయళ్లపై) పన్ను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో సెరికల్చర్ను తురుష్కులు అభి వృద్ధి చేశారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో గుర్రాలపై ‘అడ్వాబ్స్’ అనే పన్నును విధించేవారు.

చోళ యుగం

దక్షిణ భారతదేశంలో చోళులు వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమ రంగాల అభివృద్ధికి కృషి చేశారు. వీరు తంజావూరును రాజధానిగా చేసుకుని పాలించారు. స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరుగాంచారు. అప్పటి ధనవంతులైన భూస్వాములను మువ్వెంద వేలన్, అరయ్యార్ అని పిలిచేవారు. అనేక వర్గాలవారికి భూములను దానం చేశారు.

బ్రాహ్మణులకు దానం చేసిన భూములను బ్రహ్మదేయ, బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమిని వెల్లన్ వాగై దేవాలయాలకు ఇచ్చిన భూములను దేవమేయ / దేవాదాన / తిరునాముత్తక్కని, పాఠశాలలకు ఇచ్చిన భూమిని శాలభోగ, జైన సంస్థలకు ఇచ్చిన భూమిని పళ్లిచ్చందం అని పేర్కొనేవారు. అప్పటి గ్రామీణ జీవితం గురించి పెరియపురాణ గ్రంథం వివరిస్తోంది.

మధ్యయుగ ఆర్ధిక వ్యవస్థలోని ముఖ్యాంశాలు

  • అయిన్-ఈ-అక్బరి(Ain-i-Akbari) పుస్తకాన్ని రాసింది అబుల్ ఫజల్కా
  • లువల తవ్వకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది ఫిరోజ్ షా తుగ్లక్
  • రైతులపై వేసే శిస్తు మూడు రకాలుగా వుండేది.
  • బతాయి (Batai)- మొత్తం పంటలో కొంత భాగాన్ని శిస్తుగా చెల్లించడం
  • కంకుట్ (Kankut)- రైతుకు ఉన్న భూమి ఆధారంగా శిస్తు వసూలు చేస్తారు.
  • జల్త్(zabt)- పంట దిగుబడిని బట్టి చెల్లించే శిస్తు
  • అక్బర్ కాలంలో రాజ్యాన్ని రైతుల నుండి శిస్తు వసూలు చేయడానికి దస్తూర్ (Dastur)లుగా విభజించారు.
  • పోలాజ్ (Polaj) అంటే రెండు పంటలు పండే సారవంతమైన భూమి
  • బంజర్ (Banjar) అంటే బీడు భూమి.
  • మొగలుల కాలంలో ముకద్దం (Muqaddam) అంటే గ్రామ పెద్ద
  • జమీందారి వ్యవస్థ మొగలుల కాలంలో వుండేది.
  • గోన్నా (మధ్యప్రదేశ్), బోకా (చతీసడ్) వజ్రాల గనులకు ప్రసిది.
  • ఖేత్రి (రాజస్తాన్) రాగి గనులకు ప్రసిద్ధి
  • బిద్రి రాగి మరియు జింక్ ల మిశ్రమం
  • గన్ పౌడర్, ఫిరంగులను భారతదేశంలోకి తీసుకువచ్చింది బాబర్
  • తారిఖ్-ఇ-ఫిరోజాహీ ను రచించింది జియావుద్దీన్ బరని
  • టంకా అనేది వెండి నాణెం
  • జితల్, డాంగ్, డామ్ లు రాగి నాణేలు
  • రూపాయ అనే వెండి నాణేన్ని ప్రవేశపెట్టింది షేర్ షా సూరి
  • అక్బర్ కాలంలో ఒక్క కా 40 డామ్ లకు సమానం
  • అమిల్ – పరగణా స్థాయిలో శిస్తు వసూలు చేసే అధికారి
  • అమీన్ – భూమిని శిస్తుకొరకు సర్వే చేసే అధికారి
  • హిందువులపై జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ – ఫిరోజ్ షా తుగ్లక్
  • రాగి నాణేలకు బదులు బంగారు, వెండి నాణేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది మహ్మద్ బిన్ తుగ్లక్
  • షేర్ షా సూరి కాలంలో పంటలో మూడవ వంతు భాగాన్ని శిస్తుగా చెల్లించేవారు.
  • ప్రిన్సు అఫ్ మనీయర్స్ గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ – మహ్మద్ బిన్ తుగ్లక్
  •  బందోబస్త్ అనే శాస్త్రీయ శిస్తు వ్యవస్థను ప్రవేశపెట్టింది అక్బర్.

మధ్య యుగ భారత ఆర్థిక వ్యవస్థ, డౌన్లోడ్ PDF

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

భారతదేశ మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ ఏమిటి?

మధ్యయుగ యుగంలో, ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగించడానికి వివిధ వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు ఇతర అభ్యాసాలను అనుసరించేవారు.

మధ్యయుగ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది?

మధ్యయుగ కాలంలో ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది

మధ్యయుగ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?

ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ లేదా భూస్వామ్యత అని కూడా పిలుస్తారు

మధ్యయుగ భారతదేశంలో ప్రధాన వాణిజ్యం ఏమిటి?

సిల్క్ రూట్ మరియు స్పైస్ రూట్ మధ్యయుగ కాలంలో రెండు ప్రధాన వాణిజ్య మార్గాలు.