Table of Contents
Andhra Pradesh Geography PDF In Telugu(ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం PDF తెలుగులో)
APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ – నైసర్గిక స్వరూపం
ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా ౩ భాగాలుగా విభజించారు.
అవి:
I.పడమటి పీఠభూమి
II.తూర్పు కనుమలు
III. తీరమైదానాలు
I.పశ్చిమ/పడమటి పీఠభూమి
తూర్పు కనుమలకు పశ్చిమంగా సువిశాలమైన పశ్చిమ పీఠభూమి ఉంది.
- రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఇంచుమించు ఈ పీఠభూమిలోనే ఉన్నాయి. సగటున ఈ పీఠభూమి ఎత్తు సముద్ర మట్టానికి 150 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉంటుంది. ఈపీఠభూమి ఆదిలాబాద్‌లోని నిర్మల్ గుట్టల నుంచి దక్షిణాన అనంతపురంలోని మడకశిర గుట్టల వరకు వ్యాపించి ఉంది.
- ఈ పీఠభూమిలో తెలంగాణలోని పది జిల్లాలు విస్తరించి ఉండటం వల్ల దీనిని తెలంగాణ పీఠభూమి అని కూడా పిలుస్తారు.
- ఈ పీఠభూమిలో అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి.
- ఈ పీఠభూమి (పశ్చిమ) అగ్నిపర్వత సంబంధమైన ప్రాచీన కఠినశిలలతో నిర్మితమైంది.
- ఈ పీఠభూమి 4 రకాల శిలలతో ఏర్పడింది. అవి:
1 ధార్వార్ శిలలు
- కడప శిలలు
- కర్నూలు శిలలు
- రాజమండ్రి శిలలు
1.ధార్వార్ శిలలు:
- ఇవి అత్యంత ప్రాచీనమైన శిలలు. విలువైన ఖనిజాలకు ప్రసిద్ది చెందినవి.
- ఈ ప్రాంతంలో ముఖ్యంగా బంగారం (చిత్తూరు), అభ్రకం (నెల్లూరు) లభిస్తాయి.
- కర్ణాటకలో ని ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు ఈ శిలలు విస్తరించి ఉన్నాయి.
2.కడప శిలలు:
- క్రమక్షయ కారకాల వల్ల 50 కోట్ల సంవత్సరాల కిందట మిగిలిపోయిన ధార్వార్ శిలల అవశేషాలను ‘కడప శిలలు’ అంటారు.
- ఈ ప్రాంతం (ఈ శిలల్లో) ఆస్‌బెస్టాస్ (రాతి నార), మైకా, సున్నపురాయికి ప్రసిద్ధి.
3.కర్నూలు శిలలు:
ఇవి కర్నూలు ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. బైరటీస్ ఖనిజం ఈ శిలల్లో లబిస్తుంది.
4.రాజమండ్రి శిలలు:
సముద్రం ఉప్పొంగి ఈ శిలలు ఏర్పడ్డాయి. పెట్రోలియం, సహజ వాయువు,ఖనిజాలకు ప్రసిద్ధి.
- ఈ పీఠభూమి ఉపరితలం సమతలంగా కాకుండా ఎగుడు దిగుడు స్టలాకృతులను కలిగి అనేక లోయలు, గుట్టలు లాంటి నిర్మాణాలతో ఉంటుంది.
- ఈ పీఠభూముల ద్వారా ప్రయాణం చేసే గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి నదులు లోతైన గాడులను ఏర్పరిచాయి
- ఇది వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపునకు వాలి ఉంది.
- ఈ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఎర్రనేలలు ఆక్రమించాయి.
- దక్షిణ వాయవ్య ప్రాంతాల్లో నల్లరేగడి భూములు విస్తరించి ఉన్నాయి.
- లావా శిలల నుంచి నల్లరేగడి భూములు ఆవిర్భవించాయి. ఈ పీఠభూమిలో అనేక ఖనిజాలు లభిస్తున్నాయి. అవి:
బొగ్గు – తాండూరు, ఆదిలాబాద్, సింగరేణి, కొత్తగూడెం – తెలంగాణ రాష్ట్రం
ఇనుము – కడప, కర్నూలు, కృష్ణా
మాంగనీసు – శ్రీకాకుళం, విశాఖపట్నం
అభ్రకం – నెల్లూరు
రాగి – అగ్నిగుండాల (గుంటూరు)
ఆస్‌బెస్టాస్ – కడప, కర్నూలు
వజ్రాలు – అనంతపురం
Also Check: TSPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
II.తూర్పు కనుమలు
- తూర్పు కనుమలు తీర మైదానానికి, పడమటి పీఠభూమికి మధ్య ఉన్నాయి.
- ఇవి కొండల వరుసలతో ఉండి ఎక్కువగా స్థానికమైన తెంపులను కలిగి ఉన్నాయి. ఉత్తరాన శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో 70 కి.మీ. వెడల్పున వ్యాపించి; 1200 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి.
- శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని తూర్పు కనుమలు చార్నోకైట్, ఖోండాలైట్ అనే రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి.
- విశాఖపట్నం జిల్లాలోని బాలకొండల్లో ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టయిన ‘అరకు లోయ’ ఉంది.
- శ్రీకాకుళంలో తూర్పు కనుమలను మహేంద్ర గిరులు అని పిలుస్తారు.
- తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో పాపికొండలు ఉన్నాయి.
- తూర్పు కనుమలను స్టానికంగా వేర్వేరు పేర్లతో పిలుస్త
జిల్లా | తూర్పు కనుమలకు ఉన్న మరో పేరు |
శ్రీకాకుళం | మహేంద్ర గిరులు |
విశాఖప ట్నం | యారాడ కొండలు, అనంతగిరి కొండలు, డాల్ఫినోస్ కొండలు, బాల కొండలు, సింహాచలం కొండలు, చింతపల్లి కొండలు, పాడేరు కొండలు |
ఉభయ గోదావరి జిల్లాలు | పాపి కొండలు, ధూప కొండలు (వీటి సగటు ఎత్తు 915 మీ.) |
కృష్ణా జిల్లా | మొగల్రాజపురం, కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు |
గుంటూరు. | బెల్లంపల్లి కొండలు, నాగార్జునకొండ, వినుకొండ, కోటప్ప కొండ, గనికొండ,కొండవీడు కొండలు |
ప్రకాశం | మార్కాపురం, చీమకుర్తి కొండలు |
నెల్లూరు | వెలి కొండలు, గరుడాచలం కొండలు, పాల కొండలు, ఎర్రమల కొండలు |
కర్నూలు | నల్లమల కొండలు |
కడప | పాలకొండలు, వెలికొండలు |
చిత్తూరు | శేషాచల కొండలు (తిరుపతి), ఆవులపల్లి కొండలు, హార్‌స్‌లీ హిల్స్ (ఏనుగుయల్లంకొండలు) |
అనంతపురం | పెనుగొండ, మడకశిర, రామగిరి గుట్టలు |
- విజయవాడలోని సీతానగరం కొండలను చీల్చుకుని కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం వద్దే బ్రిటిషర్లు 1853లో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. దీని నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది.
- చిత్తూరు జిల్లాలో మదనపల్లి వద్ద హార్‌స్‌లీ హిల్స్ వేసవి విడిది కేంద్రం ఉంది.
- నల్లమల కొండల్లో కృష్ణా తీరంలో శ్రీశైలం ఉంది.
- చిత్తూరు జిల్లాలోని శేషాచల కొండల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం (తిరుపతి) ఉంది.
- విజయవాడ (కృష్ణా) – ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడి ఉంది.
- విశాఖపట్నం సింహాచల కొండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది.
- విశాఖపట్నం డాల్సినోస్‌పై 175 మీటర్ల ఎత్తులో లైట్‌హౌస్ ఉంది.
- తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి వద ఉన్న అరోమా శిఖరం. దీని ఎత్తు 1680 మీటర్లు
- రెండో ఎత్తయిన శిఖరం ఒడిశాలోని గంజాం జిల్లాలోని మహేంద్రగిరి శిఖరం. దీని ఎత్తు 1501 మీటర్లు
III. తీర మైదానాలు
ఇవి బంగాళాఖాతంలో తీరరేఖ, తూర్పు కనుమల మధ్య ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని పెన్నానది వరకు విస్తరించి ఉన్నాయి.(మహేంద్రగిరి నుంచి పులికాట్ వరకు).
- ఈ మైదానం కృష్ణా, గోదావరి నదుల మధ్య కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వెడల్పుతో విస్తరించి ఉంది. దీని వెడల్పు 160 కి.మీ. పైగా ఉంటుంది.
- ఒండ్రుమట్టితో ఏర్పడిన ఈ డెల్దాలు మిక్కిలి సారవంతమైనవి.
- తీరరేఖ మాదిరి తీర మైదానం కూడా 972 కి.మీ. పొడవున విస్తరించి ఉంది.
- ఈ మైదానం ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సన్నగా, మధ్యలో వెడల్పుగా ఉంటుంది.
కొల్లేరు సరస్సు
- కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రాంతమే కొల్లేరు సరస్సు.
- దీని వైశాల్యం 250 చ.కి.మీ.లు
- ఇది కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో అది పెద్ద మంచినీటి సరస్సు.
- కొల్లేరు సరస్సు సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చే పక్షుల (పెలికాన్స్ – గూడబాతుల)కు ప్రసిద్ధి.
- కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలను కొల్లేరు అభయారణ్యంగా, కొల్లేరు పక్షి సంరక్షణా కేంద్రంగా పిలుస్తారు.
- కొల్లేరు సరస్సులో కలిసే నదులు రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు.
- కొల్లేరు సరస్సును, బంగాళాఖాతాన్ని కలిపే నది – ఉప్పుటేరు
- బుడమేరును ఆంధ్ర దుఃఖదాయినిగా పిలుస్తారు.
- కొల్లేరు సరస్సుపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ – అజీజ్ కమిటీ
Also Read: TS కానిస్టేబుల్ పరిక్ష విధానం
పులికాట్ సరస్సు
- నెల్లూరు (ap), తమిళనాడు మధ్యలో పులికాట్ సరస్సు ఉంది.
- ఈ సరస్సు వైశాల్యం 460 చ.కి.మీ.
- ఇది ఒక లాగూన్ సరస్సు.
- సముద్ర జలాలు భూభాగంలోకి చొచ్చుకు వచ్చి సరస్సుగా ఏర్పడటాన్ని లాగూన్ అంటారు.
- ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద సరస్సు.
- పులికాట్ ప్రధానంగా ఉప్పునీటి సరస్సు
- ఈ సరస్సులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది.
- ఈ సరస్సు సమీపంలోనే శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉంది. (రాకెట్ లాంచింగ్‌షన్)
రామ్‌సార్ ఒప్పందం
- 1971లో ఇరాన్‌లోని రామ్‌సార్ అనే ప్రాంతంలో చిత్తడి ప్రదేశాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దీన్నే రామ్‌సార్ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన ఏకైక చిత్తడి ప్రదేశం కొల్లేరు సరస్సు.
మరిన్ని ముఖ్యాంశాలు:
- విశాఖ ఓడరేవును సముద్రపు అలల తాకిడి నుంచి కాపాడుతున్న కొండలు డాల్ఫిన్‌నోస్
- కృష్ణానదికి ఉత్తరంగా విస్తరించి ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులని, దక్షిణంగా విస్తరించి ఉన్న తూర్పు కనుమలను ‘కడప శ్రేణుల’ని పిలుస్తారు.
- విశాఖ జిల్లాలోని తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం ఆర్మీకొండ (ఆరోమా) మాచ్‌ఖండ్ పీఠభూమిలో ఉంది.
- అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం రత్న గిరి కొండల్లో ఉంది.
Download PDF : AP Geography- Andhrapradesh- Physical Geography pdf
Also Read: ఆంధ్రప్రదేశ్ – భూగోళశాస్త్రం
********************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |