Categories: ArticleLatest Post

TS TET పరీక్షా విధానం 2024, పేపర్ I మరియు పేపర్ II పరీక్షా విధానం తనిఖీ చేయండి

TS TET పరీక్షా విధానం

TS TET పరీక్షా విధానం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ త్వరలో TS TET 2024 నోటిఫికేషన్ ను మార్చి 14 విడుదల చేసింది. TS TET 2024 నోటిఫికేషన్ PDF 23 మార్చి 2024న అధికారిక వెబ్‌సైట్‌ www.tstet.cgg.gov.in లో విడుదల చేసింది. TET మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. TS TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS TET పరీక్షా సరళి 2024 పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులకు TS TET పరీక్షా సరళిపై స్పష్టమైన ఆలోచన ఉంటే, పరీక్షలో మంచి స్కోర్ పొందడానికి మీకు సహాయం చేస్తుంది మరియు TS TET పరీక్షా ప్రిపరేషన్ లో మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఈ కధనంలో మేము TS TET పరీక్షా సరళి గురించి వివరించాము. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.

Adda247 APP

TS TET పరీక్షా విధానం 2024 అవలోకనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ  TS TET 2024 నోటిఫికేషన్  విడుదల చేసింది. అభ్యర్ధులు ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్ మెరుగుపరచుకోవాలి. TS TET పరీక్షా విధానం 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TS TET పరీక్షా విధానం 2024 అవలోకనం 
సంస్థ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం
పోస్ట్ TS TET 2024
వర్గం పరీక్షా విధానం
TS TET 2024 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ  14 మార్చి 2024
TS TET 2024 2024 నోటిఫికేషన్ PDF విడుదల తేదీ 23 మార్చి 2024
TS TET 2024 2024 పరీక్ష విధానం  ఆన్ లైన్
అధికారిక వెబ్సైట్ www.tstet.cgg.gov.in

TS TET పరీక్షా విధానం 2024

TSTET 2024 పరీక్షలో పాఠశాల విద్య యొక్క వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులను నియమించడానికి రెండు పేపర్లు ఉంటాయి:

  1. TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.)
  2. TSTET పేపర్-II (సెకండరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థులకు, అంటే క్లాస్ VI-VIII)

అభ్యర్థులు అర్హత ప్రమాణాలను బట్టి పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు హాజరుకావచ్చు. ప్రశ్నపత్రం ఎంచుకున్న భాష I మరియు ఆంగ్లంలో ప్రశ్నలతో కూడిన ద్విభాషా విధానంలో  రూపొందించబడింది.

Is TS TET exam conducted every year?

TS TET 2024 పేపర్ I – పరీక్షా విధానం

TSTET పేపర్-I (ప్రైమరీ టీచర్ కావాలనుకునే అభ్యర్థుల కోసం, అంటే క్లాస్ I-V నుండి.) లో శిశు వికాసం మరియు బోధనా పద్దతులు, లాంగ్వేజ్- II ఇంగ్లీష్, లాంగ్వేజ్- I, గణితం, పర్యావరణ అధ్యయనాలు అంశాలు ఉంటాయి

  • ఒక్కో అంశం నుండి 30 ప్రశ్నలు వస్తాయి
  • అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉంటాయి
  • ఒక్కో ప్రశ్న ఒక్కో మార్కును కలిగి ఉంటాయి
  • మొత్తం 150 మార్కులకు పరీక్షా ఉంటుంది
  • తప్పు సమాధానానికి నెగెటివ్ మారికింగ్ లేదు
  • పరీక్షా వ్యవధి : 2 గంటల 30 నిముషాలు
నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
 1 శిశు వికాసం మరియు బోధనా పద్దతులు  30 MCQs  30 మార్కులు
2 లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
3 లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
4 గణితం 30 MCQs 30 మార్కులు
5 పర్యావరణ అధ్యయనాలు 30 MCQs 30 మార్కులు
మొత్తం 150 MCQs 150 మార్కులు

TS TET 2024 పేపర్ II – పరీక్షా విధానం

  • TS-TET పరీక్షా ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQలు) ఉంటాయి
  • ఒక్కొక్కటి ఒక్కో మార్కును కలిగి ఉంటాయి
  • మొత్తం 150 మార్కులకు పరీక్షా ఉంటుంది.
  • పరీక్షా వ్యవది 2 గంటల 30 నిముషాలు
నెం. సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు
i శిశు వికాసం మరియు బోధనా పద్దతులు 30 MCQs 30 మార్కులు
ii లాంగ్వేజ్ – I 30 MCQs 30 మార్కులు
iii లాంగ్వేజ్- II ఇంగ్లీష్ 30 MCQs 30 మార్కులు
iv a) గణితం మరియు సైన్స్ ఉపాధ్యాయుల కోసం: గణితం మరియు సైన్స్.

బి) సోషల్ స్టడీస్ టీచర్ కోసం : సోషల్ స్టడీస్

సి) ఇతర ఉపాధ్యాయుల కోసం – iv (a) లేదా iv (b)

60 MCQs 60 మార్కులు
మొత్తం 150 MCQs 150 మార్కులు

TSTET క్వాలిఫైయింగ్ మార్కులు

వివిధ కేటగిరీల వారీగా అర్హత మార్కుల శాతం క్రింద చూపిన విధంగా ఉన్నాయి:

నెం వర్గం క్వాలిఫైయింగ్ మార్కులు
1 జనరల్ 60% మరియు అంతకంటే ఎక్కువ
2 BCs 50% మరియు అంతకంటే ఎక్కువ
3 SC/ST/PH 40% మరియు అంతకంటే ఎక్కువ

Read More:
TS TET పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందా? TS TET నోటిఫికేషన్ 2024
TS TET పరీక్షా విధానం 2024 పూర్తి వివరాలు TS TET 2024 అర్హత ప్రమాణాలు
TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు  TS TET 2024 కోసం ఉత్తమ పుస్తకాలు 
TS TET పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? TET ప్రిపరేషన్ చిట్కాలు మొదటి ప్రయత్నంలో TS TET 2023కి ఎలా అర్హత సాధించాలి?

FAQs

TS Tet 2023 నోటిఫికేషన్ 2024 విడుదలైందా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 నోటిఫికేషన్ PDF 27 మార్చి 2024న అధికారిక వెబ్‌సైట్‌ tstet.cgg.gov.in లో విడుదల చేస్తుంది.

TS TET అంటే ఏమిటి?

TS TET అంటే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరియు దీనిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తారు. TS TET లో అర్హత సాధించిన వారు ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి అర్హులు.

praveen

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

11 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

12 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago