తెలంగాణ పోలీస్‌ నియామకాలు మరియు పరీక్షా తేదీల వివరాలు

తెలంగాణ పోలీస్‌ నియామకాలు పరీక్షా తేదీల వివరాలు : రాష్ట్రంలో మొదటిసారి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అన్ని యూనిఫాం విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఐదు విభాగాలకు సంబంధించి 17 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి చేపడుతున్న చర్యలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు  వివరించారు. అప్లికేషన్ల దాఖలు నుంచి తుది రాతపరీక్ష వరకు అవలంభిస్తున్న వినూత్న పద్ధతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను వెల్లడించారు.

దరఖాస్తు దాఖలుకు ఈ నెల 20 వరకు అవకాశముంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రశ్నపత్రాల రూపకల్పన ఇతర ప్రక్రియకు నెలన్నర పడుతుంది. బహుశా జూలై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించాలని భావిస్తున్నాం. ముందుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నిర్వహిస్తాం. తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ నిర్వహించాలని అనుకుంటున్నాం. సెప్టెంబర్‌ చివరి వారం వరకెల్లా ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తాం. ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన వారి నుంచి డిటైల్డ్‌ అప్లికేషన్‌ సేకరించాలి. దీనికి కనీసం నెలన్నర పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే అక్టోబర్‌–నవంబర్‌ మధ్య పీఎంటీ, పీఈటీ(దేహదారుడ్య) పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాం. తుది రాతపరీక్ష డిసెంబర్‌ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక సెలెక్షన్‌ లిస్ట్‌కు మూడు వారాల నుంచి నాలుగు వారాలు పడుతుంది. అంటే ప్రక్రియ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి రెండో వారంలోపు ముగించాలని కార్యచరణ రూపొందిస్తున్నాం.

దేహదారుడ్య పరీక్షల ప్రక్రియలో తెచ్చిన మార్పులు

పురుషుల విభాగంలో 1,600 మీటర్లు నిర్ణీత సమయంలో పరుగెత్తిన వారికి చాతి కొలతలు అవసరంలేదు. పరుగులో అతడి శక్తి తెలిసిపోతుంది. మహిళలకూ ఆ టెస్ట్‌ తొలగించాం. ఎందుకంటే 800 మీటర్లు నిర్ణీత సమయంలో చేరిన వారికి ఆ పరీక్ష అవసరంలేదు. ఇక పురుషులకు, మహిళలకు లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌ ఒకే విధానం ఉంటుంది. ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్, సీపీఎల్, ఎస్‌పీఎఫ్‌ విభాగంలోని వారికి రన్నింగ్‌ టెస్టులోనే మెరిట్‌ మార్కులుంటాయి. షార్ట్‌పుట్, లాంగ్‌ జంప్‌లో ఉండవు. నిర్ణీత దూరం ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అలాగే ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉన్న అభ్యర్థులకు మరో మూడు మార్కులు అదనంగా వస్తాయి. డ్రైవర్లుగా కూడా వారి సేవలను వినియోగించుకునేందుకు ఈ మార్కులు ఇస్తున్నాం.

****************************************************************************

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

mamatha

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

3 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

5 hours ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

1 day ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

1 day ago