Telangana State GK MCQs Questions And Answers in Telugu 05 November 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – Questions

Q1. గ్రామంలోని భూమి అంతా గ్రామం ఆస్తిగా పరిగణించి, గ్రామం అంతటికీ శీస్తును నిర్ణయించి, ఆ శిస్తు చెల్లించే బాధ్యత ఉమ్మడిగానూ, వ్యక్తిగతంగాను నిర్దేశించటాన్ని ఏమని పిలుస్తారు?

  1. రైత్వారీ పద్ధతి
  2. మహల్వారీ పద్ధతి
  3. జమీందారీ పద్ధతి
  4. కౌలుదారీ

Q2. కుమార్ లలిత్ నివేదిక ప్రకారం తెలంగాణ – ఆంధ్రల వ్యయాల నిష్పత్తి జరగవలసి ఉంది?

(a) 1 : 2.2 

(b) 2 : 2.5

(c) 2 : 3

(d) 1 : 2

Q3. తెలంగాణలో అధిక రైతులు బావుల ద్వారానే వ్యవసాయం సాగించడానికి గల కారణమేమిటి?

(a) నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించకపోవడం

(b) నదుల నుండి ప్రవహించే నీటిలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకపోవడం

(c) చెరువుల పునరుద్ధరణ కార్యాక్రమాలను చేపట్టక పోవడం.

(d) పైవన్నీ

Q4. కింది వాటిని జత చేయండి.

జాబితా – I జాబితా – II

  1. సెక్షన్ 84 1. నీటి వనరుల కేటాయింపు
  2. సెక్షన్ 85 2. తుంగభద్ర బోర్డు ఏర్పాటు
  3. సెక్షన్ 89 3. జల నిర్వహణ మండలి ఏర్పాటు
  4. సెక్షన్ 91 4. గోదావరి కృష్ణా నది జల యాజమాన్య శిఖరాగ్ర మండలి

సరైన సమాధానం:

A B C D

(a) 1 2 4 3

(b) 2 4 1 3

(c) 3 1 2 4

(d) 4 3 2 1

Q5. నిజాంసాగర్ రిజర్వాయర్లోనికి ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పైభాగంలో 38 టి.ఎం.సి.ల సామర్థ్యం గల ఏ ప్రాజెక్టును నిర్మించారు?

(a) సింగూర్ ప్రాజెక్టు 

(b) దేవనూర్ ప్రాజెక్టు 

(c) ఇచ్చంపల్లి ప్రాజెక్టు 

(d) ఎల్లంపల్లి ప్రాజెక్టు

Q6. ఒక వ్యవసాయ సం॥లో ఆహార, ఆహారేతర పంటల కింద ఉన్న భూమి, మరియు ఒక సారి కంటే ఎక్కువ సార్లు సేద్యమయ్యే భూమిని ఏమని పిలుస్తారు?

  1. స్థూల సేద్య భూమి 
  2. నికర సాగు భూమి
  3. పంటల సాంద్రత
  4. పైవేవి కావు

Q7. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ లోని సభ్యులు ఎవరు?

  1. విహరి మాథూర్ (ఆసియా విద్యా సంస్థల చైర్మన్),
  2. హరిభూషన్ బార్ (అసిస్టెంట్ కాగ్),
  3. సెక్రెటరీ టి.ఎన్. క్రిష్ణ స్వామి.

(a) 1, 2, 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1 మరియు 3

Q8. ఇ-నామ్ కింద వెయిటింగ్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ లను అమలు చేసిన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?

  1. మహారాష్ట్ర
  2. తమిళనాడు
  3. ఆంధ్రప్రదేశ్
  4. తెలంగాణ

Q9. ఈ క్రింది వానిలో సరియైన వాక్యం

(a) 1961 చట్టంలో కుటుంబాన్ని యూనిట్గా కాకుండా ఒక్కొక్క సభ్యున్ని యూనిట్గా తీసుకున్నారు.

(b) 1973 భూ గరిష్ట పరిమితి చట్టంలో 5 గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు.

(c) 1973 భూ గరిష్ట పరిమితి చట్టం 1975లో అమలులోకి వచ్చింది.

(d) పైవన్నీ

Q10. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కొలవడానికి ముఖ్యమైన సూచిక.

  1. రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి
  2. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి
  3. జిల్లా స్థూల ప్రాంతీయోత్పత్తి
  4. జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి

Solutions:

S1. Ans (b)

Sol: గ్రామంలోని భూమి అంతా గ్రామం ఆస్తిగా పరిగణించి, గ్రామం అంతటికీ శీస్తును నిర్ణయించి, ఆ శిస్తు చెల్లించే బాధ్యత ఉమ్మడిగానూ, వ్యక్తిగతంగాను నిర్దేశించటంమహల్వారీ పద్ధతిఅని అంటారు.

S2. Ans(b)

Sol: కుమార్ లలిత్ నివేదిక ప్రకారం తెలంగాణ – ఆంధ్రలో 2 : 2.5 నిష్పత్తిలో వ్యయం జరగవలసి ఉండగా వాస్తవంలో 1 : 2.2 నిష్పత్తిలో జరిగింది.

S3. Ans(d)

Sol: తెలంగాణలో అధిక రైతులు బావుల ద్వారానే వ్యవసాయం సాగించడానికి గల కారణాలు:

  • నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించకపోవడం
  • నదుల నుండి ప్రవహించే నీటిలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకపోవడం
  • చెరువుల పునరుద్ధరణ కార్యాక్రమాలను చేపట్టక పోవడం

S4. Ans(d)

Sol: సెక్షన్ 84 గోదావరి కృష్ణా నది జల యాజమాన్య శిఖరాగ్ర మండలి 

సెక్షన్ 85 జల నిర్వహణ మండలి ఏర్పాటు

సెక్షన్ 89 నీటి వనరుల కేటాయింపు

సెక్షన్ 91 తుంగభద్ర బోర్డు ఏర్పాటు

S5. Ans(b)

Sol: నిజాంసాగర్ రిజర్వాయర్లోనకి ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పై భాగంలో 38 టి.ఎం.సి.ల సామర్థ్యం గల దేవనూరు ప్రాజెక్టు ను నిర్మించారు

S6. Ans (a)

Sol: ఒక వ్యవసాయ సం॥లో (ఖరీఫ్+రబీ+జియాద్ కాలంలో) ఆహార, ఆహారేతర పంటల కింద ఉన్న భూమి, మరియు ఒక సారి కంటే ఎక్కువ సార్లు సేద్యమయ్యే భూమిని స్థూల సేద్య భూమిగా పిలవవచ్చు. 

స్థూల సేద్య భూమి= నికర సాగు భూమి + ఒకసారి కంటే ఎక్కువ సార్లు సాగయ్యే భూమి

S7. Ans (a)

Sol: జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ లోని సభ్యులు :

  • విహరి మాథూర్ (ఆసియా విద్యా సంస్థల చైర్మన్),
  • హరిభూషన్ బార్ (అసిస్టెంట్ కాగ్),
  • సెక్రెటరీ టి.ఎన్. క్రిష్ణ స్వామి.

S8. Ans (d)

Sol: ఇ-నామ్ కింద వెయిటింగ్ ఇంటిగ్రేషన్ మరియు పేమెంట్ లను అమలు చేసిన దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

S9. Ans (d)

Sol: 

  • 1961 చట్టంలో కుటుంబాన్ని యూనిట్గా కాకుండా ఒక్కొక్క సభ్యున్ని యూనిట్గా తీసుకున్నారు.
  • 1973 భూ గరిష్ట పరిమితి చట్టంలో 5 గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు.
  • 1973 భూ గరిష్ట పరిమితి చట్టం 1975లో అమలులోకి వచ్చింది

S10. Ans(a)

Sol: రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి లేదా రాష్ట్ర ఆదాయం అనేది రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కొలవడానికి ముఖ్యమైన సూచిక. రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల, సేవల విలువల మొత్తాన్ని లెక్కించడం రాష్ట్ర స్థూల ప్రాంతీయాదాయం అని నిర్వచించవచ్చు.

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

16 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

18 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

18 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

21 hours ago