విద్యుత్తు రంగంలో తెలంగాణకు 17వ ర్యాంకు, Telangana Ranks 17th in Power Sector

తెలంగాణ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు, పర్యావరణ సూచిక (స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ ఇండెక్స్‌) రౌండ్‌-1 ర్యాంకుల్లో ఓవరాల్‌ కేటగిరీలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానాల్లో నిలిచాయి. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్‌ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ 11, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమయ్యాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, విద్యుత్తు లభ్యత- ధర- విశ్వసనీయత, స్వచ్ఛ ఇంధన సరఫరా, విద్యుత్తు సామర్థ్యం, పర్యావరణ సుస్థిరత, వినూత్న విధానాలు.. అనే ఆరు కొలమానాల ఆధారంగా 2019-20 సమాచారం మేరకు నీతిఆయోగ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది. ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 7, 12, 13 విద్యుత్తు రంగానికి సంబంధించినవి. దాన్ని అనుసరించి రాష్ట్రాలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అంచనావేయడానికి ఈ ర్యాంకులు ఇచ్చాం’’ అని నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. 1990 నుంచి 2019 మధ్య ఆర్థిక వ్యవస్థ 6 రెట్లు పెరిగితే విద్యుత్తు వినియోగం 2.5 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. మన తలసరి విద్యుత్తు వినియోగం ప్రపంచ సగటులో 1/3 వంతుకు మాత్రమే పరిమితమైందన్నారు.

మొదటి మూడు స్థానాల్లో..

  • పెద్ద రాష్ట్రాల్లో: గుజరాత్‌, కేరళ, పంజాబ్‌
  • చిన్న రాష్ట్రాల్లో: గోవా, త్రిపుర, మణిపుర్‌
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో: ఛండీగడ్‌, దిల్లీ, దయ్యూదామన్‌, దాద్రానగర్‌హవేలీ
  • ఓవరాల్‌ ర్యాంకులు: చండీగఢ్‌, దిల్లీ, డయ్యూడామన్‌-దాద్రానగర్‌ హవేలీ

 

****************************************************************************

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

mamatha

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

2 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

4 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

1 day ago