TS మెగా DSC నోటిఫికేషన్ 2024: తెలంగాణ విద్యాశాఖ టీచర్ రిక్రూట్మెంట్ కోసం TS మెగా DSC 2024 నోటిఫికేషన్ ను 29 ఫిబ్రవరి 2024 న విడుదల అయ్యింది. గతంలో విడుదల చేసిన 5089 ఖాళీల నోటిఫికేషన్ ను రద్దు చేసి 11,062 కొత్త పోస్టులతో TS మెగా DSC 2024 నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ DSC TRT నోటిఫికేషన్ 2024 లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, PGTలు 182, SGTలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, SGTలు 796 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ మెగా DSC కోసం పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త DSC కి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ 4 మార్చి 2024 నుండి అధికారిక వెబ్ సైట్లో (https://schooledu.telangana.gov.in/ISMS/) అందుబాటులో ఉంటుంది. తెలంగాణ DSC నోటిఫికేషన్ 2024 కోసం సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగార్ధులందరికీ ఇది మంచి అవకాశం. ఇక్కడ మేము ఈ కథనంలో TS DSC నోటిఫికేషన్ 2024 వివరాలను మరియు నోటిఫికేషన్ PDFను అందిస్తున్నాము.
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటి ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఉద్యోగాలలో నియామకం కొరకు వెబ్సైట్ (https://schooledu.telangana.gov.in) నందు TS మెగా DSC 2024 నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మే లేదా జూన్ నెలలో 10 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. B.Ed, DED, BPEDలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా TS DSC పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టెట్ పరీక్షలోనూ అర్హత సాధించి ఉండాలి. మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి.
Adda247 APP
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి TS మెగా DSC నోటిఫికేషన్ 2024 ను ప్రకటించింది. టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు, ఈ రిక్రూట్మెంట్ పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. దిగువ పట్టికలో TS నోటిఫికేషన్ 2024 కు అవలోకనం దిగువ పట్టికలో తనిఖీ చేయండి
TS DSC నోటిఫికేషన్ 2024 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | TS TRT | TS DSC |
పోస్ట్స్ | స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ |
TS మెగా DSC నోటిఫికేషన్ | 29 ఫిబ్రవరి 2024 |
TS మెగా DSC నోటిఫికేషన్ pdf | 4 మార్చి 2024 |
ఖాళీలు | 11,062 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://schooledu.telangana.gov.in |
TS DSC నోటిఫికేషన్ pdf 2024: TS మెగా DSC నోటిఫికేషన్ 2024కు సంబంధించిన ప్రకటన విడుదల చేయబడింది. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ PDF అధికారిక వెబ్ సైట్లో https://schooledu.telangana.gov.in/ISMS/ అందుబాటులో ఉంది. అధికారిక నోటిఫికేషన్ వివరాలు మరియు రిక్రూట్మెంట్ పరీక్ష ప్రక్రియను కలిగి ఉంటుంది. అధికారిక TS DSC TRT నోటిఫికేషన్ 2024 ను డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
TS TRT DSC నోటిఫికేషన్ 2024 PDF
TS TRT DSC పరీక్ష తేదీలు 2024: TS DSC TRT ఆన్లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభమవుతుంది. అన్ని TS TRT ముఖ్యమైన తేదీలు ఇక్కడ నవీకరించబడతాయి.
TS TRT DSC ముఖ్యమైన తేదీలు 2024 | |
ఈవెంట్స్ | తేదీలు |
TS DSC నోటిఫికేషన్ ప్రకటన | 29 ఫిబ్రవరి 2024 |
TS DSC నోటిఫికేషన్ PDF | 4 మార్చి 2024 |
TS DSC 2024 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 4 మార్చి 2024 |
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ | 3 ఏప్రిల్ 2024 |
ఆన్లైన్ దరఖాస్తుల ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 2 ఏప్రిల్ 2024 |
TS DSC 2024 పరీక్ష తేదీలు | మే లేదా జూన్ 2024 |
TS TRT DSC 2024 హాల్ టికెట్ | – |
తాజా TS TRT నోటిఫికేషన్ 2024 యొక్క అర్హత ప్రమాణాలు వయస్సు, విద్యార్హత పరంగా రిక్రూట్మెంట్ ప్రక్రియకు అర్హత సాధించడానికి అభ్యర్థులు కొన్ని నిబంధనలను కలిగి ఉండాలి .అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియ నుండి తిరస్కరించబడతారు.
Nationality
1.అభ్యర్థి భారతీయ జాతీయత కలిగి ఉండాలి.
2. అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి మరియు స్థానిక / స్థానికేతర స్థితిని తెలిసి ఉండాలి.
TS TRT నోటిఫికేషన్ 2024 యొక్క అర్హత ప్రమాణాలు (విద్యా అర్హతలు పోస్టుల వారీగా) ఇక్కడ అందించాము.
పోస్ట్ | విద్యా అర్హతలు |
1. స్కూల్ అసిస్టెంట్లు | అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి B.Edతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. |
2. సెకండరీ గ్రేడ్ టీచర్ | అభ్యర్థి 2-సంవత్సరాల D.Ed కోర్సుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా NCTEచే గుర్తింపు పొందిన దానికి సమానమైన సర్టిఫికేట్ ఉండాలి. |
3. భాషా పండితులు | అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / కళాశాల నుండి B.Edతో డిగ్రీ (తెలుగు / హిందీ / ఉర్దూ / కన్నడ / ఒరియా / తమిళం / సంస్కృతం) పూర్తి చేసి ఉండాలి. |
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ | అభ్యర్థి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు NCTEచే గుర్తించబడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed.)లో గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ మరియు NCTEచే గుర్తించబడిన B.P.Ed లేదా M.P.Ed. పూర్తి చేసి ఉండాలి. |
తెలంగాణా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.
వయో సడలింపు | |
శారీరక దివ్యాంగులుకు | 10 సంవత్సరాలు |
SC/ST, EWS అభ్యర్థులకు | 5 సంవత్సరాలు |
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు | 5 సంవత్సరాలు |
మాజీ సైనికోద్యోగులకు | 3 సంవత్సరాలు &సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం |
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. DSC TRT నోటిఫికేషన్ 2024 లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, PGTలు 182, SGTలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, SGTలు 796 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ TS DSC ద్వారా భర్తీ చేయనున్నారు.
TS DSC నోటిఫికేషన్ 2024 ఖాళీలు | |
స్కూల్ అసిస్టెంట్ | 2,629 |
భాషా పండితులు | 727 |
PGTలు | 182 |
SGTలు | 6,508 |
ప్రత్యేక కేటగిరీలో | |
స్కూల్ అసిస్టెంట్ | 220 |
SGTలు | 796 |
TS TRT రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
TET Name | Maximum Marks | Qualifying Marks | |||
OC | BC | SC/ST/Differently Abled | |||
AP TET/TS TET | 150 | 90 | 75 | 60 | |
CTET | 150 | 90 | 75 | 60 |
TS TRT DSC 2024 సిలబస్: అభ్యర్థులు ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం సిలబస్ని తనిఖీ చేయవచ్చు. పరీక్షను విజయవంతంగా క్లియర్ చేయడానికి అభ్యర్థులు సిలబస్ ద్వారా వెళ్లడం చాలా అవసరం. TS TRT సిలబస్ దీనికి సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది:
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11062 పోస్టుల భర్తీకి TS DSC (TRT) రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల అయ్యింది
TS TRT నోటిఫికేషన్ 2023లో 11062 ఖాళీలు ఉన్నాయి
TS DSC రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ 2023 ప్రారంభ తేదీ ఫిబ్రవరి లో ఉంటుంది
TS TRT నోటిఫికేషన్ ఈ కధనం నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
RPF సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…