Table of Contents
Telangana History Vemulawada Chalukyulu | తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు Pdf :
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ చరిత్ర(Telangana History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Telangana History PDF In Telugu (తెలంగాణ చరిత్ర PDF తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు
స్థాపకుడు | విక్రమాదిత్య యుద్ధమల్లుడు |
మతం | హైందవం, జైనం |
రాజధాని | వేములవాడ |
గొప్పవాడు | రెండవ అరికేసరి |
చివరివాడు | మూడో అరికేసరి |
వేములవాడ చాళుక్యులు చరిత్ర ఆధారాలు
సాహిత్య ఆధారాలు
పంపకవి రచించిన | విక్రమార్జున విజయం , ఆది పురాణం |
సోమదేవ సూరి | యశస్తిలక |
మల్లియ రేచన | కవిజనాశ్రయం |
‘వేములవాడ’ (కరీంనగర్) ను రాజధానిగా చేసుకున్న తర్వాతనే వీరి ప్రత్యేక సంస్కృతి, రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనందున వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు.
also check: TSPSC గ్రూప్ 4 ఎంపిక విధానం
వేములవాడ చాళుక్యులు పాలకులు, వారి రాజకీయ చరిత్ర
సత్యాశ్రయ రణ విక్రముడు:
- వేములవాడ చాళుక్య వంశంలో మొదటి వాడు బోధనన్ను రాజధానిగా చేసుకొని పాలించాడు.
- వీరు మొదట బాదామి చాళుక్యులకు, తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి పాలించారు
- కొల్లిపర శాసనం (మొదటి అరికేసరి) ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు- సత్యాశ్రయరణ విక్రముడు.
వినయాదిత్య యుద్ధమల్లుడు:
- యుద్ధమల్లుడు నిజామాబాద్ జిల్లాలోని “నిందూరు బోధను” రాజధానిగా పాలన చేశాడు.
- ఇతను కొన్ని రాజ్యాలను, చిత్రకూట దుర్గాన్ని (కరీంనగర్ లోని రాయగిరి) సాధించినాడు.
మొదటి అరికేసరి:
మొదటి అరికేసరి రాజధానిని బోధన్ నుండి “వేములవాడ” కు మార్చాడు.
బద్దెగుడు:
- బద్దెగ బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించాడు. బద్దగేశ్వరాలయమును వేములవాడలోని భీమేశ్వరాలయంగా గుర్తించారు.
- ఇతని బిరుదు “సోలద-గండ” (అపజయమెరుగని వీరుడు)
రెండవ నరసింహుడు:
- పూరర ప్రతిహార మహీపాల చక్రవర్తిని ఓడించి “కాలప్రియ (కల్పి” అనే చోట విజయ సంభాన్ని నాటాడు.
- యమునా నదిని దాటి కన్యాకుబ్జ నగరం చేరి తన గుర్రాలకు గంగానది నీరు త్రాగించాడు.
- వేములవాడలో జైన చౌముఖాలు చెక్కించిన వేములవాడ చాళుక్యరాజు – రెండవ నరసింహుడు.
రెండో అరికేసరి:
- ఇతను వేములవాడ శిలాశాసనంను సంస్కృతంలో వేయించాడు.
- ఇతడు తన పేరుతో బోధన్లో అరికేసరి జీనాలయంను నిర్మించాడు.
- ఇతని కాలం నాటి కవులు : * పంపకవి * జీనవల్లభుడు * మల్లియరేచన
వాగరాజు:
- ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి యశస్థిలక చంపూ కావ్యం ను వాగరాజు కాలంలోనే పూర్తిచేశాడు.
భద్రదేవుడు (రెండవ బద్దెగుడు):
- కరీంనగర్ జిల్లాలోని ‘గంగాధర పట్టణం’ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. —
- వేములవాడలో “సుభదామ జినాలయం” ను నిర్మించాడు.
మూడో అరికేసరి:
- వేములవాడ చాళుక్యులలో చివరివాడు.
- నీటి వసతి సరిగాలేక రాజధానిని తిరిగి గంగాధర నుండి వేములవాడకు మార్చాడు. ఇక్కడి పెద్దవాగు నీటివసతిని తీరుస్తుంది.
- రెండవ తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని కూల్చి కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపనతో ఈ వేములవాడ చాళుక్య రాజ్యం కూడా అంతరించింది.
- పర్బని శాసనం ప్రకారం – ఇతడు శుభదామ జినాలయానికి మరమ్మత్తులు చేయడానికి రేపాక గ్రామాన్ని సోమదేవసూరికి దానం చేశాడు.
మతం పరిస్థితులు
వైష్ణవ, శైవ శక్తి మతాలు:
- రెండవ అరికేసరి తంత్రపాలుడు అయిన పెద్దన వేములవాడలో ‘ఆదిత్యాలయాన్ని కట్టించాడు.
- వేములవాడ శాసనం (2వ అరికేసరి) పేర్కొన్న వేములవాడలోని ప్రధానాలయాలు (4)
1) రాజేశ్వరాలయం : ఇది రాజాదిత్య బిరదాంకితుడైన మొదటి నరసింహుని పేరుతో నిర్మించిన ఆలయం
దీని స్థానాధిపతి – మల్లికార్జునుడు.
2) బద్దెగేశ్వరాలయం : ఇది వేముల వాడ రాజైన బద్దెగుని పేరుతో నిర్మించిన ఆలయం
ఈ ఆలయ స్థానాధిపతి – విద్యారాశి
3) ఆదిత్య గృహం : ఇది వేములవాడలోని ప్రధాన ఆదిత్య ఆలయం
ఈ గృహ స్థానాధిపతి – వ్యక్తిలింగి
4) నగరేశ్వరాలయం:
- ఈ ఆలయ స్థానాధిపతి – వ్యాఖ్యాన భట్టాకరుడు.
- వేములవాడ చాళుక్యులు బోధలో 100 స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంను నిర్మించారు.
- ఈ 100 స్తంభాలగుడిని ఔరంగజేబు కాలంలో ‘దేవల్ మసీద్’గా మార్చారు.
- జైనాలయాలు, హిందూ దేవాలయాలు అనుబంధంగా ఉండే మఠాలలో అనేక విద్యలు బోధించబడేవి
- కొల్లిపర శాసనం ప్రకారం మొదటి అరికేసరి ముగ్ధశివాచార్యునికి “బల్మోగ” అనే గ్రామాన్ని దానమిచ్చాడు.
జైనం:
- వేములవాడ చాళుక్య రాజులు జైనమతాన్ని ఆదరించారు.
- ప్రముఖ జైన కవులు అయిన పంపకవి, జీనవల్లభుడు, సోమదేవసూరిలను ఆదరించారు
- జినవల్లభుడు ధర్మపురిలో జీనాలయాన్ని నిర్మించాడు. • రెండవ బద్దెగుడు (భద్రదేవుడు) తన గురువైన సోమదేవుని కోసం శుభదామ జినాలయమును నిర్మించారు.
- ఈ జైన ఆలయ బసది కోసం మూడవ అరికేసరి రేపాక అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. • పర్బనీ శాసనం ప్రకారం ఈ రేపాక గ్రామంలోనే రెండవ బద్దెగుడు జైన ఆలయంను కట్టించాడు.
Also check: RRB గ్రూప్-D పరీక్ష తేదీలు విడుదల
వేములవాడ చాళుక్యులు సాహిత్య సేవ
- వేములవాడ చాళుక్య రాజులు తెలుగు, కన్నడ భాషల సాహిత్యాన్ని ప్రోత్సహించారు
- పద్మకవి – తెలుగులో జినేంద్రపురాణం
- మల్లియ రేచన – కవి జనాశ్రయం (తొలి తెలుగు లక్షణ గ్రంథం)
పంపకవి:
- కన్నడ కవిత్రయంలో మొదటి వాడు, ఆదికవి.
- 2వ అరికేసరి ఆస్థానకవి.
- ఇతని బిరుదులు : ఆదికవి, కవితా గుణార్ణవుడు
- రచనలు:
- విక్రమార్జున విజయం (ఇందులో 2వ అరికేసరిని కావ్యనాయకుడిగా (అర్జునిడిగా) చిత్రీకరిస్తూ కావ్యరచన చేశాడు.
- ఆదిపురాణం (ఋషభనాథుని జీవిత చరిత్ర)
- జినేంద్ర కళ్యానాభ్యుదయం
- 2వ అరికేసరి ఆస్థానంలో ఉండి మహాభారతంను కన్నడ భాషలోకి అనువదించాడు.
- 2వ అరికేసరి పంపకవికి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిని అగ్రహారంగా దానం చేశాడు.
- పంపకవి సమాధి బోధన్ కోటగోడపై కలదు.
సోమదేవ సూరి:
రచనలు:
- కథాసరిత్సాగరం
- మహేంద్రమాలతి
- యశస్థిలకం
- యుక్తి చింతామణి
- సన్నావతి ప్రకరణ
- నీతికావ్యామృత
- సంజిల్వ
- సైదో వాదోపనిషద్ (పద్యగ్రంథం)
3వ అరికేసరి కుంటువృత్తి, వనికాటువులు అనే గ్రామాలను సోమదేవసూరికి దానం చేశాడు.
వేములవాడ భీమకవి:
రచనలు :
- రాఘవ పాండవీయం
- శతకంధర రామాయాణం
జినవల్లభుడు (పంపకవి తమ్ముడు)
- ఇతను రుర్క్యాల గుట్ట (కరీంనగర్) వద్ద ‘చక్రేశ్వరీతీర్థం’ అనే జైన ఆలయాన్ని కట్టించాడు
- రుర్క్యాల శాసనం ప్రకారం జీనవల్లభుడు వృషభాద్రి పై జైన ఆలయాన్ని కట్టించాడు..
- కుర్క్యాలలోని బొమ్మలవర్మ గుట్టపై ఇతను వేయించిన శిలా శాసనంలో తొలి తెలుగు క పద్యం కన్పించింది.
Also read: RRB NTPC Result 2021
వేములవాడ చాళుక్యుల శాసనాలు
1.కుర్క్యాల శాసనం (బొమ్మలగుట్ట శాసనం) :
జినవల్లభుడు (రెండవ అరికేసరి క్రీ.శ 946) తొలికంద పద్య శాసనం, ఇందులో మూడు కంద పద్యాలున్నాయి. పంపకవికి ధర్మపురి అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. జినవల్లభుడు జైన పండితులను ఆదరించినట్లు తెలియుచున్నది.
2.కరీంనగర్ శిలాశాసనం : (రెండవ అరికేసరి క్రీ.శ. 930–55)
అరిపినపల్లి గ్రామంలో ధారవయ్య అనే బ్రాహ్మణునికిచ్చిన భూదానము గూర్చి వివరించబడింది.
3. బద్దెగుని వేములవాడ శిలాశాసనం : (బద్దెగుడు )
మేధావంతుడు, గౌడ సంఘాధ్యక్షుడయిన సోమదేవుడనే కవి గురించి ఈ శాసనంలో ఉన్నది.
4. రేపాక శిలాశాసనం : (ఉజయ క్రీ.శ. 968)
వేములవాడ చాళుక్య మూడవ అరికేసరి రేపాకలో జినాలయం నిర్మించినాడని, ఆ దేవాలయానికి భూదానం చేసినాడనీ ఈ శాసనం తెలుపుతుంది.
5. ఆహవ మల్లుని వేములవాడ శిలాశాసనం: (పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆహవమల్లదేవుడు)
దండనాయకుడైన మహేశ్వర శక్తి పండితునికి దానము చేసిన సమయంలో వేయించిన శాసనం
6. మసీదు శాసనం : (చాళుక్యుల కాలం క్రీ.శ. 1018)
ధర్మపురి నరసింహ ఆలయ నిర్మాణ విశేషాలు.
7. చికరాజు వేములవాడ శిలాశాసనము : (జయసింహ వల్లభుడు క్రీ.శ. 1033)
రాజేశ్వర, బద్దెగేశ్వర దేవరలకు దానమిచ్చు సందర్భంలో వేయించిన శాసనమిది.
8. కుమార సోమేశ్వరుని వేములవాడ శిలాశాసనం : (కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1106)
వేములవాడలోని శ్రీమదరికేశ్వర దేవర నైవేద్యం కొరకు ఆదేవర పూజారి ఆచార్యులకు అగ్రహరం దానమిచ్చినపుడు చేయించిన నాశనం
9. జగదేవరాజు వేములవాడ శిలాశాసనం : (శ్రీమజ్జెగద్దేవరాజు శ్రీ.శ.1108)
హరికేశ్వర దేవరకు ఇల్లిందకుంట అగ్రహారమును దానమిచ్చినపుడు వేయించిన దానశాసనం.
10.కురువగట్టు శాసనం : (శ్రీమజ్జిగద్దేవరాజు క్రీ.శ. 1108 )
జడుర సమీపంలోని గంగాపురం సమీపంలోని గుట్టపై చౌడేశ్వరీ ఆలయంలో ఈ శాసనం ఉంది. వినయాదిత్య యుద్ధమల్లుని రెండవ కుమారుడైన భీరగృహుని ప్రశస్తి ఈ శాసనంలో ఉంది.
Download Now: తెలంగాణా చరిత్ర- వేములవాడ చాళుక్యులు PDF
మునుపటి అంశాలు :
తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు
*********************************************************************