Telugu govt jobs   »   Economy Article | Economic Reforms in...

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు

Economy Study Material PDF in Telugu – Overview

Economy Study Material PDF in Telugu : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ఆర్ధిక శాస్త్రం పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో ఆర్ధిక శాస్త్రం విభాగం లో కొన్ని అంశాలను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ఆర్ధిక శాస్త్రం ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా  ఆర్ధిక శాస్త్రం లో ఉన్న ప్రతి అంశాలను pdf రూపంలో మేము మీకు అందిస్తాము.

Economics | ఆర్ధిక సంస్కరణలు

×
×

Download your free content now!

Download success!

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు |_50.1

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Economy Study Material PDF in Telugu-

ఆర్ధిక సంస్కరణలు అంటే ఏమిటి ?

ఒక దేశం నిర్ణయించుకున్న లక్ష్యాల సాధనకు ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా తన ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావడాన్ని ఆర్థిక సంస్కరణలు అంటారు.

దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకువచ్చినప్పుడు సహజంగానే అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్లే ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో మార్పులను ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా ప్రవేశపెడుతుంది. ఆ మార్పుల సమాహా రాన్ని ఆర్థిక సంస్కరణలుగా పేర్కొనవచ్చు.

భారతదేశంలో ఆర్థిక సరళీకరణ అనగా 24 జూలై 1991 నుండి అమలు చేసిన/చేస్తూ ఉన్న/చేయబోతున్న ఆర్థిక సంస్కరణలు. 1947లో స్వతంత్ర ప్రాప్తి అనంతరం భారత్ సోషలిస్టు విధానాలనే అవలంబించింది. 1966 లో మొదటి సారి,1985 లో రెండవ సారి సరళీకరణ ప్రయత్నాలు జరిగాయి.

భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ, ప్రపంచ దేశాలతో పోటీపడేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులే ఆర్థిక సంస్కరణలు.

వీటినే సరళీకృత ఆర్థిక విధానాలు అని కూడా అంటారు.

Economy Study Material PDF in Telugu-

భారత్లో ఆర్ధిక సంస్కరణల అమలుకు కారణాలు

1. పంచవర్ష ప్రణాళికల్లోనూ, పారిశ్రామిక విధానాల్లోనూ ప్రభుత్వరంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ చాలా వరకు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ఆర్ధిక వ్యవస్థకి గుదిబండలా తయారయ్యాయి.

ఉదాహరణకు 1951 – 52లో రూ.29 కోట్లతో 5 సంస్థలు ఉండేవి. అవి 1991 – 92 నాటికి 237 సంస్థలతో రూ.118 వేల కోట్లకు చేరాయి.

2. పారిశ్రామిక లైసెన్స్ నియంత్రణ విధానాలు లైసెన్స్ రాజ్ వ్యవస్థ వల్ల ప్రైవేటు సంస్థలు పరిశ్రమల్ని ఏర్పరచడంలో కష్టాలు ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఆర్థికాభివృద్ధిలో పూర్తి స్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పొందలేకపోయాం.

3. ప్రైవేట్ రంగంపై నియంత్రణలు ఉండటం

4. విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు వుండడం వల్ల విదేశీ సంస్థల నుండి దేశంలోకి పెట్టుబడులు రాక పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు లేకుండా పోయాయి.

5. పారిశ్రామిక వృద్ధి తక్కువగా ఉండటం (1%)

6. అధిక ద్రవ్యోల్బణం (1990 – 91లో 16%)

7. అత్యధిక కోశ లోటు ఉండటం (1990 – 91లో 6.6%)

 

1991లో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించే నాటికి గత ప్రభు త్వాలు అవలంబించిన విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని సకారా త్మక (పాజిటివ్),నకారాత్మక (నెగిటివ్) ఫలితాలు సంభవించాయి. అయితే ఆయా విధానాల కారణంగా ఎక్కువగా నకారా త్మక ఫలితాలే వచ్చాయి.

ఆర్థిక సంస్కరణలను ఆరంభించడానికి ప్రధాన కారణం

విదేశీ చెల్లింపుల శేషంలో భారీ సంక్షోభం/ లోటు రావడం (BOP లోటు) వల్ల అవసరమైన దిగుమతులకు డబ్బులు చెల్లించరాని పరిస్థితి ఏర్పడింది.

దీనికి కారణాలు:

 •  కోశ లోటు భర్తీకి విదేశీ రుణాలు ఎక్కువగా స్వీకరించడం.
 • దిగుమతులు విపరీతంగా పెరగడం
 • ఎగుమతుల వృద్ధి లేకపోవడం.

దీని ఫలితంగా నాటి భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ను సహాయం అడిగింది. దీనికి ప్రతిగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఆర్థిక వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకురావాలని సూచించింది

Economy Study Material PDF in Telugu-

ఆర్థిక సంస్కరణల లక్ష్యాలు
1. ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం.
2. పారిశ్రామిక రంగంలో పోటీతత్వాన్ని పెంచడం.
3. కోశ లోటును తగ్గించడం.
4. పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించడం.
5. ప్రభుత్వ రంగ సామర్థ్యాన్ని పెంచడం.
6. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం.
7. విదేశీ చెల్లింపుల లోటును తగ్గించడం.
8. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
9. ఉపాధి అవకాశాలను పెంచి తద్వారా సంపూర్ణోద్యోగితను సాధించడం.

ఆర్థిక సంస్కరణలను మూడు రూపాల్లో అమలుచేశారు. అవి.

1. సరళీకరణ (Liberalisation)

2. ప్రైవేటీకరణ (Privatisation)

3. ప్రపంచీకరణ (Globalization)

వీటినే సంయుక్తంగా LPG నమూనా లేదా ఆర్థిక సంస్కరణలు అంటారు. ఇప్పుడు వాటిగురించి వివరంగా తెలుసుకుందాము.

1. సరళీకరణ

ప్రభుత్వం గత సాంఘిక, ఆర్థిక విధానాల్లో ఉన్న నిబంధనలు, నియంత్రణలను సడలించడాన్ని సరళీకరణ అంటారు.

 •  సరళీకరణలో భాగంగా వివిధ దేశాల మధ్య వస్తుసేవల ఎగుమతులు, దిగుమతులపై ఉన్న నిబంధనలు, నియంత్రణలు, సబ్సిడీలను ప్రభుత్వం తొలగిస్తుంది.
 • ఈ సరళీకరణ విధానాలను 1991 జులై 24న ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా అమలు చేశారు.
 •  భారత్లో 1991 తీర్మానం ద్వారా లైసెన్సింగ్ విధానం, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి, ప్రభుత్వరంగ ప్రాధాన్యం, MRTP చట్టం మొదలైన అంశాల్లో ఉన్న నిబంధనలను చాలా తగ్గించి సరళీకరించారు.
 • ప్రభుత్వ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు.

2. ప్రైవేటీకరణ

ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థల ఆస్తులతోపాటు యాజమాన్య నిర్వహణను ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తారు.

 • ప్రైవేటు రంగ పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణలపై విధించిన ఆంక్షలను తొలగించడం.
 • ప్రభుత్వ సంస్థల్లో కొంత భాగం లేదా మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తారు.
 • 1980లో మార్గరెట్ థాచర్ మొదటగా ఇంగ్లండ్లో ప్రైవేటీకరణను ఆరంభించారు.
 • ఆర్థిక కార్యకాలపాల్లో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించి, ప్రైవేటు రంగ పాత్రను పెంచడం

భారత్ – ప్రైవేటీకరణ పరిణామ క్రమం

 • నిజానికి దేశంలో ప్రైవేటీకరణ 1991 కి ముందే 1980 రాజీవ్ గాంధీ కాలంలో ప్రారంభమైంది.
 • పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రప్రభుత్వం 1993లో రంగరాజన్ కమిటీనినియమించింది. పెట్టుబడుల ఉపసంహరణపై 1996లో రామకృష్ణ కమిషన్ నియామకం.
 • 2005, ఏప్రిల్ 1న జాతీయ పెట్టుబడుల నిధి ప్రారంభం.

ప్రైవేటీకరణ వల్ల లాభాలు:

 • సంస్థల నిర్వహణలో సమర్థత పెరుగుతుంది
 •  ప్రజలకి సరైన సేవల లభ్యత
 • ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ జోక్యం తగ్గి, వ్యవహారాల్లో స్వతంత్రత పెడుగుతుంది
 • క్యాపిటల్ మార్కెట్కు అనుగుణంగా ప్రైవేట్ రంగం కార్యాచరణను చేపడుతుంది
 • ప్రణాళికాబద్ధ నిర్వహణ

ప్రైవేటీకరణలో లోపాలు

 • ప్రజలకి అందే సేవలు, వస్తువుల ధరలు పెరుగుతాయి
 • ప్రణాళికాయుతంగా పెట్టుబడుల ఉపసంహరణ జరగకపోవడం.
 • పీఎసీయూ వాటాలకు అల్ప ధరలు నిర్ణయించడం.
 • లాభాల్లో ఉన్న పీఎస్ఓయూలను ప్రైవేటీకరించడం.

3. ప్రపంచీకరణ

ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య అడ్డంకులు లేకుండా వస్తుసేవలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, శ్రామికులు స్వేచ్ఛగా కొనసాగడాన్ని ప్రపంచీకరణ అంటారు.

 • ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది.
 • ఇది ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మారుస్తుంది.
 • ప్రపంచీకరణలోని ప్రధాన అంశాలు
 • వస్తుసేవలు
 • పెట్టుబడులు
 •  శ్రామికులు
 •  సాంకేతిక పరిజ్ఞానం

ప్రపంచీకరణ – లాభాలు

 • వెనకబడిన దేశాల్లో మూలధన విస్తరణ.
 • వెనకబడిన దేశాల్లో ఉత్పత్తులు, వస్తు నైపుణ్యాలు పెరుగుతాయి.
 • జాతీయాదాయంలో విదేశీ వ్యాపారం వాటా పెరుగుతుంది. *
 • మార్కెట్ల విస్తరణ తోపాటు ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుంది.
 • దేశాల ఆధునికీకరణ సాధ్యమవుతుంది.
 • ఆర్థిక సంస్కరణలు – లక్ష్యాలు
 • ప్రభుత్వ పరిధి తగ్గించడం
 • లైసెన్సులను ఎత్తివేయడం
 • విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం
 • కోశలోటు తగ్గింపు
 • కోటాలు, దిగుమతి సుంకాల ఎత్తివేత

Economy Study Material PDF in Telugu-

వ్యవస్థీకృత సంస్కరణలు
మన దేశంలో ఆర్థిక సంస్కరణలను వ్యవస్థీ కృత సంస్కరణల్లో భాగంగా నాలుగు రకాలుగా అమలుచేశారు. అవి..
1) వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు.
2) పారిశ్రామిక నియంత్రణలను తొలగించడం.
3) పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు
4) ద్రవ్య రంగంలో సంస్కరణలు

 కోశ విధానం, ద్రవ్య విధానం

 • దీనిలో భాగంగా ప్రభుత్వ వ్యయాన్ని, సబ్సిడీలను తగ్గిస్తారు.
 • పన్ను రాబడి పెంపు మార్గాలపై 1991లో రాజా చెల్లయ్య కమిటీని ఏర్పాటు చేశారు.
 • కోశ లోటును తగ్గించడానికి 2003లో FRBM చట్టాన్ని తీసుకువచ్చారు
 • ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడానికి 2000 సంవత్సరంలో గీతాకృష్ణన్ కమిషన్ను నియమించారు.
 • ద్రవ్యోల్బణం, వ్యాపార చెల్లింపుల లోటును తగ్గించేలా ద్రవ్య విధాన రూపకల్పన.

ప్రభుత్వరంగ విధానం

 •  ప్రభుత్వరంగ పాత్రను తగ్గించడం.
 • ప్రైవేటీకరణ అమలు
 • పెట్టుబడుల ఉపసంహరణ, నష్టాల్లో ఉన్న సంస్థల నిర్వహణకు ఒప్పందాలు (MoU)చేసుకోవడం.

విదేశీ రంగం

 • విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం.
 • దిగుమతి సుంకాలను తగ్గించడం.
 • విదేశీ మారకం రేటులో ద్వంద్వ వినిమయ రేటును ప్రవేశపెట్టడం.
 • ద్వంద్వ వినిమయ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ఇది మార్కెట్ నిర్ణయాలకు అనుగుణంగా రూపాయిని మార్పిడి చేసుకోవడానికి (రూపాయి పాక్షిక మార్పిడికి అవకాశం) వీలు కల్పిస్తుంది.
 • దీనికోసం ప్రభుత్వం స్వేచ్ఛా మారక వినిమయ రేటు నిర్వహణ పద్ధతి (LERMS)ని 1992 – 93లో ప్రవేశపెట్టింది.
 • 1993 – 94లో వర్తక (ట్రేడ్ అకౌంట్)లో రూపాయి పూర్తి మార్పిడికి అవకాశం కల్పించింది. ప్రస్తుత ఖాతా (కరెంట్ అకౌంట్)పై 1994 ఆగస్టులో అవకాశం కల్పించారు.
 • మూలధన ఖాతాలో రూపాయి పూర్తి మార్పిడికి 1977లో తారాపూర్ కమిటీని ఏర్పాటు చేశారు.
 •  1991లో రూపాయి విలువను తగ్గించారు (మూల్యహీనీకరణ). ఆంక్షలు, సుంకాలను తగ్గించారు.

వాణిజ్య, పారిశ్రామిక రంగం

 • నూతన పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్ల పరిమితిని కుదించారు.
 • MRTP (1969) చట్టం రద్దు, పోటీ చట్టం (2002) ఏర్పాటు చేశారు. * 2000 ఏప్రిల్ 1 నుంచి పరిమాణాత్మక నిబంధనలను సవరించి వాణిజ్య సంస్కరణలను ప్రవేశపెట్టారు.
 • 1973లో FERA ను రద్దుచేసి 1999లో FEMA ను ఆమోదించారు. ఈ చట్టం 2002 నుంచి అమల్లోకి వచ్చింది.

 బ్యాంకింగ్ రంగం

 • 1991లో బ్యాంకింగ్ రంగంపై నియమించిన నరసింహం కమిటీ సిఫారసులను అమలు చేశారు. దీనిలో భాగంగా సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్అను తగ్గించారు
 • ప్రైవేట్ బ్యాంకులకు ఆహ్వానం
 • బ్యాంకుల కంప్యూటరీకరణ
 • 2002లో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ARC)ని ఏర్పాటు చేశారు.

ఇటీవలి సంస్కరణలు

ఆర్థిక సంస్కరణలు శ్రామిక, వ్య విస్తరించాయి. రాష్ట్రాలు కూడా సంస్కరణలు తీసుకొస్తున్నాయి

అనుకూల అంశాలు

 • ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతుంది.
 • విదేశీ పెట్టుబడులు, వ్యాపారం పెరిగాయి.
 • సమాచార, సాంకేతిక రంగం అభివృద్ధి చెందాయి.
 • సేవారంగం వృద్ధి చెందింది.
 • ప్రభుత్వరంగ సంస్థల్లో సమర్థత పెరిగింది.

ప్రతికూల అంశాలు

 • ఉపాధి అవకాశాల లభ్యత తగ్గింది. ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.
 • నిరుద్యోగిత పెరిగింది.
 • వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైంది.

Economy Study Material PDF in Telugu : Conclusion

APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఎకానమీ విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.

Economy Study Material PDF in Telugu : FAQs

Q 1. Economy కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?

జ. Adda247 అందించే Economy PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో కూడా మీకు లభిస్తుంది.

Q 2. Economy కు సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు |_60.1

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు |_70.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు |_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Economy Article | Economic Reforms in Telugu | ఆర్ధిక సంస్కరణలు |_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.