Telugu govt jobs   »   State GK   »   Telangana History Recharla Padma Nayakulu

Telangana History – Recharla Padma Nayakulu, Download PDF | తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు

క్రీ.శ. 1323లో కాకతీయుల పతనానంతరం ఓరుగల్లును ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఆక్రమించి ఓరుగల్లుకు సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పరిపాలనను ప్రజలు భరించలేని స్థితికి వచ్చారు. ఆ సమయంలో ప్రోలయ నాయకుడు ఓరుగల్లు రాజధానిగా ముసునూరి వంశ రాజ్యాన్ని స్థాపించగా, సింగమ నాయకుడు తెలంగాణలో ఆమనగల్లు రాజధానిగా పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. రేచెర్ల పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. వీరు నల్లగొండ జిల్లాలోని రాచకొండ, దేవరకొండ రాజధానులుగా దాదాపు 150 సంవత్సరాలు (క్రీ.శ. 1326 – 1475) తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. రేచెర్ల వంశానికి మూలపురుషుడు  భేతాళ నాయకుడు.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు

తెలంగాణ చరిత్ర లో రేచర్ల పద్మ నాయకులు వివరాలు దిగువ పట్టికలో అందించాము.

మూల పురుషుడు చెవిరెడ్డి (భేతాళ రెడ్డి)
రాజ్య స్థాపకుడు మొదటి సింగమనాయకుడు
రాజ చిహ్నం 1 భైరవుడి శిల్పం
రాజధానులు ఆమనగల్లు,
రాచకొండ ,
దేవరకొండ.
బిరుదాంకితులు పంచపాండ్యదళ విభాళ
గొప్పవారు అనవోత నాయకుడు (రాజ్య విస్తరణలో)
సర్వజ్ఞ సింగభూపాలుడు (సాహిత్యంలో)
చివరివాడు 3వ సింగమనాయకుడు
  •  రేచర్ల పద్మనాయకులనే వెలమ నాయకులని కూడా వ్యవహరిస్తారు.
  • తెలంగాణలో రాచకొండ, దేవరకొండలు రాజధానులుగా రెండు శాఖలుగా వీరు పరిపాలించారు. 
  • రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారం – “వెలుగోటి వంశావళి”.
  • వెలుగోటి వంశావళి ప్రకారం వీరి మూలపురుషుడు – బేతాళరెడ్డి (చెవిరెడ్డి).
  • గణపతి దేవుని కాలంలో ప్రసాదిత్యానాయకుడు, రుద్రనాయకుడు అనే వెలమలు సేనాపతులుగా పనిచేశారు.
  • కాకతీయ సింహాసనంపై రుద్రమదేవిని అధిష్టింపజేసింది. ప్రసాదిత్య నాయకుడు.
  • వీరు సుమారు 150 సం||లు పాలించారు.

తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు 

రేచర్ల పద్మ నాయకులు,వారి రాజకీయ చరిత్ర

మొదటి సింగమ నాయకుడు :(క్రీ.శ.1326-1361)

ఇతను వెలమరాజ్య స్థాపకుడు, ఇతని రాజధాని “ఆమనగల్లు”.

మొదటి అనవోత నాయకుడు : (క్రీ.శ.1361-1384)

  • రాచకొండ రాజ్యాన్ని నిర్మించి రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు.
  • రాచకొండ శాసనం ప్రకారం ఇతను రాచకొండలో తవ్వించిన చెరువులు :  అనవోతు సముద్ర , రాయ సముద్రం
  • ఇతను త్రవ్వించిన ఇతర బావులు : సంకెళ్ళ బావి, కొలూకూటం బావి
  • రాజ్యాన్ని రెండుగా విభజించి తమ్ముడైన మాధవ నాయకున్ని దేవరకొండ ప్రభువుగా నియమించు
  • అప్పటి నుండి రాచకొండను అనవోత నాయకుని వారసులు, దేవరకొండను మాధానాయకుని వారసులు పాలించారు.

తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 

రెండవ సింగమ నాయకుడు (సింగభూపాలుడు) (క్రీ.శ.1384-1399)

ఇతను కవి, పండిత పోషకుడు.

ఇతని రచనలు : 1) రసవర్ణ సుధాకరం – అలంకార శాస్త్ర గ్రంథం.

సామాన్యులకు (వేశ్యలు) కూడా కావ్య ప్రబంధాలలో స్థానం కల్పించవచ్చు అని వాదించాడు.

2) సంగీత సుధాకరం – సంగీత శాస్త్ర గ్రంథం.

ఈ గ్రంథం సారంగ దేవుడు రచించిన సంగీత రత్నాకరంపై రాసిన వాఖ్యానం.

3) “కువలయావళీ” అనే పేరుతో “రత్నపాంచాలిక” అనే నాటకంను రచించాడు.

ఉత్సవాల సమయంలో ఈ నాటకం ను ప్రదర్శించేవారు. * ఇతని ఆస్థానంను శ్రీనాథుడు సందర్శించాడు. 

ఇతని ఆస్థాన కవులు:

  •  విశ్వేశ్వరుడు – చమత్కార చంద్రిక (అలంకార శాస్త్రం)
  • బొమ్మకంటి అప్పయార్యుడు – అమరకోశ గ్రంధానికి వాక్యంను రచించాడు.
  • శాకల్య మల్లభట్టు – నిరోష్ట రామాయణం , ఉదార రాఘవం (కావ్యం) ,అవ్యయ సంగ్రహం (నిఘంటువు)
  • శాకల్య మల్లభట్టు వేదాంత దేశకుని యొక్క కుమారుడు వరదా చార్యునితో వాగ్వాదంలో ఓడిపోయాడు.
  • వేదాంత దేశికుడు-తత్త్వ సందేశ, రహస్య సందేశ, సుభాషనీతి అనే గ్రంథాలను రచించాడు.
  • శాకల్య అయ్యలార్యుడు – భాస్కర రామాయణంను రచించాడు.
  • సింగభూపాలుడు వైష్ణవాన్ని ఆదరించాడు.

రావు మాదా నాయకుడు (క్రీ.శ.1421–1430)

  • ఇతను గొప్ప విద్వాంసుడు, వైష్ణవ మతాభిమాని
  • నాగారం చెరువు శాసనం ప్రకారం రామాయణానికి “రాఘవీయం” అనే వ్యాఖ్యానంను రాసి శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు.
  • శ్రీరంగనాథ స్వామికి “తొర్రూరు” గ్రామాన్ని శ్రీరంగపురం అగ్రహారం అనే పేరుతో దానం చేశాడు
  • మాదానాయకుని భార్య నాగాంబిక రాచకొండ సమీపంలో “నాగసముద్రం” అనే చెరువును నిర్మించింది.

తెలంగాణ చరిత్ర – కాకతీయులు

మూడవ సింగమ నాయకుడు (క్రీ.శ.1430-1475) 

  • ఇతనే రాచకొండ రాజులలో చివరివాడు.
  • ఇతని ఆస్థానాన్ని రెడ్డి రాజ్య విద్యాధికారి శ్రీనాథుడు సందర్శించాడు.
  • ఇతని ఆస్థానంలో నైనాచార్యుడినే వైష్ణవ మతాచార్యుడు వైష్ణవ మత వ్యాప్తికి కృషిచేశాడు.
  • బహ్మనీ సుల్తాన్ 3వ మహ్మద్ షా సేనాని నిజాం ఉల్ ముల్క్ ఖైరీ ఇతన్ని ఓడించడంతో రేచర్ల వెలమలరాజ్యం అంతమైంది.

ఆస్థాన కవులు:

గౌరన రచనలు –  1. నవనాథ చరిత్ర  2. హరిశ్చంద్ర పాక్యానం  3. లక్షణ దీపిక

కొరవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక.

పోతన : ఇతనుసర్వజ్ఞ సింగభూపాలునికి సమకాలికునిగా పేర్కొంటారు.

ఇతని రచనలు: • వీరభద్ర విజయం (శైవగ్రంథం, తొలిరచన)

  • భోగిని దండకం (సర్వజ్ఞ సింగునికి మరియు భోగినిల మధ్య ప్రేమ మారచించబడిన తొలి తెలుగు దండకం)
  •  నారాయణ శతకం.
  • భాగవతం (8 స్కందములు) – దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు

రాచకొండ కోట:

  • ఈ కోటలో ఉన్న ఒక దేవాలయం రామప్పదేవాలయాన్ని పోలి ఉంది.
  • ఈ కోటలోనే సీతారామ లక్ష్మణుల విగ్రహాల ఆలయం ఉంది. –
  • పద్మ నాయకుల యొక్క రాజచిహ్నమైన భైరవ శిల్పాలు ప్రతికోట ద్వారం వద్ద ఉన్నాయి.

నర్సింహుల గుట్ట:

  • ఈ గుట్టపై గుహాలయంలో ద్వాదశ అల్వారుమూర్తులను చెక్కారు.
  • ఈ ఆలయ పై భాగంలో రామాయణంలోని పుత్రకామేష్టి యాగం, అశ్వమేథయాగ చిత్రలేఖనాలు చిత్రించారు.

దేవరకొండ వెలమలు

  • స్వతంత్ర వెలమ రాజ్య స్థాపకుడు సింగమ నాయకుని కుమారులు- 1) అనవోతా నాయకుడు 2) మాదా నాయకుడు
  • అనవోతా నాయకుడు రాచకొండకు రాజుగా ఉండి తన తమ్ముడిని దేవరకొండకు రాజుగా చేసి రాజ్యాన్నిరెండుగా విభజించాడు.
  • దీంతో మాదానాయకుడి సంతతివారిని దేవరకొండ వెలుమలని పిలుస్తారు.

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

మాదా నాయకుడు.

  • దేవరకొండను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు.
  • నల్లమల కొండలపై ఉన్న శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి గాంచిన ఉమామహేశ్వర క్షేత్రానికి ద్వార మండపంను నిర్మించినట్లు శాసనం వేయించాడు.

పెదవేదగిరి నాయకుడు 

  • భాస్కర రామాయణంను రచించిన నలుగురు కవుల్లో ఒకరైన ‘శాకల్య అయ్యలార్యుడు’ ఇతని ఆస్థాన కవి.

లింగమ నేడు :

దేవరకొండ వెలమ రాజుల్లో చివరివాడు.

మత పరిస్థితులు

శైవ మతం 

  •  ‘ఘడే రాయవంశం’ పద్మనాయకుల కాలంలో శైవంను ప్రచారం చేశారు.
  • తొలి ముసునూరి, వెలమ రాజులు శైవ మతాన్ని ఆదరించారు.
  • తీవ్రవాద శైవమతంలో అనేక క్రూర ఆచారాలు ఉండేవి. –

వీరి క్రూర ఆచారాలు

1) రణం కడుపు:

  • వీరు భైరవుడిని ఆరాధించేవారు.
  • రణం కడుపును పద్మనాయకులు ప్రవేశపెట్టగా, రెడ్డి రాజులు కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.
  • మరణించిన వారి రక్తమాంసాలతో వండిన అన్నంను భైరవుడికి నైవేద్యంగా సమర్పించడమే రణముకుడుపు.

2) చంపుడు గుడి:

  • కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక గ్రంధంలో స్త్రీ-పురుషులు దైవంపైఅపరిమిత భక్తి వల్ల ఆత్మార్పణం చేసుకుంటున్నారని తెలపబడింది.
  • చంపుడు గుడినే వీరశిరోమండపం అంటారు.
  • దీని ప్రధాన కేంద్రం : శ్రీశైలం
  • వీరు తమ శరీరాన్ని దేవునికి (శివునికి) మొక్కుబడిగా చెల్లిస్తారు.

వైష్ణవ మతం 

  • రామానుజాచార్యుని అనంతరం శ్రీవైష్ణవ శాఖ వడగల్, తెంగల అను శాఖలుగా విడిపోయింది. 
  • తెలంగాణాలో వడగల్ శాఖ ప్రాచుర్యం పొందింది.
  • వడగల్ శాఖ అహోబిలంలో మఠం ను ఏర్పాటు చేసుకొని తమ సిద్ధాంతాలు ప్రచారం చేశారు. 
  • వడగల్ శాఖను ప్రచారం చేసిన వాడు – వేదాంత దేశికుడు.
  • సర్వజ్ఞ సింగభూపాలుని కోరిక మేరకు వేదాంత దేశికుడు రచించిన గ్రంథాలు: * సుభాషిత నీతి, రహస్య సందేశ ,తత్త్వ సందేశ

గ్రామ దేవతలు

  • శక్తి రూపాలైన దుర్గ, భద్రకాళి, కాళిలను అమ్మవారిగా ప్రతి గ్రామంలో దేవతలను ప్రతిష్టించారు.
  • ఈ దేవతలకు జంతుబలులు ఇచ్చి తమ మొక్కులను తీర్చుకునేవారు.
  • శ్రీనాథుడు ‘చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు’ అంటూ పేర్కొన్నాడు. 
  • ముఖ్య దేవాలయాలు : శ్రీశైలం, త్రిపురాంతకం
  • శ్రీశైల దేవాలయానికి అనుబందంగా మఠాలు ఉండేవి – గంటామఠం , కలుమర్ ,విభూతి మఠం , భిక్షావృత్తిమఠం (గౌరన, శ్రీనాథుడులను ఆదరించింది)

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

రేచర్ల పద్మ నాయకుల శాసనాలు

1. కందికొండ శాసనం : (అనపోతా నాయకుడు క్రీ.శ. 1365)

జల్లపల్లి కోటను జయించుట, చెంజెర్ల యుద్ధంలో క్షత్రియులను ఓడించుట, ధరణికోట వద్ద రెడ్డి రాజులను ఓడించుట ఈ శాసనంలో ప్రస్తావించబడినది.

2. అనపోతనాయకుని భువనగిరి శాసనం: (అనపోతా నాయకుడు క్రీ.శ. 1378)

ఇది అసంపూర్తి శాసనం. ముసునూరి కాపయనాయకుని ఓడించి భువనగిరి దురమును సాధించిన

సందర్భముగా వేయించిన శాసనమిది.

3. దేవలమ్మ నాగారం శాసనం : ( రాణి నాగాంబిక క్రీ.శ. 1427 )

రేచర పదునాయకుల వంశావళి వర్ణించబడింది. విష్ణువు, శ్రీరాముని స్తుతి ఈ శాసనంలో ఉంది.

4. ధర్మపురి శాసనం : ( తిరుమలయ్య క్రీ.శ. 1753)

ధర్మపురి నరసింహాస్వామి భోగమంటపం పుష్కరిణికి ప్రాకారము నిర్మించిన సందర్భంగా వేసిన శాసనం.

 తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు PDF

adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

The Padmanayakas of Rachers are also known as?

The Padmanayakas of Rachers are also known as Velamala.

What was the reign period of Padmanayakas of Rachar in Telagana?

They ruled the Telangana region for about 150 years (1326 - 1475 AD) with their capitals being Rachakonda and Devarakonda in Nalgonda district.

Who was the leader of Racher clan ?

The progenitor of the Racher clan was the leader of Bhethal.