Telugu govt jobs   »   Current Affairs   »   Dr. MS Subbulakshmi Sangeet Pracharya Award...

Dr. MS Subbulakshmi Sangeet Pracharya Award was awarded to the AU professor | ఏయూ ప్రొఫెసర్ కి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు లభించింది

Dr. MS Subbulakshmi Sangeet Pracharya Award was awarded to the AU professor | ఏయూ ప్రొఫెసర్ కి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు లభించింది

ఏయూలోని సంగీత విభాగంలో సీనియర్  ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థికి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు లభించింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న ముంబైలో శ్రీ షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్-సంగీత సభ నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పద్మవిభూషణ్ డాక్టర్ ఆర్ చిదంబరం, పద్మవిభూషణ్ ఆచార్య మన్మోహన్ శర్మ సరస్వతికి ఈ అవార్డును అందజేశారు.

సరస్వతి విద్యార్థిని భారతీయ శాస్త్రీయ సంగీత రంగానికి ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరించారు. ఏయూలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి సరస్వతికి సన్మానం చేశారు. కాగా, సరస్వతికి అవార్డుతో పాటు రూ.లక్ష నగదు పురస్కారం రాగా నగదును నగరానికి చెందిన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్కి విరాళంగా ఆమె అందజేశారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

రామన్ మెగసెసే అవార్డును అందుకున్న మొదటి భారతీయ సంగీతకారుడు ఎవరు?

భారతీయ కర్నాటక గాయని ఆర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి తమిళనాడులోని మధురైకి చెందినవారు. భారతరత్న పొందిన మొట్టమొదటి కళాకారిణి ఆమె. 1974లో, రామన్ మెగసెసే అవార్డును పొందిన భారతదేశం నుండి ఆమె మొదటి కళాకారిణి. 1966లో, UN జనరల్ అసెంబ్లీ ముందు ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయురాలు.