Telugu govt jobs   »   Telangana History Kakatiyulu   »   Telangana History Kakatiyulu

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర – కాకతీయులు Pdf

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర – కాకతీయులు Pdf :

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ చరిత్ర(Telangana History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana History PDF In Telugu (తెలంగాణ చరిత్ర PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

తెలంగాణ చరిత్ర – కాకతీయులు

మూలపురుషుడు : కాకర్త్య గుండన (మాగల్లు శాసనం ప్రకారం)

                                    వెన్నభూపతి (బయ్యారం చెరువు శాసనం ప్రకారం)

స్థాపకుడు : మొదటి బేతరాజు 

స్వతంత్ర్య రాజ్య స్థాపకుడు : రుద్రదేవుడు 

చిహ్నం  : వరాహం 

రాజలాంఛనం: కాకతి (కాక అంటే వేడి . కాకతి అంటే జ్వరదేవత, ఆరోగ్య దేవత) 

రాజధాని: హన్మకొండ , ఓరుగల్లు 

రాజభాష: సంస్కృతం

వర్ణం: శూద్రులు 

మతం: మొదట జైనమతం, తర్వాత శైవం

 బిరుదాంకితులు: “ఆంధ్రదేశాధీశ్వర” 

వంశం: దుర్జయ వంశం (బయ్యారం శాసనం ప్రకారం) 

చారిత్రక ఆధారం : మాగల్లు శాసనం దానర్ణవుడి)

                                     బయ్యారం శాసనం (మైలాంబ) 

నగర నిర్మాతలు : హన్మకొండ (ప్రోలరాజు -2)

                                   ఓరుగల్లు (కాకతి రుద్రుడు)

విదేశీ యాత్రికులు : మార్కోపోలో (రుద్రమదేవి కాలంలో)

గొప్పవాడు: గణపతి దేవుడు 

చివరివాడు : రెండవ ప్రతాపరుద్రుడు 

నాట్యకత్తె: మాచల్దేవి (ప్రతాపరుద్ర-2 కాలంలో)

also read:  RRB గ్రూప్ D అడ్మిట్ కార్డ్

కాకతీయులు చరిత్ర ఆధారాలు

శాసనాలు

1) బయ్యారం – మైలాంబ 

2) హన్మకొండ – కాకతిరుద్ర

3) మోటుపల్లి – గణపతిదేవుడు 

శిల్పకళ:

1) వేయిస్తంభాల గుడి  (రుద్రదేవుడు)

2) రామప్ప గుడి  (రేచర్ల రుద్రుడు) 

విదేశీ యాత్రికులు : మార్కోపోలో (రుద్రమదేవి కాలంలో) 

 •  కాకతీయుల (కాకర్త్య గుండన) గురించి ప్రప్రథమంగా దానర్ణవుని మాగల్లు శాసనంలో పేర్కొనబడింది.
 • మైలాంబ యొక్క బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు ‘వెన్నడు’.
 •  ప్రతాపరుద్ర యశోభూషణం’ (విద్యానాధుడు)లో ‘కాకతి’ దేవతను పూజించడం వలన వీరు కాకతీయులు అయ్యారు అని పేర్కొనబడింది.
 • కాకతీయులు మొదట రాష్ట్ర కూటులకు తరువాత పశ్చిమ చాళుక్యుల (కళ్యాణి చాళుక్యులు)కు సామంతులుగా ఉండి రుద్ర దేవుని కాలంలో స్వతంత్రులైనారు.
 • ఓరుగల్లు (వరంగల్) ప్రాంతంలో సువాసనలతో కూడిన వరి పండించబడ్డదని మార్కోపోలో పేర్కొన్నాడు.
 • రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో కాకతీయ రాజ్యం సిరి సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అని ప్రస్తావించాడు.
 • అదేవిధంగా ఢిల్లీ సుల్తానుల కాలంనాటి గొప్ప పండితుడయిన అమీర్ ఖుస్రు తన తుగ్లక్ నామా లో కాకతీయుల ఐశ్వర్యంను గూర్చి ప్రస్తావించాడు.

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_40.1

కాకతీయ పాలకులు, వారి రాజకీయ చరిత్ర

బేతరాజు -1 (క్రీ.శ 995-1052)

 • ఇతను శనిగరం శాసనం వేయించాడు (ఈ శాసనాన్ని లిఖించినది నారణయ్య) .
 • ఇతని మంత్రి నారణయ్య శనిగరంలో “యుద్ధమల్ల జినాలయాన్ని” బాగు చేయించి కానుకలు సమర్పించాడు.

ప్రోలరాజు -1 (క్రీ.శ 1052-1076)

 • కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను తెలియజేస్తున్నాయి.
 • ఆగమపండితుడు రామేశ్వరునికి ప్రోలరాజు-1 బైజనపల్లి గ్రామాన్ని శివపురంగా మార్చి దానమిచ్చాడు

బేతరాజు -2 క్రీ.శ 1076 – 1108)

 • ఇతను కాజీపేట శాసనాన్ని వేయించినాడు. 
 • హన్మకొండ ఇతని కాలంలో మొదటిసారి రాజధానిగా మారింది.
 • బేతరాజు-2 గొప్ప శివభక్తుడు ఇతని గురువు రామేశ్వర పండితుడు.
 • బేతరాజు – 2 హన్మకొండలోని శివపురం వద్ద “బేతేశ్వర శివాలయాన్ని” నిర్మించాడు.

దుర్గరాజు (క్రీ.శ 1108-1116)

 • ఇతను “బేతేశ్వర శివాలయాన్ని” కాలముఖాచార్యుడైన రామేశ్వర పండితునికి దానం చేసినట్లు ఖాజీపేట శాసనం తెలుపుతున్నది.

ప్రోలరాజు -2 (క్రీ.శ 1116-1157) 

 • రెండో ప్రోలరాజు ఘనకార్యాలను రుద్రదేవుని “హనుమకొండ శాసనం” పేర్కొంటుంది.
 • * హనుమకొండలో :  సిద్దేశ్వరాలయం , పద్మాక్షి ఆలయం(వీరి కాలంనాటి చిత్రలేఖనాలు కలవు) , స్వయంభు దేవాలయంలను ఇతను నిర్మించాడు.
 • ఇతని మంత్రి బేతనామాత్యుడు జైనమతాభిమాని.
 • బేతన భార్య మైలమ హన్మకొండలో “కడలాలయబసది”ని కట్టించినది.

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_50.1

స్వతంత్ర కాకతీయ రాజులు(క్రీ.శ.1158-1323)

 

రుద్రదేవుడు (క్రీ.శ.1158-1196)

 1.  ఇతనిని ఒకటవ ప్రతాపరుద్రుడు, కాకతిరుద్రుడు అని కూడా అంటారు.
 2. స్వతంత్ర్య పాలన ప్రారంభించిన మొదటి కాకతీయ రాజు.
 3. క్రీ.శ 1162లో రుద్రదేవుడు స్వాతంత్రం  ప్రకటించుకున్నట్లు హన్మకొండ శాసనం పేర్కొంటుంది.
 4. ఇతను హన్మకొండ, గణపవరం అనే శాసనాలు వేయించాడు.
 5. హన్మకొండ శాసనంను అచితేంద్రుడు లిఖించాడు.
 6. రుద్రదేవుడు రుద్రసముద్రతటాకం అనే చెరువును తవ్వించాడు.
 7. రుద్రదేవుడు హన్మకొండలో రుద్రేశ్వరాలయం / వేయిస్తంబాల గుడిని క్రీ.శ. 1162 లో నిర్మించాడు.
 8. ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించి రాజధానిని పాక్షికంగా హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. (పూర్తిస్థాయిలో గణపతి దేవుడు).
 9. ఇతను సంస్కృతంలో నీతిసారంను రచించాడు.
 10. ఇతని మంత్రి గంగాధరుడు(ఇతను వైష్ణవ మతాభిమాని). హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు.
 11. ఇతను 1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహకరించాడు.
 12. ఇతని కాలంలోనే జైన, శైవ సంఘర్షణలు మొదలయ్యాయి.

also check:  RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు

మహాదేవుడు (క్రీ.శ.1196-1199):

 •  రుద్రదేవుని మరణం తరువాత ఇతని తమ్ముడు మహాదేవుడు సింహాసనం అధిష్టించాడు. 
 • తన అన్న మరణానికి కారణమైన జైత్రపాలునిపై దండెత్తి ఓడి మరణించాడు.
 • ఈ దండయాత్రలో మహదేవుని కుమారుడు గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కాడు.
 • మహాదేవుడు శైవుడు, ఇతని గురువు ధ్రువరేశ్వరుడు.

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_60.1

గణపతిదేవుడు (క్రీ.శ 1199-1262)

 • ఇతను కాకతీయులలో గొప్పవాడు.
 • గణపతి దేవుని తండ్రి మహాదేవుడు యాదవరాజైన జైతుగి చేతిలో మరణించగా ఇతను బందీ అయ్యాడుదీనితో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది.
 • మహాదేవుని సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఆ సంక్షోభం నుండి రక్షించాడు.
 • రేచర్లరుద్రుడు చేబ్రోలు శాసనాన్ని వేయించాడు మరియు పాలంపేటలో “రామప్పగుడిని” (క్రీ.శ. 1213లో)నిర్మించాడు.
 • గణపతిదేవుని ప్రధాన సేనాని – రేచర్ల రుద్రుడు, రథదళాధిపతి – గంగయ్య సేనాని
 • గజదళపతి – జాయప సేనాని (ఇతని రచనలు – నృత్తరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి)
 • ఓరుగల్లు కోటకు నాలుగు వైపుల “నాలుగు శిలా నిర్మిత తోరణాలు” గణపతి దేవుడు నిర్మించాడు.
 • గణపతి దేవుని కాలంలో మాల్యాల చౌడ సేనాని చౌడ సముద్రం తవ్వించారు.
 • రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను పూర్తిచేసి రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకుక్రీ.శ. 1254లో మార్చాడు.
 • గణపతిదేవుని గురువు – విశ్వేశ్వరశంభు.
 • గణపతిదేవుడు విశ్వేశ్వర శంభుకు “కాండ్రకోట” అనే గ్రామంను దానం చేశాడు.
 • విశ్వేశ్వర శంభు – శైవవిద్యాలయాలు అయిన గోళకి మఠాలు ఏర్పాటుచేశాడు.
 • గణపతిదేవుడు ఓరుగల్లులో సహస్రలింగాలయంను నిర్మించాడు.
 • గణపతిదేవుని కుమార్తెలు – 1. రుద్రమాంబ(భర్త – చాళుక్యవీరభద్రుడు) .2. గణపమాంబ(భర్త – బేతరాజు)
 • 1259 సం,, లో గణపతి దేవుడు రుద్రమదేవిని పట్లో ధ్రుతిగా ప్రకటించాడు.
 • 1262 లో పాండ్యరాజైన జటావర్మసుందర పాండ్యుడు నెల్లూరు సమీపాన ముత్తుకూరు యుద్ధంలో గణపతిదేవున్ని ఓడించాడు.
 • ముతుకూరు యుద్ధం మినహాయిస్తే గణపతిదేవుడు పరాజయం తెలియని విజేత.

Also read: RRB NTPC Result 2021

 రుద్రమదేవి – (క్రీ.శ.1262 నుండి 1289)

 1. ఆంధ్రదేశంలో రాజ్యా ధికారమును చేపట్టిన మొదటి మహిళ. 
 2. ఈమె శాసనాలు : బీదర్ కోట శాసనం ,మల్కాపుర శాసనం (ప్రసూతి వైద్యకేంద్రాల గురించి తెలుపుతుంది).
 3. ఈమె సేనాని గోన గన్నారెడ్డి తెలుగు చోడులను, కోటరాజులను ఓడించాడు.
 4. గణపతి దేవుడు పూర్తి చేసిన ఓరుగల్లు కోట చుట్టూ కందకంను, బురుజులను, కోట లోపల మెట్లనురుద్రమదేవి నిర్మించింది.
 5. కాయస్థుల రాజైన అంబదేవుని యొక్క చందుపట్ల అత్తిరాల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవునిచే హతమార్చబడినది.
 6. ఈమె కాలంలో ఇటలీ (వెనిస్) యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు.

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_70.1

రెండవ ప్రతాపరుద్రుడు (1289 – 1323)

 1. ఇతను రుద్రమదేవి మనుమడు.
 2. ప్రతాపరుద్రచరిత్ర ప్రకారం ఇతని కాలంలో 77 బురుజులకు 77 మంది నాయకులు వుండేవారు
 3. ఇతని కాలంలో “మాచల్దేవి” అనే కళాకారిణి వుండేది. మాచల్దేవి ప్రముఖ పేరిణి నృత్యకారిణి.
 4. ఇతని కాలంలో ఆంధ్రదేశంపై ముస్లింల దండయాత్ర అధికమయింది.
 5. ముస్లింల దండయాత్ర గురించి రెడ్డిరాణి అనతల్లి తన కలువచేరు శాసనంలో పేర్కొన్నది.
 6. 1323లో గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో అతని కుమారుడు మహ్మద్ బిన్ తుగ్లక్/జునాఖాన్/కాకతీయ రాజ్యంపై దాడిచేసి ప్రతాపరుద్రున్ని ఓడించాడు.
 7. ఈ ఓటమిని గురించి పేర్కొన్న శాసనం – విలాస శాసనం.
 8. వరంగల్ కి సులానాపూర్ అని పేరు పెట్టి బురానొద్దీన్ అనే పాలకున్ని నియమించాడు.
 9. ప్రతాపరుద్రుడు నర్మదానది (సోమోద్భవ)లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రోలయ నాయకునివిలాసశాసనం పేర్కొంటుంది.
 10. దీనితో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయింది.

Download PDF : Telangana History-kakatiyulu part 1 PDF

మునుపటి అంశాలు : 

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 

తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు 

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

*********************************************************************

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_110.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana History Kakatiyulu | తెలంగాణ చరిత్ర - కాకతీయులు Pdf |_120.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.