Daily Current Affairs in Telugu | 25 May 2021 Important Current Affairs in Telugu

Table of Contents

Toggle

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం,ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్,చంద్రునిపై నీటిని శోధించడానికి నాసా తన మొదటి మొబైల్ రోబోట్,అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ వంటి ముఖ్యమైన అంశాలను  TSPSC & APPSC గ్రూప్-1,2,3 మరియు 4 అలాగే SI మరియు కానిస్టేబుల్ మరియు ఇతర అన్ని పోటి  పరిక్షలకు ఉపయోగపడే విధంగా సమకాలిన అంశాలను దిగువ పేర్కొనడం జరిగింది. మీరు ఈ అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా అన్ని పోటీ పరీక్షలలోని కరెంట్ అఫైర్స్  అంశాలను చాలా సులువుగా సాధించగలరు.

 

అంతర్జాతీయ అంశాలు

1. ’Global Pandemic Radar’ ప్రణాళికను ప్రారంభించిన UK

కోవిడ్ -19 వేరియంట్లు మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాధులను గుర్తించడానికి యునైటెడ్ కింగ్‌డమ్ ఒక ఆధునిక అంతర్జాతీయ వ్యాధికారక నిఘా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ గ్లోబల్ పాండమిక్ రాడార్ కొత్త వేరియంట్లు  మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాధికారక క్రిములను ముందుగానే గుర్తించేలా చేస్తుంది, కాబట్టి వాటిని ఆపడానికి అవసరమైన టీకాలు మరియు చికిత్సలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇటలీ మరియు యూరోపియన్ యూనియన్ (ఇయు) నిర్వహించిన గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ముందు, ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ ప్రణాళికలను ప్రకటించారు.

రాడార్ గురించి:

  • రాడార్, 2021 చివరికి ముందే నిఘా కేంద్రాల నెట్‌వర్క్‌తో పూర్తిగా నడుస్తుందని, వచ్చే ఏడాదిలో ప్రపంచ ఆరోగ్య భద్రతను గణనీయంగా మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • కొత్త కరోనావైరస్ వేరియంట్లను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు సమాచారాన్ని  పంచుకోవడం ద్వారా  జనాభాలో వ్యాక్సిన్ నిరోధకతను పర్యవేక్షించడం కోసం కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి గ్లోబల్ హెల్త్ ఛారిటీ ది వెల్కమ్ ట్రస్ట్ మద్దతుతో ఏర్పాటుచేసే  ఒక నిర్వాహణ సంస్థకు  WHO నాయకత్వం వహిస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • యుకె ప్రధాన మంత్రి: – బోరిస్ జాన్సన్;
  • యుకె కాపిటల్: లండన్.

 

2. ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని మాగ్డలీన్ కళాశాలలో భారత సంతతికి చెందిన హ్యూమన్ సైన్సెస్ విధ్యార్ధిని, విద్యార్థి యూనియన్ (ఎస్.యు) ఉప ఎన్నిక ముగింపులో విజేతగా ప్రకటించబడింది. ఆక్స్ ఫర్డ్ ఎస్.యులో జాతి అవగాహన మరియు సమానత్వం (క్యంపైన్ ఫర్ రేషియల్ అవార్నేస్ అండ్ ఈక్వాలిటీ- సిఆర్ఎఇ)కి  కో-చైర్ మరియు ఆక్స్ ఫర్డ్ ఇండియా సొసైటీకి  అధ్యక్షురాలు అన్వీ భూటాన్. ఇదే ఆమె విజయానికి కారణం అయ్యింది. 2021-22 విద్యా సంవత్సరానికి  ఉప ఎన్నికల పోటిలో గెలిచారు.

 

3. ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది

అంతర్జాతీయ ద్రవ్య నిధి 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది, ఇది 2021 చివరి నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మరియు 2022 సగానికి కనీసం 60 శాతం కవర్ చేస్తుంది. వ్యాక్సినేషన్ లక్ష్యానికి కోవాక్స్ కు అదనపు ముందస్తు గ్రాంట్ లు మరియు పూర్తయిన వ్యాక్సిన్లు, వాక్సిన్ అదనపు మోతాదులు ,ముడిపదార్థాల తరలింపులకు ఏ ఇబ్బందులు లేకుండాచూడాలి అని సూచించింది.

ఇప్పుడు బలమైన మరియు సమన్వయ చర్యతో మరియు స్వల్ప ప్రయోజనాలతో ఋణ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రపంచం ఈ అరుదైన ఆరోగ్య మరియు ఆర్థిక సంక్షోభమును ఎదుర్కొనగలదు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జి 20 ఆరోగ్య శిఖరాగ్ర సమావేశంలో తన ప్రసంగంలో చెప్పారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్, డి.సి యు.ఎస్.
  • ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఛైర్మన్: క్రిస్టినా జార్జివా.
  • ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్: గీతా గోపీనాథ్.

 

వార్తల్లోని రాష్ట్రాలు

 

4.ఇంటివద్దనే COVID రోగులకు చికిత్స చేయడానికి ‘సంజీవని పరియోజన’ పధకాన్ని ప్రారంభించిన హర్యానా రాష్ట్రం

హర్యానా ప్రభుత్వం కోవిడ్ ను ఎదుర్కోవడానికి  “సంజీవని పరియోజన” ను ప్రారంభించింది, ఇది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తేలికపాటి మరియు మితమైన కోవిడ్ -19 లక్షణాలు కలిగిన  ప్రజలకు ఇంటి వద్దనే పర్యవేక్షించే విధంగా  మరియు శీఘ్ర వైద్య సంరక్షణను అందిస్తుంది. కోవిడ్ -19 యొక్క రెండవ తాకిడి  మరియు సంబంధిత చికిత్స గురించి అవగాహన తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సంరక్షణను విస్తరించడానికి ఈ పరియోజన ప్రారంభించబడింది.

ఈ కార్యక్రమం కింద:

  • అర్హతగల వైద్యులను దాటి  వైద్య సలహా యొక్క పరిధి విస్తరించబడుతుంది, ఎందుకంటే దీనిలో  200 మంది  ఫైనల్ ఇయర్ మరియు ప్రీ-ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థులు మరియు ఇంటర్న్‌లను కన్సల్టెంట్స్ మరియు నిపుణులతో కలపడం ద్వారా సమీకరిస్తారు.
  • అంబులెన్స్ ట్రాకింగ్, ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ పడకల లభ్యత వంటి క్లిష్టమైన వనరులను నిర్వహించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ కార్యక్రమం  కలిగి ఉంటుంది.
    అందువల్ల, ఇది మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అన్ని కోణాలలో దృష్టి పెట్టడం ద్వారా  జిల్లా పరిపాలనకు సహాయపడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • హర్యానా రాజధాని: చండీఘర్
  • హర్యానా గవర్నర్: సత్యదేవ్ నారాయణ్ ఆర్య.
  • హర్యానా ముఖ్యమంత్రి: మనోహర్ లాల్ ఖత్తర్.

 

5. కరోనా కారణంగా అనాథలైన పిల్లల కోసం ఉత్తరాఖండ్ సిఎం వత్సల్య యోజన పదకాన్ని ప్రకటించారు

కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల కోసం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి వత్సల్య యోజనను ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్ర భుత్వం వారికి  21 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నిర్వహాన , విద్య , శిక్షణ మరియు ఉపాధి కోసం ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలోని ఇటువంటి అనాథ పిల్లలకు నెలకు 3000 రూపాయల నిర్వహణ భత్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ అనాథల పితృస్వామ్య ఆస్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయనుంది, దీనిలో వారు పెద్ద అయ్యేంత వరకు వారి పితృఆస్తిని విక్రయించే హక్కు ఎవ్వరికి ఉండదు. ఈ బాధ్యత సంబంధిత జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ పై ఉంటుంది. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి: తిరత్ సింగ్ రావత్;
  • ఉత్తరాఖండ్ గవర్నర్: బేబీ రాణి మౌర్య.

 

6. మమహారాష్ట్ర ప్రభుత్వం “మిషన్ ఆక్సిజన్ స్వావలంబన”పథకాన్ని ప్రారంభించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి “మిషన్ ఆక్సిజన్ స్వావలంబన” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1300 మెట్రిక్ మీటర్లుగా ఉంది . విదర్భ, మరాఠ్వాడా, ధులే, నందూర్ బార్, రత్నగిరి మరియు సింధుదుర్గ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యూనిట్లకు వాటి అర్హతను బట్టి  స్థిర మూలధన పెట్టుబడులలో 150 శాతం వరకు ప్రోత్సాహకాలకు పొందేందుకు అర్హత ఉంది మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన యూనిట్లకు  100 శాతం వరకు సాధారణ ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత ఉంది.

రూ.50 కోట్ల వరకు స్థిర మూలధన పెట్టుబడితో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ లకు స్థూల ఎస్ జిఎస్ టి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సుంకం మరియు విద్యుత్ వ్యయం యూనిట్ సబ్సిడీపై ప్రభుత్వం ఐదేళ్లపాటు తిరిగి చెల్లించనున్నాయి . జూన్ ౩౦ కి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ విధానం యొక్క ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రోత్సాహకాలతో, మహారాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ త్వరలో ఆక్సిజన్ స్వావలంబన రాష్ట్రంగా మారడానికి మరియు తయారీ, నిల్వలను పెంచడానికి బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
  • మహారాష్ట్ర రాజధాని: ముంబై.
  • మహారాష్ట్ర సిఎం: ఉద్ధవ్ థాకరే.

 

సైన్సు & టెక్నాలజీ

 

7. అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ అంటార్కిటికా నుండి వేరుపడిందని  ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి  ధృవీకరించింది. A-67 గా పిలువబడే మంచుకొండ 4320 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉంది, ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులలో పరిమాణంలో  సగం పరిమాణం ఉంటుంది . 400,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు ఫలక  అయిన రోన్నే మంచు ఫలక నుండి వేలు ఆకారపు మంచుకొండ విరిగిపడింది.

ఈ చిత్రాలను కోపర్నికస్ సెంటినెల్ -1 ఉపగ్రహం చిత్రీకరించినది. కోపర్నికస్ సెంటినెల్ వ్యోమనౌక, కమాండ్ లింక్‌లో కమ్యూనికేషన్ భద్రతను అమలు చేసిన మొదటి ESA ఎర్త్ అబ్జర్వేషన్ అంతరిక్ష నౌక.

 

8. చంద్రునిపై నీటిని శోధించడానికి నాసా తన మొదటి మొబైల్ రోబోట్ ను పంపనుంది

యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చంద్రునిపై నీరు మరియు ఇతర వనరులని శోధించడానికి. యుఎస్ ఏజెన్సీ, దాని ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా, చంద్రుని ఉపరితలంపై మరియు దిగువున ఉన్నమంచు మరియు ఇతర వనరుల కోసం 2023 చివరికి  చంద్రునిపైకి తన మొదటి మొబైల్ రోబోట్ ను పంపాలని యోచిస్తోంది. (వోలటైల్స్ ఇన్వేస్తిగేటింగ్ పోలార్ యక్స్ ప్లోరేషన్ రోవర్- వైపర్) చంద్రుని దక్షిణ ధృవం వద్ద వనరులను నాసా మ్యాప్ చేయడానికి సహాయపడే డేటాను సేకరిస్తాయి ఇది  భవిష్యత్తు లో చంద్రుని మీద మానవులు పంట పండించి  నివాసం ఏర్పరచుకోవడానికి ఉపయోగ పడుతుంది.

వైపర్ గురించి:

  • వైపర్ నుండి అందుకున్న డేటా చంద్రునిపై ఖచ్చితమైన ప్రదేశాలు మరియు మంచు సాంద్రతలను నిర్ణయించడంలో మన శాస్త్రవేత్తలకు ఉపయోగ పడనుంది. మరియు ఆర్టెమిస్ వ్యోమగాములను తయారు  చేయడంలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద పర్యావరణం మరియు సంభావ్య వనరులు తెలుసుకోడానికి సహాయపడుతుంది.
  • వైపర్ సౌర శక్తిపై నడుస్తుంది. చంద్రుని దక్షిణ ధృవం వద్ద కాంతి మరియు చీకటిలో విపరీతమైన గాలులకి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
  • ఏజెన్సీ యొక్క కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సి.ఎల్. పి.ఎస్) కార్యక్రమం లో భాగంగా వైపర్ యొక్క ప్రయోగం, రవాణా మరియు చంద్రఉపరితలానికి చేరవేయడం  కోసం నాసా ఆస్ట్రోబోటిక్ కు భాద్యతని అప్పగించింది

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • 14వ నాసా అడ్మినిస్ట్రేటర్: బిల్ నెల్సన్;
  • నాసా ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డి.C., యునైటెడ్ స్టేట్స్;
  • నాసా స్థాపించబడింది: 1 అక్టోబర్ 1958.

 

ముఖ్యమైన తేదీలు

9. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని 25 మే న జరుపుకుంటారు

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 25 న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. WTD యొక్క ముఖ్య ఉద్దేశ్యం, థైరాయిడ్ యొక్క ప్రాముఖ్యత మరియు థైరాయిడ్ వ్యాధుల నివారణ మరియు చికిత్స గురించి తెలుసుకోవడం. ఈ రోజును  2008 లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ (ETA) మరియు అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ (ATA) నేతృత్వంలోని ప్రచారంలో భాగంగా  థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు  మరియు వారికి చికిత్స చేసే వైద్యులను దృష్టిలో ఉంచుకొని , అమెరికన్ థైరాయిడ్ సొసైటీ (LATS) మరియు ఆసియా ఓషియానియా థైరాయిడ్ అసోసియేషన్ (AOTA) జ్ఞాపకార్థం ఈరోజును పాటించడం జరిగింది.

థైరాయిడ్ అంటే ఏమిటి?

థైరాయిడ్ అనేది  గొంతులో సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి, ఇది టి 3 (థైరాక్సిన్) మరియు టి 4 (ట్రైయోడోథైరోనిన్) హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్) థైరాయిడ్ గ్రంధిని నియంత్రిస్తుంది . ఇది శరీరం యొక్క జీవక్రియను నియంత్రిస్తుంది మరియు ఇందులో అసాధారణ నెలకొన్నపుడు  శరీర వ్యవస్థలు సరిగా పనిచేయక పోవచ్చు .

థైరాయిడ్ హార్మోన్ తగ్గడం కారణంగా  హైపోథైరాయిడిజం (ఆకస్మిక బరువు పెరుగుట) వస్తుంది  మరియు థైరాయిడ్ హార్మోన్ పెరుగుదల హైపర్ థైరాయిడిజానికి కారణమవుతుంది. ఆహారంలో సరైన మోతాదులో అయోడిన్ ఉండేలా చూసుకోవడం మరియు ముడి గోయిట్రోజనిక్ కూరగాయల వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా  థైరాయిడ్ వ్యాధులను నివారించవచ్చు.

 

10.అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే

 

అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25 న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. నేరానికి గురై బాధింపబడి ఇంటికి చేరుకున్న పిల్లలను మరియు ఇంకా తప్పిపోయిన  వారిని వెతకడానికి  జరుగుతున్న గాలింపు చర్యలకు గుర్తుగా  ఈ రోజును  పాటిస్తారు. మే 25ను  ఇప్పుడు మిస్సింగ్ చిల్డ్రన్స్ డే అని పిలుస్తారు, forget-me-not flower  దాని చిహ్నం.

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం గురించి:

ఈ రోజును 1983 లో యు.ఎస్. అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 2001 లో ప్రకటించారు. 25 మే మొదటిసారి అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే (IMCD) గా గుర్తించబడింది, యూరోపియన్ కమిషన్ సంయుక్త ప్రయత్నం ద్వారా తప్పిపోయిన యురోపియన్ పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ICMEC)కు గుర్తుగా దీనిని జరుపుకుంటారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ICMEC ప్రధాన కార్యాలయం: అలెగ్జాండ్రియా, వర్జీనియా, యుఎస్;
  • ఐసిఎంఇసి చైర్మన్: డాక్టర్ ఫ్రాంజ్ బి. హ్యూమర్.

 

11. భారత కామన్వెల్త్ దినోత్సవం: మే 24

కామన్వెల్త్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండవ సోమవారం నాడు  జరుపుకుంటాము . అయితే, భారతదేశంలో, మరో కామన్వెల్త్ దినోత్సవాన్ని కూడా మే 24 న జరుపుకుంటారు. ఎంపైర్ డే అని కూడా పిలువబడే ఈ కామన్వెల్త్ డే భారతదేశంతో పాటు బ్రిటన్ లోని ఇతర బ్రిటిష్ ఆక్రమిత సామ్రాజ్యాల ఏర్పాటును గుర్తుచేసుకోడానికి జరుపుకుంటారు.

ఈ సంవత్సరం కామన్వెల్త్ డే యొక్క ముఖ్య ఉద్దేశం: ఒక ఉమ్మడి భవిష్యత్తును అందించడం. వాతావరణ మార్పులను పరిష్కరించడం, సుపరిపాలనను ప్రోత్సహించడం, లింగ సమానత్వాన్ని సాధించడం వంటి ముఖ్యమన లక్ష్యాలను సాధించడంలో 54 కామన్వెల్త్ దేశాలు కలిసి ఎలా వీటిని ఎదుర్కుంటున్నాయో అని ప్రపంచానికి చాటిచెప్పడం.

ఈ రోజు యొక్క చరిత్ర:

1901 జనవరి 22న  విక్టోరియా రాణి మరణం తరువాత ఎంపైర్ డే ను మొదటిసారి జరుపుకున్నారు. రాణి పుట్టినరోజున 1902 మే 24న మొదటి సామ్రాజ్య దినోత్సవం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న అనేక పాఠశాలలు దీనిని వార్షిక కార్యక్రమం అని  అధికారికంగా గుర్తించక ముందే వేడుకలు జరుపుకున్నాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
  • మహారాష్ట్ర రాజధాని: ముంబై.
  • మహారాష్ట్ర సిఎం: ఉద్ధవ్ థాకరే.

 

మరణాలు

 

12. ’ఫాదర్ అఫ్ హైబ్రిడ్ రైస్’ గా పిలువబడే చైనాకు చెందిన యువాన్ లాంగ్పింగ్ మరణించారు

దేశంలో ధాన్యం ఉత్పత్తిని బాగా మెరుగుపరిచిన హైబ్రిడ్ బియ్యం జాతిని అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్, 91 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 1973 లో యువాన్ అధిక దిగుబడి కలిగిన హైబ్రిడ్ బియ్యం జాతిని పండించడంలో విజయవంతమయ్యారు. చైనా మరియు ఇతర దేశాలలో పెద్ద ఎత్తున కలిసి, దీనిని అభివృద్ధి చేసి  ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి కృషి చేసారు.

 

 

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

 

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

3 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

5 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

8 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

9 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

10 hours ago