Telugu govt jobs   »   Telangana History- Asafjahis   »   Telangana History- Asafjahis

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం Pdf

Telangana History- Asafjahis, Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana History that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం Pdf : 

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ చరిత్ర(Telangana History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana History PDF In Telugu (తెలంగాణ చరిత్ర PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_40.1

తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం (క్రీ.శ.1724-1948)

స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్
రాజధాని ఔరంగబాద్, హైదరాబాద్
గొప్పవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్
చివరివాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం)
 •  1724లో నిజాం-ఉల్-ముల్క్ దక్కన్లో ఔరంగాబాద్ రాజధానిగా స్వతంత్రీకరించాడు.
 • అసఫ్ హీలు టర్కీలోని – ‘తురాని తెగకు’ చెందినవారు. (పర్షియా).

Download : APPSC Group 4 Official Notification 2021

 

అసఫ్ జాహీ వంశం- రాజకీయ చరిత్ర

 

నిజాం-ఉల్-ముల్క్ (1724-48)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_50.1

 • ఇతను అసఫ్ జాహీ వంశ స్థాపకుడు.
 • ఇతని అసలు పేరు – మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్.
 • ఇతన్ని ఔరంగజేబు 4000 సేనకు మున్సబ్ దారునిగా నియమించి “చిన్ కిలిచ్ ఖాన్” అనే బిరుదునిచ్చాడు.
 • ఫరూక్ సియార్ 7000 ల సేనకు ఇతన్ని మున్సబ్ దారునిగా నియమించి ఫతేజంగ్,నిజాం-ఉల్-ముల్క్ అనే బిరుదులనిచ్చాడు.
 • మొగల్ చక్రవర్తి మహమ్మద్ షా 8000 సేనకు ఇతన్ని మున్సబ్ దారునిగా నియమించి అసహో అనే బిరుదునిచ్చాడు.
 • ఇతను 1724లో శక్కర్ ఖేదా యుద్ధంలో ముబారిజ్ ఖాన్ ను ఓడించి అసఫ్ జాహీ రాజ్యంను స్థాపించాడు.
 • ఇతను ఔరంగాబాదు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు.
 • 1739 “కర్నాల్” యుద్ధంలో పర్షియా రాజు “ నాదిర్షా ” మొఘల్ సైన్యాన్ని ఓడించగా నాదిర్ షాకు,మొఘలకు మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో నిజాం-ఉల్- ముల్క్ కీలక పాత్ర పోషించాడు.
 • ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంలను నాదిర్హాకు మొఘల్ రాజులు ఇవ్వడం జరిగింది.
 • 1748లో ఢిల్లీ పై అహ్మద్ షా అబ్దాలీ దండెత్తగా మహ్మద్ షా రంగీలాకు సహాయం చేయడానికి వెళుతూ బుర్హనపూర్ వద్ద అనారోగ్యం పాలై మరణించాడు.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_60.1

నాజర్ జంగ్ (1748-50)

 • నిజాం-ఉల్-ముల్ రెండవ కుమారుడు
 • మొఘల్ చక్రవర్తితో నిజాం ఉదెలా అనే బిరుదును పొంది దక్కన్ సుబేదార్ అయ్యాడు.
 • నిజాం-ఉల్-ముల్ మరణానంతరం నాజర్ జంగ్ తన మేనల్లుడైన ముజఫర్ జంగ్ తో వారసత్వ  యుద్ధం మొదలైంది.
 • ముజఫర్ జంగ్, ఫ్రెంచి గవర్నర్ డూప్లేలు కుట్ర చేసి నాజర్‌జంగ్ ను చంపించారు.

ALSO READ : ICAR IARI Recruitment 2021

 

ముజఫర్ జంగ్ (1750-51)

 • ఫ్రెంచి గవర్నర్ డూప్లే సహాయంతో ముజఫంగ్ నవాబుగా నియమించబడ్డాడు.
 • 1751 లో పాండిచేరి నుండి ఔరంగబాద్ వెళ్తున్నపుడు కడపలోని రాయచోటి దగ్గర “లక్కిరెడ్డిపల్లి” వద్ద కడప నవాబు (హిమ్మత్ ఖాన్) ముజఫర్ జంగ్ ను చంపివేశాడు.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_70.1

సలాబత్ జంగ్ (1751-61)

 • ఫ్రెంచి అధికారియైన బుస్సి నాజంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను హైదరాబాద్ నవాబుగా ప్రకటించాడు.
 • దాంతో ఇతడు 1752 లో ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి బహుమానంగా ఇచ్చాడు. (1759లో వెనక్కి తీసుకున్నాడు)
 • ఇతని కాలంలోనే బొబ్బిలి యుద్ధం (1757), చందుర్తి యుద్ధం (1758) లు జరిగాయి.
 • 1761లో సలాబత్ జంగ్ ను బీదర్ కోటలో బంధించి తానే పాలకుడినని నిజాం అలీ ప్రకటించుకున్నాడు.

Check Now :  APPSC Endowments Officer Notification 2021 PDF

 

నిజాం అలీఖాన్ (1761-1803)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_80.1

 • ఇతనిని రెండవ అసఫ్ జా అంటారు. ఇతని కాలం నుండి అసహోహిలు నిజాములుగా పిలవబడ్డారు. 
 • నిజాం అలి రాజధానిని ఔరంగాబాద్ నుండి హైద్రాబాద్ కు మార్చాడు.
 • జోగి పంతులు మధ్యవర్తిత్వంతో ఉత్తర సర్కారులు (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్) 1766లో బ్రిటీషువారి పరమైనాయి
 • లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార ఒప్పందంలో చేరిన మొదటి రాజు – నిజాం అలీఖాన్.
 • మూడవ మైసూరు యుద్ధంలో పొందిన కడప, బళ్ళారి ప్రాంతాలతో పాటు అనంతపూర్ ప్రాంతాలను కూడా సైన్య సహాకార పద్ధతిలో భాగంగా బ్రిటీష్ సైన్యానికి అయ్యే ఖర్చు కింద ఇవ్వడం జరిగింది.
 • అందువల్ల ఈ ప్రాంతాలను “దత్త మండలాలు” అంటారు.
 • ఫ్రెంచి అధికారి “రేమాండ్” సహాయంతో నిజాంఅలీ గన్ ఫౌండ్రిని ఏర్పాటు చేశాడు.
 • క్రీ.శ. 1798లో నిజాం అలీ కాలంలోనే “జేమ్స్ పాట్రిక్” బ్రిటీష్ రెసిడెంట్ గా నియమింపబడ్డాడు.
 • నిజాం అలీ 1803లో “రెసిడెన్సీ భవనము” నిర్మించాడు. దీని ప్రధాన ఆర్కిటెక్ – శామ్యూల్.
 • ఇతని ఇతర నిర్మాణాలు : * మోతిమహల్ • గుల్టన్ మహల్ • రోషన్ మహల్

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_90.1

 

సికిందర్ జా (1803-1829) (మూడవ అసఫ్ జా)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_100.1

 • ఇతని పేరుమీదుగానే సికింద్రాబాద్ ఏర్పడింది. 
 • ఇతని కాలంలో బ్రిటీష్ రెసిడెంట్ చేతిలో కీలుబొమ్మగా మారిన చందులాల్ 1806లో పేష్కారుగా నియమించబడ్డాడు
 • 1811లో హైద్రాబాద్ లో బ్రిటీష్ రెసిడెంట్ గా హెన్రీరస్సెల్ వచ్చాడు.
 • సంస్థానంలో శాంతిభద్రతలను కాపాడటానికి రస్సెల్స్ దళం లేదా హైద్రాబాద్ కాంటిజెంట్ సైన్యాన్ని ఏర్పరిచాడు. ఈ దళం హైదరాబాద్ సైన్యంగా పేరుపొందింది.
 • రస్సెల్స్ దళం నిర్వహణ ఖర్చు పెరగడంతో నిజాం, పామర్ కంపెనీ నుండి 60 లక్షల అప్పు తీసుకున్నాడు.
 • హెన్రీ రస్సెల్ తరువాత బ్రిటీష్ రెసిడెంట్ గా వచ్చిన చార్లెస్ మెట్ కాఫ్ పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

also read: APPSC క్యాలెండర్ 2021

 

నాసీరుద్ధౌలా (1829-1857) (నాలుగవ ఆసఫ్ జా)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_110.1

ఇతని కాలంలో ప్రధాన సంఘటనలు: 1) వహాబి ఉద్యమం 2) బేరారు దతత

వహాబి ఉద్యమం:

 • హైద్రాబాద్ లో దీనికి నాయకత్వం వహించినది నాసిరుద్దేలా తమ్ముడు “ముబారిజ్ ఉద్దేలా”.
 • ఆంగ్లేయులు ఇతనిని అరెస్టు చేసి గోల్కొండ కోటలో బందించగా 1854లో అక్కడే మరణించాడు.
 • ఈ ఉద్యమానికి కడప-కర్నూల్ నవాబుల నాయకుడు గులాం రసూల్ ఖాన్ మద్దతు పలికాడు. ఇతడు తిరుచునాపల్లి జైలుకు పంపబడ్డాడు.

బేరార్ ఒప్పందం:

 • నిజాం తమనుండి తీసుకున్న 60లక్షలను 1850డిశంబర్ 31లోగా చెల్లించాలని బ్రిటీష్ ప్రభుత్వం షరతు విధించింది.
 • 1853లో గవర్నర్ జనరల్ డల్హౌసి మరియు నసీరుద్దేలా మధ్య బేరార్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం తరువాత రస్సెల్ సైన్యాన్ని హైద్రాబాద్ కంటిజెన్సి సైన్యంగా మార్చి బ్రిటీషు-ఇండియా సైన్యానికి అనుబంధ దళంగా మార్చారు.
 • అంతేకాకుండా ఈ ఒప్పందం ప్రకారం బ్రిటీషువారికి బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను ఇచ్చారు.
 • ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రధాని అయిన సిరాజ్ వుల్ ముల్క్ అనారోగ్యంపాలై మరణించాడు.
 • ఆ సమయంలో 24ఏళ్ళ “మీర్ తురబ్ అలీఖాన్” (సాలర్‌జంగ్-1) హైద్రాబాద్ ప్రధాని అయ్యాడు.
 • 1857 మే 10న మీరట్ లో సైనిక తిరుగుబాటు ప్రారంభం అయినపుడు హైద్రాబాద్ నవాబ్ – నాసిరుద్ధౌలా
 • తిరుగుబాటు ప్రారంభం అయిన వారం రోజులకు నసిరుద్దేలా మరణించాడు.
 • అప్పుడు అఫ్జల్  ఉద్దేలా హైద్రాబాద్ నవాబు అయ్యాడు.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_120.1

 

అఫ్జల్  ఉద్దౌల (1857-1869)

 • అఫ్జల్  ఉద్దౌల మరియు ఇతని ప్రధాని సాలార్జంగ్ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటీషు వారికి మద్దతు పలుకుటకు నిర్ణయించారు.
 • తిరుగుబాటు అణచివేయబడిన తరువాత 1861లో బ్రిటీషువారు అఫ్జల్  ఉద్దౌలకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’. (విశ్వసనీయ మిత్రుడు) అనే బిరుదునిచ్చారు.
 • చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం నసీరుద్దేలా ప్రారంభించగా అఫ్టల్ ఉద్దేలా పూర్తిచేసాడు.

Also read:  RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల

 

మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_130.1

 • అఫ్జల్  ఉద్దౌల మరణానంతరం అతని2 సంవత్సరాల కుమారుడు “మీర్ మహబూబ్ అలీఖాన్” హైద్రాబాద్ నవాబుగా ప్రకటించబడ్డాడు. ఇతనికి (సాలార్‌జంగ్ నేతృత్వం వహించి కమిటీ సంరక్షకురాలిగా ఉన్నది)
 • మహబూబ్ అలీఖాన్ కు 18 సంవత్సరాలు పూర్తయినందున 1884లో లార్డ్ రిప్పన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి మహబూబ్ అలీఖాన్ కు అధికారాలు అప్పగించాడు.
 • హైద్రాబాద్ సంస్థానంను సందర్శించిన మొట్టమొదటి వైస్రాయ్ – లార్డ్ రిప్పన్.
 • ఇతని ప్రముఖ పాలనా సంస్కరణలు: -మీర్ మహబూబ్ అలీఖాన్ 1893లో ఖ్వానుంచా-ఇ-ముబారక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ పరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
 • ఇతని కాలంలోనే చందారైల్వే సంఘటన జరిగింది.
 • ఈయన కాలంలోనే చాదర్‌ఘాట్ లో థియోసోఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సంఘం) స్థాపించబడినది.
 • విద్యారంగంలో మీర్ మహబూబ్ అలీఖాన్ చొరవ: ముస్లిం బాలికల ప్రత్యేక పాఠశాల – 1885 (సయ్యద్ బిల్ గ్రామి చొరవతో)
 • నాంపల్లి బాలికల పాఠశాల – మెడికల్ కళాశాల – హైద్రాబాద్
 • సరూర్‌నగర్ అనాథాశ్రయంలో బాలికల పాఠశాల – 1905.
 • ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు – వరంగల్, ఔరంగాబాద్
 • ఇతని కాలంలో రెండవ సాలర్‌జంగ్ రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో  ఉర్ధూ భాషను ప్రవేశపెట్టాడు.
 • ఇతని కాలంలోనే అసఫియా లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పర్షియన్, అరబిక్ సంస్కృత భాషల పుస్తకాలు అందుబాటులో ఉండేవి.
 • ఇతని కాలంలో వరుసగా సాలార్‌జంగ్-1, సాలార్‌జంగ్-2, అస్మాన్ జా, వికార్-ఉల్-ఉమా (వికారుద్దీన్), కిషన్ ప్రసాద్లు ప్రధానులుగా పనిచేసారు.
 • ఇతని ప్రధాని వికారుద్దీన్ – ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మించాడు.
 • మూసీనది వరద (1908): 1908 సెప్టెంబర్ 29న పెను తుఫాన్ వచ్చి మూసీనదికి వరదలు వచ్చాయి.
 • మళ్ళీ భవిష్యత్ లో మూసీనదికి వరదలు రాకుండా 1909 లో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆనకట్టల నిర్మాణానికి ప్లాన్ గీయించాడు.

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_140.1

ఇతని ముఖ్య నిర్మాణాలు :

టౌన్ హాల్ : 1905 ఆగస్టు 25 న తన 40వ జన్మదిన సందర్భంగా నిజాం మహబూబ్ అలీఖాన్ పబ్లిక్ గార్డెన్ లో టౌన్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీనిని 7వ నిజాం పూర్తి చేశాడు.

విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయం : విక్టోరియా మహారాణి మీర్ మహబూబ్ అలీఖానకు గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇచ్చింది. అందుకని 1905 ఫిబ్రవరి 14న విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయాన్ని సరూర్ నగర్ లో నిర్మించాడు.

విక్టోరియా జనానా హాస్పిటల్: వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ రాజ్యాన్ని సందర్శించిన సమయంలో మీర్ మహబూబ్ అలీఖాన్ విక్టోరియా జనానా హాస్పిటల్ ను కట్టించాడు.

also read:ESIC UDC Recruitment 2022 Apply for 3800+ posts 

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1911-1948)

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_150.1

1. పూర్తి పేరు – నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దుర్.

2. జననం – 1886 ఏప్రిల్ 6, మరణం – 1967 ఫిబ్రవరి 24

3. ఇతను 7వ అసహ్ బిరుదుతో నిజాం పదవిని అలంకరించాడు.

పాలన సంస్కరణలు:

 • హైదరాబాద్ సంస్థానంలో శాసనవ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరుచేసిన ఘనత మీర్ ఉస్మాన్ అలీఖానకు దక్కుతుంది
 • భారతదేశం మొత్తంలో శాసన వ్యవస్థ నుంచి న్యాయవ్యవస్థను వేరుచేసిన మొదటి సంస్థానం – హైదరాబాద్
 • హైదరాబాద్ సంస్థానంలో పరిపాలనా స్వరూపం : సంస్థానం (రాజ్యం) – నిజాం,  సుభా – సుభేదారి , జిల్లా – కలెక్టర్ , తాలూకా – తహశీల్దార్ , గ్రామం- పటేల్, పట్వా రి, గ్రామ సేవకులు.

ఏడవ నిజాం పరమత సహనం:

 • ఇతని కాలంలో భద్రాచల దేవాలయానికి, తిరుపతి దేవాలయానికి వార్షిక నిధులు కేటాయించాడు.
 • సీతారాంబాగ్ దేవాలయం (హైదరాబాద్) పరిరక్షణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాడు. 
 • అజంతా ఎల్లోరా, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి పరిరక్షణకు చర్యలు తీసుకున్నాడు. 
 • నిజాం ప్రభుత్వ నిధులు పొందిన హైదరాబాద్ నగర దేవాలయాలు – * మాదన్నపేట,శంకరాభాగ్,గోల్ నాక, గౌలిపుర
 • నిజాం ప్రభుత్వ నిధులు పొందిన ఇతర దేవాలయాలు: * రేణుకా దేవాలయం (ఆదిలాబాద్), ఏక్ నాథ్ దేవాలయం (నాందేడ్), దేవల్ మాయా దేవాలయం (నాందేడ్)

Download: తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం

మునుపటి అంశాలు : 

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 

తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు 

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

తెలంగాణ చరిత్ర – కాకతీయులు

తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు

తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు 

 

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_160.1

SSC CGL 2021 Notification Out 

Monthly Current Affairs PDF All months

SBI CBO Notification 2021 Out

AP SSA KGBV Recruitment 2021

Bank Of Baroda Recruitment 2021

Folk Dances of Andhra Pradesh

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_180.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana History- Asafjahis, తెలంగాణ చరిత్ర - అసఫ్ జాహీ వంశం Pdf |_190.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.