Telugu govt jobs   »   Current Affairs   »   Virat Kohli Makes History with 50th...

Virat Kohli Makes History with 50th ODI Century | 50వ సెంచరితో చరిత్ర సృష్టించిన కోహ్లీ

క్రికెట్ ప్రపంచంలో భారతదేశం నుంచి వినిపించే కొద్ది పేర్లలో విరాట్ కోహ్లికి ఒక్కరు. తన బ్యాటింగ్ శైలితో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాడు. తన అసమానమైన నిలకడ మరియు అచంచలమైన సంకల్పంతో, క్రికెట్ చరిత్రలో అతని పేరును చిరస్థాయిగా నిలిపాడు. మరియు ఈ ముఖ్యమైన సందర్భంలో, కోహ్లి మరోసారి క్రికెట్ ప్రపంచంలో తన స్థాయిని మరోసారి నిరూపించాడు, ఆటలోని గొప్ప వ్యక్తులకు సరితూగని ఘనతను సాధించాడు.

వాంఖడే స్టేడియం లో ICC ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూ జిల్యాండ్ పై జరుగుతున్న పోరులో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో వన్డే ఇంటర్నేషనల్ లో 50వ సెంచరి చేసి  సచిన్ పేరున ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. తన 50వ వన్డే సెంచరీతో, విరాట్ కోహ్లి దిగ్గజ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించడమే కాకుండా, అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన మైలురాయి కోహ్లికి ఉన్న అసాధారణ ప్రతిభకు, అచంచలమైన అంకితభావానికి, క్రీడ పట్ల ఉన్న అచంచలమైన అభిరుచికి నిదర్శనం.

వన్డే క్రికెట్‌లో సచిన్ 451 ఇన్నింగ్స్ లో 49సెంచరీలు చేసిన ఆటగాడిగా ఒక రికార్డుని నెలకొల్పాడు మరియు వన్డేలలో ఒక ఎడిషన్లో 673 పరుగులు పరుగులు తీసి రెండవ రికార్డుని నెలకొల్పాడు. ఈ రెండు రికార్డులను కోహ్లీ న్యూజిల్యాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో తిరగరసాడు. 700 పరుగులు తీసి మరొక అరుదైన రికార్డు ని సృష్టించాడు అది కూడా కేవలం 277 మ్యాచ్లలో.

రెండో పరుగు పూర్తి కాగానే కోహ్లీ తన హెల్మెట్ విప్పి, చేతులు పైకెత్తి సచిన్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ నిలబడిన స్టాండ్స్ వైపు నమస్కరించాడు. ఈ ప్రపంచకప్లో పది ఇన్నింగ్స్ లో ఐదు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. టోర్నమెంట్ లో కేవలం 90 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో అతను వందకు పైగా సగటును కలిగి ఉన్నాడు.

ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

  • 674* – విరాట్ కోహ్లీ (2023)
  • 673 – సచిన్ టెండూల్కర్ (2003)
  • 659 – మాథ్యూ హేడెన్ (2007)
  • 648 – రోహిత్ శర్మ (2019)
  • 647 – డేవిడ్ వార్నర్ (2019)

 అసమానమైన విజయం యొక్క వారసత్వం

విరాట్ కోహ్లీ 50వ ODI సెంచరీ కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు; భారత క్రికెట్ చరిత్రలో అదొక కీలక ఘట్టం. కోహ్లి సాధించిన విజయాలు ఔత్సాహిక క్రికెటర్ల తరానికి స్ఫూర్తిని అందించడమే కాకుండా ప్రపంచ క్రికెట్ రంగంలో భారత్ స్థాయిని పెంచాయి.

APPSC Group 2 (Pre + Mains) 2.0 Complete Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!