Telugu govt jobs   »   Daily Current Affairs in Telugu |...

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu

Table of Contents

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_20.1

నూతన CBI డైరెక్టర్ గా IPS సుబోద్ కుమార్ జైస్వాల్ నియామకం,డేవిడ్ బర్నియా ఇజ్రాయెల్ యొక్క తదుపరి మొసాద్ చీఫ్,భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాలు వ్యవసాయంలో సహకారం కోసం ఒక కార్యక్రమం,వ్యాపారులు  కాంటాక్ట్ లెస్ చెల్లింపులను అంగీకరించడంలో సహాయపడటానికి ఎన్ పిసిఐ పే కోర్ తో భాగస్వామ్యం,క్యూ4  FY21లో జిడిపి 1.3% పెరిగింది అని ఎస్ బిఐ పరిశోధనలో వెల్లడించింది వంటి ముఖ్యమైన అంశాలను  TSPSC & APPSC గ్రూప్-1,2,3 మరియు 4 అలాగే SI మరియు కానిస్టేబుల్ మరియు ఇతర అన్ని పోటి  పరిక్షలకు ఉపయోగపడే విధంగా సమకాలిన అంశాలను దిగువ పేర్కొనడం జరిగింది. మీరు ఈ అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా అన్ని పోటీ పరీక్షలలోని కరెంట్ అఫైర్స్  అంశాలను చాలా సులువుగా సాధించగలరు.

 

జాతీయ వార్తలు 

 

1. మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు.

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_30.1

మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును ట్రిపుల్ ఒలింపియన్ మరియు పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ పేరు మీదకి మార్చనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్టేడియం ఇప్పుడు ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంగా పిలువబడుతుంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారుల కోసం ఆయన పేరిట స్కాలర్ షిప్ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మూడుసార్లు ఒలింపిక్స్ సాధించడం లో భారత హాకీ జట్టుని  ఛాంపియన్స్ గా మార్చడంలో బల్బీర్ సింగ్ సీనియర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఎవరూ తన ఒలింపిక్స్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. 1952 ఒలింపిక్స్ క్రీడల ఫైనల్లో నెదర్లాండ్స్ పై భారత్ తో అతను ఐదు గోల్స్ సాధించి  6-1 తేడాతో ఘన  విజయాన్ని సాధించారు .1975లో విజయం సాధించిన భారతహాకి జట్టుకి మేనేజర్ గా కూడా ఉన్నారు. పంజాబ్ ప్రభుత్వం 2019 లో మహారాజా రంజిత్ సింగ్ అవార్డుతో లెజెండరీ ఆటగాడిని గౌరవించింది.

 

అంతర్జాతీయ వార్తలు 

 

2. “కొలినెట్ మాకోస్సో” రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క  నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_40.1

 • కాంగో అధ్యక్షుడు డెనిస్ సాస్సౌ న్గుస్సో, అనాటోల్ కొల్లినెట్ మాకోసోను దేశ ప్రధాన మంత్రిగా నియమించారు. అతను 2016 నుండి కార్యాలయంలో ఉన్న క్లెమెంట్ మౌంబా స్థానంను భర్తీ చేశాడు. ఈ నియామకానికి ముందు, మాకోసో మధ్య ఆఫ్రికా దేశానికి విద్యా మంత్రిగా ఉన్నారు. 2011 నుండి 2016 వరకు యువత మరియు పౌర బోధన మంత్రిగా కూడా పనిచేశారు.
 • 2016 నుంచి ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పదవిలో ఉన్నారు.  కొలినెట్ మాకోస్సో  గత అధ్యక్ష ఎన్నికల సమయంలో అభ్యర్థి సస్సో న్గెస్సో యొక్క డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్ గా ఉన్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

 • కాంగో కాపిటల్: బ్రాజావిల్లే;
 • కాంగో కరెన్సీ: కాంగో ఫ్రాంక్.

 

3. డేవిడ్ బర్నియా ఇజ్రాయెల్ యొక్క తదుపరి మొసాద్ చీఫ్ గా నియమితులయ్యారు.

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_50.1

 • ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, డేవిడ్ బర్నియాను ఆ దేశ గూఢచారి సంస్థ మొసాద్ యొక్క కొత్త అధిపతిగా నియమించారు. మాజీ దీర్ఘకాలిక మొసాద్ ఆపరేటివ్ అయిన బార్నియా జూన్ 1న ఇజ్రాయిల్ గూఢచార సంస్థ అధిపతిగా ఉన్న యోస్సీ కోహెన్ తరువాత బాధ్యతలు చేపట్టనున్నారు. కోహెన్ 2016 లో అధికారం చేపట్టినప్పటి నుండి ఇజ్రాయిల్ యొక్క స్పై మాస్టర్ గా పనిచేశారు.
 • తన 50 ఏళ్ళ వయసులో ఉన్న బర్నియా, టెల్ అవీవ్‌కు ఉత్తరాన ఉన్న షారన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎలైట్ సయెరెట్ మట్కల్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్‌లో తను సైనిక సేవ చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితం, అతను మొసాద్‌లో చేరాడు, అక్కడ అతను కేసు అధికారి అయ్యాడు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

 • ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి: బెంజమిన్ నెతన్యాహు.
 • ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలేం.
 • ఇజ్రాయెల్ కరెన్సీ: ఇజ్రాయెల్ షెకెల్.

 

4. మాల్దీవుల్లో కొత్త కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రారంభానికి మంత్రివర్గం ఆమోదం

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_60.1

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మాల్దీవులలోని అడ్డూ సిటీలో భారత కొత్త కాన్సులేట్ జనరల్ ను 2021లో ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. భారతదేశం మరియు మాల్దీవులు పురాతనకాలం నుంచి ఉన్న జాతి, భాషా, సాంస్కృతిక, మత మరియు వాణిజ్య సంబంధాలను పంచుకుంటాయి. భారత ప్రభుత్వం యొక్క ‘నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ’  మరియు ‘సాగర్’ (ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి) దృష్టిలో మాల్దీవులు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి.

కాన్సులేట్ జనరల్ గురించి:

 • అడ్డూ సిటీలో కాన్సులేట్ జనరల్ ను ప్రారంభించడంతో మాల్దీవుల్లో భారతదేశం యొక్క దౌత్య ఉనికిని పెంచడానికి సహాయపడుతుంది మరియు ఇది ఇప్పటికే ఉన్న మరియు  ఆశించిన స్థాయిలో  సంబంధాలు పెరగడానికి ఆస్కారం ఉంది.
 • మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ మరియు అధ్యక్షుడు సోలిహ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలు అపూర్వ మైన  స్థాయికి చేరుకున్నాయి. జాతీయ ప్రాధాన్యతను సాధించడంలో వృద్ధి అభివృద్ధి లేదా ‘సబ్ కసాత్ సబ్ కా వికాస్’ ఒక మంచి ఆరంభం కానుంది .
 • భారతదేశం యొక్క దౌత్య ఉనికిని పెంచడం, ఇతరత్రా, భారతీయ కంపెనీలకు మార్కెట్ ను పెంచడానికి సహాయపడుతుంది. వస్తువులు మరియు సేవలు, భారతీయ ఎగుమతులను పెంచుతుంది. ఇది స్వయం ప్రతిపత్తి గల భారతదేశం లేదా ‘ఆత్మనీభర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ ఉత్పత్తి మరియు ఉపాధిని పెంచడంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

మాల్దీవుల అధ్యక్షుడు: ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్.
మాల్దీవుల రాజధాని: మగ; మాల్దీవుల కరెన్సీ: మాల్దీవియన్ రుఫియా.

 

5. భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాలు వ్యవసాయంలో సహకారం కోసం ఒక కార్యక్రమంపై సంతకం చేశాయి 

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_70.1

భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాల ఉమ్మడి పని కార్యక్రమాన్ని కుదుర్చుకున్నాయి, ఇది 2023 వరకు కొనసాగనుంది. ఉమ్మడి పని కార్యక్రమాన్ని వ్యవసాయంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించారు. కొత్త పని కార్యక్రమం కింద, ఇజ్రాయిల్ వ్యవసాయ మరియు నీటి సాంకేతికతల గురించి భారతీయ రైతులకు అవగాహన కల్పించడానికి 13 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఈలు) లను ఏర్పాటు చేయనుంది.

ఎనిమిది రాష్ట్రాల్లోని 75 గ్రామాలలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ (విఒఇ) అనే ఒక మాదిరి ఎకోసిస్టమ్ ను వ్యవసాయ రంగంలో ఏర్పాటు చేయ బడుతుంది. ఈ కొత్త కార్యక్రమం నికర ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది మరియు రైతుల  వ్యక్తిగత జీవనోపాధిని పెంచుతుంది. భారతదేశం మరియు ఇజ్రాయిల్ ఇప్పటివరకు ఇలాంటి నాలుగు ఉమ్మడి పని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాయి.

 

నియామకాలు

 

6. నూతన CBI డైరెక్టర్ గా IPS సుబోద్ కుమార్ జైస్వాల్ నియామకం

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_80.1

ఐపిఎస్ అధికారి సుబోధ్ జైస్వాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్‌గా నియమించారు. సిబిఐ డైరెక్టర్ పదవికి షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురిలో ఆయన అత్యంత సీనియర్ అధికారి. జైస్వాల్, కె.ఆర్. చంద్ర, వి.ఎస్. కౌముడిలతో పాటు, 109 మంది అధికారులతో డైరెక్టర్  పదవికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై-పవర్ కమిటీ జాబితాను తయారుచేసింది. ఈ కమిటీలోని ఇతర సభ్యులలో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్వి రమణ మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు.

కేబినెట్ నియామక కమిటీ కమిటీ సిఫారసు చేసిన ప్యానెల్ ఆధారంగా, ఐపిఎస్ (ఎంహెచ్: 1985) శ్రీ సుబోధ్ కుమార్ జైస్వాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ గా నియమించిన తేదీ నుండి రెండేళ్ల వరకు లేదా కార్యాలయం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.

సుబోధ్ జైస్వాల్ ఎవరు?

 • సుబోధ్ జైస్వాల్ 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపిఎస్ అధికారి, అతను సిఐఎస్ఎఫ్ చీఫ్. అంతకుముందు ముంబై పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర డిజిపి పదవులను నిర్వహించారు.
 • 2018 లో ముంబై పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఆయన గతంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) తో కలిసి పనిచేశారు. సుబోధ్ జైస్వాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పిజి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) మరియు RAW (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) లతో ఒక దశాబ్దం పాటు పనిచేశారు.
 • 58 ఏళ్ల అధికారి అబ్దుల్ కరీం తెల్గి కుంభకోణం అని కూడా పిలువబడే రూ .20,000 కోట్ల నకిలీ స్టాంప్ పేపర్ కుంభకోణంపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఈయన ప్రదాన అధికారి.
 • అతను 2006 మాలెగావ్ పేలుడు కేసును విచారించిన బృందంలో కూడా ఉన్నారు.
 • సుబోధ్ జైస్వాల్‌కు 2009 లో ఆయన చేసిన విశిష్ట సేవకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

 • సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ.
 • సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాపించబడింది: 1 ఏప్రిల్ 1963.

 

బ్యాంకింగ్ &ఎకానమీ

 

7. వ్యాపారులు  కాంటాక్ట్ లెస్ చెల్లింపులను అంగీకరించడంలో సహాయపడటానికి ఎన్ పిసిఐ పే కోర్ తో భాగస్వామ్యం చేసుకుంది 

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_90.1

నేషనల్ పేమెంట్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) టర్కీ యొక్క గ్లోబల్ పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ పేకోర్ తో దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులను నడపడానికి రూపే సాఫ్ట్ పిఒఎస్ కోసం సర్టిఫైడ్ భాగస్వాముల్లో ఒకరిగా భాగస్వామ్యం చేసుకుంది. రూపే సాఫ్ట్ పివోఎస్ వ్యాపారులు తమ మొబైల్ ఫోన్ లతో కాంటాక్ట్ లెస్ కార్డులు, మొబైల్ వాలెట్లు మరియు వేరబుల్స్ నుంచి చెల్లింపులను సురక్షితంగా ఆమోదించడానికి ఇది  దోహదపడుతుంది.

ఈ అసోసియేషన్ కింద:

 • రూపే కొరకు పేకోర్ అభివృద్ధి చేసిన సాఫ్ట్ పిఒఎస్ సొల్యూషన్ని  ఎన్ పిసిఐ ఆమోదించింది. ఈ సాఫ్ట్ పిఒఎస్ సొల్యూషన్ని బ్యాంకు లేదా అగ్రిగేటర్లు కొనుగోలు వ్యవస్థల్లో విలీనం చేసుకోవచ్చు, తద్వారా ఎన్ .ఎఫ్. సి సామర్ధ్యం లేదా యాడ్-ఆన్ లతో ప్రారంభించబడిన మొబైల్ ఫోన్లను ఉపయోగించి రూపేను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
 • లక్షలాది మంది వ్యాపారులు ఇప్పుడు తమ సమీప ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారిత (ఎన్ ఎఫ్ సి) స్మార్ట్ ఫోన్ లను రూపే సాఫ్ట్ పివోఎస్ ద్వారా కాంటాక్ట్ లెస్ చెల్లింపులను ఆమోదించడానికి పివోఎస్ మెషిన్లా వాడుకోవచ్చు .

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

 • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సీఈఓ: దిలీప్ ఆస్బే.
 • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం: ముంబై.
 • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది: 2008.

 

8. క్యూ4  FY21లో జిడిపి 1.3% పెరిగింది అని ఎస్ బిఐ పరిశోధనలో వెల్లడించింది

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_100.1

2020-21 నాలుగో త్రైమాసికంలో భారత జిడిపి 1.3% వృద్ధి చెందే అవకాశం ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సుమారు 7.3% ఉండవచ్చని ఎస్ బిఐ పరిశోధన నివేదిక ‘ఎకోర్యాప్’ తెలిపింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ ఎస్ ఓ) మార్చి 2021 త్రైమాసికంలో జిడిపి అంచనాలను, 2020-21 సంవత్సరానికి తాత్కాలిక వార్షిక అంచనాలను మే 31న విడుదల చేయనుంది.

స్టేట్ బ్యాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ (ఎస్ బిఐ) సహకారంతో పరిశ్రమ కార్యకలాపాలు, సేవా కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 41 హై ఫ్రీక్వెన్సీ సూచికలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ‘నౌకాస్టింగ్ మోడల్’ను అభివృద్ధి చేసింది. 1.3% జిడిపి వృద్ధి అంచనా ప్రకారం, ఇప్పటివరకు తమ జిడిపి సంఖ్యను విడుదల చేసిన 25 దేశాలలో పోలిస్తే  భారతదేశం ఇప్పటికీ ఐదవ-వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటుందని ఆర్థిక పరిశోధన బృందం తెలిపింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

 • ఎస్ బిఐ చైర్ పర్సన్: దినేష్ కుమార్ ఖారా.
 • ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం : ముంబై.
 • ఎస్ బిఐ స్థాపించబడింది: 1 జూలై 1955.

 

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_110.1

 

9. FY22 గాను భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటు 7.7%గా ఉంటుంది అని బార్క్లేస్ అంచనా వేసింది.

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_120.1

బార్క్లేస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్ మహమ్మారి మూడవసారి విజ్రుమ్బిస్తుంది అనే ఉద్దేశ్యంతో భారతదేశ శూల స్థూల దేశీయ ఆర్థిక వృద్ధిని 7.7 శాతంగా అంచనా  వేసింది, మునుపటి సంవత్సరం లాగానే ఈ ఏడాది చివర్లో ఎనిమిది వారాలపాటు దేశవ్యాప్తంగా మరో సారి కఠినమైన లాక్ డౌన్ లు విధించవలసిన అవసరం వస్తే ఆర్థిక వ్యయం కనీసం 42.6 బిలియన్ డాలర్లు పెరగవచ్చని పేర్కొంది.

 

10. 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_130.1

విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం మరియు వ్యాపారాలని సులభతరం చేయడం వంటి రంగాలలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) 19 శాతానికి పెరిగి 2020-21 నాటికి 59.64 బిలియన్ డాలర్లు గా ఉంది. ఈక్విటీలు, తిరిగి పెట్టుబడి పెట్టిన సంపాదన మరియు మూలధనంతో సహా మొత్తం ఎఫ్ డిఐ 10 శాతం పెరిగి 2019-20 లో 74.39 బిలియన్ డాలర్ల నుంచి  2020-21 లో 81.72 బిలియన్ డాలర్ల కు చేరాయి.

గత సంవత్సరం సింగపూర్ 29 శాతం వాటాతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షంచడంతో  అగ్రస్థానంలో ఉంది. అమెరికా (23 శాతం), మారిషస్ (9 శాతం) తర్వాత స్థానాలలో నిలిచాయి. 2019-20 (49.98 బిలియన్ డాలర్లు) తో పోలిస్తే 2020-21 (59.64 బిలియన్ డాలర్లు)తో ఎఫ్ డిఐ ఈక్విటీ ఇన్ ఫ్లో 19 శాతం పెరిగింది.

 

క్రీడలు

 

11. జెనీవా ఓపెన్ టెన్నిస్ లో కాస్పర్ రుడ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_140.1

నార్వేకు చెందిన కాస్పర్ రుడ్, డెనిస్ షపోవాలోవ్ పై 7-6 (8/6), 6-4 తేడాతో ATP జెనీవా ఓపెన్ ఫైనల్ లో విజయం సాధించాడు. కాస్పర్ రూడ్ ప్రపంచంలోని 21 వ ఆటగాడు. క్లే-కోర్ట్ ఈవెంట్లలో ,”రెండవ కెరీర్ టైటిల్ ఫైనల్స్” రుడ్ రికార్డును 2-2కు పెంచింది. 22 ఏళ్ల నార్వేజియన్ మునుపటి టైటిల్ ను గత ఏడాది బ్యూనస్ ఎయిర్స్ లో గెలుచుకున్నాడు.

 

అవార్డులు 

 

12 .”స్పైస్ హెల్త్” 2021 గోల్డ్ స్టీవ్ అవార్డును గెలుచుకుంది

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_150.1

స్పైస్ జెట్ ప్రమోటర్లు స్థాపించిన స్పైస్ హెల్త్ అనే హెల్త్ కేర్ కంపెనీ 2021 ఆసియా-పసిఫిక్ స్టెవీ అవార్డుల్లో ‘మోస్ట్ వాల్యూబుల్ మెడికల్ ఇన్నోవేషన్(అత్యంత విలువైన వైద్య ఆవిష్కరణ)’ కోసం గోల్డ్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 2020లో కోవిడ్-19 భారతదేశంలో మితిమీరిన సమయంలో, అవనీ సింగ్ యొక్క నిర్వహణ క్రింద స్పైస్ హెల్త్, ₹499 వద్ద సెల్ ప్రయోగశాలలలో తనిఖీలు అందించడం ద్వారా రియల్ టైమ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (RT-PCR) టెస్టింగ్ హౌస్ కు అంతరాయం కలిగించింది, ఢిల్లీలో అప్పటి ₹2,400 రేటుకు వ్యతిరేకంగా మరియు దేశవ్యాప్తంగా కోవిడ్-19 టెస్టింగ్ ధరను నాటకీయంగా తగ్గించడానికి సహాయపడింది.

ఆసియా-పసిఫిక్ స్టీవ్ అవార్డుల గురించి:

 • ఆసియా-పసిఫిక్ స్టీవ్ అవార్డులు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మొత్తం 29 దేశాల కార్యాలయంలోని ఆవిష్కరణలను గుర్తించే ఒక వ్యాపార అవార్డుల కార్యక్రమం.
 • స్టెవీ అవార్డులు ప్రపంచంలోని ప్రధాన వ్యాపార అవార్డులు, ఇది 19 సంవత్సరాల పాటు ది ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డులకు సమానమైన అనువర్తనాలలో సాధించిన విజయానికి గుర్తింపును అందిస్తుంది.

 

ముఖ్యమైన రోజులు 

 

13. ప్రపంచ వైశాక దినోత్సవం : 26 మే 2021

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_160.1

వైశాక దినోత్సవం 2021 ను ప్రపంచవ్యాప్తంగా మే 26న జరుపుకుంటారు.ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్మరించుకుంటూ ఉంటుంది.

చరిత్ర:

ఈ రోజును ఐక్యరాజ్యసమితి 2000 నుండి జరుపుకుంటుంది. ఈ రోజును జరుపుకోవాలనే  తీర్మానం ను 1999 లో ఆమోదించబడింది. 2004 నుండి, అంతర్జాతీయ వెసాక్ సమ్మిట్(International Vesak Summit) ను నిర్వహిస్తున్నారు. 2019 లో ఇది వియత్నాంలో జరిగింది. ఇప్పటివరకు, థాయ్‌లాండ్‌లో 11 సార్లు, వియత్నాంలో 3 సార్లు, శ్రీలంకలో 1 సారి శిఖరాగ్ర సమావేశం జరిగింది. బుద్ధుని పుట్టినరోజును వెసాక్(Vesak) దినోత్సవంగా జరుపుకోవాలనే నిర్ణయం 1950 లో శ్రీలంకలో జరిగిన World Fellowships of Buddhists conference లో లాంఛనప్రాయంగా జరిగింది. ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన బౌద్ధ నాయకులు పాల్గొన్నారు.

 

మరణాలు

 

14.మాజీ ఫార్ములా వన్ అధ్యక్షుడు మాక్స్ మోస్లే మరణించారు

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_170.1

ఫార్ములా వన్ పాలక మండలి మాజీ అధ్యక్షుడు మాక్స్ మోస్లే(81) క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. 1930లలో బ్రిటిష్ ఫాసిస్ట్ ఉద్యమ నాయకుడు ఓస్వాల్డ్ మోస్లే యొక్క చిన్న కుమారుడు. మోస్లే 1993లో ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (FIA) అధ్యక్షుడయ్యే ముందు అతను రేసింగ్ డ్రైవర్, జట్టు యజమాని మరియు న్యాయవాది.

 

15. U.S. ఒలింపిక్ స్ప్రింటర్ లీ ఎవాన్స్ మరణించాడు

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_180.1

1968 ఒలింపిక్స్ లో నిరసన చిహ్నంగా బ్లాక్ బెరెట్ ధరించిన రికార్డు స్థాయి స్ప్రింటర్ లీ ఎవాన్స్ మరణించాడు. 400 మీటర్లలో 44 సెకన్లు పరుగెత్తిన తొలి వ్యక్తిగా ఎవాన్స్ నిలిచాడు మరియు మెక్సికో సిటీ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

 

 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_190.1Daily Current Affairs in Telugu | 26 May 2021 Important Current Affairs in Telugu_200.1

 

 

 

 

 

 

 

Sharing is caring!