Telangana State GK MCQs Questions And Answers in Telugu 1 November 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – Questions

Q1. గోదావరి నదికి తెలంగాణ లో ఉన్న ఉపనదులు ఏమిటి?

  1. మంజీర
  2. మానేరు
  3. ఇంద్రావతి
  4. పైనవన్ని

Q2. తెలంగాణ ఏ ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో బాగంగా ఉంది?

  1. బస్టాల్
  2. నిస్
  3. గొండ్వానా
  4. పైనవేవి కావు

Q3. కింది వాటిని జత చేయండి.

జాబితా – I                                             జాబితా – II

A. మహల్వారి విధానం                     1. లార్డ్ కారన్ వాలీస్

B. రైత్వారీ విధానం                            2. విలియం బెంటిక్

C. జమిందారి విధానం                       3. ఆచార్య వినోభావే

D. భూదానోద్యమం                           4. థామస్ మన్రో

సరైన సమాధానం:

A             B             C             D

(a)          1              2              4              3

(b)          2              4              I               3

(c)           3              1              2              4

(d)          3              2              1              4

Q4. హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) కౌలు వ్యవసాయ భూముల చట్టం -1950 ఏ కమిటీ సూచనల ఆధారంగా తీసుకురావడం జరిగింది?

(a)  హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ

(b) హైదరాబాద్ కౌలుదారుల పరిరక్షణ కమిటీ

(c) హైదరాబాద్ భూ గరిష్ట పరిమితి కమిటీ

(d) పైవేవీ కావు

Q5. కొమరం భీం ను నిజాం పోలీసులు హత్య చేసిన తేదీ?

  1. 1940 సెప్టెంబరు 1
  2. 1945 సెప్టెంబర్ 5
  3. 1942 ఆగష్టు 1
  4. 1943 నవంబర్ 4

Q6.  భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని తప్పుబట్టిన ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు

  1. జె చొక్కారావు
  2. మర్రి చెన్నారెడ్డి
  3. వెంగళరావు
  4. కాసు బ్రహ్మానందరెడ్డి

Q7. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది?

  1. అధిక ఉష్ణోగ్రత , తక్కువ చలి
  2. అధిక ఉష్ణోగ్రత, అధిక చలి
  3. అధిక చలి, తక్కువ ఉష్ణోగ్రత
  4. తక్కువ ఉష్ణోగ్రత , తక్కువ చలి

Q8. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పడు జరిగింది?

(a) 1969 ఏప్రిల్ 14

(b) 1969 ఏప్రిల్ 10

(c) 1956 ఫిబ్రవరి 20

(d) 1969 నవంబర్ 1

Q9. శ్రీ‌ కృష్ణ దేవరాయలకు తన కుమార్తె అయిన తుక్కాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నవారు?

(A) హంవీరుడు

(B) కపిలేశ్వర గజపతి

(C) పురుషోత్తమ గజపతి

(D) ప్రతాపరుద్ర గజపతి

Q10. ఆధునిక భారతదేశంలో సామాజిక, మత, రాజకీయ సంస్కరోణద్యమాల మూలపురుషుడుగా ఎవరిని పేర్కొంటారు?

  1. రాజా రాంమోహన్ రాయ్
  2. రావి నారయణ రెడ్డి
  3. కాళోజి నరసింహారావు
  4. బూర్గుల రామకృష్ణారావు

Solutions:

S1. Ans (d)

Sol: గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఇది దేశంలో రెండో పొడవైన నది. దక్షిణ బారతదేశంలో పొడవైన నది. గోదావరి నదికి తెలంగాణ లో ఉన్న ఉపనదులు మంజీర, మానేరు, కిన్నెరసాని, పెద్దవాగు, శబరీ, ఇంద్రవతి, ప్రాణహిత, వేన్ గంగా, వార్దా, వెయిన్ గంగా.

S2. Ans (c)

Sol: తెలంగాణ పురాతన  గొండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో బాగంగా ఉంది. రాష్ట్రంలో ని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమి లో భాగంగా ఉన్నాయి.

S3. Ans (b)

Sol: బెంగాల్ లో లార్డ్ కారన్ వాలీస్ 1793 లో జమిందారి విధానాన్ని ప్రవేశపెట్టాడు.

థామస్ మన్రో 1807 లో రైత్వారీ  విధానాన్ని ప్రవేశపెట్టాడు.

విలియం బెంటిక్ 1833 లో మహాల్వరి విధానాన్ని ప్రవేశపెట్టాడు.

ఆచార్య వినోభావే   1951 లో భూదానోద్యమం ప్రారభించాడు.

S4. Ans (a)

Sol: హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు జూన్, 1950లో కౌలు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి 1951 లో రెండు సవరణలు, ఆ తరువాత మరికొన్ని సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల (ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్) ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.

S5. Ans (a)

Sol: గోండు వీరుడు, గిరిజన జాతి ముద్దు బిడ్డ, కొమరం భీం ను నిజాం పోలీసులు హత్య చేసిన తేదీ – 1940 సెప్టెంబరు 1.

S6. Ans (a)

Sol: భార్గవ కమిటీ నివేదిక సమగ్రంగా లేదని ప్రధాని హామీలను ప్రతిపాదించడం లేదని ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు జె చొక్కారావు  తప్పుబట్టారు.

S7. Ans (b)

Sol: తెలంగాణ రాష్ట్రనిది ఆయన రేఖా ఋతుపవన శీతోష్ణస్థితి. రాష్ట్రంలో ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత, అధిక చలి(అర్ధశుష్క శీతోష్ణస్థితి)ఉంటుంది. రాష్ట్రంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెంటిగ్రేడ్, సగటు కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.

S8. Ans (c)

Sol: కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ పంత్ సమక్షంలో 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో లేదా దక్కన్ హౌస్ లో చర్చలు జరిగాయి పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేది 1956 ఫిబ్రవరి 20.

S9. Ans (d)

Sol: ప్రతాపరుద్ర గజపతి కృష్ణదేవరాయలకు తన కూతురు తుక్కాదేవి నిచ్చి సంధి చేసుకొని తిరిగి ఈప్రాంతాలను పొందినాడు. ఉభయరాజ్యాలకు కృష్ణానది సరిహద్దుగా విధంగ ఒప్పందం చేసుకున్నాడు.

S10. Ans (a)

Sol: ఆధునిక భారతదేశ పునరుజ్జీవనానికి నాంది పలికిన వారు రాజా రాంమోహన్ రాయ్. ఆధునిక భారతదేశంలో సామాజిక, మత, రాజకీయ సంస్కరోణద్యమాల మూలపురుషుడుగా పేర్కొంటారు. భారతదేశ పురోగతికి ఆంగ్ల విద్యా విధానం అవసరమని భావించాడు.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
Pandaga Kalyani

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF 2020 | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

4 mins ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

47 mins ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

4 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

5 hours ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

6 hours ago