Telugu govt jobs   »   Telangana History-Salarjung Reforms   »   Telangana History-Salarjung Reforms

Telangana History – Salarjung Reforms, Download PDF in Telugu | తెలంగాణ చరిత్ర – సాలార్‌జంగ్ సంస్కరణలు, డౌన్లోడ్ PDF

Salarjung Reforms | సాలార్‌జంగ్ సంస్కరణలు

సర్ మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I, 1829 సాలార్ జంగ్ I అని పిలుస్తారు, అతను 1853 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా 1883లో మరణించే వరకు పనిచేసిన ఒక భారతీయ గొప్ప వ్యక్తి.  1853 నుండి 1883 వరకు సుమారు 30 సంవత్సరాలు, అతను ముగ్గురు అసఫ్జాహీ రాజులు – నాసిర్-ఉద్-దౌలా, అఫ్జల్-ఉద్-దౌలా మరియు మీర్ మహబూబ్-అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. బహమనీ రాజ్యం యొక్క ప్రధాన మంత్రి మహమ్మద్ గవాన్‌తో సమానంగా ఆయనను పోల్చారు. విలియం డిగ్బీ మాట్లాడుతూ, ‘సాలార్ జంగ్ నిజాం ‘రాజ్యంలో’ పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చారు. ఈ కధనంలో సాలార్ జంగ్ I చేసిన సంస్కరణలు గురించి వివరించాము.

Telangana History -Salarjung Reforms, Download PDF in Telugu_3.1

అసలు పేరు : మీర్ తురబ్ అలీ ఖాన్

దివాన్ గా ఉన్న కాలం : 1853 -83

సత్కారం : డాక్టర్ ఆఫ్ సివిల్ లా (ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ)

 • ఇతను ప్రవేశపెట్టిన సంస్కరణలకు ‘డైటన్’ అనే బ్రిటీషు అధికారి మార్గదర్శకుడైనాడు.
 • ఇతను 30 సంవత్సరాలు దివాన్ గా ముగ్గురు నిజాంల వద్ద పనిచేశాడు-
 • 1) నాసిరుద్దేలా- 1853-57
 • 2) అఫ్జల్  ఉద్దౌల – 1857-69
 • 3)మీర్ మహబూబ్ అలీఖాన్- 1869-83

Revenue and Governance Reforms | రెవెన్యూ మరియు పాలనా సంస్కరణలు

1853కు పూర్వం రెవెన్యూ వ్యవస్థలో భూమిశిస్తు వసూలుకొరకు ఉన్న వేలంపాట లేదా కమీషన్ పద్ధతిని రద్దు చేశాడు.

రైత్వారీ విధానం

 • రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు.
 • ప్రతి 30 సం||ల కొకసారి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.

కస్టమ్స్

Telangana History -Salarjung Reforms, Download PDF in Telugu_4.1

 • హైదరాబాద్ రాజ్యంలో జరిగే ఎగుమతి, దిగుమతిలపై 5% పన్ను విధించాడు. 
 • పన్నుల వసూలుకు 1864లో కస్టమ్స్ శాఖను ఏర్పాటు చేశారు.
 • 1864లో దఫర్-ఎ-ముల్క్ అనే రాజకీయ శాఖను (బ్రిటీష్ ప్రభుత్వం, తాలూకా దార్లతో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపడం కోసం) ఏర్పాటు చేశాడు.
 • ప్రధాని ఆధీనంలో శాఖల నిర్వహణకై నలుగురు సదరుల్ మహమ్ లను (శాఖామంత్రులు) 1868లో నియమించాడు- .
 • రెవెన్యూ మంత్రి – నవాబ్ ముఖరం ఉద్దెల
 • న్యాయశాఖ మంత్రి – నవాబ్ బషీర్ ఉద్ఘాల 
 • పబ్లిక్ శాఖ మంత్రి – నవాబ్ షాహ జంగ్
 • పోలీస్ మంత్రి – నవాబ్ షంషేర్ జంగ్ 
 • 1865లో నూతన జిల్లాబంది వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ జీతంతో పనిచేసే అధికార్లను నియమించాడు. 
 • జిల్లాబందీ విధానం ప్రవేశపెట్టినపుడు నాటి నిజాం – అష్టలుడాలా, రెసిడెంట్ – జార్జ్ యూల్.
 • దీని ప్రకారం హైద్రాబాద్ రాజ్యాన్ని 5 సుబాలు, 17 రెవెన్యూ జిల్లాలుగా విభజించినాడు.
 • సుభాలు /విభాగాలు – సదర్ తాలూకాదార్ (సుబేదార్)
 • జిల్లాలు – తాలూకాదార్
 • తాలూకాలు – తహసిల్దార్
 • గ్రామాలు – పట్వా రీ

రెవెన్యూ బోర్డు

 • ఇది 1864లో ఏర్పాటయింది. 
 • 1867లో రదై దీని స్థానంలో సదర్ మహకే -ఇ-మల్-గుజారీ (కేంద్ర రెవెన్యూశాఖ) ఏర్పాటయింది.
 • 1875లో రెవిన్యూ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేశాడు.

Economic reforms | ఆర్థిక సంస్కరణలు

 • 1857లో హాలిసిక్కాను ప్రవేశపెట్టాడు. (బ్రిటీష్ రూపాయి కంటే 15% తక్కువ విలువ కలది).
 • ” హాలిసిక్కా చలామణికై హైద్రాబాద్ లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని ఏర్పాటు చేశారు.

Police Reforms | పోలీస్ సంస్కరణలు

 • 1867లో రెవెన్యూ బోర్డ్ రదైన తరువాత రెవెన్యూశాఖ నుండి పోలీస్ వ్యవస్థను వేరు చేసి సదర్ ఉల్ మెహతమీన్ కొత్వాల్ అనే అధికారిని నియమించారు.
 • 1869లో పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది.
 • నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు
 • ప్రతి జిల్లాకు – మహాతమీన్ (పోలీస్ సూపరిండెంట్)
 • తాలుకాకు – అమీన్ (ఇన్స్పెక్టర్)
 • టాణాకు – జమేదార్
 • చౌకీ (పోలీస్ స్టేషన్) కి – దఫేదార్లను నియమించారు

Legal reforms | న్యాయ సంస్కరణలు

 • 1862లో న్యాయశాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు 
 • మొదటి న్యాయశాఖామంత్రి నవాబ్ బషీర్ ఉదోలా ను నియమించారు  
 • జిల్లాస్థాయి : సివిల్ కేసుల కొరకు – మున్సిఫ్, క్రిమినల్ కేసులకు మీర్ అదాలత్ లను నియమించారు 
 • జిల్లా అధికారులపై పర్యవేక్షణకు (హైకోర్టు) మహాకాయి-ఇ-సాదర్ ఉండేది.
 • హైద్రాబాద్ లో ప్రత్యేక సివిల్, క్రిమినల్ కోర్టులను ఏర్పరిచారు.
 • దివాని అదాలత్ – సివిల్ కోర్టు
 • ఫౌజ్ దారీ అదాలత్ – క్రిమినల్ కోర్టుగా వ్యవహరిస్తారు.

AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 - ఆగష్టు 2023లో విడుదల_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Educational reforms | విద్యా సంస్కరణలు

Telangana History -Salarjung Reforms, Download PDF in Telugu_6.1

 • సాలార్‌జంగ్ 1854లో దారుల్-ఉల్మ్ అనే ఓరియంటల్ ప్రభుత్వ విద్యాసంస్థను స్థాపించాడు. 
 • 1873- మదర్సా-ఇ-ఆలియా (ప్రభువుల పిల్లల కొరకు)
 • 1878 – మదర్సా -ఇ-ఐజా (రాజ కుటీంబుకుల పిల్లల కొరకు) 
 • 1881 – గ్లోరియా గర్ల్స్ హైస్కూల్ (మొదటి బాలికల పాఠశాల).
 • 1884లో మహబూబియా కాలేజి స్థాపించబడింది.
 • నిజాం కాలేజ్:  చాదర్ ఘాట్ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ మద్రాస్ యూనివర్సిటీతో సెకండ్ గ్రేడ్ కాలేజిగా గుర్తింపు పొందింది.
 • 1884లో దీనిని హైద్రాబాద్ కాలేజిగా పేరు మార్చారు.
 • 1887లో ఈ కాలేజీ నిజాం కాలేజిగా మార్చబడింది.
 • విద్యాశాఖ పనితీరు పర్యవేక్షణకు ప్రతి విభాగానికి ముహతామిమ్స్ తాలిమత్ అనే అధికారులను నియమించారు

Transport reforms | రవాణా సంస్కరణలు

రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ

 • 1856-57లో హైద్రాబాద్ రాజ్యంలో మొదటగా ‘ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్’ సౌకర్యం కల్పించబడింది.
 • 1869 సెప్టెంబర్ 8న హైద్రాబాద్ లో మొట్టమొదటి తపాల బిళ్ళను ప్రవేశపెట్టారు. 
 • 1866లో హైదరాబాద్-ముంబాయి-మద్రాస్ లను కలుపుతూ గ్రాండ్ పెన్సులార్ రైల్వేలైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 • 1874లో వాడి-సికింద్రాబాద్ మధ్య 121 మైళ్ళ దూరం రైలు మార్గం వేయబడింది.
 • 1868లో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు గ్రాండ్ టంక్ రోడను నిర్మించారు.

Industrial reforms | పారిశ్రామిక సంస్కరణలు

 • 1856లో బ్రిటీష్ రెసిడెన్సీ అధికారి డా,, స్మిత్ వస్తు ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. 
 • 1873లో హైదరాబాద్ లో మొదటి స్పిన్నింగ్ & వీవింగ్ బట్టల మిల్లు స్థాపించబడినది.
 • 1876లో ఫిరాని ఫ్యాక్టరీ స్థాపించబడినది.

Other Reforms | ఇతర సంస్కరణలు

 • సాలర్‌జంగ్ హైద్రాబాద్ లో సతీసహగమనమును నిషేధించారు  
 • సాలర్‌జంగ్ అలీఘర్ లో విద్యాసంస్థలు నెలకొల్పేందుకు – సర్ సయ్యద్ అహ్మద్ ఆర్థిక సహాయాన్ని అందించారు
 • బేరార్ విషయం కోసం ఇంగ్లాండుకు వెళ్ళి విక్టోరియా మహారాణితో చర్చలు జరిపారు.
 • 1883 లో కలరా వ్యాధి సోకి సాలార్‌జంగ్-1 మరణించారు

Telangana Study Note:

Telangana History (తెలంగాణ చరిత్ర) Telangana State Formation – Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర -తెలంగాణ రాష్ట్ర అవతరణ)
Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Telangana Government Schemes (తెలంగాణ ప్రభుత్వ పధకాలు)
Telangana Current Affairs (తెలంగాణ కరెంటు అఫైర్స్) Other Study Materials

1857 Sepoy Mutiny | 1857 సిపాయిల తిరుగుబాటు

సిపాయిల తిరుగుబాటు అధికారికంగా మీరట్ లో ప్రారంభమైన రోజు – మే 10, 1857.

తిరుగుబాటుదారుల చేత తమదేశ చక్రవర్తిగా ప్రకటింపబడినవారు – బహదూర్ షా.

1857 తిరుగుబాటు-హైద్రాబాద్ సంస్థానం

 • 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ నిజాం – అఫ్టల్ ఉదెలా. 
 • 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ దివాన్ – సాలార్‌జంగ్-1 (మీర్ – తురబ్-అలీఖాన్).
 • ఈ తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ లో బ్రిటీష్ రెసిడెంట్ – కల్నల్ డేవిడ్సన్. 

ఔరంగాబాద్ అశ్వికదళాల తిరుగుబాటు

 • ఔరంగాబాద్ లో 1వ, 2వ అశ్విక దళాలు సంస్థానం వెలుపలికి వెళ్ళడానికి నిరాకరించినారు. 
 • ఈ అశ్వికదళాల తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు – మీర్ ఫిదా అలీ,  జమేదార్ అమీర్ ఖాన్.
 • మీర్ ఫిదా అలీనీ ఉరితీయడం జరిగింది. అమీర్ ఖాన్ పారిపోయాడు.

Bulthana Revolt | బుల్తానా తిరుగుబాటు

 • బుల్తానా లో జమేదార్ చిడ్డాఖాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. 
 • తిరుగుబాటు అనంతరం ‘చిడ్డాఖాన్’ పారిపోయి హైద్రాబాద్ నగరం చేరుకొన్నాడు.
 • హైద్రాబాద్ దివాన్ సాలర్‌జంగ్ ‘చిట్టాఖాన్’పై 3,000 రివార్డు ప్రకటించాడు. 
 • తర్వాత కాలంలో సాలార్‌జంగ్ చిట్లాఖాన్ ను, అతని అనుచరులను అరెస్టుచేసి బ్రిటీష్ రెసిడెంటుకు అప్పగించినారు.
 • 1857 జూలై 17న మక్కామసీదులో ప్రజలు సమావేశమై అయి ‘చిట్లాఖాన్’ను విడిపించాలని తీర్మానించారు.
 • చిట్లాఖానను విడిపించడానికి ‘బ్రిటీష్ రెసిడెంట్’ పై దాడికి సిద్ధమయ్యారు.
 • బ్రిటీష్ రెసిడెంట్ పై దాడిలో రోహిల్లా సైనికులకు నాయకత్వం వహించినది – 1. తుర్రెఖాజ్ ఖాన్ 2.మౌల్విఅల్లా ఉద్దీన్.
 • బ్రిటీష్ రెసిడెన్సీ దాడికి అబ్బాస్ సాహిబ్, జయగోపాలదాస్ అనేవడ్డీ వ్యాపారుల ఇండ్లను తుర్రెఖాజ్ ఖాన్ తమ స్థావరంగా ఉపయోగించుకున్నాడు.

తుర్రేబాజ్ ఖాన్:

 •  తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలోని రోహిల్లాల తిరుగుబాటుకు వ్యతిరేకంగా మేజర్ బ్రిక్స్ నాయకత్వంలోని బ్రిటీష్ సైన్యం దాడి ప్రారంభించింది.
 • అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ కల్నల్ డెవిడ్సన్ ఈ తిరుగుబాటును సమర్థవంతంగా తిప్పికొట్టాడు.
 • ‘కుర్బాన్ అలీ’ అనే ద్రోహి సమాచారంతో తుర్రేబాజ్ ఖానను ‘తుఫ్రాన్’ వద్ద చుట్టు ముట్టి కాల్చి చంపారు.

మౌల్వి అల్లావుద్దీన్

 • మౌల్వి అల్లావుద్దీన్‌ను మంగళంపల్లి వద్ద అరెస్టు చేశారు.
 • మౌల్వి అల్లావుద్దీన్ కు జీవిత కారాగార శిక్ష విధించి, అండమాన్ జైలుకు తరలించారు.
 • మౌల్వి అల్లావుద్దీన్ హైదరాబాద్ రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా పేర్కొనవచ్చు. ఇతను అక్కడే 1884 లో మరణించాడు.
 • రెసిడెంట్ దాడి తర్వాత కూడా అక్కడక్కడ హైద్రాబాద్ సంస్థానంలో ఈ తిరుగుబాటు కొనసాగింది.
 • షోలాపూర్ లో – రాజా వెంకటప్పనాయక్
 • నిర్మల్ లో – రోహిల్లా పితూరి.
 • ఆదిలాబాద్ లో – రాంజీగోండ్
 • కౌలాస్ లో – రంగారావు పట్వారీ.
 • మాల్కేడ్, కోపాల్ ప్రాంతంలోని జమీందారులు.
 • ఈ విధంగా హైద్రాబాద్ సంస్థానంలో 1857 సిపాయిల తిరుబాటు అంతం అయింది.

1857 తిరుగుబాటు వలన హైద్రాబాద్ సంస్థానంకు కలిగిన ప్రయోజనాలు

 • నిజాం నవాబు అఫ్టల్ ఉదెలాకు ‘ది స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదునిచ్చారు.
 • దివాన్ మీర్ తురబ్ అలీఖాన్ (సాలార్‌జంగ్-1)కు సాలార్‌జంగ్ బిరుదునిచ్చారు.
 • నిజాం చెల్లించవలసిన 50 లక్షల రూపాయల అప్పును రద్దు చేశారు.
 • నిజాం నుండి బకాయిల క్రింద తీసుకొన్న రాయచూర్, ఉస్మాన్ బాలను తిరిగి ఇచ్చివేశారు. 
 • నిజాం నవాబు పూర్తిగా తన పేరుతో నాణెములు ముద్రించుకునే అవకాశం కల్పించారు.

తెలంగాణ చరిత్ర – సాలార్‌జంగ్ సంస్కరణలు PDF

మరింత చదవండి 
తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు  తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 
తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు  తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు
తెలంగాణ చరిత్ర – కాకతీయులు తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు
తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు 

pdpCourseImg

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Sharing is caring!

FAQs

What is Telangana old name?

The name "Telangana" refers to the word Trilinga Desa, earned due to the presence of three ancient Shiva Temples at Kaleshwaram, Srisailam, and Draksharamam.

What are the reforms of Salarjung?

His earlier reforms included constitution of courts of justice at Hyderabad, organization of the police force, construction and reparation of irrigation works, and establishment of schools.

Who gave the title Salarjung?

Mir Laiq Ali Khan was the son of Mir Turab Ali Khan, Salar Jung I.

What was the role of Salarjung reforms in modernization of Telangana?

Salarjung had extended priceless service for the development of Hyderabad Kingdom. He brought life to the declining economic system in 1853 through his economic reforms.