Telangana State GK MCQs Questions And Answers in Telugu ,31st May 2023 For TSPSC Groups & TS Gurukulam

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu.(తెలుగులో)

Q1. పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్ మరియు జారీకి టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఆ అప్లికేషన్ ఏమిటి?

(a) వెరిఫాస్ట్ యాప్

(b) హాక్ ఐ యాప్

(c) షీ టీమ్స్

(d) T-ఫైబర్

Q2. SOFTNETకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:

  1. శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా చివరి మైలు కనెక్టివిటీని సాధించే లక్ష్యంతో ఉన్న సమూహాలను గుర్తించడానికి నాణ్యమైన విద్య మరియు శిక్షణను అందించే చొరవ.
  2. SoFTNET GSAT 8 ఉపగ్రహాన్ని ఉపయోగిస్తుంది మరియు నాలుగు ఛానెల్‌లను ప్రసారం చేస్తుంది. T-SAT నిపుణ మరియు T-SAT విద్య తెలంగాణ ప్రజల దూరవిద్య, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలి-మెడిసిన్ మరియు ఈ-గవర్నెన్స్ అవసరాలను తీరుస్తాయి.
  3. SoFTNET అవగాహన వీడియోల ద్వారా డిజిటల్ మరియు నగదు రహిత చెల్లింపులను కూడా ప్రోత్సహించింది.

(a) 1 మరియు 2

(b) 2 మరియు 3

(c) 1 మరియు 3

(d) పైవన్నీ

Q3. ఉండవల్లి గుహాలయాలను నిర్మించింది ఎవరు?

(a) గోవిందవర్మ

(b) రెండో మాధవ వర్మ

(c) మంచన భట్టారికుడు

(d)4వ మాధవవర్మ

Q4. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBS)  కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైంది?

  1. గ్రామీణ బ్యాంక్ లపై నియమించబడ్డ వర్కింగ్ గ్రూప్ సిఫారసులపై వాణిజ్య బ్యాంకులు సహకార సంఘాలు కృషికి అనుబంధంగా RRB లను ఏర్పాటు చేసింది.
  2. ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో గ్రామీణ రుణ భారాన్ని తగ్గించి సంస్థాగత పరపతిని అందించుట ఒక అంశము.
  3. 1975 సెప్టెంబర్ ల RRB ల స్థాపనకు ఆర్డినెన్స్లను జారీ చేసింది.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q5. భూ సంస్కరణల లక్ష్యాలను గూర్చి, ప్రణాళిక సంఘం అధికారికంగా క్రింది లక్ష్యాలను ప్రకటించింది.

  1. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలు తొలగించుట.
  2. వ్యవసాయ రంగంలో ఉన్న దోపిడీలు, సాంఘిక అన్యాయాలు తొలగించి భూమి దున్నేవాడికి రక్షణ ఇచ్చుట.
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2
  4. 1 & 2 రెండూ కాదు

Q6. AGMARK (Agriculture Marketing) గుర్తు దేనికి సంబందించినది?

(a) ఆహార ప్రామాణిక తూనికలు, కొలతలు

(b) గ్రేడింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులు

(c) మార్కెటింగ్ గిడ్డంగి సౌకర్యాలు

(d) వ్యవసాయ లాబ్స్

Q7. చరిత్రకారులు ‘పాశ్చాత్యీకరణ’ ప్రారంభానికి సాక్షీభూతంగా ఎవరిని పేర్కొంటారు?

(A) జంషీద్ కుతుబ్‌షా

(B) ఇబ్రహీం కుతుబ్‌షా

(C) హైదర్ కుతుబ్‌షా

(D) మహమ్మద్ కుతుబ్‌షా

Q8. చందూలాల్ తరువాత నిజాం యొక్క ప్రధాని ఎవరు?

A) సిరాజ్ ఉల్ ముల్క్

B) గులాం రసూల్ ఖాన్

C) మీరు తురబ్ అలీ ఖాన్

D) పైనవేవి కావు

Q9. ‘ది రెబెలియన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం రచించినది ఎవరు

A) మీరు తురబ్ అలీ ఖాన్

B) డూప్లే

C) హెన్రీ రస్సెల్

D) బ్రూస్ నార్తజ్

Q10. ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి ప్రారంభమైన ఉద్యమం?

A) ముస్లిం జాతీయోద్యమం

B) సిపాయి తిరుగుబాటు

C) వహాబీ ఉద్యమం

D) స్వదేశి ఉద్యమం

Solutions:

S1. Ans (a)

Sol: వెరిఫాస్ట్ యాప్:  పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్ మరియు జారీకి టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. SMS సందేశ సేవల ద్వారా దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితి గురించి నిరంతరం నవీకరించబడతారు. జాతీయ సగటు 21 రోజుల పోలీసు వెరిఫికేషన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ రిపోర్టు జారీ చేయడానికి దరఖాస్తు సమయం నుండి తీసుకున్న సగటు సమయం 4 రోజులు.

S2.Ans (d)

Sol: సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్ అనేది శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా చివరి మైలు కనెక్టివిటీని సాధించే లక్ష్యంతో ఉన్న సమూహాలను గుర్తించడానికి నాణ్యమైన విద్య మరియు శిక్షణను అందించే ఒక చొరవ. SoFTNET GSAT 8 ఉపగ్రహాన్ని ఉపయోగిస్తుంది మరియు నాలుగు ఛానెల్‌లను ప్రసారం చేస్తుంది. T-SAT నిపుణ మరియు T-SAT విద్య తెలంగాణ ప్రజల దూరవిద్య, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలి-మెడిసిన్ మరియు ఈ-గవర్నెన్స్ అవసరాలను తీరుస్తాయి. SoFTNET ISROతో తాజా అవగాహన ఒప్పందాన్ని 28 సెప్టెంబర్ 2016 నుండి అమలులోకి తెచ్చింది. TS-క్లాస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడమే కాకుండా, TSPSC గ్రూప్ II సర్వీసెస్ ఆశించేవారికి కోచింగ్ తరగతులను కూడా ప్రారంభించింది. SoFTNET అవగాహన వీడియోల ద్వారా డిజిటల్ మరియు నగదు రహిత చెల్లింపులను కూడా ప్రోత్సహించింది.

S3. ANS (a)

Sol: ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన ‘ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.

S4. Ans (d)

Sol: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBS)  :

  • గ్రామీణ బ్యాంక్ లపై నియమించబడ్డ వర్కింగ్ గ్రూప్ సిఫారసులపై వాణిజ్య బ్యాంకులు సహకార సంఘాలు కృషికి అనుబంధంగా RRB లను ఏర్పాటు చేసింది.
  • ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో గ్రామీణ రుణ భారాన్ని తగ్గించి సంస్థాగత పరపతిని అందించుట ఒక అంశము.
  • 1975 సెప్టెంబర్ ల RRB ల స్థాపనకు ఆర్డినెన్స్లను జారీ చేసింది

S5. Ans (c)

Sol: భూ సంస్కరణల లక్ష్యాలను గూర్చి, ప్రణాళిక సంఘం అధికారికంగా క్రింది లక్ష్యాలను ప్రకటించింది.

1 వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలు తొలగించుట.

  1. వ్యవసాయ రంగంలో ఉన్న దోపిడీలు, సాంఘిక అన్యాయాలు తొలగించి భూమి దున్నేవాడికి రక్షణ ఇచ్చుట.

S6. Ans (b)

Sol: గ్రేడింగ్, ప్రామాణీకరణ: గ్రేడింగ్, ప్రామాణీకరణ్ సదుపాయాలు లేకుండా వ్యవసాయ మార్కెటింగ్ విధానం మెరుగకాదు. అందుచే వ్యవసాయ ఉత్పత్తుల (గ్రేడింగ్ మార్కెటింగ్) చట్టం 1937లో తీసుకు రావడం జరిగింది. గ్రేడింగ్ చేసిన. వ్యవసాయ ఉత్పత్తులకు అగ్ మార్క్ గుర్తును అందిస్తారు. 1937 (Central Quality Control Laboratory) ని నాగపూర్ లో స్థాపించారు. దీని ఆధ్వర్యంలో AGMARK (Agricultueal Marketing) ఇవ్వబడుతుంది. వ్యవసాయ వస్తువుల నాణ్యతను తెలియజేసేదే AGMARK.

Q7. Ans: (D)

మహమ్మద్ కుతుబ్‌షా గోల్కొండ రాజ్యంలో అస్థిరత నెలకొనకుండా చేసుకున్నాడు. చచ్చివారు ఇంగ్లీషు వారు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాల్ని నెలకొల్పుకొని పాశ్చాత్యీకరణ ప్రారంభానికి సాక్షీ భూతమితడు

S8. Ans: (A)

1843లో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ కు ప్రధాని అయ్యాడు.

Q9. Ans: (D)

బ్రూస్  నార్తజ్ తన ‘ది రెబెలియన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో బీరార్ ఒప్పదం గురించి ‘న్యాయ దేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని , గుడ్డిదాన్ని చేశారు’ అని పేర్కొన్నాడు. ఈ ఒప్పందాన్ని అవమానకరంగా భావించిన సిరాజ్ ఉల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు.

S10. Ans : (C)

ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి వారి రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి ప్రారంభమైన గొప్ప ఉద్యమం వహాబీ ఉద్యమం

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website

sailakshmi

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

31 mins ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 hours ago

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 విడుదల, 563 ఖాళీలు విడుదల, డౌన్లోడ్ PDF, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…

3 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

4 hours ago

SSC CHSL 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ, 3712 ఖాళీలకు రిజిస్ట్రేషన్ లింక్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…

5 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

21 hours ago