AP Geography – Types of Soils in Andhra Pradesh, Download PDF | ఆంధ్రప్రదేశ్ లోని నేలల రకాలు

AP Geography – Types of Soils in Andhra Pradesh

The state of Andhra Pradesh in India contains different soils of a wide variety. soil is the basis for the prolific agriculture in Andhra Pradesh, which supports approximately 60% of the population in the state. Andhra Pradesh state is one of the foremost producers of a variety of agricultural products, including poultry, dairy, fruits, vegetables, grains, and cotton. there are different types of soils such as Red soil, Black soil, and Deltaic alluvial soils. Coastal alluvial soils and laterite soils.

Types of Soils in AP | ఆంధ్రప్రదేశ్‌ నేలలు 

ఆంధ్రప్రదేశ్‌లో నేలలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

1) ఎర్ర నేలలు

2) నల్లరేగడి నేలలు

3. ఒండ్రుమట్టి నేలలు

4) లాటరైట్‌ నేలలు

5) తీరప్రాంత ఇసుక నేలలు

Red Soils | ఎర్ర నేలలు

Red Soil

రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు.

  • ఇవి చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా;తూర్పుగోదావరి, కడప, కర్నూలు, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి తక్కువగా విస్తరించి ఉన్నాయి.
  •  ఇవి గ్రానైట్‌ రాళ్ల నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి.
  •  ఇవి తేలికైన నేలలు. తక్కువ బంకమన్నుతో ఉండి నీటిని గ్రహించే శక్తికి కలిగి ఉంటాయి.
  • నీటిలో కరిగే లవణాలు 0.26% మించవు. వృక్ష జంతు సంబంధిత పదార్థాలు లోపించి ఉంటాయి (హ్యూమస్).
  •  వేరుశనగ, ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ది.
  •  తరచుగా వర్షాలు, నీటి వనరులు ఉన్నవచోట్ల పత్తి, పొగాకు, వివిధ ఫల జాతులకు కూడా ఈ నేలలు అనువైనవి. ఎర్ర నేలల్లో జొన్న సజ్జ, వరి, చెరకు కూడా పండుతాయి.

Black Soil | నల్లరేగడి నేలలు

Black soil

ఇవి కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా; తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి తక్కువగా ఉన్నాయి.

  •  ఇనుప ఆక్సైడ్స్‌ నేలలో కరిగి ఉండటం వల్ల ఈ నేలలు నల్లగా ఉంటాయి.
  •  ఈ నేలల్లో పత్తి ఎక్కువగా పండటంతో వీటిని పత్తి నేలలు అని కూడా పిలుస్తారు.
  • వేసవిలో పెద్ద నెర్రలు పడి గట్టిగా ఉండే ఈ నేలలు వర్షం పడగానే మెత్తగా జిగటగా మారతాయి. దీనివల్ల దున్నడం కష్టమవుతుంది. అందుకే వీటిని తమను తామే దున్నుకునే నేలలు (Self Ploughing) అని అంటారు.

ఈ నేలల్లో ముఖ్యంగా పండే పంటలు: పత్తి, పొగాకు, మిరప, చెరకు, పసుపు, జొన్న, సజ్జ.

Alluvial soils | ఒండ్రు నేలలు

Alluvial Soils

ఈ నేలలు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటాయి. నదులు తీసుకువచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపితమవడం వల్ల ఈ ఒండ్రు నేలలు ఎర్పడ్డాయి.

  •  ఈ నేలలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ; కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి
  •  ఒండ్రు నేలల్లో పొటాషియం, సున్నపురాయి, భాస్వరం అధికంగా; నత్రజని, హ్యామస్‌లు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది.
  •  ఈ నేలల్లో వరి, చెరకు, పత్తి, పొగాకు, మొక్కజొన్న, పసుపు, అల్లం, మిరప, మామిడి, కొబ్బరి, సపోటా లాంటి అన్నిరకాల పంటలు పండుతాయి.

Laterite soils | లాటరైట్‌ నేలలు

Laterite soil

సాధారణంగా కొండలకు ఇరువైపులా అత్యధిక వర్షం ఉన్నచోట వర్షం లెని పర్వతాల వెనుక భాగాల్లో ఈ నేలలు ఏర్పడ్డాయి.

  •  అధిక వర్షపాతం, ఉష్ణోగ్రత ఉన్న ఆర్ద్ర , అనార్ద్ర శీతోష్ణస్టితిలో, అధికంగా సున్నం, సిలికా లాంటి మూలకాలు విక్షలాన చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడతాయి.
  •  ఉభయ గోదావరి; కృష్ణా జిల్లాల్లో మాత్రమే ఈ నేలలు ఉన్నాయి.
  •  ఈ నేలల్లో రబ్బరు, కొబ్బరి, మామిడి, జీడిమామిడిలాంటి తోట పంటలు పండుతాయి.
  •  లాటరైట్‌ నేలలకు మరొక పేరు జేగురు నేలలు
  •  ఈ నేలలు ఎరుపు, గోధుమ రంగులో ఉంటాయి.
  • లాటరైట్‌ నేలల్లో నత్రజని అధికంగా కారాలు తక్కువగా ఉంటాయి.
  •  ఈ మట్టిని భవనాల పెంకులు, ఇటుకల తయారీకి ఉపయోగిస్తారు.

Coastal sandy soils | తీర ప్రాంత ఇసుక నేలలు

Coastal Soil

శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా; చిత్తూరు జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి.

  •  ఈ నేలల్లో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడిమామిడి లాంటి పంటలు పండుతాయి.
  • మృత్తికా క్రమక్షయం (Soil Erosion): మృత్తికల సారవంతమైన పైపొర గాలులు, వర్షాల వల్ల కొట్టుకుపోవడాన్ని మృత్తికాక్రమక్షయం అంటారు.
  • మృత్తికా క్రమక్షయం వల్ల భూసారం తగ్గడం, నీటిపారుదల కాలువలు, నదీమార్గాలు

పూడుకుపోవడం; వరదలు వచ్చి పంటలు, ఆస్తి నష్టం లాంటివి సంభవిస్తాయి.

క్రమక్షయ నివారణ పద్దతులు:

  1. Contour Bunding (వాలు కట్టలు) నిర్మించాలి.
  2. సోపాన వ్యవసాయం చేయడం వల్ల క్రమక్షయాన్ని నివారించవచ్చు.
  3. కొండ వాలుల వద్ద మొక్కలు పెంచడం
  4. గడ్డిని పెంచడం
  5. చెట్లను నాటి అడవులను అభివృద్ధి చేయడం వల్ల క్రమక్షయాన్ని నివారించవచ్చు.

AP-Geography – Types of Soils in Andhra Pradesh PDF  

 

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

Which soil is highest in AP?

Red soil dominates Andhra Pradesh.

What are the 3 main types of soil?

There are three main categories of soil: sandy, clay or loam.

Which soil is 25 percent of AP?

Black soils cover nearly 25% of the land area.

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

14 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

16 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

16 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

18 hours ago