Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Q1. తెలంగాణ బడ్జెట్ 2022-23 ప్రకటన ప్రకారం, ఆసరా పెన్షన్ కోసం వయోపరిమితిని ఎంతకు తగ్గించారు?
Q2. తెలంగాణలో ఈ-నామ్ ని (e-NAM) విజయవంతంగా అమలు చేసినందుకు కింది ఏ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు (AMC) ప్రైమ్ మినిస్టర్ ఎక్సేలేన్సి అవార్డు లభించింది?
Q3. కౌలుదారుల సమస్యల పరిష్కారినికి తగిన సూచనలు ఇవ్వడానికి 1937లో నాటి నిజాం ప్రభుత్వం క్రింది వాటిలో ఏ కమిటీని ఏర్పాటు చేసింది?
Q4. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Q5. క్రింది వాటిలో సరికానిది ఏది?
Q6. GST కౌన్సిల్ కి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
Q7. తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీకి సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏవి సరైనవి?
Q8. టెక్నాలజీ హబ్ (T-హబ్) కి సంబంధించి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది?
Q9. క్రింద ఇవ్వబడిన ప్రకటనలలో సరైనవి ఏది/ఏవి?
Q10. తెలంగాణలోని కింది జిల్లాలవారిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను (MSME) వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
S1. Ans(d)
Sol: తెలంగాణ బడ్జెట్ 2022-23 ప్రకటన ప్రకారం, ఆసరా పెన్షన్ కోసం వయోపరిమితిని 65 సంవత్సరాల వయస్సు నుండి 57 సంవత్సరాల వయస్సుకి తగ్గించారు. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో రూ. 11,728కోట్లు కేటాయించడం జరిగింది.
S2. Ans(d)
Sol: జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ e-NAM(వ్యవసాయ ఉత్పత్తుల ఆన్ లైన్ వ్యాపారం కోసం) 2016, ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.రైతులు తమ ఉత్పత్తులను ఎప్పుడు,ఎక్కడ , ఏ ధరకు అమ్ముకోవాలో నిర్ణయించుకోవడానికి ఇది దోహదపడుతుంది. తెలంగాణలో ఈ-నామ్ ని (e-NAM) విజయవంతంగా అమలు చేసినందుకు నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు (AMC) ప్రైమ్ మినిస్టర్ ఎక్సేలేన్సి అవార్డు లభించింది
S3. Ans(b)
Sol: కౌలుదారుల సమస్యల పరిష్కారినికి తగిన సూచనలు ఇవ్వడానికి 1937లో నాటి నిజాం ప్రభుత్వం బరూచ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రైతులైతే 12 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ కాలం నిరంతరాయంగా భూమి సాగు చేస్తూ ఉన్నారో వారికి జిరాయితీ హక్కులు (అన్ని రకాల చట్టపరమైన రక్షణలు) కల్పించాలని కమిటీ సూచించింది. జిరాయితీ హక్కులు ఉన్నవారిని షిక్మిదార్లని, ఏ హక్కులు లేని ఇతర కౌలుదార్లని ఆసామి షిక్మిదార్లని పిలిచేవారు. అయితే కమిటీ సూచనలు అమలులో విఫలమయ్యాయి.
S4. Ans(b)
Sol: తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2014 సంవత్సరంలో ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగ క్యాప్షన్ – “Visit for All Seasons & All reasons” .తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ – ఉప్పల శ్రీనివాస్ గుప్త.తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ i- Explore Telangana app ను ప్రారంభించింది
S5. Ans(c)
Sol: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లాలో కలదు. దీనిని గోదావరి నది పై నిర్మించారు.
జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం , జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారంలో కలదు.
S6. ans(d)
Sol: ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అధ్యక్షతన GST కౌన్సిల్ 47వ సమావేశం జరిగింది. GST కౌన్సిల్ అనేది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి వేదిక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279(a)(1) ప్రకారం దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు.
కేంద్రప్రభుత్వం తరుపున కేంద్ర ఆర్థికమంత్రి, కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి దీనిలో సభ్యులు.రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆర్థిక లేదా పన్నుల ఇన్ఛార్జ్ మంత్రిని లేదా ఏ ఇతర మంత్రినైన సభ్యుడిగా పంపవచ్చు.
GSTకి సంబంధించి ముఖ్యమైన విషయాలపై GST కౌన్సిల్ రాష్ట్రాలకు సిఫారసు చేస్తుంది.
ఇటీవల, GST కౌన్సిల్ చేసే సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ 2022 మే నెలలో సుప్రీం కోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246a ప్రకారం GST చట్టం పై శాసనాలు చేయడానికి పార్లమెంట్ తో పాటు రాష్ట్ర శాసనసభలకు కూడా అధికారం ఉంటుందని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.
GST కౌన్సిల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే రేట్లను సర్దుబాటు చేయగలదు.కేంద్రం ఏదైనా సెస్ ని ప్రవేశపెట్టి GST చట్టాన్ని అతిక్రమించకూడదు.
S7. ans(c)
Sol: ‘తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030’ భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ ఏప్రిల్ 2019 నుండి అమలుచేస్తున్న FAME II పథకంపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ల స్వీకరణను, వినియోగాన్ని మరింత మెరుగుపరచడానికి ఆర్థిక మరియు ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందించాలని రాష్ట్రాలకు సూచించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, హైదరాబాద్ ను ‘గ్రీన్ సిటీ’ గా మార్చడానికి FAME (ఫాస్ట్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ) పథకం కింద 40 ఎలక్ట్రిక్ వాహనాలను TSRTC ప్రవేశపెట్టింది.
S8. ans(c)
Sol: ఆలోచనలతో రండి అవిష్కరనలతో వెళ్ళండి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన టీ-హబ్ రెండో దశను ముఖ్యమంత్రి కెసిఆర్ 2022, జూన్ 28న ప్రారంభించారు. రూ. 400కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని మాదాపూర్- రాయదుర్గం నాలెడ్జే సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ గా ఈ టీ-హబ్ 2.0 ని నిర్మించారు. ఇన్నోవేషన్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి 2015లో టీ-హబ్ ని ఏర్పాటు చేసింది.
S9. ans(c)
Sol: ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ‘టి – హబ్’ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికయ్యింది.
S10. ans(d)
Sol: తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం -2022 ప్రకారం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చాల్ – మల్కాజ్గిరి, నల్గొండ, కరీంనగర్ జిల్లాలలో ఎమ్.ఎస్. ఎమ్.ఇ (MSME) లు అధిక సంఖ్యలో కేంద్రీకరించబడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 48,224 ఎమ్.ఎస్. ఎమ్.ఇ (MSME) లు కలవు. జిల్లాల వారీగా పరిశీలిస్తే పెట్టుబడి, ఉద్యోగ కల్పనలలో మేడ్చల్-మల్కాజ్ గిరి ప్రథమ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా అధిక పెట్టుబడి వాటాలోను, సంగారెడ్డి జిల్లా ఉద్యోగకల్పనలో అధిక వాటాతో ద్వితీయ స్థానంలో ఉన్నాయి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…