Telangana State GK MCQs Questions And Answers in Telugu 12 January 2023, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. శాతవాహనల సామ్రాజ్యానికి ఏది తొలి రాజధాని?

(a) కొండాపూర్

(b) కోటిలింగాల

(c) పెద్ద బొంకూరు

(d) ధూళికట్ట

Q2. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండిస్తున్నట్లు వివరించినవారు ఎవరు ?

(a) మహదేవుడు

(b) రుద్రదేవుడు

(c) మార్క్ పోలో

(d) బేతన

Q3. ఏ ఆంధ్రమహా సభలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను గూర్చి చర్చించారు.

(a) తెలంగాణ 3వ ఆంధ్రమహాసభ

(b) తెలంగాణ 4వ ఆంధ్రమహాసభ

(c) తెలంగాణ 5వ ఆంధ్రమహాసభ

(d) తెలంగాణ 6వ ఆంధ్రమహాసభ

Q4. దిగువ వాటిని జతచేయండి

      జాబితా I (రచయితలు)            జాబితా II (రచనలు)

  1. నేబతి కృష్ణమంత్రి                           1. కుముదవల్లీ విలాసం
  2. ఎలకూచి బాలసరస్వతి                   2. తోతినామా (అనువాద కథలు)
  3. గవాసి                                           3. యాదవ రాఘవ పాండవీయం
  4. పొనుగోటి జగన్నాథరాయలు           4. రాజనీతి రత్నాకరం

Code:

             a    b    c    d

(a) 1   2   3   4

(b) 4   3   2   1

(c)  1   4   2   3

(d) 3   2   4   1

Q5. హైదరాబాద్ సంస్థానంలో అంతర్గత వ్యాపారం మీద _____ అనే సుంకం వసూలు చేసారు?

(a) సలార్ – ఏ – జాగిర్

(b) మాష్

(c) అసఫర్

(d) పైనవేవి కావు

Q6. ఆచార్య వినోభాభావే 1951లో భూదాన ఉద్యమాన్ని తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ భూదానోద్యమంలో మొదటి భూ దాత ఎవరు?

(a) కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి

(b) శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి

(c) జయప్రకాశ్ నారాయణ

(d) శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి

Q7. భారతదేశంలో తొలిసారిగా యుద్ధరంగంలో ‘గన్‌పౌడర్’ను ఉపయోగించినవారు?

(a) హసన్ గంగూ

(b) ఫిరోజ్‌షా

(c) ఒకటో మహమ్మద్ షా

(d) రెండో మహ్మద్ షా

Q8. ఎవరి కాలంలో తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం, సామాజికోద్యమం, రాజకీయోద్యమం ప్రారంభమైనవి?

(a) నిజాం అలీ

(b) అక్బర్ అలీ

(c) నాసిరుద్దౌలా

(d) మహబూబ్ అలీ ఖాన్

Q9. చాళుక్యుల కాలం నాటి గ్రామాధికారులు కు సంబంధించి కింది ప్రకటనలను పరిశిలించండి.

  1. గ్రన్తి – నీటి నిల్వలపై అధికారి
  2. కరణం – భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
  3. తలారి – గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
  4. గ్రామోపాధ్యాయుడు – గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు

పైన పేర్కొన్న ప్రకటనలో సరైనది ఏది?

(a) 2 మరియు 4 మాత్రమే

(b) 1 మరియు 3 మాత్రమే

(c) 1, 2, 4 మాత్రమే

(d) పైవన్నీ

Q10. క్రింది వారిలో ఎవరిని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తిస్తారు?

(a) బద్దెన

(b) పాల్కురిసోమనాథుడు

(c) కేతన

(d) పైనవేవి కావు

Solutions:

S1. Ans (b)

Sol: కోటిలింగాల శాతవాహనల సామ్రాజ్యానికి తొలి రాజధాని. ఇది ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కోటగోడలు, ఒక బురుజు బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహనుల్లో మొదటి రాజైన శ్రీముఖుని నాణేలు, శాతవాహనల పూర్వపు రాజుల నాణేలు దొరికాయి.

S2. Ans(c)

Sol: ఓరుగల్లు (వరంగల్) ప్రాంతంలో సువాసనలతో కూడిన వరి పండిస్తున్నట్లు మార్కోపోలో పేర్కొన్నాడు.రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో కాకతీయ రాజ్యం సిరి సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అని ప్రస్తావించాడు

S3. Ans (c)

Sol:

తెలంగాణ 5వ ఆంధ్రమహాసభ 1936లో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగింది.ఇది 1936 డిసెంబరు నెలలో జరిగింది.

అధ్యక్షుడు: కొండా వెంకట రంగారెడ్డి

అధ్యక్షురాలు: అనంత లక్ష్మీదేవి

ఈ సభలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను గూర్చి చర్చించారు

S4. Ans(b)

Sol

  • నేబతి కృష్ణమంత్రి – రాజనీతి రత్నాకరం
  • ఎలకూచి బాలసరస్వతి – యాదవ రాఘవ పాండవీయం
  • పొనుగోటి జగన్నాథరాయలు – కుముదవల్లీ విలాసం
  • గవాసి – తోతినామా (అనువాద కథలు)

 

S5. Ans(b);     హైదరాబాద్ సంస్థానంలో అంతర్గత వ్యాపారం మీద ‘మాష్’ అనే సుంకం వసూలు చేసి ‘మిలాత్-ఇ-ఇస్లామియా’కు ముట్టచెప్పడం జరిగేది. ఇదే కాకుండా తన సంస్థ కోసం రకరకాల పన్నులను వసూలు చేయాలని యార్ జంగ్ సంకల్పించాడు.

 

S6. Ans(d);     వినోభా భావే 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో శాంతి ప్రసంగం తర్వాత అక్కడి హరిజనులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచు కోవడానికి భూమి కావాలని పేర్కొన్నారు. దీంతో శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి 100 ఎకరాలు దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది

S7. Ans(c);     1వ మహమ్మదా క్రీ.శ 1364-65 లో గోల్కొండ దుర్గంతో సహ పరిసర ప్రాంతాల్ని ఆక్రమించినాడు. భారతదేశంలోనే మొదటి సారి యుద్ధరంగంలో గన్పౌడర్ ఉపయోగించినవాడితడు

S8. Ans(d);     తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం, సామాజికోద్యమం, రాజకీయోద్యమం ప్రారంభమైనవి. దీనిని చరిత్ర కారులు మూడు దశలుగా విభజించినారు. ఇందులో మొదటి దశకు సంబంధించిన కొన్ని సంఘటనలు మహబూబ్ అలీ కాలంలో జరిగినవి

S9. Ans(d);     చాళుక్యుల కాలం నాటి గ్రామాధికారులు:

  1. గ్రన్తి – నీటి నిల్వలపై అధికారి
  2. కరణం – భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
  3. తలారి – గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
  4. గ్రామోపాధ్యాయుడు – గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు

S10. Ans

(b);     తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు (1160- 1240) తెలంగాణ సాహిత్యంలోనే కాదు తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. ఆయన ఏ సంస్కృతపురాణంలో లేని స్వతంత్ర ఇతివృత్తాన్ని తీసుకోవడమే కాక, పూర్తిగా దేశీయమైన భాషను, నుడికారాన్ని.. ఛందస్సును తీసికొని దేశీయతకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినాడు

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

These Quizzes are helpful for TSPSC Group 2?

Yes, for more Quizzes visit Adda27 Telugu website

Pandaga Kalyani

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

9 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

11 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

14 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

15 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

15 hours ago