APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది, అవసరమైన అర్హతలు ఏమిటి, ఇక్కడ చదవండి

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానుంది :

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023: APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తన అధికారిక వెబ్‌సైట్‌ @psc.ap.gov.inలో అతి త్వరలో విడుదల చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 508 ఖాళీలను విడుదల చేయబోతుంది. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023కి దరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కు  సంబంధించిన అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, సిలబస్, పరీక్ష నమూనా మొదలైన వివరాలను తెలుసుకోవాలి.

APPSC గ్రూప్ 2లో ఇన్ని ఖాళీలు ఉండవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 508 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ సంస్థలకు సంబంధించిన ఖాళీలు క్రింది విధంగా ఉన్నాయి. త్వరలో వెలువడే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

శాఖ పోస్ట్ ఖాళీల సంఖ్య
ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23
జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 12
లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10
MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 04
రెవిన్యూ డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii) 114
సబ్-రిజిస్త్రార్ 16
ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ 150
LFB & IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18
మొత్తం 508

APPSC గ్రూప్ 2కి ఈ అర్హతలు తప్పనిసరి

APPSC గ్రూప్ 2 ఖాళీలకు దరఖాస్తు చేయడానికి ,అభ్యర్థులు  APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

విద్యా అర్హత:

APPSC గ్రూప్ 2 పోస్టులకు, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.

అయితే కొన్ని పోస్టులకు భౌతిక ప్రమాణాలు అర్హత తప్పనిసరి, అవి:

ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్ట్ కోసం హాజరయ్యే అభ్యర్థులకు కమిషన్ కొన్ని భౌతిక ప్రమాణాలు నిర్ణయించింది. కింద అవసరమైన భౌతిక ప్రమాణాలు ఇవ్వబడ్డాయి.

పురుషులు: 

  • ఎత్తు 165 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
  • కనీసం 5 సెంటీమీటర్ల విస్తరణతో , ఛాతీ చుట్టూ 81 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు

స్త్రీలు:

  • ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
  • 45.5 కిలోల కంటే తక్కువ బరువు ఉండకూడదు.

APPSC/TSPSC Sure shot Selection Group

వయో పరిమితి:

APPSC గ్రూప్ 2 దరఖాస్తుదారుడు నోటిఫికేషన్ లో పేర్కొన్న వయో పరిమితిని కలిగి ఉండాలి.

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి
  • గరిష్ట  వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.

వయోసడలింపు

APPSC గ్రూప్ 2 పరీక్షకు కనీస వయస్సు అవసరం, అయితే, రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిర్దిష్ట వయస్సు సడలింపులు అందించబడతాయి. గరిష్ట వయోపరిమితి కింది సందర్భాలలో సడలించదగినది:

వర్గం వయోసడలింపు
SC/ST/BC 5 సంవత్సరాలు
AP రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 సంవత్సరాలు
PH 10 సంవత్సరాలు
Ex -సర్వీస్ మెన్ 3 సంవత్సరాలు
NCC 3 సంవత్సరాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులు (రాష్ట్ర జనాభా లెక్కల విభాగం) 3 సంవత్సరాలు

APPSC గ్రూప్ 2 దరఖాస్తు విధానం

ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు ప్రక్రియ దశలు దిగువన పేర్కొన్నబడింది. దరఖాస్తు ప్రక్రియ దశలు ఉపయోగించి మీ దరఖాస్తు ఫారం ను తప్పులు లేకుండా పూరించండి. ఒక అభ్యర్ధి ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బహుళ దరఖాస్తులు ఆమోదించబడవు.

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • కొత్త OTPR కొరకు హోం పేజి లోని Modify OTPR ID మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.
  • ఇదివరకే OTPR రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వివరాలు సరి చూసుకొన్న తరువాత వెబ్ సైట్ లోని హోం పేజి మీద క్లిక్ చేసి తరువాత ప్రకటనలు లో ”APPSC గ్రూప్ II కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ” మీద క్లిక్ చేయాలి.
  • తరువాత మీ యొక్క USER ID మరియు Mobile Number నమోదు చెయ్యడం ద్వారా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజి లోనికి వెళ్ళడం ద్వారా, మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు.
  • ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో మళ్లీ లాగిన్ చేయండి.
  • “APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు” లింక్‌పై క్లిక్ చేయండి.
  • APPSC గ్రూప్ 2 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ : తరచూ అడిగే ప్రశ్నలు

ప్ర. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 విడుదల చేయబడిందా?
జ: APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయబడలేదు.

ప్ర. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జ: APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల అవుతుంది

ప్ర. APPSC  గ్రూప్ 2 ప్రతికూల మార్కులు ఉంటుందా?
జ: అవును, APPSC గ్రూప్ 2 పరీక్షలో 1/3వ మార్కుల ప్రతికూల మార్కింగ్ ఉంటుంది.

ప్ర. APPSC  గ్రూప్ 2 దరఖాస్తు ఫారం ఎలా పూరించాలి?
జ: APPSC  గ్రూప్ 2 దరఖాస్తు ప్రక్రియ గురించి ఈ కధనంలో వివరంగా ఇవ్వడం జరిగింది.

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 జీతం
APPSC గ్రూప్ 2 సిలబస్
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

APPSC Group 2 Notification 2023 Released?

APPSC Group 2 notification is not released yet.

When will the APPSC Group 2 notification be released?

APPSC Group 2 notification will be released soon

is there any negative marks in APPSC Group 2 exam?

Yes, there will be a negative marking of 1/3rd marks in the APPSC Group 2 Exam.

How to fill APPSC Group 2 Application Form?

APPSC Group 2 Application Process is given in detail in this article.

Pandaga Kalyani

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

16 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

18 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

18 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

19 hours ago