Telugu govt jobs   »   Article   »   TS TET పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు

TS TET పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి

TS TET పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి నిర్వహించే (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) TS TETను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్‌ను జరిపేందుకు క్యాలెండర్‌ ప్రకటించే వైపుగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఆ ఏడాది టెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించేలా మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ వర్గాలున్నట్టు తెలుస్తోంది.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TS TET పరీక్ష 2023 అవలోకనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ త్వరలో టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ ని  విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలను తనిఖీ చేయవచ్చు మరియు అధికారిక వెబ్‌సైట్‌ www.tstet.cgg.gov.in ను తరచూ సందర్శించండి. TS TET పరీక్ష 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TS TET పరీక్ష  2023 అవలోకనం
సంస్థ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం
పోస్ట్ TS TET 2023
TS TET 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ త్వరలో విడుదలకానుంది
TS TET 2023 దరఖాస్తు ప్రారంభం తెలియజేయాలి
TS TET 2023  దరఖాస్తు చివరి తేదీ తెలియజేయాలి
TS TET 2023 పరీక్ష విధానం ఆఫ్ లైన్ / ఆన్ లైన్
అధికారిక వెబ్సైట్ www.tstet.cgg.gov.in

TS TET నోటిఫికేషన్ 2023

TSTET పరీక్ష ఇక నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు

TS TET నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించిన పాఠశాల విద్యాశాఖ అధికార బృందం తుది ఆమోదం కోసం సంబంధిత దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు చెబుతున్నారు. ఈ దస్త్రానికి ఆమోదం తెలిపిన వెంటనే TS TET పరీక్షా జరిపేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుడంతో  ఆ రోజునే పాఠశాలలు పున: ప్రారంభమవుతుండడంతో ఒకటి రెండు రోజులు అటు ఇటుగా TS TET షెడ్యూల్‌ను ప్రకటించాలని ప్రణాళిక చేస్తుంది.

TS TET సిలబస్ 2023

TS TET పరీక్ష కు ఉన్న పోటీ

తెలంగాణ రాష్ట్రంలో TETలో ఇప్పటివరకు నిర్వహించిన TETలో మొత్తం 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా ఇంకా 2.50 లక్షల మంది డీఎడ్‌, బీఈడీ పూర్తయినవారు ఉత్తీర్ణులయ్యేందుకు పరీక్షలు రాస్తూనే ఉన్నారు. మరోవైపు మార్కులు మెరుగుపరుచుకునేందుకు పాసైనవారూ మళ్లి రాస్తూనే ఉన్నారు. గత ఏడాది పరీక్షకు 3.50 లక్షల మంది హాజరయ్యారు. మళ్లి జరిపినా కనీసం 3 లక్షల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ త్వరలో టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ ని  విడుదల చేయనున్నట్లు తెలిపింది.

TS TET మునుపటి సంవత్సరం పేపర్లు 

TS TET పరీక్షా FAQs

జ. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET)ని పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

ప్ర. TS TET 2023 నోటిఫికేషన్ 2023 విడుదలైందా?

జ. TS TET 2023 నోటిఫికేషన్ 2023 త్వరలో విడుదల కానుంది

ప్ర. TS TET పరీక్షా ప్రతి ఏడాది నిర్వహిస్తారా?

జ. TS TET ప్రతి ఏడాది నిర్వహించే ప్రయత్నం చేసేందుకు TS ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

ప్ర. TS TET అంటే ఏమిటి?

జ. TS TET అంటే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరియు దీనిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తారు. తెలంగాణ టెట్‌లో అర్హత సాధించిన వారు ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి అర్హులు.

Telangana Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TS TET 2023 నోటిఫికేషన్ 2023 విడుదలైందా?

TS TET 2023 నోటిఫికేషన్ 2023 త్వరలో విడుదల కానుంది

TS TET అంటే ఏమిటి?

TS TET అంటే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరియు దీనిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తారు. తెలంగాణ టెట్‌లో అర్హత సాధించిన వారు ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి అర్హులు.

TS TET పరీక్షా ప్రతి ఏడాది నిర్వహిస్తారా?

TS TET ప్రతి ఏడాది నిర్వహించే ప్రయత్నం చేసేందుకు TS ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.