ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ల విడుదల క్రమంలో06 మార్చి 2024 న APPSC కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 49 ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో A.P ఫిషరీస్ సర్వీస్ అసిస్టెంట్‌లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్- 04 ఖాళీలు, A.P ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ – 05 ఖాళీలు, A.P ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ – 03 ఖాళీలు మరియు A.P ఫారెస్ట్ సర్వీస్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ – 37 ఖాళీల చొప్పున మొత్తం 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
APPSC AEI, ASO, FRO మరియు FDO నోటిఫికేషన్లకు ముఖ్యమైన తేదీలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వేర్వేరు కేటగిరీల్లో 49 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో 49 ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఒక్కో పోస్ట్ కి ఒక్కో దరఖాస్తు తేదీలు ఉన్నాయి. పోస్టుల వారీగా ముఖ్యమైన తేదీలను కింది పట్టికలో చూడండి.
APPSC నోటిఫికేషన్లకు ముఖ్యమైన తేదీలు | ||
పోస్టులు | దరఖాస్తు ప్రారంభ తేదీ | చివరి తేదీ |
APPSC FDO (ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్) | 23 ఏప్రిల్ 2024 | 13 మే2024 |
APPSC అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) | 18 ఏప్రిల్ 2024 | 08 మే 2024 |
APPSC అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (AEI) | 21 మార్చి 2024 | 10 ఏప్రిల్ 2024 |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) | 15 ఏప్రిల్ 2024 | 05 మే2024 |
APలో వివిధ ఖాళీల భర్తీకి APPSC నోటిఫికేషన్ల PDF
APPSC రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ PDF |
FAPPSC FDO Notification 2024 Pdf |
APPSC ASO Notification 2024 PDF |
APPSC Assistant Electrical Inspector (AEI) Notification 2024 PDF |
APPSC FRO (Forest Range Officers) Notification 2024 PDF |
Adda247 APP
APPSC AEI, ASO, FRO మరియు FDO ఖాళీల వివరాలు
పోస్టులు | ఖాళీలు |
APPSC FDO (ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్) | 04 |
A.P ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ | 05 |
A.P ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ | 03 |
A.P ఫారెస్ట్ సర్వీస్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ | 37 |
మొత్తం | 49 |
APPSC రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు
వయోపరిమితి
- అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి A.P ఫారెస్ట్ సర్వీస్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ఇతర పోస్టులకు అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
విద్యార్హతలు
పోస్టుల వారీగా విద్యార్హతలు | |
పోస్టులు | విద్యార్హతలు |
APPSC FDO (ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్) | ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.Sc.) కనీస అర్హతను కలిగి ఉండాలి. |
A.P ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ |
లేదా
లేదా
లేదా
లేదా
|
A.P ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. |
A.P ఫారెస్ట్ సర్వీస్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ | భారతదేశంలోని యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి |
APPSC రిక్రూట్మెంట్ 2024 జీతం
APPSC రిక్రూట్మెంట్ 2024 జీతం | |
పోస్టులు | జీతం |
APPSC FDO (ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్) | రూ. 45,830 – 1,30,580/- |
A.P ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ | రూ. 37,640 – 1,15,500/ |
A.P ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ | రూ. .57,100 – 1,47,760 |
A.P ఫారెస్ట్ సర్వీస్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ | రూ.48,440 – 1,37,220/ |
APPSC AEI, ASO, FRO మరియు FDO ఎంపిక ప్రక్రియ
- APPSC AEI, ASO, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు మరియు FDO ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- APPSC AEI, ASO, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మరియు FDO పోస్టులకు పేపర్ 1 ఒకటే ఉంటుంది. మిగిలిన పేపర్లు సంబంధింత సబ్జెక్టు లకు చెందినది ఉంటుంది
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |