Telugu govt jobs   »   TS TET 2024 నోటిఫికేషన్   »   TS TET పరీక్షకు ఉత్తమ రివిజన్ పద్ధతి...

TS TET పరీక్షకు ఉత్తమ రివిజన్ పద్ధతి తెలుసుకోండి

నేర్చుకోవడానికి విధ్యార్ధి దశలో చాలా ప్రాధాన్యత ఉంది ఏ విషయంకైనా పూర్తి అవగాహన, పరిజ్ఞానం మనం ఏ విధంగా నేర్చుకున్నాము అనే దాని పైన ఆధార పడుతుంది. అదేవిధంగా నేర్చుకున్న విషయాలను పూర్తిగా అర్థం చేసుకుని దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకున్న విషయం చిన్న దైనా, పెద్దదైనా మనం మంచిగా రివిజన్ చేస్తే అభ్యసన విజయవంతం అయినట్టు. ఒక్కో విధ్యార్ధికి ఒక్కో విధమైన అవగాహనా శైలి ఉంటుంది దానిని తెలుసుకుని రివిజన్ చేస్తే నేర్చుకున్న అంశాలపై పట్టు ఉంటుంది.

పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్ధులు రివిజన్ ని సరిగ్గా చేస్తే పరీక్షలలో మంచి మార్కులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. పరీక్షలకి అన్నీ అంశాలు చదువుతారు కాబట్టి వాటన్నింటినీ మళ్ళీ రివిజన్ చేయడం వలన అంశాల పై పట్టు పోకుండా ఉంటుంది. ఈ పోటీ పరీక్షల ప్రపంచం లో ప్రతీ ప్రశ్న ప్రతీ మార్కు మనల్ని అనుకున్న విజయం వైపు నడిపిస్తాయి.

పరీక్ష రోజు దగ్గర పడే సమయంలో మనం చదివిన చాలా విషయాలపై అవగాహన ఉంటుంది. కానీ, ఎప్పుడో సంవత్సరాల క్రితం మనం నేర్చుకున్నది నిన్న నేర్చుకున్నంత స్పష్టంగా గుర్తుంచుకోవాలని అనుకుంటాం! మనం ఇంతకు ముందు చదివిన దానితో పోల్చితే మనం ఈ మధ్యనే చదివింది మనకు  బాగా గుర్తుంటుందని చెప్పడానికి గొప్ప మెమరీ అవసరం లేదు. అయితే, పోటీ పరీక్షలు మనకు ఒక పెద్ద  పరీక్ష వాటిని ఎలా అయిన ఎదుర్కోవాలి అని అనుకుంటాము. కొందరికి అన్నీ విషయాలు బాగా గుర్తుంటాయి అది వారికి వెన్నతో పెట్టిన విధ్యలా అనిపిస్తుంది వాటిని ఏమి చేయలేమ. కానీ మనం చదివినది బాగా గుర్తుంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటి గురించి ఈ కధనం లో తెలుసుకోండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TS TET పరీక్షకు ఉత్తమ రివిజన్ పద్ధతి

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా 20 మే 2024 నుండి 03 జూన్ 2024 మధ్య నిర్వహించబడుతుంది. TS TET పరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్ధులందరు ఈ పాటికి రివిజన్ పూర్తి చేసి పరీక్ష రోజు కోసం ఎదురుచూస్తారు. రివిజన్ లో కొన్ని పద్దతులను పాటిస్తే మన మీద మనకు నమ్మకం పెరిగి పరీక్షని బాగా రాయగలము. సాధారణంగా మెదడులో ఏదైనా విషయం లేదా జ్ఞాపకం రెండు రకాలుగా ఉంటుంది అది స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మరియు దీర్ఘకాల/ జీవితకాల జ్ఞాపక శక్తి. రోజువారీ నిత్య సంభాషణలు, పనులు స్వల్ప కాలిక మెమరీ లో చోటు చేసుకుంటాయి ఇవి పెద్దగా గుర్తుండవు, కానీ దీర్ఘకాల జ్ఞాపక శక్తి మనకి ఎన్ని సంవత్సరాలైన గుర్తుంటుంది. జీవితకాల జ్ఞాపక శక్తి మనం చదివిన 2వ ఎక్కంలా ఉంటుంది ఎప్పుడు అడిగిన టక్కున చెప్పచ్చు. అభ్యర్ధులు వారు చదివిన అంశాలను జీవితకాలిక జ్ఞాపక శక్తి లో నిల్వ చేసుకోవాలి అంటే రివిజన్ తప్పని సరి. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వ చేయబడినప్పుడు, అభ్యాసం శాశ్వతం అవుతుంది. కానీ అపారమైన మెదడు సామర్థ్యం కారణంగా, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి చాలా సమాచారాన్ని కలిగి ఉంటుంది, దీని వలన నేర్చుకున్న అంశాలను గుర్తుచేసుకోవడం కష్టమవుతుంది.

TS TET పరీక్షకు రివిజన్ పద్ధతులు

ఒక్కొకరికి ఒక్కో విధమైన రివిజన్ చేసే అలవాటు ఉంటుంది వారు దానినే అనుసరిస్తూ ఉంటారు, మీకు ఇక్కడ వివిధ రకాల రివిజన్ పద్దతులను తెలియజేస్తాము. వివిధ పద్దతులను తెలుసుకుని మీకు నచ్చిన లేదా మీకు సరిపడా పద్దతిని ఎంచుకోండి.

తక్షణ రివిజన్

ఈ పద్దతిలో అభ్యర్ధులు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న వెంటనే దానిని రివిజన్ చేసేస్తారు, ఆ అంశం మెదడులో బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. నేర్చుకున్న వాటిని వెంటనే రివిజన్ చేయడం వలన ప్రతీ విషయం పూర్తిగా గుర్తుంటుంది. నేర్చుకున్న విషయాలు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి లో నిల్వఉండే అవకాశం ఉంటుంది. తక్షణ లేదా వెంటనే రివిజన్ చేయడం తో పాటు నేర్చుకున్న వివరాలను నోట్స్ తయారు చేసుకుంటే మరలా చేసే రివిజన్ లో ఉపయోగపడుతుంది. ఇది అందరికి సౌకర్యవంతమైనది కాదు ఒక వేల మీరు ఈ పద్దతి కనుక పాటిస్తే ఇంకా ఎలా మీ రివిజన్ ను మెరుగుపరచుకోవలో తెలుసుకోండి.

పోమోడోరో టెక్నిక్

పోమోడోరో టెక్నిక్ అనేది 1980ల చివరలో ఫ్రాన్సిస్కో సిరిల్లోచే అభివృద్ధి చేయబడిన సమయ నిర్వహణ పద్ధతి. ఇది ప్రభావవంతమైన పరీక్షలకు, రివిజన్ లో మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ పద్దతిలో మీ పని లేదా అధ్యయన సమయాన్ని విరామాలుగా విభజించి (25 నిమిషాల నిడివిని “పోమోడోరోస్” అని పిలుస్తారు), దానిపై కదలకుండా అధ్యయనం చేయండి. 

మీరు రివైజ్ చేయాలనుకుంటున్న టాపిక్ లేదా సబ్జెక్ట్‌ని ఎంచుకోండి. టైమర్‌ను 25 నిమిషాలకు సెట్ చేసుకొండి (ఒక పోమోడోరో). టైమర్ రింగ్ అయ్యే వరకు పూర్తి ఏకాగ్రతతో అంశంపై పని చేయండి. విశ్రాంతి తీసుకోవడానికి మరియు రీఛార్జ్ చేయడానికి 5 నిమిషాల విరామం తీసుకోండి. మొత్తం నాలుగు పోమోడోరోల కోసం ప్రక్రియను పునరావృతం చేయండి. నాలుగు పోమోడోరోలను పూర్తి చేసిన తర్వాత, 15-30 నిమిషాల సుదీర్ఘ విరామం తీసుకోండి.

ఫ్లాష్‌కార్డ్స్

ఇది రివిజన్ విధానం లో ఒక కొత్త పద్దతి, ఈ పద్దతిలో మీరు చిన్న పేపర్ లను లేదా ఫ్లాష్ కార్డ్స్ ను తీసుకుని వాటిపైన ముఖ్యమైన లేదా గుర్తుపెట్టుకునే విధంగా ఉండటానికి ఒక పదాన్ని/ బొమ్మ ని రాయాలి. ఈ ఫ్లాష్ కార్డ్ ను చూసిన ప్రతీ సారి మీరు జ్ఞాపకం ఉంచున్న ఆ అంశం తాలూకు వివరాలు గుర్తుకువస్తాయి. ఇలా చేయడం వలన మీరు త్వరగా రివిజన్ పూర్తి చేసుకోడానికి వీలవుతుంది. సాధారణంగా రాసుకునే నోట్స్ కన్నా ఇలా చిన్న చిన్న పేపర్ లు బధ్రపరచుకోవడం కొంచం కష్టమైన పని కాని ఇది అలవాటు చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ అంశం తాలూకు ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకుంటే చాలు నోట్స్ మొత్తం తీసుకుని వెళ్ళనవసరం లేదు. మీరు ఫ్లాష్‌కార్డ్‌ను మీ జేబులో పట్టుకుని, ఎప్పుడైనా సమీక్ష చేసుకోవచ్చు అందుకే ఇది సాధారణంగా ఉపయోగించే సులభమైన స్వీయ-అధ్యయన పద్ధతుల్లో ఒకటి.

బోధించండం

బోధించండి, అవును మీరు మీ స్నేహితులకి లేదా తోటి వారికి బోధించడం వలన మీరు చదివిన అంశాన్ని పూర్తిగా గుర్తుచేసుకోగలరు. బోధించడం వలన మీ విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది మరియు ఇది మీ జ్ఞాపకశక్తి మెరుగు పరుస్తుంది. విధ్యార్ధులు ఎవరైతే బోధిస్తారో వారికి అంశాల పై పట్టు తో పాటు మంచి మార్కులు లభిస్తాయి. బోధించడం వలన మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి అవుతాయి.

ప్రశ్నపత్రాలు/క్విజ్ లు

కొంతమంది విధ్యార్ధులు చదివిన అంశాలను గుర్తుకు చేసుకోవడానికి గత సంవత్సర ప్రశ్నాపత్రాలు లేదా మాక్ టెస్ట్లు, క్విజ్ లు చేస్తారు ఇది వారిలో ప్రశ్నలకు సమాధానాలు వెతికే శైలిని తెలియజేస్తుంది. కావున మీరు కూడా ఒక సారి సంబందిత అంశం చదివిన తరువాత టెస్ట్ లు చేయడం, ప్రశ్నలకు సమాధానాలు రాయడం, వంటివి చేసి మీ జ్ఞాపకశక్తిని తెలుసుకోండి. పదే పదే సాధన చేయడం కష్టమైనపుడు ప్రాక్టీస్ ప్రశ్నలు సాధన చేయడం వలన రెవిజం తొందరగా పూర్తవుతుంది. కానీ ఈ విధం గా చేయడం లో కొన్ని అంశాలను మర్చిపోయే అవకాశం ఉంది. ఈ పద్దతి కనుక మీకు అలవాటు ఉంటే మిగిలిన వాటిని కూడా ప్రయత్నించి మెరుగైన రివిజన్ పద్దతిని ఎంచుకోండి. ప్రశ్నలు సాధన చేయడం మరియు అంశాలను గుర్తుకు తెచ్చుకోవడం పరీక్షలలో బాగా సహాయపడతాయి.

ఆన్లైన్/ ఆఫ్ లైన్ క్లాసులు

విధ్యార్ధులు తాము చదువుకునే దాని కన్నా ఎవరైనా బోధిస్తే బాగా అర్దం చేసుకోగలరు. ఒక అంశాన్ని పూర్తిగా అర్ధం చేసుకోడానికైనా లేక రివిజన్ అయిన సరే ఒకరు బోధిస్తే త్వరగా మరియు సులభంగా అర్ధం అవుతుంది అనుకున్నప్పుడు ఆన్లైన్ వనరులు లేదా ఆఫ్లైన్  క్లాసులలో చేరండి. రివిజన్ కోసం ప్రత్యేకంగా ఉండే క్లాసులను ఎంచుకుని మీ రివిజన్ ను పూర్తిచేసుకొండి.

సమయానుకూల పునరావృతం

ప్రభావవంతమైన అభ్యాసానికి సమయానుకూల పునరావృతం ఒక శక్తివంతమైన వ్యూహం. ఇది మన జ్ఞాపకశక్తి ఎలా పనిచేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేర్చుకునే సమయంలో మనం నిశితంగా గమనిస్తే, జ్ఞాపకాలు మరింత బలంగా ఏర్పడతాయి.

చాలా కాలం క్రితం, హెర్మాన్ ఎబ్బింగ్‌హాస్ అనే మనస్తత్వవేత్త జ్ఞాపకశక్తిని అధ్యయనం చేశాడు. అతను “మర్చిపోయే వక్రరేఖ” అని పిలిచే ఒక నమూనాను అనుసరించి, సమాచారం యొక్క మన జ్ఞాపకశక్తి కాలక్రమేణా మసకబారుతుందని అతను కనుగొన్నాడు. దీన్ని ఎదుర్కోవడానికి, మీరు నేర్చుకున్న వాటిని నేర్చుకోవాలి, సమీక్షించాలి మరియు క్రమం తప్పకుండా మళ్లీ రివిజన్ చేసుకోవాలి.

ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది: మీరు ఈరోజు ఏదైనా నేర్చుకున్నారని ఊహించుకోండి, ఆపై దాన్ని రేపు సమీక్షించండి. ఒక వారం తర్వాత, దాన్ని మళ్లీ సమీక్షించండి, ఆపై మళ్లీ రెండు వారాల తర్వాత. చివరగా, ఒక నెల తర్వాత మరియు పరీక్షకు కొద్దిసేపటి ముందు మరోసారి సమీక్షించండి. ఈ విధానం మీ మెదడు ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.

మీరు ఏదైనా క్రొత్తదాన్ని నేర్చుకున్నప్పుడు, మీ మెదడు దానిని తాత్కాలికంగా స్వల్పకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వ చేస్తుంది. మీరు దీన్ని క్రమం తప్పకుండా తిరిగి సందర్శించకపోతే, మీ మెదడు అది ముఖ్యమైనది కాదని భావించి దానిని మరచిపోతుంది. కానీ సమయానుకూల పునరావృతం చేయడంతో, మీ మెదడు సమాచారాన్ని ముఖ్యమైనదిగా గుర్తించి, దానిని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిగా మారుస్తుంది.

కాబట్టి, మీ సమీక్షలకు అంతరాయం ఇవ్వడం ద్వారా, మీరు మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేసుకుంటారు మరియు చాలా కాలం పాటు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.

TS TET పరీక్షకు ప్రభావవంతమైన రివిజన్ చెయ్యాలో తెలుసుకోండి

విద్యార్థులను వారి సొంత అవసరాలకు అనుగుణంగా అత్యంత అనుకూలమైన రివిజన్ పద్ధతులను కనుగొనడం చాలా అవసరం. మైండ్ మ్యాప్‌లు, ఫ్లాష్‌కార్డ్‌లు, గ్రాఫిక్ ఆర్గనైజర్‌లు, రివిజన్ షెడ్యూల్‌లు, స్వీయ-క్విజ్ చేయడం, హైలైట్ చేయడం, చిత్రాలు మరియు వీడియోల వంటి విజువల్స్‌ద్వారా రివిజన్ పద్దతిని కనుగొనడం ద్వారా వారి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. రివిజన్ మైలురాళ్లను ఎంచుకుని వాటిని  సాధించడానికి ప్రేరణగా రివార్డ్‌లను ఉపయోగించడం వంటి వాటితో సహా అనేక రకాల రివిజన్ వ్యూహాలను అమలుచేసుకోండి.

ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన అభ్యాస ప్రాధాన్యతలు మరియు బలాలు ఉంటాయి మరియు వారి అభ్యాస శైలితో ప్రతిధ్వనించే రివిజన్ పద్ధతులను అన్వేషించడం వారికి చాలా అవసరం.

ప్రభావవంతమైన రివిజన్ అనేది ఒకసారి చేసే ప్రయత్నం కాదు, అది నిరంతర ప్రక్రియ అని గుర్తుంచుకోండి. సబ్జెక్ట్‌పై వారి అవగాహన మరియు పట్టు మరింత లోతుగా చేయడానికి ఎంచుకున్న పునర్విమర్శ పద్ధతులను ఎక్కువ కాలం పాటు స్థిరంగా వర్తింపజేయడానికి విద్యార్థులను ప్రోత్సహించండి.

విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య సమాచారం:

  • అభ్యాస శైలులు మరియు ప్రాధాన్యతలలో వారి ప్రత్యేకతను గుర్తించుకోవడం.
  • వారికి ఏది ఉత్తమంగా పని చేస్తుందో తెలుసుకోవడానికి వివిధ పునర్విమర్శ వ్యూహాలను అన్వేషించడం.
  • ఈ వ్యూహాలను ఎలా సమర్థవంతంగా వర్తింపజేయాలో అర్థం చేసుకోవడానికి సబ్జెక్ట్ ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం మరియు దిశానిర్దేశం పొందటం.
  • విజయవంతమైన రివిజన్ అనేది విషయ పరిజ్ఞానం యొక్క బలమైన పునాదిపై నిర్మించబడుతుంది అని గ్రహించడం.

👍🏻ALL THE BEST 👍🏻

TS TRT (SGT) Exam 2023 | Online Test Series By Adda247

Read More:
TS TET పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందా? TS TET నోటిఫికేషన్ 2024
TS TET పరీక్షా విధానం 2024 పూర్తి వివరాలు TS TET సిలబస్ 2024
TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు  TS TET 2024 కోసం ఉత్తమ పుస్తకాలు 
మొదటి ప్రయత్నంలో TS TET 2024కి ఎలా అర్హత సాధించాలి?  TS TET పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

Sharing is caring!