Telugu govt jobs   »   Economics study material పారిశ్రామిక రంగం

Economics Study Material in Telugu | పారిశ్రామిక రంగం | For APPSC, TSPSC Group1,2,3, SSC, SI and Constable

Economy Study Material in Telugu: Overview

Economy Study Material in Telugu : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ఆర్ధిక శాస్త్రం పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో ఆర్ధిక శాస్త్రం విభాగం లో కొన్ని అంశాలను ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ఆర్ధిక శాస్త్రం ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా  ఆర్ధిక శాస్త్రం లో ఉన్న ప్రతి అంశాలను మేము మీకు అందిస్తాము.

 

Economy Study Material in Telugu :  పారిశ్రామిక రంగం

పరిశ్రమ (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతా.

ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు అతిముఖ్యపాత్ర వహిస్తాయి.

Economy Study Material in Telugu: ప్రభుత్వ రంగం-నిర్వచనం

ఏ సంస్థ మూలధనంలోనైనా ప్రభుత్వానికి 51% లేదా అంత కంటే ఎక్కువ వాటా ఉంటే దాన్ని ప్రభుత్వరంగ సంస్థగా భావిస్తారు.పారిశ్రామిక, వ్యవసాయ, విత్త, వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్య నిర్వహణను ప్రభుత్వరంగం అంటారు.

ప్రభుత్వ రంగం – ప్రాధాన్యం

1. పారిశ్రామిక పునాది

2. వనరుల సమీకరణ

3. అవస్థాపన

4. ఆర్థికస్థోమత కేంద్రీకరణ నివారణ

5. ప్రణాళికలకు తోడ్పాటు

6. సంతులిత ప్రాంతీయ వృద్ధి

7. ప్రజోపయోగ వస్తూత్పత్తి

8. సామ్యవాదరీతి సమాజ స్థాపన

9. ఉపాధి, పేదరికం నిర్మూలన

10. రక్షణ అవసరాలు

Economy Study Material in Telugu: ప్రభుత్వరంగ సంస్థల వర్గీకరణ

1. శాఖాపరమైన సంస్థలు (Departmental undertakings)

ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉంటాయి.

ఉదా: తంతితపాలా, రైల్వే

2. ప్రభుత్వ కార్పొరేషన్లు (Public Corporations)

ఇవి ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైనవి. వీటికి స్వయంప్రతిప్రత్తి ఉంటుంది.

ఉదా: ఎస్ఐసీ, ఎస్టీసీ, ఐవోసీ, ఎఫ్ సి ఐ

3. ప్రభుత్వ సంస్థలు (Government Organisations)

కంపెనీల చట్టం ద్వారా ఏర్పాటు అయ్యాయి.

ఉదా: హెచ్ఎమ్ఎ, హిందుస్థాన్ షిప్యర్డ్, బీఈఎల్

 

Economy Study Material in Telugu : ప్రభుత్వ రంగ సంస్థల ప్రగతి

1951లో 29 కోట్ల రూపాయల పెట్టుబడులతో 5 సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం 2010 నాటికి 5,79,320 కోట్ల రూపాయల పెట్టుబడులతో 249 సంస్థలు ఉన్నాయి.

ప్రభుత్వ రంగం -సమస్యలు

1. అధిక నష్టాలు

2. రాజకీయ జోక్యం

౩. సరైన ధరలు ఉండకపోవడం.

4. ఉత్పాదక శక్తిని వినియోగించకపోవడం

5. స్థల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం

6. ప్రాజెక్టు నిర్మాణంలో అతిజాప్యం

7. ఎక్కువ సిబ్బంది

8. అధిక పెట్టుబడులు

Economy Study Material in Telugu: ప్రభుత్వ సంస్థల రకాలు

1. నవరత్న

వీటిని 1997లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 17 సంస్థలు ఉన్నాయి.ఈ హోదా వల్ల 1000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. నిర్వహణ, విత్త స్వయం ప్రతిపత్తి ఉంటుంది.వరుసగా 3 సంవత్సరాల నుంచి లాభాలు పొందుతూ, ఒక సంవత్సరం 1000 కోట్లు లాభం పొందాలి. అలాంటి సంస్థలకు మాత్రమే నవరత్న హోదా కల్పిస్తారు.

2. మహారత్న (2009)

నవరత్న హోదా కలిగి, మూడేళ్లు లాభాలు పొందుతూ నికర లాభం 5000 కోట్ల రూపాయలుఉండాలి. నికర ఆస్తులు రూ.10 వేల కోట్లు (గతంలో 15 వేలు) ఉండి సంవత్సరం టర్నోవరు రూ.20,000 కోట్లు (రూ.25,000 కోట్లు) ఉండాలి. ఈ హోదా పొందిన సంస్థలు 5 వేల కోట్ల రూపాయల వరకు స్వయంగా పెట్టుబడులు పెట్టవచ్చు.

  • ప్రస్తుతం ఇవి 7  BHEL, GAIL, IOCL, CIL, ONGC, NTPC, SAILలు హోదా పొందాయి.

3. మినీరత్న హోదా (1997)

3 సంవత్సరాలు లాభాలు పొందుతూ 30 కోట్ల రూపాయల లాభాలు దాటితే మినీరత్న -I, 30 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉంటే మినీరత్న – II హోదా ఉంటుంది.అధిక నష్టాలు పొందే ప్రభుత్వరంగ సంస్థలు – Air India, MTNL, BSNL (2010 – 11) అధిక లాభాలు పొందే ప్రభుత్వరంగ సంస్థలు – ONGC, NTPC, IOCL (2010 – 11)మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని 1970లో రద్దు చేశారు మేనేజింగ్  ఏజెన్సీ పద్ధతిని 1970లో రద్దు చేశారు.

 

Economy Study Material PDF in Telugu : Conclusion

APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఎకానమీ విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.

Economy Study Material PDF in Telugu : FAQs

Q 1. Economy కోసం ఉత్తమమైన సమాచారం ఏమిటి?

జ. Adda247 అందించే Economy సమాచారం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో కూడా మీకు లభిస్తుంది.

Q 2. Economy కు సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

. ఆర్ధిక అంశాలకు సంబంధించిన ఇటివల సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి పరీక్షలోను తప్పనిసరిగా అడిగే కొన్ని అంశాలు, భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికలు, దేశంలో ఇప్పటికి వరకు జరిగిన వివిధ ఆర్ధిక సంస్కరణలు, నీతి ఆయోగ్, రాజ్యాంగంలో ఉన్న వివిధ ప్రభుత్వ ఆర్ధిక సంస్థల వివరాలు, జాతీయ ఆర్ధిక సర్వే యొక్క పుటం, రాష్ట్ర ఆర్ధిక సర్వే మరియు జాతీయ, రాష్ట్రీయ బడ్జెట్ పై పూర్తి అవగాహనా ఉండాలి.

 

IDBI Bank Executives Live Batch-For Details Click Here

Economics Study Material in Telugu | | For APPSC, TSPSC Group1,2,3, SSC, SI and Constable |_40.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Economics Study Material in Telugu | | For APPSC, TSPSC Group1,2,3, SSC, SI and Constable |_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Economics Study Material in Telugu | | For APPSC, TSPSC Group1,2,3, SSC, SI and Constable |_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.