Telugu govt jobs   »   Telangana History- Qutubshahis   »   Telangana History- Qutubshahis

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf :

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ చరిత్ర(Telangana History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana History PDF In Telugu (తెలంగాణ చరిత్ర PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_40.1

తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_50.1

 •  క్రీ.శ. 1347లో గుల్బర్గా కేంద్రంగా అబ్దుల్ ముజాఫల్ అల్లాఉద్దీన్ బహ్మన్ షా/హసన్ గంగూ బహమనీరాజ్యా న్ని స్థాపించాడు.
 • ఈ రాజ్యం క్రీ.శ.1500 ప్రాంతంలో అహ్మద్ నగర్, బీజాపూర్, బీరారు, బీదర్ అనే 4 స్వతంత్ర ముస్లిం రాజ్యాలుగా ఏర్పడకముందు గోల్కొండ స్వతంత్ర్య రాజ్యంగా ఏర్పడకముందు బీదర్ లో అంతర్భాగంగా ఉండేది.
 • గోల్కొండ రాజధానిగా క్రీ.శ. 1518-1687 మధ్య ముఖ్యంగా తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలను పాలించిన వంశస్థులే కుతుబ్ షాహీలు.
 • కుతుబ్ షాహీలు క్రీ.శ.1512లో రాజ్యస్థాపన చేసినట్లు కొన్ని రచనల ద్వారా తెలుస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు .
 • కుతుబ్ షాహీలు ‘కారాకునీల్’  అనే తురష్క తెగకు చెందినవారు. నోట్ : కారాకునీల్ అనగా నల్లమేక (black goat) అని అర్థం.
 • కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ
 • ఈ వంశంలో గొప్పవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా
 • చివరివాడు అబుల్ హసన్ తానీషా
 • వీరి రాజ్యం క్రీ.శ.1687లో ఔరంగజేబు దాడుల వల్ల పతనమైంది.
 • క్రీ.శ.1512-1687 మధ్యకాలంలో మొత్తం 8 మంది కుతుబ్ షాహీ పాలకులు 175 సం,,లు పాలించారు.

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_60.1

Political History – రాజకీయ చరిత్ర

సుల్తాన్ కులీ కుతుబ్ షా (1512-1543) 

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_70.1

 •  ఇతను మొదటివాడు.
 • తండ్రి- షేరకులీ, తల్లి మాలిక్ సాలె
 • ఇతను షియా మతస్థుడు
 • ఇతని సమకాలికులు : 1. శ్రీకృష్ణదేవరాయలు  2. బాబర్  3. హుమాయూన్ఇ
 • ఇతని బిరుదు : 1. ఖవాస్ ఖాన్ 2. బడే మాలిక్ (దొడ్డ ప్రభువు) 3. అమర్-ఉల్-ఉమ్రా 4. కుతుబ్-ఉల్-ముల్క్ .
 • దుర్భేధ్యమైన గోల్కొండ కోటను నిర్మించి, దాని చుట్టూ ఒక పట్టణాన్ని నిర్మించి దానికి “మహ్మద్ నగర్” అని పేరు పెట్టాడు.
 • ఇతను గోల్కొండపై 2 మినార్లతో ఒక మసీదును (జామా మసీద్) నిర్మాణాన్ని ప్రారంభించాడు.. దీనిని ఇబ్రవరి కులీకుతుబ్ షా పూర్తి చేశాడు.
 • ఈ మసీదు యొక్క మినార్ ఆధారంగా తర్వాత కాలంలో చార్మినార్ నిర్మాణం జరిగింది.
 • ఇతని కుమారులు హైదర్ కులీ, కుతుబుద్దీన్, యార్కులీ (జంషీద్), అబ్దుల్ కరీం, దౌలత్ కులీ, ఇబ్రహీం కులీ.

also read:  RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు

జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550) 

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_80.1

 • ఇతను పితృ హంతకుడు.
 • కోపంలో క్రూరత్వాన్ని  ప్రదర్శించేవాడని ఫెరిస్టా రచనల వల్ల తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులకు మరణశిక్షలు విధించేవాడు.
 • ఇతనికి వ్యతిరేకంగా తన సోదరులైన దౌలత్ కులీ, ఇబ్రహీం కులీ కుట్ర పన్ని విఫలమయ్యారు.
 • ఇబ్రహీంకులీ కుతుబ్ షా దేవరకొండ దుర్గాదిపతిగా  ఉండేవాడు. ఇబ్రహీం తన అన్న అయిన జంషీద్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడు.
 • ఈ విషయం తెలుసుకొన్న జంషీద్ ఇబ్రహీంను బంధించుటకు సైన్యాన్ని పంపాడు. దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని వదిలి విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించాడు.
 • విజయనగర సైన్యాధిపతి అలియరామరాయలు ఇబ్రహీంకు ఆశ్రయం కల్పించాడు. ఇబ్రహీం 7 సంవత్సరాలు పాటు విజయనగర సామ్రాజ్యంలో గడిపాడు. అప్పుడే ఇబ్రహీం తెలుగు కవులను కలుసుకొని తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు.
 • 1550లో జంషీద్ కులీ కుతుబ్ షా ‘రాజయక్ష్మ’ అనే వ్యాధితో మరణించాడు.
 • జంషీద్ కులీ కుతుబ్ షా భార్య జిల్ ఖైస్ తన మైనర్ కుమారుడైన ‘సుబాన్’ను పాలకుడిగా ప్రకటించింది.

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_90.1

సుబాన్ కులీ కుతుబ్ షా (1550-50)

 • ఇతను జంషీద్ కుమారుడు.
 • తండ్రి మరణించేనాటికి రెండేళ్ల వాడని ఫెరిస్టా రచనలు తెలుపుతుండగా, ఇతర రచనలు అతని వయసును ఏడు సంవత్సరాలుగా తెలుపుతున్నాయి.
 • సుబాన్ పిన్న వయస్కుడు కావడం వల్ల ‘రాణి బిల్ ఖెస్ జమాన్ కోరిక మేరకు సయిషా ఖాన్ పాలనా బాధ్యత నిర్వహించాడు.
 • ఇబ్రహీం జంషీద్ కుమారుడైన సుబాన్ కులీని హత్య చేయించి రాజ్యానికి వచ్చాడు.

Also read:  (RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల)

ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580) 

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_100.1

 • ఇతను సమర్థుడు, పరిపాలనాధక్షుడు.
 • ఇబ్రహీం బిరుదులు: 1. మల్కీభరాముడు         2.ఉర్దూ చాజర్          3.షా
 • ఇతని పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ  ఉండేదని పెరిస్టా రచనల వల్ల తెలుస్తోంది.
 • ఖానెఆజం బిరుదాంకితుడైన ముస్తఫాఖాన్ ఇబ్రహీంకు ఆప్తునిగా, పీష్వాగా వ్యవహరించాడు
 • అహ్మద్ నగర్ సుల్తాన్ హుసేన్ నిజాం షా తన కుమార్తె బీబీజమాల్ ను ఇబ్రహీంకు ఇచ్చి వివాహం జరిపించాడు.
 • అహ్మద్ నగర్ పాలకుడైన హుసేన్ నిజాం షా, బీజాపూర్ పాలకుడైన అలీ ఆదిలా, బీదర్ పాలకుడైన అలీ బరీద్ షా, గోల్కొండ పాలకుడైన ఇబ్రహీం కుతుబ్ షాలు ఒక సైనిక సమాఖ్యగా ఏర్పడి క్రీ.శ. 1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర పాలకులతో తలపడ్డారు.
 • అహ్మద్ నగర్లో ఉన్న వైరం కారణంగా బీరార్ వీరితో చేరలేదు.
 • తళ్లికోట యుద్ధంలోనే హుసేన్ నిజాం షా చేతిలో రామరాయలు మరణించినట్లు తెలుస్తోంది.
 • ఇబ్రహీం కాలంలో గోల్కొండను భాగీరథి నగరమని పిలిచేవారు.
 • ఇబ్రహీం కుతుబ్ షా పరమత సహనం గల వ్యక్తి, కవి పండిత పోషకుడు. ఆంధ్ర కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్ల మల్కీభరాముడుగా పేరుగాంచాడు.

ఇతని ఆస్థాన కవులు:

 1.  పొన్నెగంటి తెలగనార్యుడు,
 2. అద్దంకి గంగాధరుడు
 3. కందుకూరి రుద్రకవి

ఇతని కాలం నాటి కట్టడాలు:

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_110.1

 1.  హుస్సేన్‌సాగర్
 2. ఇబ్రహీంపట్నం చెరువు,
 3. గోల్కొండ దుర్గం చుట్టు ప్రహరీగోడ
 4. పూల్ బాగ్ తోట
 5. ఇబ్రహీంబాగ్
 6. మూసీపై పురానాపూల్ (ఇది మూసీపై మొదటి వంతెన)
 7. లంగర్లు (భిక్షాగృహాలు)
 • ఇబ్రహీం కులీ కుతుబ్ షా ‘ఆషిఖానా’లో కవితా గోష్ఠిని నిర్వహించేవాడు. అందుకు
 • ఇతని కాలంలో (ఉర్దూ భాష అభివృద్ధి చెందింది. అందువల్లనే ఇతన్ని “ఉర్దూ రాజర్” ఉర్దూ పితామహుడు అంటారు.
 • ఇతని కాలంలో దక్కనీ ఉర్దు(మాండలిక ఉర్దూ)  ప్రారంభమైంది
 • ఇబ్రహీం పరమత సహనం  కలవాడని తెలుస్తున్నా అహోబిల దేవాలయంపై దాడిచేసి ధనరాశులను దోచుకోవడం ఇతని పరమత సహనానికి మచ్చగా చెప్పవచ్చు (గోల్కొండ సేనాని నరహరి రావు ఆధ్వర్యంలో)
 • కుతుబ్ షాహీ వంశస్థుల్లో మొట్టమొదట షా బిరుదు వహించింది ఇబ్రహీం
 • ఇబ్రహీంకు అబ్దుల్ ఖాదర్, హుస్సేన్, మహ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్ ఫతా, ఖుదాబందా మీర్జా, మహ్మద్ అమీన్ అనే ఆరుగురు కుమారులు ఉన్నారు .
 • ఏకైక కుమార్తె చాంద్ సుల్తానా, ఈమె బీజాపూర్ పాలకుడు రెండో ఇబ్రహీం ఆదిల్ షా భార్య
 • ఇబ్రహీం కులీ కుతుబ్ షా అల్లుడు (Nephew) ‘హుస్సేన్ షా/ హుస్సేన్ నిజాం షా’ హుస్సేన్‌సాగర్‌ను తవ్వించాడు.

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_120.1

మహ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612) 

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_130.1

 • కుతుబ్ షాహీ పాలకుల్లో గొప్పవాడు – ఇతని కాలమును గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా పిలుస్తారు.
 • గోల్కొండ రాజ్యంలోకి యూరప్ వర్తకుల ప్రవేశం  ఇతని కాలంలోనే ప్రారంభమైంది.
 • బ్రిటిష్ నౌక గ్లోబ్ క్రీ.శ.1611లో మచిలీపట్నం చేరుకుంది. అదే ఏడాది వర్తక కేంద్రం ఏర్పాటుకు  మచిలీపట్నంలో ఈస్టిండియా కంపెనీకి అనుమతించాడు
 • హైదరాబాద్ నిర్మాత ఇతడే. కులీ కుతుబ్ షా తన ప్రేయసి భాగ్ మతి(భాగ్యమతి) పేరు మీద నిర్మించిన భాగ్యనగరమే నేటి హైదరాబాద్
 • ఇతని కాలపు నిర్మాణాలు: 1. చార్మినార్ 2. జామా మసీదు 3. చందన్ మహల్  4. చార్ కమాన్  5. దారుల్ షిఫా(ఆరోగ్య కేంద్రం)      6. దాద్ మహల్ (న్యాయస్థానం)
 • 1593-94లో హైదరాబాద్ లో సంభవించిన ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా ఇతను చార్మినార్ ను నిర్మించారు.
 • మహ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా కవి . దక్కనీ ఉర్దూలో ఎన్నో గేయాలను రచించారు. ఇతని కవిత్వాలు కులియత్ కూలీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.
 • మహ్మద్ కులీ కుతుబ్ షా కలం పేరు ‘మాని’
 • గొప్ప పండితుడు, తత్వవేత్త అయిన మీర్ మోమిన్ అస్రబాది  ఇతని ఆస్థానంలో ఉండేవాడు.
 • ఇతని కాలంలోనే కుతుబ్ షాహీల రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు మార్చారు.
 • మహ్మద్ కులీకుతుబ్ షా కులియథ్ కులీ గా  ప్రసిద్ధి చెందాడు.

Also read: SSC CGL 2021 Notification Out

సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా (1612-1626)

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_140.1

 • ఇతను మహద్ కులీ కుతుబ్ షా సోదరుని కుమారుడు. ఇతడు శాంతిప్రియుడు
 • మహ్మద్ కుతుబ్ షా కాలంలోనే ఖైరతాబాద్ మసీదు నిర్మించారు.
 • మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేశాడు. ఔరంగజేబు దీన్ని పూర్తి చేశాడు .
 • ఇతని కాలంలో ట్రావెర్నియర్(ఫ్రెంచ్) హైదరాబాద్ లో పర్యటించి మక్కా మసీదు నిర్మాణం గురించి వివరించాడు .
 • స్వయంగా కవి అయిన మహ్మద్ కుతుబ్ షా ‘జల్-ఉల్-లాహ్’  అనే కలం పేరుతో ఎన్నో గజళ్లను రాశాడు .
 • మొఘల్ చక్రవర్తి జహంగీర్ తను జారీ చేసిన ఫర్మానా  లో మహ్మద్ కుతుబ్ షాను కుమారునిగా సంబోధించినట్టు తెలుస్తోంది.
 • ఇతని కాలంలోనే ప్రముఖ వైద్యుడు ‘హకీం తకీముద్దీన్’ వైద్యశాస్త్రంపై ‘నిజామత్ తబాయి కుతుబ్ షాహీ’ గ్రంథం రచించాడు
 • ఇతని కాలంలో మహ్మద్ మోమిన్ తూనికలు ,కొలతలపై రిసాలా మిక్టారియాను రచించాడు.

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_150.1

అబుల్లా కుతుబ్ షా (1626-1672) 

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_160.1

 •   మహ్మద్ కుతుబ్ షా పెద్ద కుమారుడు
 • కుతుబ్ షాహీల్లో అత్యధిక కాలం పాలించింది ఇతడే.
 • ఇతని హయాంలోనే గోల్కొండ రాజ్య పతనం ప్రారంభమైంది
 • సింహాసనం అధిష్టించే నాటికి ఇతని వయస్సు 12 సంవత్సరాలు. తల్లి హయత్ బక్ష్మీ బేగం సంరక్షకురాలిగా పాలన సాగించింది
 • 1636లో షాజహాన్ గోల్కొండ పైకి దండెత్తాడు.
 • అబ్దుల్లా కుతుబ్ షా 1636లో షాజహాన్ తో సంధి చేసుకొని మొఘల్ చక్రవర్తులకు సామంతుడిగా మారాడు.

ALSO READ : ICAR IARI Recruitment 2021

అబుల్ హసన్ తానీషా (1672-1687)

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_170.1

 •  కుతుబ్ షాహీ వంశంలో చివరి పాలకుడు
 • ఉదార స్వభావుడైన ఇతన్ని ప్రజలు తానీషా అని కీర్తించారు. ఇతని గురువు షారజు కట్టాల్ (సూఫీ) ఇతనికి తానీషా (భోగి) అనే బిరుదు ఇచ్చాడు
 • ఇతని కాలంలోనే శివాజీ హైదరాబాద్ ను సందర్శించినట్లు తెలుస్తోంది
 • ఇతని ప్రధాని (మీర్ జుమ్లా) – మాదన్న. ఇతని అసలు పేరు – ‘సూర్య ప్రకాశరావు’.
 • ఇతని సర్వసైన్యాధ్యక్షుడు (సర్ లస్కర్) – అక్కన్న – అక్కన్న, మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న
 • పాల్వంచ తహసీల్దార్ గా పనిచేసిన గోపన్న భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించాడు. గోపన్న రామదాసుగా ప్రసిద్ధి చెందాడు.
 • కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయంను నిర్మించాడు. దీనితో ఆయనను గోల్కొండ కోటలో బంధించారు.
 • క్రీ.శ.1685 ప్రాంతంలో జరిగిన మొఘలుల దాడిలో ఓటమిపాలైన తానీషా వారితో సంధి చేసుకున్నాడు
 • ఇతని కాలంలో అక్కన్న (సైన్యాధిపతి), మాదన్న (ప్రధాని)లు ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీ మరియు బీజాపూర్ లతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు.
 • ముస్లిం సర్దారుల కుట్రవల్ల 1686 మార్చి 24న అక్కన్న, మాదన్నల హత్యతో గోల్కొండ రాజ్యం బలహీనమైంది
 • బీజాపూరును ఆక్రమించిన తర్వాత ఔరంగజేబు క్రీ.శ.1687 ఫిబ్రవరిలో గోల్కొండపై దండెత్తాడు(invaded). 1687 ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు గోల్కొండ ఆక్రమణ కొరకు యుద్ధం జరిగింది.
 • ఈ సమయంలో మొఘల్ సేనలను ఎదుర్కొని 7 నెలల పాటు కోటను కాపాడి, చివరకు విఫలుడైన యోధుడు అబ్దుల్ రజాక్ లారి నోట్ : గోల్కొండ ఆక్రమణలో కీలకపాత్ర పోషించిన ఔరంగాజేబు సేనాని – మీర్ ఖమ్రుద్దీన్ చిన్ లీచ్ ఖాన్.
 • 1687 అక్టోబర్ 3న గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. మొఘల్ సేనలకు బందీగా చిక్కిన అబుల్ హసన్ తానీషాను దౌలతాబాద్ కోటలో బంధించారు. తానీషా అక్కడే మరణించాడు (1700లో)

Download:  తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు 

మునుపటి అంశాలు : 

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 

తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు 

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

తెలంగాణ చరిత్ర – కాకతీయులు

తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_180.1

SSC CGL 2021 Notification Out 

Monthly Current Affairs PDF All months

SBI CBO Notification 2021 Out

AP SSA KGBV Recruitment 2021

Bank Of Baroda Recruitment 2021

Folk Dances of Andhra Pradesh

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_200.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana History- Qutubshahis, తెలంగాణ చరిత్ర -కుతుబ్ షాహీలు Pdf |_210.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.